విభిన్నంగా శ్రీకాంత్‌ లుక్‌ | SDT18: Srikanth First look released | Sakshi
Sakshi News home page

విభిన్నంగా శ్రీకాంత్‌ లుక్‌

Published Sat, Nov 9 2024 1:17 AM | Last Updated on Sat, Nov 9 2024 5:58 AM

SDT18: Srikanth First look released

‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్‌ సినిమాల తర్వాత సాయి దుర్గా తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘ఎస్‌డీటీ 18’ (వర్కింగ్‌ టైటిల్‌). రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌. ‘హను–మాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కె. నిరంజన్‌  రెడ్డి, చైతన్య రెడ్డి ‘ఎస్‌డీటీ 18’ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీకాంత్‌ లుక్‌ని శుక్రవారం రిలీజ్‌ చేశారు. ‘పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్‌డీటీ 18’. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చేయని పవర్‌ఫుల్‌ పాత్రను పోషిస్తున్నారు సాయి దుర్గా తేజ్‌. అలాగే శ్రీకాంత్‌ పాత్ర విభిన్నంగా ఉంటుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియన్‌ మూవీగా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్‌ లోక్‌నాథ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement