Manjima Mohan And Gautham Karthik Latest Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Manjima Mohan Pre Wedding Shoot: పెళ్లి పీటలు ఎక్కనున్న నటి.. ఫోటోలు వైరల్

Published Fri, Nov 25 2022 1:43 PM | Last Updated on Fri, Nov 25 2022 3:19 PM

Manjima Mohan and Gautham Karthik latest photos Before Their wedding  - Sakshi

కోలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ బ్యూటీ మంజిమా మోహన్‌. నటుడు శింబుకు జంటగా 'అచ్చం యంబదు మడమయడా' చిత్రంలో కథానాయికగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ కార్తీక్‌ వంటి యువ హీరోలతో జత కట్టింది. అలా గౌతమ్‌ కార్తీక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇటీవలే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

(చదవండి: హీరోతో డేటింగ్‌, పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్స్‌ డిలీట్‌ చేసిన మంజిమా మోహన్‌)

ఈ నెల 28వ తేదీ ఒక్కటవుతున్న ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఫోటోలు వైరలవుతున్నాయి. వీరి వివాహానికి  చెన్నైలోని ఒక ప్రైవేటు గెస్ట్‌ హౌస్‌ వేదికగా కానుందని సమాచారం. తాజాగా మంజిమా మోహన్ తన ఇన్‌స్టాలో గౌతమ్‌ కార్తీక్‌తో ఉన్న ప్రీ వెెడ్డింగ్‌ ఫోటోలను పంచుకుంది. తాజా ఫోటోషూట్‌లో కొత్త జంట ఫోటోలకు పోజులిచ్చింది. మంజిమా మోహన్ ఆకుపచ్చ జాతి దుస్తులలో అద్భుతంగా కనిపించగా.... గౌతమ్ కార్తీక్ పైజామాతో సంప్రదాయ దు‍స్తుల్లో అందంగా కనిపించారు. దీంతో ఆమె అభిమానులు కాబోయే జంటకు ముందుగానే కంగ్రాట్స్‌ చెబుతున్నారు. తమ పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని మంజిమా మోహన్ వెల్లడించారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement