
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్ మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇటీవలే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపిన (నంబర్ వన్ ర్యాంక్) ప్రణయ్.. తన గర్ల్‌ఫ్రెండ్ శ్వేతా గోమ్స్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు ట్విటర్ వేదికగా అనౌన్స్ చేశాడు. ప్రణయ్ తన ట్వీట్‌లో ఫియాన్సీ శ్వేతా గోమ్స్‌తో దిగిన ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
30 ఏళ్ల ప్రణయ్ ఈ ఏడాది భీకర ఫామ్‌లో కొనసాగుతున్నాడు. మే నెలలో జరిగిన థామప్ కప్‌లో భారత్ స్వర్ణం సాధించడంలో ప్రణయ్ కీలకపాత్ర పోషించాడు. అలాగే ఇటీవలే జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, జపాన్ ఓపెన్‌లోనూ ప్రణయ్ సత్తా చాటాడు. ప్రణయ్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుని రాటుదేలాడు. ప్రణయ్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం.
All that you are is all that I will ever need ♥️ #3daystogo pic.twitter.com/SegXJdv5ES
— PRANNOY HS (@PRANNOYHSPRI) September 10, 2022
Comments
Please login to add a commentAdd a comment