Pre Wedding Photoshoot
-
కర్ణాటక తీరం.. ప్రీవెడ్డింగ్ షూట్ గమ్యం! (ఫొటోలు)
-
Maternity Photoshoot: నిండు నెలల జ్ఞాపకం
ప్రీ వెడ్డింగ్ షూట్ వెడ్డింగ్ షూట్ తెలిసిందే. కాని ఇప్పుడు మెటర్నిటీ షూట్ ట్రెండ్‌లో ఉంది. స్త్రీలు తమ నిండు గర్భం సమయంలో భర్తతో కలిసి ఫొటో షూట్లో పాల్గొనడం ఒక ముఖ్య ఉత్సవంగా మారింది. తాజాగా దీపికా పడుకోన్ విడుదల చేసిన మెటర్నిటీ షూట్ ఫొటోలు ఈ ట్రెండ్ గురించి ప్రొత్సాహంగా మాట్లాడుతున్నాయి.తొలి చూలుతో పుట్టింటికి వచ్చిన కూతురు రేపో మాపో కాన్పు అవుతుందనగా ‘నొప్పులొస్తే నన్ను లేపమ్మా’ అందట నిద్రపోతూ. అప్పుడు తల్లి నవ్వుతూ ‘పిచ్చిపిల్లా... నొప్పులొస్తుంటే నేను నిన్ను లేపడం కాదే. నువ్వే గోల చేసి ఊరంతా లేపుతావు’ అందట. మాతృత్వపు మధురిమ స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. గర్భం దాల్చడంతో మొదలు నెలలు నిండుతూ వెళ్లడం, శరీరంలో మార్పు ఉదర భాగం బిడ్డకు గూడుగా మారుతూ ఎదుగుతూ ఉండటం, ఆ మార్పులన్నీ చూసుకోవడం, చివరకు కాన్పు జరిగి అంతవరకూ గర్భంలో ఉన్న బిడ్డ ఒడికి చేరడం... స్త్రీకి ఇదంతా అద్భుత ఘట్టం. మానసిక శాస్త్ర అధ్యయనం ప్రకారం చాలామంది స్త్రీలకు గర్భం దాల్చినప్పుడు ఆ నిండుదనాన్ని నలుగురికీ చెప్పుకోవాలని ఉంటుందట. నిండు గర్భంతో అప్పుడప్పుడు నలుగురిలోకి రావడాన్ని ఇష్టపడతారట. కాలక్రమంలో ఈ ఇష్టం ఆ క్షణాలను ఫొటోలుగా దాచుకునే వరకూ వచ్చింది.1991లో మొదలైన ట్రెండ్హాలీవుడ్ ప్రసిద్ధ నటి డెమి మూర్ 1991లో తన ఏడు నెలల గర్భాన్ని ప్రదర్శిస్తూ ఒక మేగజీన్ కవర్ పేజీ మీద కనపడినప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం అయ్యింది. ప్రఖ్యాత మహిళా ఫొటోగ్రాఫర్ ఆనీ లీబోవిజ్ ఈ ఫొటో తీసింది. చాలామంది దీనిని స్త్రీ శరీర ధర్మానికి సంబంధించిన ఒక గౌరవ ప్రకటనగా భావిస్తే మరికొందరు ఇందులో అశ్లీలత ఉందని విమర్శలు చేశారు. అయితే కాలక్రమంలో సెలబ్రిటీలు చాలా మంది మెటర్నిటీ ఫొటోస్ను జనం ముందుకు తీసుకురాసాగారు.2012 నుంచి ఇండియాలోమన దేశంలో బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు మెటర్నిటీ షూట్‌ను 2010 నుంచి పరిచయం చేయసాగారు. కొంకణా సేన్, సోహా అలీ ఖాన్, నేహా ధూపియా, బిపాషా బసు, అనుష్కా శర్మ, కరీనా కపూర్, సోనమ్ కపూర్, ఇటీవల ఆలియా భట్... వీళ్ల ఫొటోషూట్లు సామాన్యజనానికి కుతూహలం రేకెత్తించాయి. మనం కూడా ఎందుకు ఇలాంటి జ్ఞాపకాలు నిక్షిప్తం చేసుకోకూడదు అనిపించేలా చేశాయి. ఇప్పుడు దీపికా పడుకోన్ తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి బ్లాక్ అండ్ వైట్‌లో చేసిన మెటర్నిటీ షూట్ అందరి చేత ప్రశంసలు పొందుతోంది. రెండు ఫ్యాషన్ బ్రాండ్ల నుంచి ప్రత్యేకంగా ఎంచుకున్న దుస్తులతో దీపిక ఈ షూట్ చేసింది. రణ్వీర్ సింగ్ ఈ షూట్లో సంబరంగా పాల్గొన్నాడు.మధ్యతరగతికి దూరం కాదుమెటర్నిటీ షూట్లకు సెలబ్రిటీలు లక్షలు ఖర్చు పెడుతుంటే మధ్యతరగతి స్త్రీలకు అదేమీ అందని కల కాదు. ్ర΄÷ఫెషనల్ ఫొటోగ్రాఫర్లతో మొదలు హాబీగా ఫొటోలు తీసేవారి వరకూ ఇలాంటి ఫొటోలు తీసి పెట్టేవారు ఉన్నారు. నాలుగు గంటల వ్యవధిలో మూడు రకాల డ్రస్సులతో ఫొటోలు తీసి పెట్టే ΄్యాకేజీలు కూడా ఉన్నాయి. ‘ఒకప్పుడు గర్భిణులు కెమెరా ముందుకు రావడానికి సిగ్గు పడేవారు. కాని తమ మాతృత్వ దశలను పదిలం చేసుకునేందుకు ఇప్పుడు సంతోషంగా ముందుకొస్తున్నారు’ అని ఇలాంటి ఫొటోలు తీసే ఒక ఫొటోగ్రాఫర్ అన్నారు.థీమ్ ఫొటోలుప్రెగ్నెన్సీ షూట్లో కూడా థీమ్స్ ఉన్నాయి. పల్లెటూరి జంటలుగా, నగర శ్రీమంతులుగా, గుడి ్రపాంగణంలో, తెలుగుదనంతో ఇలా చాలా రకాలున్నాయి. ఎనిమిదవ నెలలో ఈ ఫొటోషూట్ చేయించుకుంటే ఫొటోలు బాగావస్తాయంటున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం. మీ మనసులో ఈ ముచ్చట ఉంటే వెంటనే అందుకు సిద్ధం కండి. -
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గచ్చిబౌలి: మరి కొద్ది గంటల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. కాబోయే భర్త మాట్లాడి వెళ్లి కొద్ది సేపటికే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, గొసుకులపల్లికి చెందిన ముద్దం విద్యశ్రీ(23) కొత్తగూడలోని పీజీ హస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. సోమవారం సాయంత్రం హస్టల్లోని బాత్ రూమ్‌కు వెళ్లిన ఆమె బయటికు రాకపోవడంతో రూమ్మేట్స్ తలుపులు తెరిచి చూడగా. టవల్‌తో షవర్ రాడ్‌కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వారు ఆమె సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కాగా ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కార్డులు పంపిణీ చేసి షాపింగ్ పూర్తి చేసింది. బుధవారం ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. ఆమెకు కాబోయే భర్త హస్టల్ వద్దకు మాట్లాడి వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అంబానీ-రాధిక ప్రీ-వెడ్డింగ్: ఈ బ్యూటీ సందడి మామూలుగా లేదు (ఫోటోలు)
-
అద్బుతమైన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసిన నీతా అంబానీ (ఫోటోలు)
-
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్: ఏఐ ఫోటోలు అదుర్స్
-
ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్ షూట్
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఆపరేషన్లు నిర్వహించాల్సిన థియేటర్లో ప్రీవెడ్డింగ్ షూట్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో ఉన్నతాధికారులు ఓ వైద్యుడిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే భరంసాగర్ ఏరియా జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న ఒక వైద్యుడు ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాడు. ఇది వైరల్‌గా మారి వివాదాస్పదమైంది. ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ నిర్వహించిన వైద్యుడిని సర్వీసు నుంచి తొలగించినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత వైద్యులు, సిబ్బందికి సూచించారు. Prewedding shoot reaches Operation Theatre in #Karnataka. Doctor under NHM sacked after video of his pre-wedding shoot in OT of a government hospital goes viral. https://t.co/qNykToeJlw — South First (@TheSouthfirst) February 10, 2024 -
నది మధ్యలో ఫోటోషూట్: అనుకోని అతిథిని చూసి భయంతో యువతి..
ఈరోజుల్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. కళ్లు చెదిరే లొకేషన్లలో అద్భుతమైన సెట్టింగులతో, ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేనకడుగు వేయడం లేదు. సినిమా స్టైల్‌ను తలపించే లైటింగ్స్, ఎఫెక్ట్స్, రిచ్‌నెస్‌తో ఫోటోషూట్స్ పెట్టుకుంటున్నారు. దీనికోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను నియమించుకుంటున్నారు. తమ క్రియేటివిటీకి పదును పెట్టి ఢిపరెంట్ స్టైల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు అందరి దృష్టని ఆకర్షిస్తున్నాయి. రీసెంట్గా ఓ జంట తీయించుకున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ నదిలో కాబోయే జంట అందంగా ఫోటోలకు ఫోజులిస్తుండగా పాము అనుకోని అతిథిలా ఫ్రేమ్‌లోకి వచ్చింది. దీంతో యువతి భయపడి కేకలు వేయగా, ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పాడు. కాసేపట్లోనే ఆ పాము అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ మొత్తం తతంగాన్ని ఫోటోగ్రాఫర్ కెమెరాలో బంధించాడు. వైల్డ్ ఫోటోషూట్ అంటూ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఇప్పటికే 53 లక్షల మంది ఆ వీడియోను చూశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పాము ఒంటిపై నుంచి వెళ్లినా అదరకుండా, బెదరకుండా చాలా చిల్ మూడ్‌లో ఉన్నారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పామును చూసి ఆ అమ్మాయి భయపడినప్పుడు ఆమె కాబోయే భర్త ధైర్యం చెప్పిన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by 🅟🅐🅡🅢🅗🅤 🅚🅞🅣🅐🅜🅔 🅟🅗🅞🅣🅞🅖🅡🅐🅟🅗🅨 (@parshu_kotame_photography150) -
ప్రీ వెడ్డింగ్ షూట్ కు పోలీస్ వాహనాన్ని వాడుకున్న మహిళా ఎస్సె
-
HYD: పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ !
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పోలీస్ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్ అధికారులు షూట్లో పాల్గొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఎస్సై భావనతో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే.. వివాహానికి ముందు ఈ జంట వెడ్డింగ్ షూట్ నిర్వహించింది. రకరకాల లొకేషన్లో షూట్లో పాల్గొంది ఆ టైంలో ఆ కాబోయే జంట. అంత వరకు పర్వాలేదు. అయితే షూట్ ఆరంభంలోనే.. మూడు సింహాలను చూపించి, ఇద్దరూ సినిమా లెవల్లో వాహనాల నుంచి కిందకు దిగి.. పీఎస్ బయట షూట్లో పాల్గొన్నారు. దీంతో యూనిఫాంలో అదీ పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది. -
ఆ ఇద్దరిని ఒక్కటి చేసిన పాము.. ప్రీ వెడ్డింగ్ షూట్ మామూలుగా లేదుగా!
ఇటీవల కాలంలో ఫోటో షూట్ల హడావిడీ ఎక్కువైపోయింది. ప్రతి ప్రత్యేక సందర్భాన్ని జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లికి అయితే ఫోటో షూట్ తప్పనిసరిగా మారింది.ప్రీ వెడ్డింగ్ షూట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పెళ్లి చేసుకునే నూతన దంపతులు.. తమకు నచ్చిన లోకెషన్లలో వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మరీ చిత్ర విచిత్ర లోకేషన్లలో, వస్తువులతో ఫోటోషూట్లు చేస్తున్నారు. తాజాగా ఓ జంట ఏకంగా పాముతో ఫోటో షూట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వివేక్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. .ఓ జంటను పాము ఎలా కలిపిందనే విషయాన్ని ఈ ఫొటోలు వెల్లడిస్తాయి. ఇందులో యువతి ఇంటి దగ్గర నడుచుకుంటూ వస్తుండగా ఆమెకు పాము ఎదురైంది. దీంతో పామును చూసి భయపడి రెస్క్యూ సర్వీసులకు కాల్ చేసి పిలిపించింది. ఇంతలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు అక్కడికి రాగా.. ఓ వ్యక్తి మహిళవైపు చూసి నవ్వడం కనిపిస్తుంది. ఆపై వారు పాముని పట్టుకుని బాక్స్ లోపల పెడతారు. చదవండి: కుక్క కోసం రూ. 16 లక్షల ఇల్లు! ఫ్రిజ్‌తో సహా.. స్నేక్‌ను తీసుకుని వెళుతూ తనకు కాల్ చేయాలని ఆ వ్యక్తి మహిళకు సంకేతం ఇస్తాడు. ఆపై వారు ఫోన్లో మాట్లాడుతూ ప్రేమలో పడిపోతారు. చివరి ఫొటోలో పాము ఇద్దరిని ఒక్కటి చేసినట్లు చూపించారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్న స్పందన లభించింది. షార్ట్ మూవీస్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ చేయాలని ఓ యూజర్ కామెంట్ చేయగా మరొవ్యక్తి ట్విటర్లో తాను చూసిన బెస్ట్ ఫోటోలు ఇవేనని చమత్కరించాడు. ట్విటర్లో షేర్ చేసిన ఫోటో స్టోరీస్‌ను కింద చూడండి.. Pre Wedding Photoshoot ❤️ A Thread: 🧵 pic.twitter.com/8vXpgTRMNK — vivekk (@oyevivekk) May 27, 2023 pic.twitter.com/5jmLzXyLwh — vivekk (@oyevivekk) May 27, 2023 pic.twitter.com/lxK8tiC2pS — vivekk (@oyevivekk) May 27, 2023 pic.twitter.com/RTFYtE2InN — vivekk (@oyevivekk) May 27, 2023 pic.twitter.com/RTFYtE2InN — vivekk (@oyevivekk) May 27, 2023 pic.twitter.com/v4HtjAo4bA — vivekk (@oyevivekk) May 27, 2023 pic.twitter.com/oDJl2wAGE1 — vivekk (@oyevivekk) May 27, 2023 pic.twitter.com/s7xdkPH9wZ — vivekk (@oyevivekk) May 27, 2023 -
ఫొటో షూట్లకు యమా క్రేజ్!
సాక్షి, అమరావతి: ఒకప్పుడు పెళ్లి అంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్లు, ఏడు అడుగులతో పాటు రుచికరమైన భోజనం, గుర్తుంచుకునేలా కొన్ని ఫొటోలు. కానీ ఇప్పుడు వాటన్నింటితో పాటు కళ్లు చెదిరే లొకేషన్లలో ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు కూడా కలిపితేనే ‘అసలైన పెళ్లి’ అని యువ జంటలు అంటున్నాయి. పెళ్లికి ముందు(ప్రీ వెడ్డింగ్), ఆ తర్వాత(పోస్ట్ వెడ్డింగ్) తీసే ఫొటోలు, వీడియోల కోసం ఎంత దూరమైనా, ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసే ఇదే క్రేజ్. ఇందులో కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పెళ్లి అనే కాదు.. పుట్టినరోజుతో పాటు శుభకార్యక్రమం ఏదైనా సరే.. ఫొటో, వీడియో షూట్లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని.. ఫొటో షూట్లకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని సముద్ర తీరాలు, నదులు, రిసార్టులు, పార్కులు ప్రస్తుతం ఫొటో షూట్లతో కళకళలాడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని లంబసింగి, అరకు, పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరంతో పాటు నల్లమల, శేషాచలం అటవీ ప్రాంతాలు కూడా యువ జంటల ఫొటో షూట్లకు అడ్డాలుగా మారిపోయాయి. మరికొందరైతే ఈ షూట్ల కోసం ఫొటోగ్రాఫర్లను వెంటబెట్టుకొని దేశ, విదేశాలకు కూడా వెళ్లివస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్లు సినీ పాటలకు స్టెప్పులు వేస్తూ.. తమ ప్రేమను, అనుబంధాన్ని వ్యక్తం చేసేలా ఫొటోలు తీయించుకుంటూ మురిసిపోతున్నారు. షూట్ల కోసం ప్రత్యేక స్టూడియోలు.. సినిమాలను తలపించేలా తీస్తున్న ఈ ఫొటో, వీడియో షూట్ల కోసం రాష్ట్రంలోని చాలా చోట్ల ప్రత్యేకంగా స్టూడియోలు కూడా ఏర్పాటయ్యాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల్లోని అందమైన ప్రదేశాలు, భవనాలను పోలిన నిర్మాణాలను ఈ స్టూడియోల్లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఈ స్టూడియోలు వెలిశాయంటే.. ఫొటో షూట్లకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల భీమవరంలో మూడు, పాలకొల్లులో రెండు, కాకినాడలో మూడు స్టూడియోలు ఏర్పాటయ్యాయి. ఇంకా పలు చోట్ల స్టూడియోలు నిర్మాణంలో ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లిలేని వారు.. ఈ స్టూడియోలకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు. ఖర్చుకు వెనుకాడడం లేదు.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్లకు భారీ క్రేజ్ ఉంది. 90 శాతం జంటలు పెళ్లితో పాటు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. వారి ఆసక్తికి తగినట్లే అందమైన లొకేషన్లలో ఫొటోలు, వీడియోలు తీసి.. ట్రైలర్లు(చిన్న వీడియోలు)గా మార్చి.. శుభ కార్యక్రమానికి ముందే అందిస్తున్నాం. దీంతో వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసి.. ఆహా్వనాలుగా ఉపయోగిస్తున్నారు. – షేక్ గౌస్‌బాషా, ఫొటోగ్రాఫర్ -
పెళ్లి పుస్తకంలో రంగుల పేజీలు
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయనేది పాత మాట.. ఇక్కడే స్వర్గం సృష్టిస్తామనడం నయా ట్రెండ్.. సంప్రదాయ తంతుకు సరికొత్త హంగులద్దుతున్నారు.. ఎంగేజ్మెంట్ హంగామా.. ప్రీవెడ్డింగ్ షూట్.. ప్రత్యేక అలంకరణలు.. మెహందీ.. సంగీత్ వంటి వాటితో మెగా ఈవెంట్‌ను తలపింపజేస్తున్నారు.. వివాహాది శుభకార్యాలను పదికాలాల పాటు పదిలపర్చుకోవాలని వధూవరులు చూపిస్తున్న ఆసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు కొందరు. ముహూర్తాలు మొదలవడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్లిసందడి ప్రారంభమైంది. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : పెళ్లిచూపులు, నిశ్చయ తాంబూలాల నుంచి వివాహ వేడుక వరకూ భారీ బడ్జెట్‌తో జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వీడియోలు, ఫొటోలు తీయించుకోవడం పెళ్లి పుస్తకంలో మధుర ఘట్టంలా వధూవరులు భావిస్తున్నారు. దీంతో ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఉపాధి లభిస్తోంది. అలాగే వివాహ వేడుకలో పూర్వకాలం నుంచి అరివేడు ముంత, పూలజడ, చమ్మిలి దండ, అడ్డుతెర, ఉంగరాల ఆట బిందె, మంగళస్నానాల జల్లెడ, గొడుగులు వంటి వాటికి ప్రాధాన్యముంది. పెళ్లివారి అభిరుచులకు అనుగుణంగా వీటిని రంగులు, అద్దాలతో ప్రత్యేకంగా అలంకరిస్తూ ఆకట్టుకుంటున్నారు డిజైనర్లు. భలే ముహూర్తం ఈ ఏడాది వరుసగా మూడు నెలల మూఢం కారణంగా ఎటువంటి శుభకార్యాలు జరగలేదు. ఈనెల మొదటి వారంలోనే మూఢానికి ముగింపు పడగా కొద్దిపాటు ముహూర్తాలు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 2న రాత్రి నుంచి కొద్దిపాటి పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలయ్యాయి. అలాగే జనవరిలో 25 నుంచి మాఘమాసం ప్రవేశించి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ గట్టి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అనంతరం మార్చి 28 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకూ గురు మూఢం ప్రవేశిస్తుండడంతో ముహూర్తాలకు బ్రేక్ పడనుంది. మెండైన ఉపాధి : వివాహాది శుభకార్యాలు మొదలుకావడంతో ఇప్పటికే చాలా మంది బ్యూటీషియన్లను బ్రైడల్ మేకప్‌ల కోసం రిజర్వ్ చేసుకున్నారు. అలాగే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు డిమాండ్ పెరిగింది. వీరితో పాటు పూలు, విద్యుత్ అలంకరణ చేసేవారు, ఫుడ్, ఐస్‌క్రీమ్, పాన్ సప్లయర్లు, కేటరర్లు, ఆయా వర్గాలకు సంబంధించిన సహాయకులకు చేతినిండా పని దొరుకుతుందనే ఆశతో ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు ముహూర్తాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిన వారంతా తిరిగి ఇటుగా రానున్నారు. దృశ్య కావ్యంలా.. వధూవరుల మంగళస్నానాలకు వినియోగించే పాత్రలు, మహారాజా తలపాగాలు, కాళ్లకు తొడిగే పావుకోళ్లు, రోళ్లు, రోకళ్లు, బాసికాలు, విదేశీ పూలజడలు, అల్లికల జాకెట్లు, పట్టువస్త్రాలు, వధూవరులు ఆకర్షణీయంగా కనిపించడానికి బ్రైడల్ మేకప్‌లు, పూచ్చిపూల మండపాలు, విద్యుద్దీపాలంకరణ, బాణసంచా సందడి, ఆర్కెస్ట్రా, వింధు భోజనాలు ఇలా అన్నింటా ప్రత్యేకతకు ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తంగా దృశ్యకావ్యంలా వివాహ తంతును జరిపించేందుకు పలువురు ఆసక్తి చూపడంతో ఆయా రంగాల్లో ని ఎందరో ముహూర్తాల సీజన్లో ఉ పాధి పొందుతున్నారు. మెహందీ.. సంగీత్ వేడుకలు వివాహా వేడుకల్లో ముఖ్యంగా మెహందీ, సంగీత్‌లు ప్రత్యేకతను సంతరించుకుంటున్నా యి. ఉత్తర భారతదేశంలో ఉండే ఈ వేడుకలు ఇటీవల జిల్లాలోను తళుక్కుమనిపిస్తున్నాయి. గోరింటాకు పెట్టుకోవడం, సినీ గీతాలకు నృత్యాలు చేయడం వంటి పనులు వినోదాత్మకంగా జరుగుతున్నాయి. దీంతో బ్యూటీషియన్లు, ఈవెంట్ మేనేజర్లకు ఉపాధి లభిస్తోంది. ఈవెంట్ అంటే ఓ కళ పెళ్లంటే సంప్రదాయ సంబరం. అందరినీ ఒకదగ్గరకు చేర్చి వినోదాన్ని పంచాలి. అలాంటి ఈవెంట్‌ను నిర్వహించడంలో ఓ కిక్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరితో డ్యాన్స్ చేయిస్తే ఈవెంట్ ఆర్గనైజర్‌గా విజయం సాధించినట్టే. ఒక్కోసారి ముహూర్తం అర్ధరాత్రి ఉంటుంది. అటువంటప్పుడు అందరినీ ఆహ్లాదపరుస్తూ సమయం గడిచేలా చేయడం కూడా కళగా భావిస్తున్నాం. – అల్లాడ లావణ్య, ఈవెంట్ మేనేజర్ ఓపిగ్గా మేకప్ బ్రైడల్ మేకప్‌ను ఎంతో ఓపికగా చేయాలి. దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. ఒక్కొక్కరి శరీర ఛాయకు సరిపడేలా రంగులు అద్దాల్సి ఉంటుంది. దానిని గుర్తించడం బ్యూటీషియన్‌కు సవాలే. కరోనా తర్వాత చాలా మంది బ్రైడల్ మేకప్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది ఈ రంగంలోకి రావడంతో పోటీ పెరిగి ఆదాయం తగ్గింది. అలాగే ఖర్చు కూడా పెరుగుతోంది. – బండి శిరీష, బ్యూటీషియన్, సిరీస్ హెయిర్ అండ్ బ్యూటీ ప్రత్యేక అలంకరణలు పెళ్లి తంతులో వినియోగించే ప్రతి వస్తువునూ ఆకర్షణీయంగా అలంకరించడం ట్రెండ్‌గా మారింది. ఇందుకు అనుగుణంగా గరికి ముంతలు, అవిరేడు ముంతలు, బాసికాలు, తలపాగాలు, సంప్రదాయ టోపీలు, పూల జడలు, గొడుగులు, బుట్టలు, బిందెలు వంటివి ప్రత్యేకంగా అలంకరిస్తున్నాం. ప్రతి దానికీ హంగులు అద్దుతూ పూసలు, పెయింటిగ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాం. – పి.ఉమా మహేశ్వరిదేవి, శ్రీదేవి ఉమెన్స్ వరల్డ్ యజమాని ప్రీ వెడ్డింగ్ షూట్‌తో.. ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్ నంచి ఫొటో, వీడియోగ్రాఫర్లకు పెళ్లి పని మొదలవుతోంది. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఫొటోగ్రాఫర్ల పనితనానికి మచ్చు తునకగా నిలుస్తోంది. దీంతో మేం అందమైన లొకేషన్లను వెదుకుతున్నాం. పెళ్లి తంతులో ప్రతి ఘట్టాన్నీ కవర్ చేయాల్సి ఉంది. ఇందుకు తగ్గట్టు ఖరీదైన కెమెరాలు వాడుతున్నాం. వివాహాల కవరేజ్‌ను బట్టి ప్యాకేజీ ఉంటుంది. – కరణం ఫణి, ఫొటోగ్రాఫర్ -
పెళ్లి పీటలు ఎక్కనున్న నటి.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
కోలీవుడ్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ బ్యూటీ మంజిమా మోహన్. నటుడు శింబుకు జంటగా 'అచ్చం యంబదు మడమయడా' చిత్రంలో కథానాయికగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ వంటి యువ హీరోలతో జత కట్టింది. అలా గౌతమ్ కార్తీక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇటీవలే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. (చదవండి: హీరోతో డేటింగ్, పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్స్ డిలీట్ చేసిన మంజిమా మోహన్) ఈ నెల 28వ తేదీ ఒక్కటవుతున్న ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఫోటోలు వైరలవుతున్నాయి. వీరి వివాహానికి చెన్నైలోని ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ వేదికగా కానుందని సమాచారం. తాజాగా మంజిమా మోహన్ తన ఇన్‌స్టాలో గౌతమ్ కార్తీక్‌తో ఉన్న ప్రీ వెెడ్డింగ్ ఫోటోలను పంచుకుంది. తాజా ఫోటోషూట్‌లో కొత్త జంట ఫోటోలకు పోజులిచ్చింది. మంజిమా మోహన్ ఆకుపచ్చ జాతి దుస్తులలో అద్భుతంగా కనిపించగా.... గౌతమ్ కార్తీక్ పైజామాతో సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. దీంతో ఆమె అభిమానులు కాబోయే జంటకు ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నారు. తమ పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని మంజిమా మోహన్ వెల్లడించారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలిపారు. -
వైరల్ వీడియో: ‘ధూమ్ 4’ షూటింగ్లో కొత్త జంట!
-
‘ధూమ్ 4’ షూటింగ్లో కొత్త జంట!.. వీడియో వైరల్
అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ‘ధూమ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి సంబంధించి మూడు సీక్వెల్‌లు ఇప్పటికే రాగా ధూమ్ 4ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ కొత్తజంట తమ ప్రీవెడ్డింగ్ షూట్లోనే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు వైరల్ కాగా.. చూసిన నెటిజన్లు ‘ధూమ్ 4’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో పెళ్లిలో వీడియో ఉండకపోయినా పర్వాలేదు కానీ, ప్రీవెడ్డింగ్ షూట్ మాత్రం ఉండాలనే పట్టుతో ఉన్నారు యువత. అందుకు లక్షల్లో ఖర్చు చేస్తూ సినిమాలను మించిన యాక్షన్ సీన్లు చేస్తున్నారు. ఇలాగే.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట ప్రీవెడ్డింగ్ షూట్ చేసింది. అందరిలా చేస్తే ఏముంటుందనుకున్నారో ఏమో? బైక్‌పై స్టంట్ చేస్తూ వీడియో షూట్ చేశారు. సినిమాల్లో చూపించినట్లుగా సుమో పైనుంచి బైక్ జంప్ చేసే స్టంట్ చేశారు. వధూవరులు ఇద్దరు పెళ్లిలో మాదిరిగా వస్త్రధారణలో బైక్‌పై కూర్చోగా.. దానిని తాళ్ల సాయంతో సుమో వాహనంపై నుంచి జంప్ చేసినట్లుగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఒక్కరోజులోనే 77 మంది వీక్షించారు. ఇలా చేయకపోతే నేను పెళ్లే చేసుకోను అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. నా పెళ్లిలోనూ ఇలానే చేస్తాను. ఇలా చేయకపోతే అర్థమే లేదు. ఈ ప్రీవెడ్డింగ్ షూట్‌కు రోహిత్ శెట్టి డైరెక్టరా? అంటూ పలువురు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు! -
పెళ్లి పీటలెక్కనున్న భారత స్టార్ షట్లర్.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు అదుర్స్
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్ మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇటీవలే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపిన (నంబర్ వన్ ర్యాంక్) ప్రణయ్.. తన గర్ల్‌ఫ్రెండ్ శ్వేతా గోమ్స్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు ట్విటర్ వేదికగా అనౌన్స్ చేశాడు. ప్రణయ్ తన ట్వీట్లో ఫియాన్సీ శ్వేతా గోమ్స్‌తో దిగిన ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 30 ఏళ్ల ప్రణయ్ ఈ ఏడాది భీకర ఫామ్‌లో కొనసాగుతున్నాడు. మే నెలలో జరిగిన థామప్ కప్‌లో భారత్ స్వర్ణం సాధించడంలో ప్రణయ్ కీలకపాత్ర పోషించాడు. అలాగే ఇటీవలే జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్, జపాన్ ఓపెన్‌లోనూ ప్రణయ్ సత్తా చాటాడు. ప్రణయ్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుని రాటుదేలాడు. ప్రణయ్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. All that you are is all that I will ever need ♥️ #3daystogo pic.twitter.com/SegXJdv5ES — PRANNOY HS (@PRANNOYHSPRI) September 10, 2022 -
సినిమాను తలపించేలా ఫొటోషూట్స్
కరీంనగర్ (జగిత్యాలటౌన్) : గతంలో పెళ్లి, ప్రత్యేక సందర్భాలకే పరిమితమైన ఫొటోలు.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా పోస్ట్ వెడ్డింగ్, ప్రివెడ్డింగ్, ఫొటోషూట్స్, హల్దీ, మెహందీతో పాటు సినిమా సాంగ్స్‌కు అనుగుణంగా అపురూపమైన ఫొటోలను కరిజ్మా, క్యాన్వెరా అల్బమ్లతో ముస్తాబు చేసి అందిస్తున్న ఫొటోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను తమ ఉపాధిగా మల్చుకుంటున్నారు యువత. లెన్స్ కెమెరాలతో పాటు డ్రోన్, క్రేన్ కెమెరాలతో ఓవైపు షూట్ చేస్తూనే మరోవైపు జరుగుతున్న షూటింగ్‌ను లైవ్ ద్వారా వీక్షించేలా ఫంక్షన్ హాల్ నలువైపులా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రీవెడ్డింగ్ సాంగ్స్‌తో పెళ్లిల్లకు కొత్త అందాలు అద్దుతూ ఔరా అనిపిస్తున్నారు. షూట్ చేసిన ఫొటోలను ఆకర్షణీయమైన ఆల్బమ్స్ తయారు చేస్తూ పెళ్లిళ్లు, శుభకార్యాలు, సంబరాలను చిరకాలం గుర్తుండే మధుర స్మృతిగా మలుస్తున్నారు. యువతకు ఉపాధి.. ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త ట్రెండును పట్టణ జిల్లా ప్రజలు ఆహ్వానిస్తుండటంతో ఫొటోగ్రఫీని స్థానిక యువత ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. ప్రివెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి ఫొటో షూట్లతో కలిపి సినిమా ఫొటోగ్రఫీ, వీడియో క్యాన్వెరా, ఎల్ఈడీ స్క్రీన్స్, క్యాండెట్ ఫొటోగ్రఫీ అల్బమ్‌తో సహా కస్టమర్ రిక్వైర్మెంట్ను బట్టి రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు చార్జ్ చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు 240మంది ఫొటోగ్రాఫర్లు ఉండగా 40 నుంచి 50కి పైగా ఫొటో స్టూడియోలు, మిక్సింగ్ సెంటర్లు, అల్ఫా డిజైనర్స్ ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఔట్‌డోర్ ఫొటో షూట్.. పెళ్లికి ముందు జరిపే ప్రివెడ్డింగ్ షూట్ల ను ఔట్డోర్లలో అత్యాధునిక లెన్స్ కెమెరాలు, డ్రోన్, క్రేన్ కెమెరాలను వినియోగిస్తూ సినిమా షూటింగ్‌ను తలపించేలా షూట్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఔట్‌డోర్ ఫొటోషూట్లకు నగర శివారు ప్రాంతాలతో పాటు హైదరా బాద్, నిజామాబాద్(డిచ్పల్లి), సిద్దిపేట లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి ఫొటోషూట్ చేస్తున్నా రు. ఈ షూటింగ్‌ను చూస్తున్న చాలామంది సినిమా షూటింగ్ అని భ్రమపడుతున్నారు. ఉపాధి కల్పిస్తున్నాను టీనేజ్‌లో ఫొటోగ్రఫీ నా హాబీగా ఉండేది. సొంత ఫొటోలను మాత్రమే తీసుకునే నేను ప్రస్తుతం ఫొటోగ్రఫీని ఉపాధిగా మార్చుకుని వెడ్డింగ్ షూటింగ్, వీడియో మిక్సింగ్, ఆల్బమ్ మేకింగ్ చేస్తూ నాతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాను. – శ్రీనివాస్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఆల్బమ్ మేకింగ్ చేసిస్తాం జిల్లా కేంద్రంలో ఎడిట్ పాయింట్ నిర్వహిస్తున్నాను. కొత్త జంటల తొలి కలయికలకు సంబంధించిన మధురమైన స్మృతులను పదికాలాల పాటు దాచుకునేలా షూటింగ్, ఎడిటింగ్‌తో పాటు, ఆల్బమ్ మేకింగ్ కూడా చేసిస్తాం. ఒక్కో వెడ్డింగ్‌కు అన్ని ఫార్మాలిటీస్ కలుపుకుని రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు చార్జ్ చేస్తాం. – గంటె మహేశ్, ఎడిట్ పాయింట్ -
ఫొటోషూట్‌లో లైట్స్.. కెమెరా.. యాక్షన్.. ప్రస్తుతం జరుగుతోంది ఇదే
ఈ పదాలను సినిమా షూటింగ్లో నిత్యం వింటుంటాం. కానీ ఫొటోషూట్లోనూ ఈ పదాలు వినిపిస్తే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతోంది అదే. డ్రోన్, క్రేన్ షాట్స్‌తో సినిమా షూటింగ్‌ను తలపించేలా నగర శివారులో ఫొటోషూట్ చేయడం ట్రెండ్‌గా మారింది. చాలా మంది ఫొటోషూట్‌ను సినిమా షూటింగ్ అనే భ్రమపడుతున్నారు. దానికి సినిమా షూటింగ్ తరహాలో చేయడమే కారణమంటున్నారు ఫొటోగ్రాఫర్లు. అందుకే ఫొటోషూట్‌ను ఈ తరహాలో చేస్తున్నామని స్టుడియో నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఫొటోగ్రఫీపై ఆసక్తి (ఫొటోనాసక్తి) ఉన్న యువత తమ పనితనానికి మెరుగులు దిద్దుకుంటూ ఫొటోనాసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: గతంలో పెళ్లిళ్లు, పేరంటాలకు మాత్రమే ఫొటోలు తీయించుకునేవారు. ప్రస్తుతం పెళ్లితో పాటు ప్రీ–వెడ్డింగ్, పోస్ట్–వెడ్డింగ్ ఫొటోషూట్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫొటోగ్రాఫర్ స్వయంగా వెళ్లి తీయలేని యాంగిల్స్‌లో కూడా ఫొటోలను తీసే అవకాశం డ్రోన్ షాట్స్, క్రేన్ షాట్స్‌తో ఏర్పడుతోంది. అంతేకాకుండా సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆ వీడియోలను సినిమా పాటల తరహాలో ఎడిటింగ్ చేయించుకుంటున్నారు. అపురూపమైన ఈ ఫొటోలు, వీడియోలను కరిజ్మా, క్యాన్వేరా ఆల్బామ్, డీవీడీలలో పొందు పరిచి అందజేస్తున్నారు. సినిమా షూటింగ్ తరహాలో ఫోటో షూట్ రూ.70వేల నుంచి రూ.3.5లక్షల వరకు.. ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త ట్రెండ్లను నగర ప్ర జలు ఆహ్వానిస్తుండటంతో ఈ రంగంలోకి వచ్చే వారికి ఉపాధి లభిస్తోంది. ప్రీ–వెడ్డింగ్, పోస్ట్–వెడ్డింగ్ ఫొటోషూట్లతో కలుపుని సినిమా ఫొటో గ్రఫీ, వీడియో క్యాన్వేరా, ఎల్ఈడీ స్క్రీన్స్, క్యాన్డెట్ ఫొటోగ్రఫీ ఆల్బంతో సహా మొత్తం క్వాలిటీని బట్టి దాదాపు రూ.70 వేల నుంచి రూ.3.5లక్షల వరకు ఫొటోగ్రాఫర్లు తీసుకుంటున్నారు. జవహర్‌నగర్‌లో 200 స్టూడియోలు, 3 కలర్‌ల్యాబ్‌లు ఫొటోగ్రఫీలో కొత్త ట్రెండ్లు రావడంతో పాటు మార్కెట్ రోజురోజుకు విస్తరించడంతో ఫొటోగ్రఫీ రంగంవైపు రావడానికి నేటితరం జవహర్‌నగర్ యువత ఆసక్తి చూపుతున్నారు. దానినే ఉపాధిగా మలుచుకుంటున్నారు. 15 ఏళ్ల క్రింద జవహర్‌నగర్ పరిసర ప్రాంతాలలో 5 నుంచి 10 ఫొటో స్టూడియోలు ఉండేవి. కానీ ప్రస్తుతం దాదాపు 200 వరకు ఫొటోస్టూడియోలు, 3 కలర్‌ల్యాబ్‌లు ఉన్నాయి. తక్కువ ఖర్చులోనే.. తక్కువ ఖర్చులోనే సినిమాను తలపించే రీతిలో అన్ని కోణాల్లో దశ్యాలను చిత్రీకరిస్తున్నాం. ఎక్కువ శాతం క్రేన్ షాట్స్ తీయాలని వినియోగదారులు కోరుతున్నారు. సీజన్లో గిరాకీ బాగుండటంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. – శ్రీకాంత్‌యాదవ్, జవహర్‌నగర్ ఎంతో మందికి ఉపాధి.. ఫొటో రంగంలోకి యువత రావడానికి ఇష్టపడుతున్నారు. నూతన టెక్నాలజీ ద్వారా షాట్స్ తీయడమే కాకుండా వారికి అనుకున్న రీతిలో ఫొటోఆల్బమ్ తీసి ఇస్తున్నాం. అంతే కాకుండా ఎంతో మంది ఉపాధిని కూడా పొందున్నారు. – సంపత్, అంబేడ్కర్‌నగర్ -
ప్రీ వెడ్డింగ్ షూట్లో అపశ్రుతి.. కాబోయే జంటపై తేనెటీగల దాడి
ఇటీవలి కాలంలో ఫోటోషూట్లు ఎక్కువయ్యాయి. ఏ చిన్న వేడుకైనా కూడా ఫోట్ షూట్ ఉండాల్సిందే అనేంతగా రోజులు మారిపోయాయి..కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా చేసుకుంటున్న ఈ ఫోటోషూట్లు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. పుట్టినరోజులు, ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ కచ్చితంగా పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ఫోటో షూట్ పేరుతో ప్రమాదలను కొనితెచ్చుకుంటున్నారు. జాగ్రత్తలు మరిచి ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తున్నారు. సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్ : ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తేనెటీగలు దాడి చేయడంతో స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీకి చెందిన అనురాగ్‌రెడ్డి, శివానికి వివాహం కుదిరింది. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఈనెల 11న కోహెడలోని ఔటర్ పరిసరాల్లోకి వచ్చారు. ఫొటో షూట్లో నిమగ్నమైన సమయంలో సమీపంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో అక్కడే ఉన్న పోలీస్ కంట్రోల్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. స్వల్ప గాయాలు కావడంతో పోలీసు సిబ్బంది సహకారంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అదే రోజు సాయంత్రం డిశ్చార్జి అయినట్లు తెలిసింది. చదవండి: అదృశ్యమైన సస్పెండ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య? -
ఇప్పుడిదే ట్రెండ్! ఫిక్సయిపోతున్న కొత్త జంటలు.. ఖర్చుకు తగ్గేదేలే!
సిరిసిల్లఅర్బన్: పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ మూడే ముళ్లు.. ఏడే అడుగులు ఇదీ అందరికీ తెలిసిందే.. కానీ ప్రస్తుతం వీటితో పాటు పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లి వేడుకలను చెదరని మధుర జ్ఞాపకంలా జీవితాంతం గుర్తుండి పోయేలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రీవెడ్డింగ్ షూట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంతలా అంటే సినిమాలకు ధీటుగా చిత్రీకరించేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. దీనికోసం ప్రత్యేకంగా అనుభవజ్ఞులైన నిపుణులు, కెమెరామెన్లను సాంకేతిక బృందాలను ఆశ్రయిస్తున్నారు. పాటల చిత్రీకరణకు సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు వెళ్తున్నారు. కొందరైతే సముద్ర తీర ప్రాంతాలకు, గోవాకు సైతం వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొంటున్నారు. (చదవండి: గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణలో ఉద్రిక్తత) లోకేషన్లను బట్టి చార్జీ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అందమైన ప్రదేశాలకు వెళ్తారు. ప్రీవెడ్డింగ్ ఫొటో, వీడియోగ్రాఫర్లు లొకేషన్లను బట్టి రూ.15 వేల నుంచి రూ.40వేల వరకు చార్జీ చేస్తుంటారు. వాహనఖర్చు, డ్రెస్సింగ్, తదితర ఖర్చులు వెడ్డింగ్ షూట్ చేసుకునేవారు చెల్లించాల్సి ఉంటుంది. సిరిసిల్ల, సిద్దిపేట, హైదరబాద్, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి ఫొటో షూట్ చేస్తుంటారు. ఒక్కో ఫొటో ప్రీ వెడ్డింగ్ షో చిత్రీకరించడానికి రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది. సినిమా తరహాలో పాటల చిత్రీకరణ విహహం నిశ్చయమైనప్పటి నుంచి పెళ్లి చేసుకునే జంటలు ప్రతీ క్షణాన్ని ప్రత్యేకంగా పదిల పర్చుకునేందుకు ప్రతీ క్షణాన్ని అందంగా మలుచుకునేందుకు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని దీంతో పెళ్లికి ముందే ఒకరి భావాలు మరోకరు తెలసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్లో కాబోయే జంటల నృత్యాలు సినిమాలను తలపించేలా చూడ ముచ్చటగా ఉంటున్నాయి. వీరు నటించిన నృత్యాలను, అందమైన ఫొటోలను పెళ్లి సమయంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తుండడంతో నూతన జంటలతో పాటు, పెళ్లికి వచ్చిన కుటుంబీకులు సైతం ఆనందపడుతున్నారు. (చదవండి: తొలిసారిగా ఆ ఊర్లో నడిచిన గూడ్స్ రైలు!!) ఆదరణ పెరిగింది మారుతున్న కాలానీకి అణుగుణంగా పెళ్లి జంటలు ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కు ఇష్టపడుతున్నా రు. వారు ఎంచుకున్న ప్రదేశాలకు వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్చేస్తాం సినిమాలను తలపించేలా చిత్రీకరిస్తుండడంతో యువతీయువకుల్లో ఆసక్తి పెరుగుతోంది. – రాము, ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోగ్రాఫర్, సిరిసిల్ల ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ప్రీ వెడ్డింగ్ షూట్‌తో పెళ్లి చేసుకునే జంటలు ఒకరినొకరు అర్థంచేసుకుంటారు. దీంతో బిడియం ఉండదు. సినిమా, జానపద పాటలపై నృత్యాలు చేయగా, వాటిని పెళ్లి సమయంలో ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తుంటాం. – అనగోని చందు, ఫొట్రోగాఫర్ పెళ్లి ఒక మధుర ఘట్టం పెళ్ళి అనేది ఒక మధుర ఘట్టం లాంటిది. అలాంటి పెళ్లి వేడుకలను జీవితాంతం గుర్తిండి పోయేందుకు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు దోహదపడుతుంది. దీంతో ఒకరి మనోభావాలు మరోకరికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. – కత్తి రఘు మౌనిక,