
శివలెంక కృష్ణప్రసాద్, రూప, ప్రియదర్శి, మోహనకృష్ణ
‘‘కోర్ట్’ తర్వాత ‘సారంగపాణి జాతకం’ చిత్రం నాకు ఓ వరంలా దొరికింది. ఇలాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. శనివారం ‘సారంగపాణి జాతకం’ సినిమా సెలబ్రిటీ షో వేశాం. సెలబ్రిటీలు, ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేశారు’’ అని ప్రియదర్శి అన్నారు. ప్రియదర్శి, రూపా కొడవయూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అయింది.
ఆదివారం జరిగిన ఈ సినిమా ‘ఫన్’టాస్టిక్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘నేను అనుకున్నదాని కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రియదర్శి నటించాడు. శివలెంక కృష్ణప్రసాద్‌గారితో నేను ‘సమ్మోహనం, జెంటిల్‌మ్యాన్’ సినిమాలు చేశాను. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ సినిమా చేశాం. ఈ మూడూ ప్రేక్షకులు పది కాలాలపాటు గుర్తుపెట్టుకునే చిత్రాలు’’ అని తెలిపారు.
‘‘మేం ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన ఈ సినిమాను అందరూ చూసి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘దర్శికి మంచి జడ్జ్‌మెంట్ ఉంది. అప్పట్లో ఆమిర్ ఖాన్‌గారికి ఇలాంటి జడ్జ్‌మెంట్ ఉండేది. ఇంద్రగంటిగారితో పనిచేస్తే చాలు... రిజల్ట్‌తో అవసరం లేదు’’ అని చెప్పారు ‘వెన్నెల’ కిశోర్. ‘‘దర్శి ఆల్‌రౌండర్ నటుడు’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ఇంకా నటుడు వైవా హర్ష, కెమెరామేన్ పీజీ విందా మాట్లాడారు.