చైతూ- శోభిత ఎంగేజ్‌మెంట్‌.. వాలైంటెన్స్‌ డే వీడియో వైరల్! | Akkineni Naga Chaitanya Wishes To His Engagement Goes Viral | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: చైతూ- శోభిత ఎంగేజ్‌మెంట్‌.. వాలైంటెన్స్‌ డే వీడియో వైరల్!

Published Sat, Aug 10 2024 4:15 PM | Last Updated on Sat, Aug 10 2024 6:32 PM

Akkineni Naga Chaitanya  Wishes To His Engagement Goes Viral

అక్కినేని హీరో నాగాచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఈనెల 8న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, ఫ్యాన్స్‌ ఈ జంటకు అభినందనలు తెలిపారు.

అయితే చైతూ, శోభితకు అందరిలా కాకుండా కాస్తా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కాబోయే జంటకు నాగచైతన్య సినిమాకు సంబంధించిన వీడియోతో స్పెషల్‌గా విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో నాగ చైతన్య వాలైంటైన్స్ డే సందర్భంగా షేర్ చేశారు. హీరోయిన్ సాయిపల్లవితో తండేల్ డైలాగ్‌ చెబుతూ వాలైంటైన్స్ డే రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే చైతూ ప్రస్తుతం తండేల్ మూవీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సముద్ర జాలర్ల నేపథ్యంలో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement