హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు మారుతి ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్
దిల్ రాజు మాట్లాడుతూ.. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. థియేటర్‌కు వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్‌టైనర్ మూవీ ఈ సమ్మర్‌కు వచ్చింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ చూశాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్‌ను కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది' అన్నారు.
కష్టే ఫలి
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం. థియేటర్స్ లో విజల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలకు మహిళా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది అన్నారు. రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. కష్టే ఫలి అంటారు. మా దర్శకుడు మమ్మల్ని కష్టపెట్టి ఫలితాన్ని పొందాడు. (నవ్వుతూ) కష్టం పడటంలో కూడా ఓ ఆనందంగా వుంటుంది. తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతావారు అనందంగా నవ్వడం చూసి మేము ఆనంద పడుతున్నాం'' అన్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ... ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయామని చెప్పారు.
చదవండి: నటిని నానామాటలన్న అత్త.. ఇప్పుడేమో తెగ పొగిడేస్తోంది!
Comments
Please login to add a commentAdd a comment