రాజకీయాల్లోకి రావడం అంత ఈజీ కాదంటున్నాడు హీరో సాయిదుర్గ తేజ్ (Sai Durga Tej). పాలిటిక్స్ అనేవి పెద్ద సబ్జెక్ట్ అని.. అందులో తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తున్నాడు. బుధవారం నాడు నంద్యాల జిల్లాలోని అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఈ క్షణంలో బతికే మనిషిని. రేపు పొద్దున ఏం జరుగుతుందో నాకవసరం లేదు. ఇప్పుడు ఈ పూటకు భోజనం చేశానా? లేదా? నలుగురికి సాయం చేశానా? లేదా? అన్నదే చూస్తాను. తర్వాతి క్షణాల గురించి ఆలోచించను. రాజకీయాలనేవి చాలా పెద్ద సబ్జెక్ట్.
రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదు
చాలా నేర్చుకోవాలి. చాలా చదువుకోవాలి. అంత ఈజీ కాదు. నాకేదో సినిమాల్లో ఫాలోయింగ్ ఉందని రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదు. అనుకున్నంత ఈజీ కానే కాదు. జనాల సమస్యలు తెలుసుకోవాలి.. ఇంకా చాలా ఉంటాయి. దయచేసి నన్ను సినిమాల నుంచి దూరం చేయకండి. హ్యాపీగా మిమ్మల్ని అందర్నీ ఎంటర్‌టైన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయితేజ్.. సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
చదవండి: బుల్లి రాజుకు ఫేమ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment