శ్రీకాంత్‌కు షాక్ | Indian badminton star srikanth | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌కు షాక్

Published Fri, Oct 16 2015 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

Indian badminton star srikanth

ఒడెన్స్ (డెన్మార్క్): భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు.. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో చుక్కెదురైంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఐదోసీడ్ శ్రీకాంత్ 15-21, 17-21తో అన్‌సీడెడ్ టామి సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. కేవలం 39 నిమిషాలు మాత్రమే జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ సైనా 18-21, 13-21తో మితాని మినత్సు (జపాన్) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-మను అత్రి 19-21, 22-20, 19-21 తో లీ షెంగ్ ము-చియా సిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement