Om Bhim Bush Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే
ఓటీటీలోకి మరో రెండు క్రేజీ సినిమాలు వచ్చేశాయి. గత కొన్నాళ్లుగా అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే రాలేదు. వచ్చినా కూడా ఒకటి అరా వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రెండు మూడు క్రేజీ చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి అనేది చూసేద్దాం. (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) గత నెలలో శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'గామి'. దాదాపు ఆరేళ్లపాటు షూటింగ్ చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా నటించడం విశేషం. టాక్ పరంగా పాజిటివ్ వచ్చినప్పటికీ డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే ఇది నచ్చింది. ఇప్పుడు అందరికోసమా అన్నట్లు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలానే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓం భీమ్ బుష్' అనే సినిమా కూడా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. లాజిక్స్ లేని కామెడీతో తీసిన ఈ చిత్రం.. గతనెల చివరి వారంలో రిలీజైంది. ఇప్పుడు మరీ 3 వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈ రెండు మూవీస్ బెస్ట్ ఆప్షన్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. మరోవైపు రంజాన్ పండగ వచ్చేసింది. దీంతో ఈ హాలీడేస్‌లో సినీ ప్రియులకు పండగే. వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావటం లేదు. ఈ వారంలో గీతాంజలి మళ్లీ వచ్చింది మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతే కాకుండా ఒకటి, రెండు చిన్న చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో సందడి చేసేందుకు హిట్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం విశ్వక్సేన్ గామి, ఓం భీమ్ బుష్, రజినీకాంత్ లాల్ సలామ్, మలయాళ హిట్ మూవీ ప్రేమలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. మీకిష్టమైన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ లాల్ సలామ్(తమిళ డబ్బింగ్ సినిమా)- ఏప్రిల్ 12 అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12 గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్కామ్)- ఏప్రిల్ 12 లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12 స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12 ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్)- ఏప్రిల్ 12 అమెజాన్ ప్రైమ్ ఓం భీం బుష్(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 ఎన్డబ్ల్యూఎస్ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12 జీ5 గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు(తమిళం, మలయాళం, హిందీ వర్షన్)- ఏప్రిల్ 12 -
ఓటీటీలో ఒకేరోజు నాలుగు హిట్ సినిమాలు.. ఈ వారం పండగే
‘ఓమ్ భీమ్ బుష్’: అమెజాన్ ప్రైమ్ శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్ భీమ్ బుష్’ హిట్ టాక్‌తో భారీ హిట్ కొట్టింది. మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా ప్రేక్షకుల చేత ఔరా అనిపించింది.లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. గామి: జీ5 టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గామి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో అఘోరా పాత్రలో మెప్పించారు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన గామి సినిమాను దాదాపు ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'లాల్ సలామ్': నెట్ ఫ్లిక్స్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమా ఓటీటీ కష్టాలు దాటుకుని స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో కొద్దిరోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'లాల్ సలామ్' స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ప్రేమలు: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ.. తెలుగులో మార్చి 8న వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం, హిందీ, తమిళ వెర్షన్లు అందుబాటులోకి రానున్నాయి. -
3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రాబోతుంది. మొన్నీమధ్యే థియేటర్లలో రిలీజ్ కాగా, ఇప్పుడు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ మరీ ఇంత తర్వగా వస్తుండటంపై మూవీ లవర్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి? (ఇదీ చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే) లాజిక్స్ లేని కామెడీ సినిమాలు ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వస్తున్నాయి. అయితే ఇవేవి కూడా 'జాతిరత్నాలు'లా సక్సెస్ కాలేకపోయాయి. ఇలా లాజిక్స్ లేని కథతో వచ్చిన మూవీనే 'ఓం భీమ్ బుష్'. ఇప్పుడు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి అంచనాలతో రిలీజైంది. కానీ థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇది వచ్చిన వారంలో 'టిల్లు స్క్వేర్' రావడంతో ఈ మూవీ కాస్త డౌన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు మూడు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసేశారు. (ఇదీ చదవండి: Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర చూస్తారా?) #OmBheemBush premieres on @PrimeVideoIN on 12th April! pic.twitter.com/v6YaCo6IAk — Movie Mahal (@moviemahaloffl) April 8, 2024 -
ఓం బీమ్ బుష్ కలెక్షన్స్ దెబ్బకు షేక్ అవుతున్న టాలీవుడ్
-
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీ వివరాలు.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్ భీమ్ బుష్’ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 10.44 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించి, ఔరా అనిపిస్తోంది. లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. (చదవండి: ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు..) ఈ మధ్య కాలంలో ఫుల్లెన్త్ కామెడీ చిత్రాలేవి తెలుగులో రిలీజ్ కాకపోవడం కూడా ఓం భీమ్ బుష్‌కి బాగా కలిసొచ్చింది. వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డిటేల్స్ బయటకు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఓటీటీలోకి 'ఓపెన్‌హైమర్' తెలుగు వర్షన్ వచ్చేసింది) రిలీజ్‌కి ముందే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కింకుంది. మంచి రేటుకే ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు వారాల వరకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం లేదు. ఏప్రిల్ చివరి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు మాత్రం ఆగాల్సిందే. -
'ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు..
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. చాలారోజుల తర్వాత ఫుల్ లెన్త్ కామెడీగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా ఆ ప్రభావాన్ని తట్టుకుని భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. సామజవరగమన హిట్ తర్వాత ఓం భీమ్ బుష్ సినిమాతో శ్రీ విష్ణు మరో హిట్‌ను అందుకున్నాడు. రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే మంచి కలెక్షన్స్‌నే ఈ చిత్రం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 10.44 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. మొదటిరోజు రూ.4.6కోట్ల, రెండో రోజు రూ.5.84 కోట్లు రాబట్టింది. అమెరికాలో అయితే ఇప్పటికే సుమారుగా రూ. 3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ఓం భీమ్ బుష్ సినిమా లాభాల్లోకి వెళ్లిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. తక్కువ బడ్జెట్‌తోనే తెరకెక్కిన ఈ మూవీకి మంచి ఓపెనింగ్‌తో కలెక్షన్స్ రన్ అవుతున్నాయి. తాజాగా ఓం భీమ్ బుష్ సినిమా సక్సెస్ మీట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. 'నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. థియేటర్‌కు వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్టైనర్ మూవీ ఈ సమ్మర్‌కు వచ్చింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ చూశాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్‌ను కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది' అన్నారు. BLOCKBUSTER BAZINGAAAA ❤🔥#OmBheemBush grosses 10.44+ CRORES in 2 days worldwide 🔥 Go LOL in the theatres! 🎟️ https://t.co/duPyNtQcze Directed by @HarshaKonuganti #OBB @sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #Ayeshakhan @PreityMukundan @SunnyMROfficial @SunilBalusu1981… pic.twitter.com/gcmVwvMqzn — V celluloid (@vcelluloidsoffl) March 24, 2024 -
కడుపుబ్బా నవ్వుకునే మూవీ, చివరి 20 నిమిషాలైతే..
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు మారుతి ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ దిల్ రాజు మాట్లాడుతూ.. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. థియేటర్‌కు వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్టైనర్ మూవీ ఈ సమ్మర్‌కు వచ్చింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ చూశాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్‌ను కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది' అన్నారు. కష్టే ఫలి హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం. థియేటర్స్ లో విజల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలకు మహిళా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది అన్నారు. రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. కష్టే ఫలి అంటారు. మా దర్శకుడు మమ్మల్ని కష్టపెట్టి ఫలితాన్ని పొందాడు. (నవ్వుతూ) కష్టం పడటంలో కూడా ఓ ఆనందంగా వుంటుంది. తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతావారు అనందంగా నవ్వడం చూసి మేము ఆనంద పడుతున్నాం'' అన్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ... ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయామని చెప్పారు. చదవండి: నటిని నానామాటలన్న అత్త.. ఇప్పుడేమో తెగ పొగిడేస్తోంది! -
‘ఓం భీమ్ బుష్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ మూవీ రివ్యూ
టైటిల్: ఓం భీమ్ బుష్ నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సమర్పణ: యూవీ క్రియేషన్స్ దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి సంగీతం: సన్నీ ఎమ్ఆర్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతం ఎడిటింగ్: విజయ్ వర్ధన్ విడుదల తేది: మార్చి 22, 2024 ‘ఓం భీమ్ బుష్’ కథేంటంటే? కృష్ణ కాంత్ అలియాస్ క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మాధవ్ రేలంగి అలియాస్ మ్యాడీ(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలనేది వారి కోరిక .పీహెచ్డీ కోసం లెగసీ యూనివర్సిటీలో చేరతారు. ఐదేళ్లయినా పీహెచ్డీ పూర్తి చేయరు. కాలేజీలో వీళ్లు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కాలేజీ ప్రిన్సిపాల్ రంజిత్ విలుకొండ(శ్రీకాంత్ అయ్యంగార్). ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు, మాంత్రిక దళం చేసే మోసాన్ని గమనించి, తాము కూడా టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు. సైంటిస్టుల అవతారమెత్తి ఎ టు జెడ్ సర్వీసెస్ పేరు ఓదుకాణం తెరుస్తారు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే బ్యాంగ్ బ్రోస్(ఈ ముగ్గురి టీమ్ పేరు బ్యాంగ్ బ్రోస్) నిజమైన సైంటిస్టులు కాదని, డబ్బుకోసం ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్(ఆదిత్యా మీనన్).. ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఊరి చివరన ఉన్న సంపంగి మహాల్‌లోకి వెళ్లి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. సంపంగి దెయ్యం ఉన్న ఆ మహాల్‌లోకి వెళ్లిన తర్వాత బ్యాంగ్ బ్రోస్కి ఎదురైన సంఘటనలు ఏంటి? సంపంగి మహల్ కథ ఏంటి? ఇంతకీ ఆ మహల్ లో నిధి ఉందా లేదా? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ఓం భీమ్ బుష్’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు వాస్తవానికి విరుద్దంగా, లాజిక్ లెస్‌గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ ఒకటి. ‘నో లాజిక్ ఓన్లీ మేజిక్ ’అని టైటిల్ క్యాప్షన్ ఇచ్చిన దర్శకుడు శ్రీహర్ష.. అందుకు తగ్గట్టే ఓన్లీ స్క్రీన్‌ప్లేతో తెరపై మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ‘జాతిరత్నాలు’ తరహాలో సాగే ముగ్గురు స్నేహితుల కథకి హారర్‌ని జోడించి.. చివరిలో ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల భయపెడతూనే ఓ డిఫరెంట్, ఎమోషనల్ లవ్‌స్టోరీని చెప్పాడు. టైటిల్లో చెప్పినట్లుగానే కథ ప్రారంభం నుంచే ఇందులో లాజిక్స్ ఉండవు. సంపంగి మహల్ లో తాంత్రిక పూజ సీన్ తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజీ ఎపిసోడ్ తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చేవరకు కథ స్లోగా అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. భైరవపురంలో బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సర్వీసెస్ పేరుతో దుకాణం తెరిచాక అసలైన కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఊరి ప్రజలతో ఈ ముగ్గురు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన ఓ వ్యక్తికి వీరిచ్చే ట్రీట్మెంట్ సీన్‌కి థియేటర్స్‌లో పగలబడి నవ్వుతారు. అలాగే అర్థరాత్రి ఈ ముగ్గురు సర్పంచ్ ఇంట్లోకి చొరబడి చేసే అల్లరి, ప్రియదర్శి, ఆదిత్య మీనన్‌కు సంబంధించిన సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.ద్వితియార్థం మొత్తం సంపంగి మహాల్ చుట్టే తిరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హారర్ సీన్ పెట్టాలి? ఎలాంటి సీన్‌కి నవ్వుతారు? లాంటివి లెక్కలేసుకొని బలమైన స్క్రీప్ట్ రాసుకున్నాడు. సంపంగి దెయ్యం, ప్రియదర్శిని భయపెట్టే సీన్ వచ్చినప్పుడు మనం కూడా భయపడుతూనే నవ్వుతుంటాం. అయితే సంపంగి దెయ్య నేపథ్యం తెలిశాక వచ్చే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. నిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు కూడా రొటీన్‌గా ఉంటాయి. కానీ చివరిలో మాత్రం ఓ కొత్త పాయింట్‌ని టచ్ చేశాడు. ఇంతవరకు ఎవరూ అలాంటి అంశాన్ని ఇంత డిఫరెంట్‌గా తెరపై చూపించలేదు. నవ్వించడంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చారు. కొన్నీ సంభాషణలు, సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. క్రిష్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన చేసే ఇన్నోసెంట్‌గా కామెడీ నవ్వులు పూయిస్తుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. భయస్తుడు వినయ్ గుమ్మడి పాత్రకి ప్రియదర్శి వందశాతం న్యాయం చేశాడు. సినిమాలో బాగా నవ్వించిన సీన్లలో ఎక్కువగా ప్రియదర్శివే ఉంటాయి.మహల్లో అతనికి, దెయ్యంకి మధ్యవచ్చే సీన్లు హిలేరియస్‌గా అనిపిస్తాయి. ఇక రాహుల్ రామకృష్ణ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్, కామెడీతో ఆకట్టుకున్నాడు.స్పెషల్ సాంగ్‌లో ప్రియా వడ్లమాని అందాల అరబోసింది.ప్రీతీ ముకుందన్ , ఆయేషా ఖాన్, రచ్చరవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా ఉన్నతంగా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు బాగుంది. సన్నీ అందించిన బీజీఎం కొన్ని సీన్లను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్ విజయ్ వర్దన్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ నటి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది: శ్రీవిష్ణు
‘‘నా సినిమాలకు పెట్టుబడి పెట్టే నిర్మాతలు నష్టపోకూడదని కోరుకుంటాను. ఇండస్ట్రీలో నా మార్కెట్ పెరగడం, తగ్గడం అనేది నా చేతుల్లో లేని విషయం. ఏ సినిమా వల్ల మార్కెట్ పెరుగుతుందో, ఏ సినిమా వల్ల తగ్గుతుందో గ్యారెంటీగా చెప్పలేం’’ అని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘సైంటిస్ట్‌లు కావాలని ఉస్మానియా యూనివర్సిటీలో చాలా కాలంగా తిష్ట వేసిన ఓ ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్‌ను అక్కడి విద్యార్థులు ఓ స్కెచ్ వేసి బయటకు పంపిస్తారు. అలా బయటకు వచ్చిన ఆ ముగ్గురు భైరవపురం అనే ఊరికి వెళ్లినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఈ ముగ్గురి నిధి అన్వేషణ ఫలించిందా? లేదా అన్నది ‘ఓం భీమ్ బుష్’ కథాంశం. అలాగే ఈ మూవీలో కొత్త పాయింట్‌ని టచ్ చేశాం. ఆ అంశం నాకు కిక్ ఇచ్చింది. ఈ మూవీలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేసింది. తనకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన విషయం మాతో చెప్పకుండా వెళ్లిపోయింది. తన వల్ల కొన్నాళ్లు షూటింగ్ ఆలస్యమైంది. నా తర్వాతి చిత్రం ‘స్వాగ్’ పూర్తి కావొచ్చింది. గీతా ఆర్ట్స్, కోనగారితో సినిమాలు కమిటయ్యాను. అలాగే ఓ థ్రిల్లర్ ఫిల్మ్ కూడా ఉంది’’ అన్నారు. చదవండి: జపాన్‌లో భూకంపం.. రాజమౌళి కుటుంబానికి తప్పిన ప్రమాదం -
Om Bheem Bush: నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్?
తెలుగు తెరపై మరో కామెడీ సినిమా సందడి చేయబోతుంది. అదే ఓమ్ బీమ్ బుష్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ(U/A) సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు సెన్సార్ సభ్యులు నవ్వుతూనే ఉన్నారట. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ పోటీపడి నటించారట. శ్రీవిష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటే.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ స్పాంటేనియస్ డైలాగ్స్‌తో అదరగొట్టారట. క్లైమాక్స్ లో భారీ ఎమోషన్ తో ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయట. సెన్సార్ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్? సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ ఓమ్ బీమ్ బుష్. డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి ఈ కథకి హారర్ టచ్ ఇవ్వడంతో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ని జతచేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేసింది. సెన్సార్ సభ్యులు ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్ పడేలా ఉంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓమ్ బీమ్ బుష్’ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది. -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం పరీక్షల కాలం నడుస్తుండటం వల్ల థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. ఉన్నవాటిలో 'ఓం భీమ్ బుష్' కాస్త ఆసక్తికరంగా అనిపిస్తోంది. లాజిక్స్ కంటే కామెడీని నమ్ముకున్న ఈ చిత్రం ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి. మరోవైపు ఓటీటీలో కూడా ప్రస్తుతం 'హనుమాన్' హవా నడుస్తోంది. అలానే ఈ వారమైతే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. కానీ పలు డబ్బింగ్ చిత్రాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. (ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగు స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. అలానే పలు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మార్చి 18 నుంచి 24 వరకు) నెట్‌ఫ్లిక్స్ యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ సినిమా) - మార్చి 18 3 బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 21 ఫైటర్ (హిందీ మూవీ) - మార్చి 21 (రూమర్ డేట్) బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22 షిర్లే (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22 ద కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 22 హాట్‌స్టార్ అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 20 సాండ్ ల్యాండ్: ద సిరీస్ (జపనీస్ సిరీస్) - మార్చి 20 ఎక్స్-మ్యాన్ '97 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20 అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22 డేవీ & జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22 లూటేరే (హిందీ సిరీస్) - మార్చి 22 ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 24 అమెజాన్ ప్రైమ్ మరక్కుమ నెంజమ్ (తమిళ మూవీ) - మార్చి 19 ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా) - మార్చి 21 రోడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 21 జియో సినిమా ఓపెన్ హైమర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 21 బుక్ మై షో ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 19 ఆపిల్ ప్లస్ టీవీ పామ్ రాయల్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20 ఆర్గిల్లీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 23 (ఇదీ చదవండి: Priyanka Chopra: ఒక్క నెక్లెస్.. ఏకంగా అన్ని కోట్లు.. ఏంటంత స్పెషల్?) -
