Man, Woman And Snake: Bizarre Pre-Wedding Photoshoot Goes Viral - Sakshi
Sakshi News home page

Viral: ఆ ఇద్దరిని ఒక్కటి చేసిన పాము.. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ మామూలుగా లేదుగా!

Published Thu, Jun 1 2023 7:00 PM | Last Updated on Thu, Jun 1 2023 7:12 PM

Man Woman And Snake: Bizarre Pre Wedding Photoshoot Goes Viral - Sakshi

ఇటీవల కాలంలో ఫోటో షూట్‌ల హడావిడీ ఎక్కువైపోయింది. ప్రతి ప్రత్యేక సందర్భాన్ని జీవితాంతం గుర్తుండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. పెళ్లికి అయితే ఫోటో షూట్‌ తప్పనిసరిగా మారింది.ప్రీ వెడ్డింగ్ షూట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పెళ్లి చేసుకునే నూతన దంపతులు.. తమకు నచ్చిన లోకెషన్లలో వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మరీ చిత్ర విచిత్ర లోకేషన్లలో, వస్తువులతో ఫోటోషూట్‌లు చేస్తున్నారు.

తాజాగా ఓ జంట ఏకంగా పాముతో ఫోటో షూట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వివేక్‌ అనే యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. .ఓ జంట‌ను పాము ఎలా కలిపింద‌నే విష‌యాన్ని ఈ ఫొటోలు వెల్ల‌డిస్తాయి. ఇందులో యువ‌తి ఇంటి ద‌గ్గ‌ర న‌డుచుకుంటూ వ‌స్తుండ‌గా ఆమెకు పాము ఎదురైంది. దీంతో పామును చూసి భయపడి రెస్క్యూ స‌ర్వీసుల‌కు కాల్ చేసి పిలిపించింది. ఇంతలో స్కూటీపై ఇద్ద‌రు వ్య‌క్తులు అక్కడికి రాగా.. ఓ వ్య‌క్తి మ‌హిళ‌వైపు చూసి న‌వ్వ‌డం క‌నిపిస్తుంది. ఆపై వారు పాముని ప‌ట్టుకుని బాక్స్ లోప‌ల పెడతారు.
చదవండి: కుక్క కోసం రూ. 16 లక్షల ఇల్లు! ఫ్రిజ్‌తో సహా..

స్నేక్‌ను తీసుకుని వెళుతూ త‌న‌కు కాల్ చేయాల‌ని ఆ వ్య‌క్తి మ‌హిళ‌కు సంకేతం ఇస్తాడు. ఆపై వారు ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమ‌లో ప‌డిపోతారు. చివ‌రి ఫొటోలో పాము ఇద్దరిని ఒక్కటి చేసినట్లు చూపించారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఈ పోస్ట్‌పై నెటిజ‌న్ల నుంచి భిన్న స్పంద‌న ల‌భించింది. షార్ట్ మూవీస్ కేట‌గిరీలో ఆస్కార్‌కు నామినేట్ చేయాల‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేయగా మరొవ్యక్తి ట్విటర్‌లో తాను చూసిన బెస్ట్‌ ఫోటోలు ఇవేనని చమత్కరించాడు.

ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫోటో స్టోరీస్‌ను కింద చూడండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement