
-శ్రీవిష్ణు
‘‘గుప్త నిధుల కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారు? అనే నేపథ్యంలో ‘ఓం భీమ్ బుష్’ ఆసక్తిగా ఉంటుంది. మా పాత్రలకు (శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి) ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రెండు గంటల పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు.. ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్‌లో యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది.
ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘టీజర్ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది. సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కాలంటే ప్రేక్షకులు చూడాలి’’ అన్నారు రాహుల్ రామకృష్ణ. ‘‘మా సినిమాని అందరూ చూడాలి’’ అన్నారు శ్రీహర్ష కొనుగంటి.
Comments
Please login to add a commentAdd a comment