అదంటే చాలా భయం: నటుడు ప్రియదర్శి
‘‘నటుడిగా ఉంటే విభిన్నరకాలైన పాత్రలు చేయవచ్చు. అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇలా కాకుండా నన్ను నేను ఓ హీరోగా అనుకుంటే ఓ డిఫరెంట్ ఇమేజ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్ అంటే నాకు భయం. ‘మల్లేశం’ సినిమా తర్వాత నేను దాదాపు 40 కథలు విన్నాను. ఈ కథల్లో ఓ నటుడిగా నన్ను నేను ఊహించుకోలేకపోయాను. దీంతో ‘జాతిరత్నాలు’ సినిమాలో నటించాను. ‘మంగళవారం’ సినిమాలో కూడా నాది హీరో రోల్ అనుకోవడం లేదు. దర్శక–నిర్మాతలు డిఫరెంట్ రోల్స్ ఇస్తున్నారంటే నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రియదర్శి అన్నారు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఓం భీమ్ బుష్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీ సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ కథే ఈ చిత్రం. ఓ మంచి పాయింట్‌ను టచ్ చేశాం. ప్రస్తుతం‘గేమ్‌చేంజర్’ మూవీలో ఓ పాత్ర చేస్తున్నాను. నేను, నభానటేష్ లీడ్స్‌గా ఓ మూవీ చేస్తున్నాం’’ అన్నారు. -
నవ్వులే నవ్వులు
‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతోనే ‘ఓం భీమ్ బుష్’ సినిమా చేశాం. రెండు వందల శాతం ఆడియన్స్ పిచ్చి పిచ్చిగా నవ్వుతారు. ప్రేక్షకుల నవ్వులతో థియేటర్స్ బద్దలైపోతాయి’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, ప్రీతీ ముకుందన్ జంటగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్ పతాకాలపై సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘దర్శకుడు హర్ష ఈ సినిమాను హిలేరియస్‌గా తీశాడు. అవకాశం ఇచ్చిన యూవీ వంశీ అన్న, సునీల్గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ట్రైలర్లో ఉన్న ఎనర్జీ కంటే సినిమాలో వంద రెట్లు ఎనర్జీ ఉంది’’ అన్నారు శ్రీహర్ష. ‘‘ఈ సినిమాతో డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఓం భీమ్ బుష్’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సునీల్. -
నాలుగేళ్లకోసారి పుట్టినరోజు జరుపుకుంటున్న హీరో
కొత్తదనం పంచడంలోనూ.. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు హీరో శ్రీవిష్ణు . రొటీన్ సినిమాలకు భిన్నంగా తనకంటూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఆయన హిట్ కొట్టి అభిమానులను సంపాధించుకున్నాడు. గతేడాదిలో 'సామజవరగమన'తో హిట్ క్టొటిన ఆయన నేడు ఫిబ్రవరి 29న 40వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ ఏడాది లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. నాలుగేళ్లకు ఒకసారి ఇలాంటి సందర్భం వస్తుంది. అందుకే ఈ తేదీలో పుట్టినవారు నాలుగేళ్లకు ఒక్కసారి తమ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటారు. నేడు హీరో శ్రీవిష్ణు కూడా తన పుట్టినరోజును జరుపుకున్నారు. నాలుగేళ్లకు ఒక్కసారి ఈ వేడుకలు జరుగుతుండటంతో ఎంతో ఘనంగా తన అభిమానులతో పాటు ఆయన జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విషయాలను షేర్ చేస్తున్నారు మేకర్స్. ఆయన నటించిన 'ఓం భీమ్ బుష్' సినిమా మార్చి 22న విడుదల కానుంది. స్వాగ్, ఏమండో బాగున్నారా సినిమాల్లో నటిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. -
Om Bhim Bush: పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారెంటీ
‘‘గుప్త నిధుల కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారు? అనే నేపథ్యంలో ‘ఓం భీమ్ బుష్’ ఆసక్తిగా ఉంటుంది. మా పాత్రలకు (శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి) ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రెండు గంటల పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు.. ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్‌లో యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘టీజర్ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది. సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కాలంటే ప్రేక్షకులు చూడాలి’’ అన్నారు రాహుల్ రామకృష్ణ. ‘‘మా సినిమాని అందరూ చూడాలి’’ అన్నారు శ్రీహర్ష కొనుగంటి.