ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ | Karnataka: Pre Wedding Shoot In Hospital | Sakshi
Sakshi News home page

Karnataka: ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌

Feb 10 2024 10:14 AM | Updated on Feb 10 2024 10:28 AM

Pre Wedding Shoot in Hospital - Sakshi

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.  ఆపరేషన్లు నిర్వహించాల్సిన థియేటర్‌లో ప్రీవెడ్డింగ్‌ షూట్‌ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ నేపధ్యంలో ఉన్నతాధికారులు ఓ వైద్యుడిని విధుల నుంచి తొలగించారు.  వివరాల్లోకి వెళితే భరంసాగర్ ఏరియా జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న ఒక వైద్యుడు ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేశాడు. ఇది వైరల్‌గా మారి వివాదాస్పదమైంది.

ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ నిర్వహించిన వైద్యుడిని సర్వీసు నుంచి తొలగించినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత వైద్యులు, సిబ్బందికి సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement