
మంచు విష్ణు మరోసారి మంచి గొప్ప మనసు చాటుకున్నాడు. తన కూతురు ఐరా విద్యా బర్త్‌డే సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.
గత మూడేళ్లుగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతూ.. అసోసియేషన్ మెంబర్లకు అండగా నిలుస్తున్నాడు. సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్‌ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు.నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్‌లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు.విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment