HYD: పోలీస్‌ వాహనంతో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ! | Controversy Sorrounds Panjagutta Police Station Pre Wedding Shoot | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ఆన్‌ డ్యూటీలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. ఎస్సై భావనపై విమర్శలు

Published Sat, Sep 16 2023 8:10 PM | Last Updated on Sat, Sep 16 2023 8:19 PM

Controversy Sorrounds Panjagutta Police Station Pre Wedding Shoot - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పోలీస్‌ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్‌ అధికారులు షూట్‌లో పాల్గొన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. 

ఎస్సై భావనతో ఏఆర్‌ ఎస్సై రావూరి కిషోర్‌ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే.. వివాహానికి ముందు ఈ జంట వెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించింది. రకరకాల లొకేషన్లో షూట్‌లో పాల్గొంది ఆ టైంలో ఆ కాబోయే జంట. అంత వరకు పర్వాలేదు.

అయితే షూట్‌ ఆరంభంలోనే.. మూడు సింహాలను చూపించి,  ఇద్దరూ సినిమా లెవల్‌లో వాహనాల నుంచి కిందకు దిగి.. పీఎస్‌ బయట షూట్‌లో పాల్గొన్నారు. దీంతో యూనిఫాంలో అదీ పోలీస్‌ వాహనంతో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement