‘ధూమ్‌ 4’ షూటింగ్‌లో కొత్త జంట!.. వీడియో వైరల్‌ | Couple Performs Bike Stunt For Pre Wedding Shoot Like Dhoom 4 | Sakshi
Sakshi News home page

‘ధూమ్‌ 4’ను తలపించేలా ప్రీవెడ్డింగ్‌ షూట్‌.. వీడియో వైరల్‌

Published Thu, Oct 27 2022 3:45 PM | Last Updated on Fri, Oct 28 2022 3:43 PM

Couple Performs Bike Stunt For Pre Wedding Shoot Like Dhoom 4 - Sakshi

అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో ‘ధూమ్‌’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి సంబంధించి మూడు సీక్వెల్‌లు ఇప్పటికే రాగా ధూమ్‌ 4ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ కొత్తజంట తమ ప్రీవెడ్డింగ్‌ షూట్‌లోనే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించింది. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు వైరల్‌ కాగా..  చూసిన నెటిజన్లు ‘ధూమ్‌ 4’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుత రోజుల్లో పెళ్లిలో వీడియో ఉండకపోయినా పర్వాలేదు కానీ, ప్రీవెడ్డింగ్‌ షూట్‌ మాత్రం ఉండాలనే పట్టుతో ఉన్నారు యువత. అందుకు లక్షల్లో ఖర్చు చేస్తూ సినిమాలను మించిన యాక్షన్‌ సీన్లు చేస్తున్నారు. ఇలాగే.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట ప్రీవెడ్డింగ్‌ షూట్‌ చేసింది. అందరిలా చేస్తే ఏముంటుందనుకున్నారో ఏమో? బైక్‌పై స్టంట్‌ చేస్తూ వీడియో షూట్‌ చేశారు. సినిమాల్లో చూపించినట్లుగా సుమో పైనుంచి బైక్‌ జంప్‌ చేసే స్టంట్‌ చేశారు. వధూవరులు ఇద్దరు పెళ్లిలో మాదిరిగా వస్త్రధారణలో బైక్‌పై కూర్చోగా.. దానిని తాళ్ల సాయంతో సుమో వాహనంపై నుంచి జంప్‌ చేసినట్లుగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. 

ఈ వీడియోను బెస్ట్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా ఒక్కరోజులోనే 77 మంది వీక్షించారు. ఇలా చేయకపోతే నేను పెళ్లే చేసుకోను అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చారు. నా పెళ్లిలోనూ ఇలానే చేస్తాను. ఇలా చేయకపోతే అర్థమే లేదు. ఈ ప్రీవెడ్డింగ్‌ షూట్‌కు రోహిత్‌ శెట్టి డైరెక్టరా? అంటూ పలువురు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement