Sri Vishnu
-
'ఫస్ట్ లవ్' టీజర్ బాగుంది: శ్రీవిష్ణు
దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం 'ఫస్ట్ లవ్'. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ ని సక్సెస్ ఫుల్ హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ సాంగ్ చూశాను. చాలా తక్కువ టైంలో చాలా బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చెప్పారు. చాలా బాగా షూట్ చేశారు. కెమరా వర్క్ చాలా బావుంది. సిద్ శ్రీరామ్ గారి వాయిస్ అద్భుతంగా వుంది. వినగానే ఒక నోస్టాల్జియ ఫీలింగ్ వచ్చింది. భూమి ఆకాష్ గా దీపు , వైశాలి చాలా పర్ఫెక్ట్ గా కనిపించారు. డైరెక్టర్ గారు చాలా మంచి కాన్సెప్ట్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. తప్పకుండా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది’ అన్నారు. సాంగ్ టీజర్ విషయానికొస్తే..'ఫస్ట్ లవ్వా.. అతను నీతో చెప్పిన ఫస్ట్ మాట ఏంటి?' అనే డైలాగ్ తో మొదలైన సాంగ్ టీజర్ మెస్మరైజ్ చేసింది. కంపోజర్ సంజీవ్.టి ఈ సాంగ్ ని అందరూ మళ్ళీ మళ్ళీ పాడుకునే చార్ట్ బస్టర్ నెంబర్ గా ట్యూన్ చేశారు. 'మనస్సే చేజారే నీ వల్లే పతంగై పోయిందే నీ వెంటే ఇదంతా కల కాదా'' అంటూ కిట్టు విస్సాప్రగడ రాసిన బ్యూటీఫుల్ లిరిక్స్ ని సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరాం పాడిన తీరు హార్ట్ వార్మింగ్ గా ఉంది. -
3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రాబోతుంది. మొన్నీమధ్యే థియేటర్లలో రిలీజ్ కాగా, ఇప్పుడు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ మరీ ఇంత తర్వగా వస్తుండటంపై మూవీ లవర్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి? (ఇదీ చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే) లాజిక్స్ లేని కామెడీ సినిమాలు ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వస్తున్నాయి. అయితే ఇవేవి కూడా 'జాతిరత్నాలు'లా సక్సెస్ కాలేకపోయాయి. ఇలా లాజిక్స్ లేని కథతో వచ్చిన మూవీనే 'ఓం భీమ్ బుష్'. ఇప్పుడు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి అంచనాలతో రిలీజైంది. కానీ థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇది వచ్చిన వారంలో 'టిల్లు స్క్వేర్' రావడంతో ఈ మూవీ కాస్త డౌన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు మూడు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసేశారు. (ఇదీ చదవండి: Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర చూస్తారా?) #OmBheemBush premieres on @PrimeVideoIN on 12th April! pic.twitter.com/v6YaCo6IAk — Movie Mahal (@moviemahaloffl) April 8, 2024 -
విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు
వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్ స్టూడెంట్స్ కాదు.. రీల్ స్టూడెంట్స్. కొందరు స్టార్స్ ప్రస్తుతం స్టూడెంట్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ సెట్స్‌లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్ స్టూడెంట్స్ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ► కెరీర్లో పలు చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్‌గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్‌లో కూడా కాలేజ్‌కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్ రోల్ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ►కాలేజీ స్టూడెంట్ రోల్ హీరోయిన్ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్ మొదలైంది కన్నడ హిట్ క్యాంపస్ డ్రామా ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్ రోల్. ఇలా కాలేజీ స్టూడెంట్‌గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్‌ఫ్రెండ్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. ► కాలేజీలో ఓ ఫెయిల్యూర్ స్టూడెంట్‌గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్‌గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ జీవితాలు ఓ ఘటనతో సడన్‌గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్‌లో కాలేజీ సీన్స్ ఉంటాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్‌గా ఇన్నాళ్లూ సెట్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటున్నారు. ► ‘ఏవండీ.. (మృణాల్ ఠాకూర్).. రామచంద్రా.. (చిన్న వాయిస్‌తో విజయ్ దేవరకొండ).. నేను కాలేజ్‌కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్),.. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్’ సినిమాలోని డైలాగ్ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్‌కి వెళతారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్. అశోక్ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్ రోల్స్ చేస్తున్నారు. -
డబుల్ ట్రీట్
బర్త్ డేకి శ్రీ విష్ణు డబుల్ ట్రీట్ అందుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 29) శ్రీవిష్ణు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన నటించనున్న రెండు కొత్త చిత్రాలను అధికారికంగా ప్రకటించారు ఆయా మేకర్స్. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రేమకథతో కూడిన ఫన్ రోలర్ కోస్టర్ మూవీ ఇది. మరోవైపు ‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు ‘శ్వాగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరకర్త. -
Om Bhim Bush: పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారెంటీ
‘‘గుప్త నిధుల కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారు? అనే నేపథ్యంలో ‘ఓం భీమ్ బుష్’ ఆసక్తిగా ఉంటుంది. మా పాత్రలకు (శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి) ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రెండు గంటల పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు.. ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్‌లో యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘టీజర్ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది. సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కాలంటే ప్రేక్షకులు చూడాలి’’ అన్నారు రాహుల్ రామకృష్ణ. ‘‘మా సినిమాని అందరూ చూడాలి’’ అన్నారు శ్రీహర్ష కొనుగంటి. -
ఆమెను చూస్తే గర్వంగా ఉంది
‘‘అంజలిగారి కెరీర్లో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ 50వ సినిమా. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేసి, విజయం సాధించడం గర్వంగా ఉంది. అంజలిగారు వందకుపైగా సినిమాలు చేయాలి. మార్చి 22న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో పాటు నా మూవీ ‘ఓం భీం బుష్’ కూడా విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలి’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ , ఎంవీవీ సినిమాస్‌పై కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలకానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో శ్రీ విష్ణు, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, బుచ్చిబాబు సన అతిథులుగా హాజరయ్యారు. అంజలి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. యాభై సినిమాలు చేయడం నాకు సంతోషాన్నిస్తోంది’’ అన్నారు అంజలి. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు కోన వెంకట్. ‘‘ఓ మంచి చిత్రానికి దర్శకత్వం వహించాననే సంతృప్తి కలిగింది’’ అన్నారు శివ తుర్లపాటి. నటులు అలీ, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. -
ఓం భీమ్ బుష్!
‘సామజవరగమన’(2023) వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అన్నది ఉపశీర్షిక. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటించారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు చేశారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమాకి ‘ఓం భీమ్ బుష్’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగామి దుస్తులు ధరించి, తమ చేతుల్లో కరపత్రాలతో నడుచుకుంటూ వస్తున్న ఫస్ట్ లుక్ ఆసక్తిగా ఉంది. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూ΄÷ందిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. మార్చి 22న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: సన్నీ ఎం.ఆర్. -
మంత్రాన్ని తలపించేలా సినిమా టైటిల్.. ఆసక్తిగా పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గతేడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో తాజాగా మరో హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు టైటిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ చూడగానే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఓం భీమ్ బుష్ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ కొత్తగా ఉండడం చూస్తే థియేటర్లలో ఫుల్ కామెడీ ఖాయంగా కనిపిస్తోంది. ఓం భీమ్ బుష్ అనే పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగాముల పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో వీరి ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా అనే సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. The hilarious trio of @sreevishnuoffl, @PriyadarshiPN & @eyrahul are back 👨🏻🚀👨🏻🚀👨🏻🚀 And they are bringing the 𝐍𝐄𝐖 𝐌𝐀𝐍𝐓𝐑𝐀 𝐎𝐅 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐌𝐄𝐍𝐓 - #OmBheemBush - No Logic Only Magic 🪄 Directed by @HarshaKonuganti ❤️🔥 Grand Release Worldwide on March 22nd 💫… pic.twitter.com/8x6wMICA3R — UV Creations (@UV_Creations) February 22, 2024 -
షూటింగ్లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు
తెలుగు యంగ్ హీరో శ్రీవిష్ణుకు కొందరు కూలీలు షాకిచ్చారు. కొత్త సినిమా షూటింగ్లో భాగంగా అనుకోని సంఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేందుకు కోసం కొందరు కూలీలని చిత్రబృందం తీసుకొచ్చింది. అయితే పూర్తయిన తర్వాత వాళ్లకు వేతనం ఇచ్చే విషయం కాస్త ఆలస్యమైంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) ఈ క్రమంలోనే తమకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని దాదాపు 400 మంది కూలీలు.. షూటింగ్ లొకేషన్లో ఆందోళన చేశారు. అటుగా వెళ్తున్న హీరో కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. కూలీలకు సర్దిచెప్పారు. హీరోకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అతడు కారుని పోనిచ్చారు. ఆ తర్వాత వివాదం కూడా సద్దుమణిగింది. గతేడాది 'సామజవరగమన' సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగమ్మాయి రీతూవర్మ కూడా గతేడాది 'మార్క్ ఆంటోని', 'ధృవ నక్షత్రం' లాంటి మూవీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూవీకే తాజాగా సమస్య ఎదురైంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) -
కోటబొమ్మాళి పీఎస్ ట్విటర్ రివ్యూ.. టాక్ ఏంటంటే?
ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్, కానిస్టేబుల్ రవిగా రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘నాయట్టు’కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించింది. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమాకు రివ్యూ ఇచ్చిన శ్రీవిష్ణు దీంతో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉందంటున్నారు. శ్రీకాంత్ కెరీర్లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుందంటున్నారు. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటున్నారు. హీరో శ్రీవిష్ణు సైతం సినిమాపై రివ్యూ ఇచ్చాడు. 'పోలీసుల్ని పోలీసులే ఛేదించడం.. శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు టెర్రిఫిక్‌గా ఉన్నాయి' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఆ సన్నివేశాలు గూస్బంప్స్.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సైతం ఈసినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. 'శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు పిల్లి- ఎలుకల కొట్లాటలా అనిపిస్తుంది. ఈ సన్నివేశాలే ప్రేక్షకుడిని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. చాలాకాలం తర్వాత శ్రీకాంత్‌గారు గుర్తుండిపోయే పాత్ర చేశారు. అతడి పర్ఫామెన్స్ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఈ థ్రిల్లర్ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి అందరికీ కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ గురించి పవర్ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి. వాటికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. నిర్మాతల గుండెధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే' అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. Fantastic #KotaBommaliPS Every scene pure Mass 🔥 Must watch everyone pic.twitter.com/tZo484lviq — RC Varagani 🔥 (@VaraganiSaikum2) November 24, 2023 Mental Mass Entertainer#KotaBommaliPS Worth Watching Movie 👌🔥🔥🔥 pic.twitter.com/ZJIK2KsHvA — Cherry 🍒 (@Rammm755) November 24, 2023 Mind Blowing #KotaBommaliPS 🔥🔥🔥🔥 Best Movie Avuthundhi E year Lo Don't Miss It pic.twitter.com/cy6RFY20t1 — Kranthi 🔥 (@iamkranthi99) November 24, 2023 Movie chala bagundhi very interesting and thrilling go and Watch#KotaBommaliPS pic.twitter.com/cTgQvoh6sQ — Sweety 🦚 (@Pravallika7C) November 24, 2023 Gripping Screenplay 💥 Twists kuda next level unayi #KotaBommaliPS pic.twitter.com/pbFUW5oEY7 — Ramcharan tej (@Ramcharan14377) November 24, 2023 USA is reporting positive things about #KotaBommaliPS❤️🔥Applause for the amazing performances, gripping story, and intense drama is universal 👏 — Rainbow 💞 (@_AAnshu_) November 24, 2023 Watched #KotabommaliPS an intruding movie to watch on the big screens done by @DirTejaMarni . The unique plot of police chasing police and the scenes between @actorsrikanth Garu and @varusarath5 Garu are terrific.@Rshivani_1, @ActorRahulVijay & Each of the performances is… — Sree Vishnu (@sreevishnuoffl) November 23, 2023 I just finished watching the film #KotaBommaliPS. The screenplay between #Srikanth and #VaralaxmiSarathkumar, as well as their cat and mouse game, will have everyone glued to their seats in the theatres. After a long time, #Srikanth garu got a remarkable character, and his… — Harish Shankar .S (@harish2you) November 23, 2023 చదవండి: అమర్‌దీప్‌కు ఫిట్స్.. తనకు ఆ అనారోగ్య సమస్య ఉందన్న నటుడు -
హత్యా? ఆత్మహత్యా?
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధానపాత్రల్లో నటించిన ఇంటరాగేటివ్ ఫిల్మ్ ‘ది ట్రయల్’. రామ్ గన్ని దర్శకత్వంలో స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ది ట్రయల్’ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. రామ్ ఈ సినిమా కథను బాగా డీల్ చేశారనిపిస్తోంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కథ రీత్యా సబ్ఇన్స్పెక్టర్ రూప, ఆమె భర్త అజయ్ ఓ అపార్ట్మెంట్ టెర్రస్‌పై తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అజయ్ కాలుజారి ఆ బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోతాడు. తన భర్తను రూపే చంపిదనే అనుమానం తెరపైకి వస్తుంది. అయితే తన భర్తది ఆత్మహత్య అని రూప చెబుతుంది. అసలు.. అజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
భయానక చిత్రం
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌ను ఈ నెల 30న రిలీజ్ చేస్తాం. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి. -
ముగ్గురి స్నేహితుల అదృష్టం
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘కిస్మత్’. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రియా సుమన్ హీరోయిన్. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. ముగ్గురు స్నేహితులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వదేవ్ నమ్మకం కోల్పోయి ఉంటాడు. అభినవ్ గోమఠంకి సినీ రచయిత అవ్వాలన్నది కల. రియా సుమన్‌తో నరేశ్ అగస్త్య ప్రేమలో ఉంటాడు. ఓ సంఘటనతో ఈ ముగ్గురి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిపోయింది అనేది ఈ చిత్రకథ అని యూనిట్ పేర్కొంది. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘కిస్మత్’ లాంటి చిత్రాలు మౌత్ టాక్ వల్లే హిట్టవుతాయి. ప్రేక్షకులు మమ్మల్ని సపోర్ట్ చేయాలి’’ అన్నారు. ‘‘మంచి క్రైమ్ కామెడీ ఫిల్మ్ ఇది’’ అన్నారు అభినవ్ గోమఠం. ‘‘చక్కని ఫన్ ఫిల్మ్ ఇది’’ అన్నారు విశ్వదేవ్. ‘‘రాజు రెండేళ్ల పాటు ఈ సినిమా స్క్రిప్ట్‌పై వర్క్ చేశారు. నరేశ్, అభినవ్, విశ్వలతో పాటు అందరూ అద్భుతంగా నటించారు’’ అన్నారు శ్రీనాథ్. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: వేదరామన్ శంకర్, సహనిర్మాత: భాను ప్రసాద్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భరత్ రెడ్డి. -
అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి – శర్వానంద్
‘‘మేం ఒక్క పాత్ర చేయడానికి చాలా కష్టపడుతున్నాం. అలాంటిది ‘మామా మశ్చీంద్ర’లో సుధీర్ ఏకంగా మూడు పాత్రలు చేశారు.. ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు శర్వానంద్. సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల అతిథులుగా హాజరయ్యారు. ‘‘సుధీర్ మూడు పాత్రలు చేశారంటే కథ ఎంత విలక్షణంగా ఉండి ఉంటుందో అర్థమవుతోంది’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘సుధీర్ కొత్త రకం కథలు ప్రయత్నిస్తుంటారు’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘మామా మశ్చీంద్ర’లో మంచి కథ, పాటలు, వినోదం.. అన్నీ ఉంటాయి’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘ఇది ఒక అమ్మ, తండ్రీకూతుళ్ల కథ’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘రచయితల నుంచి డైరెక్టర్స్‌గా మారిన త్రివిక్రమ్, కొరటాల శివల్లా హర్షవర్ధన్ కూడా పెద్ద డైరెక్టర్ కావాలి’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
‘జోరుగా హుషారుగా’ విరాజ్ అశ్విన్
‘ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ’ అంటూ ‘జోరుగా హుషారుగా..’ చిత్రంలోని ‘యువరాణి’ పాట సాగుతుంది. విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అనుప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘యువరాణి యువరాణి నువ్వు..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసి, ‘‘ఈ సినిమా ఓ జెన్యూన్ లవ్‌స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రణీత్ స్వరపరచిన ‘యువరాణి’ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా అమ్రాన్ మాలిక్, నవ్య సమీర పాడారు. ‘‘త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. -
సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది
‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. అప్పట్నుంచి నాకు కథలు చెబుతుంటాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం.. నిర్మాతలు ముందుకు రారు, కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేయమని తనతో చెప్పాను. కానీ బెన్నీలాంటి నిర్మాతలు ఇప్పుడు కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. ఇక కొత్త కొత్త పాత్రలు చేస్తున్న కార్తికేయకు పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు ‘బెదురులంక’తో హిట్ కొట్టేశాడు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కార్తికేయకు హిట్ వస్తే నాకూ హిట్ వచ్చినట్టే’’ అని అజయ్ భూపతి అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బాగుందని అందరూ చెప్పిన తర్వాత పెద్ద రిలీఫ్ అనిపించింది. ఇలా సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్‌కు వెళ్లలేదు. ఒక్క హిట్ వస్తే చాలనుకున్న టైమ్‌లోనే ‘బెదురులంక’ వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని. ఇంకా బీవీఎస్ రవి, నేహా శెట్టి తదితరులు మాట్లాడారు. ∙బెన్నీ, శ్రీ విష్ణు, కార్తికేయ, నేహాశెట్టి -
కొత్తవాళ్లు సక్సెస్ అవ్వాలి
విజయ్ రాజ్‌కుమార్, నేహా పఠాని జంటగా భరత్ మిత్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’. నవీన్ కురవ, కిరణ్ కురవ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ విష్ణు మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో కొత్తవాళ్లు విజయం సాధిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. దర్శకుడు భరత్‌కు మంచి విజన్ ఉంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘18–30 వయసు మధ్య ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు భరత్ మిత్ర. ‘‘ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా, సెకండాఫ్‌లో ఆడియన్స్ తల తిప్పుకోలేని సీన్స్ ఉంటాయి’’ అన్నారు విజయ్ రాజ్‌కుమార్. -
చిన్న సినిమాలకు మీడియా సపోర్ట్ చేయాలి: శ్రీవిష్ణు
‘చిన్న సినిమాలకు ప్రమోషన్స్ కొంచెం కష్టం. కానీ మీడియా సపోర్ట్ చేస్తే అదేమంత కష్టం కాదు. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలి. నాకు సపోర్ట్ చేసినట్లే ‘ఏం చేస్తున్నావ్’ చిత్రబృందానికి కూడా మీడియా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఏం చేస్తున్నావ్’. భరత్ మిత్ర దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏం చేస్తున్నావ్’.. నా జీవితంలో ఎక్కువగా ఉన్న ప్రశ్న ఇదే . ఇందులో చాలా అర్థాలు ఉంటాయి. టైటిల్‌తో పాటు టీజర్ కూడా చాలా బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందని సాంగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ భరత్ కు మంచి విజన్ ఉంది. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘ఈ చిత్రం 18-30 ఏళ్ల వయసు వారికి బాగా కనెక్ట్ అవుతుంది. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి మంచి అనుభూతి అందిస్తుంది’అని దర్శకుడు భరత్ మిశ్రా అన్నారు. సినిమా మస్త్ ఉంటదని, ఫస్ట్ ఆఫ్ డీసెంట్ గా ఉంటుందని, సెకండ్ హాఫ్ తల తిప్పుకొని సన్నివేశాలు ఉంటాయని హీరో విజయ రాజ్ కుమార్ తెలిపారు. -
నమ్మకం నిజమైంది
శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. తాజాగా ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా రాజేష్ దండా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడే చాలా నవ్వుకున్నాం. ఈ కథలో యూనిక్ పాయింట్ ఉంది. అందుకే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘గీత గోవిందం’ వంటి సినిమాల తరహా స్క్రిప్ట్ ‘సామజ వరగమన’ అని మేం నమ్మాం. మా నమ్మకం నిజమైంది. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయడం లాభించింది. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసే ఆలోచన ఉంది’’ అన్నారు. -
సామజవరగమన ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది
శ్రీవిష్ణు, నరేశ్ తండ్రీకుమారులుగా నటించి ప్రేక్షకులందరిని కడుపుబ్బా నవ్వించిన కామెడీ ఎంటర్టైనర్ ‘సామజవరగమన’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఇందులో రామ్ అబ్బరాజు దర్శకుడు. రెబా మోనికా జాన్ కథానాయిక. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. (ఇదీ చదవండి: సినీ నటిపై రేప్.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఆపై) మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన సామజవరగమన ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో జులై 28న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహా ఈమేరకు అధికారికంగానే ప్రకటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా జూన్ 29న విడుదలైన ‘సామజవరగమన సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలకు ముందు కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. తర్వాత సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో దాని బిజినెస్ లెక్కలు మారిపోయాయి. కేవలం రూ. 7కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 50 కోట్లకు పైగానే రాబట్టింది. ఇంత సూపర్ హిట్ అయిన సినిమాను జులై 28న 'ఆహా' ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలోకి 'సామజవరగమన'.. ఆ రోజే రిలీజ్!
ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. ఈ మధ్య కాలంలో అలా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, సూపర్‌హిట్ అయిన మూవీ 'సామజవరగమన'. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం.. ఇప్పటికి రెండు వారాలకు అవుతున్నా విజయవంతంగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. (ఇదీ చదవండి: తెలుగు హీరోతో ధోనీ కొత్త సినిమా?) సినిమాల్లో మిగతా వాటి సంగతేమో గానీ కామెడీ జానర్ అనేది ఎవర్గ్రీన్. కరెక్ట్ గా వర్కౌట్ అయితే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా బాగుంటే కలెక్షన్స్ గట్టిగా వస్తాయి. అలానే జస్ట్ రూ.7 కోట్లతో తీసిన సినిమా 'సామజవరగమన'.. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రెండు రోజుల అంతంతమాత్రంగా ఉన్న ఈ సినిమా శనివారం నుంచి రయ్ మని దూసుకెళ్లింది. ప్రస్తుతం మూడు-నాలుగు రెట్ల లాభాలని సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 'సామజవరగమన'.. డిజిటల్ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. జూలై 28 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఆల్రెడీ చూసినవాళ్లు కూడా మళ్లీ చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?) నవ్వడం ఒక భోగం....😄 నవ్వించడం ఒక యోగం💁🏻♀️ సామజవరగమన దానికి చక్కటి రూపం.😉 ఇక నో ఆలస్యం...ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం..!#SamajavaragamanaOnAHA@sreevishnuoffl @Reba_Monica @ItsActorNaresh @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @HasyaMovies @AKentsOfficial pic.twitter.com/P5TcmbR87O — ahavideoin (@ahavideoIN) July 21, 2023 -
శ్రీ విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్.. ఈ కథ అతని వద్దకు ఎలా వచ్చిందంటే?
శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన 'సామజవరగమన' మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదట ఎటువంటి బజ్ లేకుండా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు టాలీవుడ్లో మంచి టాక్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కలెక్షన్ల పరంగానూ రోజు రోజుకూ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 30.1 కోట్లు వసూలు చేసి శ్రీవిష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇదీ చదవండి: హీరో విజయ్ నన్ను బెదిరిస్తున్నాడు.. అరెస్ట్ చేయండి: ప్రియ) ఈ విజయం అతని కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది. ఇప్పటికే 'సమాజవరగమన' చూసిన అల్లు అర్జున్,రవితేజ వంటి సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో ఈ సినిమాకు మరింత పబ్లిసిటీ దక్కింది. క్లాస్ స్టోరీతో పాటు కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా వైపు ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా క్యూ కట్టేలా చేస్తోంది. 'సామజవరగమన'ను రిజెక్ట్ చేసిన హీరో దర్శకుడు రామ్ అబ్బరాజు 'సామజవరగమన' కథ కోసం హీరోగా శ్రీ విష్ణును అనుకోలేదట. రామ్ అబ్బరాజు గతంలో వివాహభోజనంబు సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాకు సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ పరిచయంతో సందీప్ కోసం కథను రెడీ చేశాడట రామ్. కానీ అప్పటికే మైఖేల్ సినిమాతో సందీప్ బిజీగా ఉండటంతో ఈ సినిమాలోకి శ్రీ విష్ణు ఎంట్రీ ఇచ్చేశాడని టాక్. (ఇదీ చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి) -
'మెగాస్టార్ చెయ్యి నా గుండెను తాకడంతోనే మా జాతకం మారిపోయింది'
'సామజ వరగమన’ కథని రామ్ చెప్పినప్పుడే ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నిజమైంది. ‘సామజ వరగమన’ చూసి అందరూ హాయిగా నవ్వుతున్నారు' అని హీరో శ్రీ విష్ణు అన్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో శ్రీ విష్ణు మాట్లాడుతూ– 'ఈ సినిమా ట్రైలర్ లాంచ్ టైమ్‌లో చిరంజీవిగారి చేయి నా గుండె మీద ఎప్పుడైతే ఆటోగ్రాఫ్‌గా పడిందో అప్పటి నుంచి ఈ సినిమా జాతకం మారిపోయింది’ అన్నారు. ‘‘నవ్వించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వెంకటేశ్‌గారు సీనియర్ మోస్ట్. ఆ ప్లేస్‌కి ఇప్పుడు శ్రీవిష్ణు యాప్ట్’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘ఐదు రోజులుగా నిద్రపట్టడం లేదు. అంత సంతోషంగా ఉంది’’ అన్నారు రాజేష్ దండా. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు రామ్ అబ్బరాజు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, విజయ్ కనకమేడల, వశిష్ట, నటుడు వీకే నరేష్, రెబా మోనికా జాన్ మాట్లాడారు. -
‘ఏజెంట్’ ఫలితం నన్ను మార్చింది.. మళ్లీ ఆ తప్పు జరగదు: నిర్మాత
'ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. వాటి ద్వారా నిర్మాతలకు అదనపు ఆదాయం వస్తోంది. ఏప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినా అది ఇండస్ట్రీకి వచ్చినట్లే. రేపు మా సినిమా కూడా రీ రిలీజ్‌కి రావచ్చు.. అది నిర్మాతలకు మంచిదే' అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్ మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా జూన్ 29 విడుదలైంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ... ► ‘సామజ వరగమన’ మా యూనిట్ నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ విజయం చాలా తృప్తి ఇచ్చింది. ఈ కథకు శ్రీ విష్ణు కరెక్ట్‌గా సరిపోయాడు. మహేశ్ బాబు, నాని, శ్రీవిష్ణు... ఇలా ఎవరి మార్కెట్ వాళ్లది. ‘సామజ వరగమన’ని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. ఇదే కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా ఉంటుంది. ► ‘ఏజెంట్’ ఫలితం విషయంలో యూనిట్ అందరి తప్పు ఉంది. కొన్ని కారణాల వల్ల బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్లలేకపోయాం. ఇకపై పూర్తి కథ లేనిదే ఏ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లను. పెద్ద సినిమాలకు కాంబినేషన్‌ని బట్టి బిజినెస్ ఉంటుంది. కానీ, చిన్న సినిమాలకు కొంచెం రిస్క్ ఉంటుంది. కథ బాగుంటేనే వర్కవుట్ అవుతాయి. ► మా బ్యానర్లో తీసిన ‘హిడింబ’ ట్రైలర్ నచ్చడంతో టేబుల్ ప్రాఫిట్ బిజినెస్ జరిగింది. అలాగే ‘ఊరు పేరు భైరవ కోన’ కంటెంట్ కూడా యూనిక్‌గా ఉంటుంది. చిరంజీవిగారితో తీస్తున్న ‘భోళా శంకర్’ ఫ్యామిలీ మూవీ. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఆగస్ట్ 11న సినిమా విడుదలవుతుంది. కీర్తి సురేష్, చిరు మధ్య ఉండే సీన్లు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తాయి. -
చిన్న సినిమా.. పెద్ద సక్సెస్.. కోట్లకు కోట్లు!
ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది అస్సలు చెప్పలేం. అలా గతవారం నిఖిల్ పాన్ ఇండియా చిత్రం 'స్పై' రిలీజైంది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడింది. దీనితోపాటే థియేటర్లలోకి వచ్చిన 'సామజవరగమన' అనే చిన్న సినిమా అనుహ్యంగా హిట్ అయిపోయింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ఇంతకీ వసూళ్ల సంగతేంటి? లాభాలు ఎంత? 'సామజవరగమన' కథేంటి? బాలు(శ్రీవిష్ణు) ఓ మల్టీప్లెక్స్ లో పనిచేస్తుంటాడు. తండ్రి ఉమా మహేశ్వరరావు(సీనియర్ నరేష్)ని డిగ్రీ పాస్ చేయించేందుకు తిప్పలు పడుతుంటాడు. ఎందుకంటే డిగ్రీ పాస్ అయితేనే తాత వీలునామా ప్రకారం కోట్ల రూపాయల ఆస్తి తండ్రికి దక్కుతుంది. అలా తండ్రితో పరీక్షలు రాయించే క్రమంలో సరయూ(రెబా మోనికా జాన్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ తన బావ పెళ్లి వల్ల బాలుకి చిక్కులు వస్తాయి. ఇంతకీ అవేంటి? బాలు-సరయూ ఒక్కటయ్యారా అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) కలెక్షన్స్ ఎంత? ఈ సినిమా విడుదలకు రెండు మూడు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. అప్పుడే పాజిటివ్ టాక్ వచ్చింది. అయినాసరే విడుదలైన తొలిరోజు మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం రూ.2.89 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. రెండో రోజుల్లో రూ.6.31 కోట్ల గ్రాస్ వచ్చింది. మూడోరోజుకి అయితే.. తొలి రెండురోజుల్లో వచ్చిన దానికి రెట్టింపు వసూళ్లు దక్కాయి. అంటే రూ.12.96 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. నాలుగురోజైన ఆదివారం దాదాపు రూ.7 కోట్ల వరకు వచ్చాయి. దీంతో మొత్తం కలిపి రూ.19.80 కోట్ల గ్రాస్ లభించినట్లు చిత్రబృందం ప్రకటించింది. సక్సెస్‌కి కారణమేంటి? ఓ చిన్న సినిమాకు అదీ కూడా ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన దానికి ఈ తరహా హిట్ టాక్ రావడం చాలా అరుదైన విషయం. 'సామజవరగమన' ఇది చేసి చూపించింది. కుటుంబమంతా కలిసి చూసేలా ఎంటర్ టైన్మెంట్ ఉండటం చాలా కలిసొచ్చింది. ముందు వారాల్లో వచ్చిన సినిమాలు పెద్దగా జనాల్ని అలరించకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.7 కోట్లు పెట్టుబడి పెట్టారని, ఈ పాటికే ఆ మొత్తం వచ్చేసినట్లు సమాచారం. ఇకపై వచ్చే కలెక్షన్ అంతా లాభామే! BALU gadi family ni intha baga receive chesukunna prathi family ki 🙏🏻🙏🏻 Couldn't have asked for a better reception than this to our #Samajavaragamana ❤️ pic.twitter.com/TIoH87l9ZA — Sree Vishnu (@sreevishnuoffl) July 3, 2023 (ఇదీ చదవండి: ఒక్క సినిమా.. 35 పాటలు.. అదే అసలు సమస్య!) -
‘సామజవరగమన’ మూవీ రివ్యూ
టైటిల్: సామజవరగమన నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, వీకే నరేశ్, శ్రీకాంత్, వెన్నెల కిశోర్, సుదర్శన్ తదితరులు నిర్మాణ సంస్థ:హాస్య మూవీస్ నిర్మాత: రాజేశ్ దండా సమర్పణ: అనిల్ సుంకర్ దర్శకత్వం: రామ్ అబ్బరాజు సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ:రామ్ రెడ్డి ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్ విడుదల తేది: జూన్ 29, 2023 వైవిద్యమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లిన ఈ యంగ్ హీరోకి ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త వెనకబడ్డాడు. ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ‘సామజవరగమన’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్,ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సామజవరగమనపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శ్రీవిష్ణుకి అచ్చొచ్చిన కామెడీ జానర్‌తో హిట్ ట్రాక్ ఎక్కడా ? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు(శ్రీవిష్ణు) థియేటర్ బాక్సాఫీస్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. అతని తండ్రి ఉమామహేశ్వరరావు(నరేశ్)కు వేలకోట్ల ఆస్తి ఉంటుంది కానీ.. కొడుకు డిగ్రీ పాసైతేనే అది అతనికి చెందుతుందని బాలు తాత వీలూనామా రాసి చనిపోతాడు. దీంతో తన తండ్రిని ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించాలని నానా ఇబ్బందులు పడుతూ చదివిస్తుంటాడు బాలు. ఉమామహేశ్వరరావు మాత్రం 30 ఏళ్లుగా డిగ్రీ పరీక్షలు రాస్తూనే ఉంటాడు. బాలు ఒక్కడే ఉద్యోగం చేసి ఫ్యామిలీని పోషిస్తుంటాడు. ఓ సారి ఎగ్జామ్ హాల్లో ఉమామహేశ్వరరావుకు డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చిన స్టూడెంట్ సరయు(రెబా మౌనికా జాన్) పరిచయం అవుతుంది. ఆమెకు హాస్టల్లో ఉండడం ఇబ్బంది కావడంతో బాలు ఇంట్లోకి పెయింగ్ గెస్ట్‌గా వస్తుంది. బాలు ప్రవర్తను చూసి అతనితో ప్రేమలో పడుతుంది. బాలుకి మాత్రం ప్రేమ అంటే అస్సలు నచ్చదు. అంతేకాదు ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తున్నాను అని చెబితే వెంటనే ఆమెతో రాఖీ కట్టించుకుంటాడు. అలాంటి బాలు సరయుతో ఎలా ప్రేమలో పడ్డాడు? ఐలవ్ యూ చెప్పిన అమ్మాయిలతో బాలు ఎందుకు రాఖీ కట్టించుకుంటాడు? సరయు తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్)కి ప్రేమ పెళ్లిళ్లు అంటే ఎందుకు నచ్చదు? సరయు అక్కకి, బాలు బావకి పెళ్లి సెట్ అయిన తర్వాత వీరి ప్రేమకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? బాలు తండ్రి డిగ్రీ పాస్ అయ్యాడా? లేదా? చివరకు సరయు, బాలు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు చెప్పడానికి చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. ఆ కేటగిరీలోకి ‘సామజవరగమన’ వస్తుంది. కథలో కొత్తదనం లేకున్నా చక్కటి స్క్రీన్‌ప్లేతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రామ్. కరెంట్ పంచ్ డైలాగులతో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కథను రాసుకున్నాడు. అలా అని పూర్తిగా కామెడీనే నమ్ముకోలేదు. కావాల్సిన చోట ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేందుకు ఎమెషనల్ సన్నివేశాలను కూడా యాడ్ చేశాడు. సినిమాలోని ప్రతి పాత్రకు కామెడీ టచ్ ఉంటుంది. తండ్రిని డిగ్రీ పరీక్ష పాస్ చేయించడం కోసం కొడుకు పడే ఇబ్బందులతో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రతి సీన్ హిలేరియస్‌గా ఉంటుంది. ట్యూషన్ సెంటర్లో నరేశ్, హీరోయిన్ చేసే కామెడీ, రఘుబాబు వేసే ప్రశ్నలు నవ్వులు పూయిస్తాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలు చేసే మోసాల గురించి హీరో చెప్పే నాన్‌స్టాప్ డైలాగ్ అయితే ఫస్టాఫ్‌కే హైలెట్. ఈ డైలాగ్‌కి యూత్ అంతా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండాఫ్‌పై ఆసక్తికి పెంచుతుంది.ఇక సెకండాఫ్ కూడా కథను పూర్తి వినోదాత్మకంగా మలిచాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో కొన్నిచోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ‘కుల’ శేఖర్‌గా వెన్నెల కిశోర్ కామెడీ బాగా వర్కౌట్ అయింది.అయితే ఈ తరహా పాత్రతో యూట్యూబ్‌లో చాలా వీడియోలు వచ్చాయి. నాని ‘జర్సీ’లోని ఓ ఎమోషనల్ సీన్‌ని పేరడీ చేసి బాగా నవ్వించారు. బూతు సీన్లు, డబుల్ మీనింగ్ డైగాల్స్ లేకుండా క్లీన్ కామెడీతో ఇంటిల్లి పాది కలిసి చూసి నవ్వుకునే సినిమా ఇది. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. బాలు పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీతో పాటు కావాల్సిన చోట ఎమోషన్ని కూడా చక్కగా పండించాడు. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు తర్వాత బాగా పండిన పాత్ర నరేశ్ది. తండ్రి పాత్రలు నరేశ్‌కి కొత్తేమి కాదు కానీ.. ఈ సినిమాలో ఆయన నటించిన తండ్రి పాత్ర మాత్రం చాలా కొత్తది. ఆ పాత్రకు నరేశ్ మాత్రమే న్యాయం చేయగలడు అనేలా అతని నటన ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి నరేశ్ మరో హీరో అనొచ్చు. తనదైన కామెడీతో అందరికి ఆకట్టుకున్నాడు. సరయు పాత్రకి రెబా మౌనికా న్యాయం చేసింది. కుల శేకర్గా వెన్నెల కిశోర్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఉన్నంతలో కామెడీ పండించాడు. హీరో ఫ్రెండ్‌గా సుదర్శన్, హీరోయిన్ తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్తో పాటు రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. గోపీసుందర్ సంగీతం పర్వాలేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ ఈ సినిమాకు చాలా ప్లస్. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
స్టార్’ లేదా ‘యాక్టర్’ అంటే నా అప్షన్ యాక్టర్కే, ఎందుకంటే..: శ్రీవిష్ణు
‘‘స్టార్ అవ్వడం అనేది మన చేతుల్లో లేదు. అయితే ఎంచుకునే పాత్రలతో మంచి యాక్టర్ అవ్వడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ యాక్టర్ అనిపించుకోవడం అనేది చాలా కష్టం. ‘స్టార్’ లేదా ‘యాక్టర్’ అని ఎవరైనా నాకు అప్షన్ ఇస్తే.. యాక్టర్ అవుతాననే చాలెంజ్‌నే తీసుకుంటాను’’ అని శ్రీ విష్ణు అన్నారు. శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు చెప్పిన విశేషాలు.. ►‘సామజవరగమన’లో బాలసుబ్రహ్మణ్యం అనే యువకుడి పాత్రలో నటించాను. థియేటర్ బాక్సాఫీస్‌లో ఉద్యోగం చేస్తుంటాడు బాలసుబ్రహ్మణ్యం. సో.. కొంతమంది హీరోల డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయి. నవ్వించడమే పనిగా పెట్టుకుని మేం తీసిన సినిమా ఇది. యూత్‌కు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో ఓ సర్ప్రైజింగ్ పాయింట్ కూడా ఉంది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ ఇలాంటి పాయింట్ రాలేదనే అనుకుంటున్నాం. ►ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ ఎక్కవైపోయారు. పెద్ద దర్శకులు తక్కువైపోయారు. కొన్నిసార్లు స్టార్ డైరెక్టర్స్‌కే స్టార్ హీరోలు దొరకడం లేదు కూడా. ఇక స్టార్ దర్శకులు మాలాంటి వారితో సినిమాలు చేయాలంటే అది టఫ్ అవుతుంది. దీనికి తోడు మార్కెట్ సమీకరణాలు కూడా ఉంటాయి. అలాగే పెద్ద దర్శకులు కొంతమంది దాదాపు రెండేళ్ల వరకూ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. నేను సమయం వృథా కాకూడదని కొత్త దర్శకులతో, వీలైతే నేను ఇంట్రడ్యూస్ చేసిన వారితోనే మళ్లీ సినిమాలు చేసుకునేలా ప్లాన్ చేసుకుంటాను. ►విలన్ రోల్స్ చేయడం నాకు ఇష్టమే. అయితే ‘వీరభోగ వసంతరాయలు’, ‘తిప్పరా మీసం’ సినిమాల్లో నెగటివ్ టచ్ ఉండే రోల్స్ చేస్తే ప్రేక్షకులు అంతగా యాక్సెప్ట్ చేయలేదనిపించింది. అందుకే విలన్ రోల్స్ చేయాలనుకోవడం లేదు. ►ప్రస్తుతం హర్ష కొనుగంటి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే ‘రాజరాజ చోర’కు ప్రీక్వెల్‌గా హసిత్ గోలి దర్శకత్వంలోనే ఓ సినిమా చేస్తున్నాను. -
కేజీఎఫ్‌లో బానిసల్లా చూస్తాడు!
‘‘బాక్సాఫీస్ బాలు ఫ్యామిలీ మేము. డబ్బులు అతని దగ్గర తీసుకోండి’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘సామజ వరగమన’ సినిమా ట్రైలర్. శ్రీ విష్ణు హీరోగా ‘వివాహభోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో చిరంజీవి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే.. కేజీఎఫ్‌లో బానిసల్లా చూస్తాడు’ (వీకే నరేశ్), ‘ఎప్పుడైనా ఏదైనా పనికొచ్చే పని చేశావా.. చెత్త నుంచి కూడా కరెంట్ తీస్తున్నారు’ (శ్రీ విష్ణు) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘అమ్మాయిల పట్ల విరక్తి పెంచుకునే ఓ మధ్యతరగతి కుర్రాడు బాలు. అయితే రిచ్ లైఫ్‌స్టైల్ కోరుకునే ఓ అమ్మాయి అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ’’ అనిచిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సహనిర్మాత: బాలాజీ గుత్తా. -
శ్రీ విష్ణు ‘సామజవరగమన’ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్‌సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 18న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా..
‘‘డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారాను. నా వరకు నిర్మాతగానే బావుంది. మనకి నచ్చిన కథతో సినిమా నిర్మించామనే సంతృప్తి ఉంటుంది’’ అన్నారు రాజేష్ దండా. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరు పేరు భైరవకోన’, శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ చిత్రాలను అనిల్ సుంకర సమర్పణలో నిర్మించారు రాజేష్ దండా. ఈ రెండు చిత్రాల గురించి రాజేష్ దండా మాట్లాడుతూ– ‘‘స్వామి రారా’తోపాటు దాదాపు 80 చిత్రాలు పంపిణీ చేశాను. ‘కేరాఫ్ సూర్య, ఒక్క క్షణం, నాంది’ చిత్రాలకి కోప్రొడ్యూసర్‌గా చేశాను. ‘టైగర్’ సినిమా నుంచి సందీప్ కిషన్, వీఐ ఆనంద్‌లతో ఉన్న పరిచయంతో హాస్య మూవీస్ బ్యానర్‌ని ప్రారంభించాను. ముందు ‘ఊరు పేరు భైరవకోన’ ప్రారంభించినా, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫస్ట్ విడుదలైంది. ‘సామజవరగమన’ చిత్రాన్ని ఈ వేసవిలో, ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని జులై లేదా ఆగస్ట్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. అలాగే సుబ్బు దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్‌తో నిర్మించనున్న మరో సినిమాను ఆగస్ట్‌లోప్రారంభిస్తాం. శ్రీవిష్ణుతో మరో సినిమా చర్చల దశలో ఉంది. సాయిధరమ్ తేజ్‌తో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది’’ అన్నారు. -
ఓ వింత సమస్య
‘ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లకి క్యాస్ట్ ప్రాబ్లమ్ వస్తుంది లేకపో తే క్యాష్ ప్రాబ్లమ్ వస్తుంది.. ప్రపంచంలో ఎవరికీ రాని వింత ప్రాబ్లమ్ నాకు వచ్చిందేంట్రా’ అని హీరో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌లతో ‘సామజవరగమన’ గ్లింప్స్ రిలీజైంది. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వ సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు బర్త్‌డే (ఫిబ్రవరి 29) సందర్భంగా గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఈ వేసవిలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి. -
వేసవిలో సామజవరగమన
శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు డైరెక్టర్. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సామజవరగమన’ అనే టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందు తున్న చిత్రం ఇది. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవిలో మా సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అల్లూరి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 7న రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీ విష్ణు ఈ సినిమాలో నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజా రవింద్ర, పృథ్వీరాజ్, సుమన్, జయవాణి, మధుసుధననరావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తన్నారు. థియేటర్లలో ఈ సినిమా మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Alluri. Athaniki oka style undi. Case ni handle chese vidhananiki oka meter undi. Okkasari bari loki digithe, raccha ne🔥#AlluriOnAHA Premieres tomorrow @ 8pm @sreevishnuoffl pic.twitter.com/ju1qu9rEmQ — ahavideoin (@ahavideoIN) October 6, 2022 -
‘అల్లూరి’ ఫిక్షనల్ పాత్ర తీసుకొని వాస్తవ ఘటనలతో రూపొందించాం : శ్రీ విష్ణు
-
ఫస్ట్ పోలీస్ పాత్ర అనగానే లైట్ తీసుకున్న: శ్రీ విష్ణు
‘‘పోలీస్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. ఫిక్షనల్ పాత్ర తీసుకొని వాస్తవ ఘటనలతో రూపొందించాం. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.. చాలామందిలో స్ఫూర్తి నింపుతుంది’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా నటించిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణు గోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు పంచుకున్న విశేషాలు... ⇔ ‘అల్లూరి’ కథ చెప్పే ముందు ప్రదీప్ ఇందులో నాది పోలీస్ పాత్ర అంటే లైట్ తీసుకున్నాను. కానీ, కథ విన్నాక చేయాలనిపించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉంటూ విధిని నిర్వహించే ఓ పోలీస్ కథ ఇది. వ్యవస్థలోని మంచి చెడుల్ని చూపించాం. చెడుకి పరిష్కారం కూడా చెప్పాం. ⇔ కృష్ణగారి సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ క్లయిమాక్స్‌లో ‘ఒక అల్లూరి చనిపోతే వందమంది అల్లూరిలు పుడతారు’ అనే డైలాగ్ ఉంది. ఆ వందమందిలో మా ‘అల్లూరి’ ఒకరు (నవ్వుతూ). ⇔ పక్కింటి అబ్బాయిలా కంఫర్ట్ జోన్లో ఉంటే కొంత కాలానికి బోర్ కొట్టేస్తుంది. అందుకే అలా ఉండిపోదలచుకోలేదు. విభిన్నమైన పాత్రలు చేయాలని కొత్త ప్రయత్నాలు చేస్తుంటాను. అయితే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం లేదు. ⇔ ‘అల్లూరి’కి కొత్త ఆడియన్స్ కావాలి. దీనికి నా ఒక్కడి బలం సరిపోదు. అందుకే అల్లు అర్జున్‌గారిని మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పిలిచాను. మాకు సపోర్ట్ చేసిన బన్నీ, నాని, రవితేజగార్లకు థ్యాంక్స్. నిజానికి ఏఏ (అల్లు అర్జున్) సెంటిమెంట్ నాకు కలిసొచి్చంది. ‘అల్లూరిలో ‘అల్లు’ రావడం ఇంకా హ్యాపీ (నవ్వుతూ). ⇔ రానున్న రెండేళ్లలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. దర్శకుడు మన తెలుగువాడే. స్క్రిప్ట్ వర్క్ జరుగు తోంది. ప్రస్తుతం హాసిత్, సాయి, హర్ష దర్శకత్వాల్లో సినిమాలు చేస్తున్నాను. -
అదే ఇప్పుడున్న ట్రెండ్: అల్లు అర్జున్
‘‘చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్నది కాదు. ఇప్పుడున్న ట్రెండ్ ఒక్కటే.. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే థియేటర్స్‌కు వస్తున్నారు. ‘అల్లూరి’ సినిమా విజయం సాధించాలి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల్లూరి’. కయదు లోహర్ కథానాయికగా నటించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ‘నారాయనుడయ్యేను నవ వరుడు..’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో తన నటన నచ్చడంతో పిలిచి మాట్లాడాను. ప్రతి సినిమాకు అంకితభావంతో పనిచేసే శ్రీవిష్ణు అంటే నాకు ఇష్టం.. గౌరవం కూడా. యాక్టర్‌గా తను ఇంకా పైకి ఎదగాలి’’ అన్నారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా తర్వాత బన్నీగారు నన్ను పిలిచి, ‘భవిష్యత్‌లో కంటెంట్ ఉన్న సినిమాలే ఆడతాయి. సో... కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించు.. లేకపోతే ఖాళీగా ఉండు’ అంటూ ఓ ముందు చూపుతో చెప్పారు. అవసరమైతే నా సినిమాని నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో నేను ఓ చిన్న రోల్ చేశాను. ఆ తర్వాత నేను కేరళ వెళ్లినప్పుడు బన్నీగారి ఫ్యాన్స్ నన్ను గుర్తుపట్టి మాట్లాడారు. బన్నీగారు టాలీవుడ్లో చేస్తే చాలు అది ప్యాన్ ఇండియా సినిమా అయిపోతుంది. ‘అల్లూరి’ చిత్రం పోలీస్ స్టోరీ. మా మూవీ చూసిన తర్వాత పోలీసు కనిపిస్తే సెల్యూట్ చేస్తారు’’ అన్నారు. ‘‘పోలీసు అంటే ఒక వ్యక్తి కాదు.. పోలీస్ అంటే ఒక వ్యవస్థ’ అనే డైలాగ్ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను’’ అన్నారు ప్రదీప్ వర్మ. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో బెక్కెం బబిత, సహ నిర్మాతలు నాగార్జున, గంజి రమ్య, విజయలక్ష్షి్మ, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, దర్శకులు ప్రశాంత్ వర్మ, హర్ష, తేజ మార్ని, నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. -
ఆయనలా శ్రీ విష్ణు పెద్ద స్టార్ అవ్వాలి: నాని
‘‘మహేశ్‌బాబుగారు బయట చాలా రిజర్వ్డ్గా ఉండి లోపల చాలా సరదాగా ఉంటారని విన్నాను. ఆయన తర్వాత శ్రీ విష్ణు ఆ కోవకి వస్తారు. తను కూడా మహేశ్గారిలా పెద్ద స్టార్ కావాలి’’ అని హీరో నాని అన్నారు. శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘అల్లూరి’ ట్రైలర్ బావుంది.. సినిమా పెద్ద సక్సెస్ కావాలి. సినిమా చేస్తే హీరో కాకుండా పాత్రలు మాత్రమే కనిపించే హీరోలు చాలా తక్కువమంది ఉంటారు.. అలాంటి నటుల్లో ముందు వరుసలో ఉండే శ్రీ విష్ణు అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘ఎంతోమంది నానీగారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వస్తారు.. నాకు కూడా ఆయనే స్ఫూర్తి. గొప్ప కథతో రూపొందిన ‘అల్లూరి’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా ‘అల్లూరి’. ట్రైలర్ అందరికీ నచ్చింది.. సినిమా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. గేయ రచయిత రాంబాబు గోసాల పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: రాజ్ తోట. -
హీరో నాని చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘అల్లూరి’ మూవీ ట్రైలర్
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘అల్లూరి’ చిత్రంతో అలరించబోతున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. ‘లక్ష్యసాధనకు పడిన శ్రమ గొప్పది’ అంటూ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ వస్తుండగా పోలీసు ఆఫీసర్‌గా శ్రీవిష్ణు ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత పోలీసులు నిజమైన హీరోలు అంటూ చెప్పే డైలాగ్, యాక్షన్స్ సీన్స్, లవ్ యాంగిల్ వంటి ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ అద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఊహించిన రితీలో ఉన్న యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల చేత ఈళలు వేయించడం ఖాయం అంటున్నారు. సమాజం బాగుపడాలంటే రాజకీయ నాయకులను కూడా మార్చాలని హీరో సవాలు విసరడం, అలాగే, ఎక్కువ మంది పిల్లలు పోలీసు అధికారులుగా మారాలని కోరుకుంటున్నానంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ చూపించాడని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు హైలెట్ అని చెప్పవచ్చు. ఇలా సాంతంగా ఆసక్తిగా సాగిన ట్రైలర్ ప్యాన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా తనికేళ భరణి, రాజా రవింద్ర, పృథ్వీరాజ్, సుమన్, జయవాణి, మధుసుధననరావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తన్నారు. సెప్టెంబర్ 23న ఈచిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. -
పోలీస్ అవ్వాలనుకున్నా...కానీ ఈ సినిమాతో అయ్యాను: నిర్మాత
‘‘అల్లూరి’లో శ్రీ విష్ణు విశ్వరూపం చూస్తారు. తన కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు. శ్రీ విష్ణు పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నాను.. కానీ కాలేకపోయాను. అందుకే ‘అల్లూరి’ సినిమాలో పోలీస్ పాత్రను చాలా ఇష్టంగా చేశాను. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ‘దిల్’ రాజుగారి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ మధ్య షూటింగ్స్ నిలిపివేసి చర్చించడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి.. వాటిని త్వరలోనే వెల్లడిస్తాం. వైజాగ్‌లోని అల్లూరి సీతారామరాజుగారి సమాధి దగ్గర నుంచి ఈ నెల 3 నుండి ‘అల్లూరి’ యూనిట్ యాత్రని ప్రారంభిస్తున్నాం. వైజాగ్‌లో మొదలైన టూర్ వరంగల్, నిజామాబాద్ వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం ‘బూట్ కట్ బాలరాజు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
ఆ జానర్లో ఉన్న ఒకే ఒక్క తెలుగు హీరో శ్రీ విష్ణు – రాజమౌళి
‘‘పక్కింటి కుర్రాడిలా ఉంటాడు శ్రీ విష్ణు. ఒక చేప నీటిలోకి ఎంత ఈజీగా వెళ్లగలదో శ్రీ విష్ణు ఓ మాస్ హీరో పాత్రలోకి అలా వెళ్లగలడు. అంత ఈజీగా మాస్ క్యారెక్టర్లోకి షిఫ్ట్ అవ్వగలడని మనం ఊహించలేం. ఇంతకుముందు కూడా శ్రీ విష్ణు మాస్ పాత్రలు చేశాడు. కానీ ‘భళా తందనాన’ స్టార్టింగ్‌లో మామూలుగా కనిపించి ఆ తర్వాత చాలా ఈజీగా మాస్ హీరోలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాడు. ఆ కైండ్ ఆఫ్ జానర్లో తెలుగులో ఉన్న ఒకే ఒక్క హీరో శ్రీ విష్ణు’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. శ్రీ విష్ణు, కేథరిన్ హీరో హీరోయిన్లుగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భళా తందనాన’. సాయికొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథులుగా పాల్గొన్న దర్శకులు రాజమౌళి, శేఖర్ కమ్ముల బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఎంచుకుంటున్న సబ్జెక్ట్స్ నుంచే తనకంటూ డిఫరెంట్ జానర్‌ను క్రియేట్ చేసుకున్న శ్రీ విష్ణుకు మంచి భవిష్యత్ ఉంది. ఎవరైనా చిన్న సినిమాను చిన్న సినిమాగా, పెద్ద సినిమాను పెద్దగా తీస్తారు. కానీ చైతన్య దంతులూరి చిన్న సినిమా చేసినా సరే, పెద్ద సినిమా చేస్తున్నాననే యాటిట్యూడ్ తన సినిమాలో కనిపించేలా చేస్తాడు. ‘బాణం’ చూసినప్పుడు నాకు ఇలా అనిపించింది. ‘భళా తందనాన’ చూశాను. సేమ్ యాటిట్యూడ్. నెక్ట్స్ ఏం జరుగుతుంది? అనే ఓ టెన్షన్‌ను మెయిన్టైన్ చేస్తూ.. సస్పెన్స్ రివీల్ అయినప్పుడు ఓ హై వచ్చేలా చైతన్య చేసుకుంటూ వెళ్లాడు. ఈ సినిమా పట్ల సాయిగారు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఓటీటీలో మంచి ఆఫర్ ఉన్నా థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘చైతన్య తీసిన ‘బాణం’ నాకు ఇష్టమైన సినిమా. కంటెంట్‌కు, క్రాఫ్ట్స్‌కు మంచి వేల్యూ ఇచ్చే వ్యక్తి చైతన్య అని ‘బాణం’ తర్వాత అనుకున్నాను. ‘భళా తందనాన’ ట్రైలర్ బాగుంది. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. శ్రీ విష్ణు నా దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో స్మాల్ రోల్ చేశాడు. అప్పటిలానే అదే వినయంతో ఉన్నాడు. సాయి కొర్రపాటిగారు ఇలాంటి మరిన్ని మంచి చిన్న సినిమాలు నిర్మించాలి’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా అద్భుతంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా బయటకు తీసుకువచ్చిన రాజమౌళిగారికి థ్యాంక్స్. ఇందువల్ల తెలుగు సినిమాలే కాదు.. మా విలువ కూడా పెరిగింది సార్ (రాజమౌళిని ఉద్దేశించి..). శేఖర్ కమ్ములగారితో నాకు వర్క్ చేసిన అనుభవం ఉంది. నాలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని ఎంతోమంది కొత్తవారు ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా సెటిలయ్యారు. సాయిగారిలాంటి డేరింగ్ ప్రొడ్యూసర్‌ను నేనింతవరకు చూడలేదు. మణిశర్మగారు తన ఆర్ఆర్తో సర్ప్రైజ్ చేస్తారు. చైతన్య, నేను 14 ఏళ్లుగా మంచి స్నేహితులం. మంచి సినిమా చేశాం. 6న వస్తున్నాం.. సిక్స్ కొడతాం’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘రాజమౌళిగారి సినిమాల్లోని కమర్షియాలిటీని, శేఖర్ కమ్ములగారి సెన్సిబిలిటీని ఒక శాతం అయినా నా సినిమాలో వినియోగించాననే అనుకుంటున్నాను. తన యాక్టింగ్‌తో శ్రీ విష్ణు సర్ప్రైజ్ చేస్తారు. కథా రచయిత శ్రీకాంత్ వల్లే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను ఏ థియేటర్స్‌లో అయినా ఎవరైతే ఫస్ట్ చూస్తారో వారికి అంకితం ఇస్తున్నాను. వారే మా టార్చ్ బేరర్స్’’ అన్నారు చైతన్య దంతులూరి. ఈ కార్యక్రమంలో రాజమౌళి సతీమణి, స్టయిలిస్ట్ రమా రాజమౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రియ, రచయిత శ్రీకాంత్ విస్సా, నటుడు గరుడ రామ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ విష్ణు మూవీ వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘భళా తందనాన’. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించారు. మే 6వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ థ్రెసా నటించింది. ‘బాణం’ సినిమా ఫేమ్ చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. -
శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
Sri Vishnu Bhala Thandanana Movie Release Date Lock: శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా జంటగా నటించిన చిత్రం ‘భళా తందనాన’. ‘బాణం’ సినిమా ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చదవండి: కార్తీకేయతో జతకట్టిన ‘డిజే టిల్లు’ హీరోయిన్ ‘‘కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భళా తందనాన’. మా సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. వేసవి సెలవులు, మే 3న రంజాన్ పండగను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30న మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించాం. మణిశర్మ సంగీతం అందించిన మా సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు. -
ఆ హీరోని ఏమనాలో తెలియడంలేదు: దిల్‌రాజు
‘‘శ్రీ విష్ణును హీరో అనాలో, ఆర్టిస్టు అనాలో నాకు తెలియడంలేదు. కానీ సినిమాను లీడ్ చేస్తున్నప్పుడు హీరో అనే అంటాం. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశాలను ఇస్తూ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఏదో ఒక రోజు అతని ప్రయత్నం పెద్దవాడ్ని చేస్తుంది. అయితే తన ప్రయత్నాలను మాత్రం శ్రీ విష్ణు ఆపకూడదు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజా మార్ని దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘కొత్త దర్శకులు నాకు కథలు చెప్పినప్పుడు వాటిలో రెండు, మూడు కథలను శ్రీ విష్ణుతో షేర్ చేస్తాను. కొత్తవారికి చాన్స్ ఇస్తూ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నిర్మాతలను అభినందిస్తున్నాను. వీరి ప్రయత్నాలు పెద్ద సక్సెస్‌లు కావాలని కోరుకుంటున్నాను. ‘అర్జున ఫల్గుణ’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీకి ఉత్తి చేతుల్తో వచ్చాను నేను. ఇప్పుడు చాలా ఆస్తి ఉంది నాకు. నేను పరిచయం చేసిన దర్శకులే నా ఆస్తి. స్నేహితులైన ఐదుగురు అమాయకులు ఓ చిన్న సమస్యలో ఇరుక్కుని ఎలా బయటపడ్డారు? అన్నదే ‘అర్జున ఫల్గుణ’ కథ’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘ఓ వేదికపై మైక్ పట్టుకుని నేను మాట్లాడటం ఇదే మొదటిసారి. కొత్త కొత్త దర్శకులకు శ్రీ విష్ణు ఓ ధైర్యం. ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడివరకు తీసుకువచ్చింది’’ అన్నారు తేజ మార్ని. ‘‘శ్రీ విష్ణు చేసిన 15 చిత్రాల్లో పదిమంది కొత్త దర్శకులే’’ అన్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. ‘‘చాలామంది దర్శకులను పరిచయం చేసిన శ్రీ విష్ణును నేను ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో దర్శకులు వివేక్ ఆత్రేయ, సాగర్ చంద్ర, వెంకటేశ్ మహా, మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ సినిమా చేసినా అది మిస్సవ్వను
‘‘ప్రతి దర్శకుడికీ తన సినిమాని పెద్ద తెర మీద చూసుకోవాలని ఉంటుంది. అయితే నా మొదటి సినిమా (‘జోహార్’) ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమాకి నేనే నిర్మాతను కావడంతో ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పుడు ‘అర్జున ఘల్గుణ’కి మంచి నిర్మాతలు దొరికారు. ‘దిల్’ రాజుగారు రిలీజ్ చేస్తున్నారు’’ అని తేజ మార్ని అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో ఎన్.ఎమ్. పాషా కో ప్రొడ్యూసర్‌గా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ నెల 31న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా తేజ మార్ని చెప్పిన విశేషాలు. ► ‘అర్జుణ ఫల్గుణ’ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నాం. ఇందులో ఎన్టీఆర్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద డైలాగ్స్ ఉన్నాయి. పైగా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ (జనవరి 7) తర్వాత వేరే సినిమాలు కనపడవేమో! ఈ కారణాల వల్ల మా సినిమాని ముందు రిలీజ్ చేస్తున్నాం. ► గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సినిమా ఇది. ఈస్ట్ గోదావరిలో దొరికే ఓ కూల్ డ్రింక్‌ని టైటిల్‌గా అనుకుంటే, అనుమతి దక్కలేదు. ఆ టైటిల్ కాకపోతే కథ మార్చాలి. ఆ విషయం గురించి చర్చించుకుంటున్నప్పుడు అర్జున ఫల్గుణ అంటే ధైర్యం వస్తుందట అని నేను, శ్రీవిష్ణు మాట్లాడుకున్నాం. ఇదే టైటిల్‌గా పెడితే బాగుంటుందని శ్రీవిష్ణు అన్నారు. సినిమాలో హీరో పేరు అర్జున్. టైటిల్ పెట్టాక కథలో చాలా మార్పులు చేశాం. ఉళ్లో ఉన్నప్పుడు అర్జునుడిగా ఉండే హీరో ఊరు దాటాక ఫల్గుణుడిగా ఎలా మారాడు? అన్నదే కథ. ► సిటీలో ఎంత సంపాదించుకున్నా మిగిలేది కొంతే.. ఒక్కోసారి మిగలకపోవచ్చు కూడా. అందుకే ఊళ్లోనే ఉండి సంపాదించుకుంటే మంచిదేమో అనుకునే ఊరి కుర్రాళ్ల కథ ఇది. నా స్నేహితులు, వాళ్ల స్నేహితుల జీవితాల్లో జరిగిన ఘటనలను ఈ కథలో పొందుపరిచాను. సినిమాలోని మెయిన్ ఐదు పాత్రలూ ఎన్టీఆర్ ఫ్యా¯Œ ్స. నేను కూడా ఎన్టీఆర్ అభిమానినే. ► శ్రీ విష్ణుని అనుకుని ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు కథ రాశాను. కథానుగుణంగా గోదావరి యాస పెట్టాం. సినిమాలో శ్రీవిష్ణుని చూస్తే ‘సిందూరం’లో రవితేజగారిని చూసిన ఫీల్ వస్తుంది. యాక్షన్ పరంగా కొత్త విష్ణును చూస్తారు. సినిమా ఫస్టాఫ్ వినోదంగా, సెకం డాఫ్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో ప్రేక్షకులు ఎమోషనల్ అవుతారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2, షైన్ స్క్రీన్ బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాను. ఇకనుంచి కమర్షియల్ సినిమాలే చేయాలనుకుంటున్నాను. కానీ ఎమోషన్ని మాత్రం మిస్సవ్వను. -
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా శ్రీ విష్ణు, ట్రైలర్ చూశారా?
Arjuna Phalguna Trailer: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ శుక్రవారం అర్జున ఫల్గుణ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో అర్జున పాత్రలో ఒదిగిపోయిన శ్రీ విష్ణు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించాడు. ట్రైలర్లో ఇంకా ఎన్నాళ్లు ఖాళీగా ఉంటావన్న ప్రశ్నకు హీరో రియాక్ట్ అవుతూ 'డిగ్రీదాకా చదివాం.. ఆర్నెళ్లు రెస్ట్ తీసుకుంటే తప్పా?' అని చెప్పిన డైలాగ్ యూత్‌కు కనెక్ట్ అవుతోంది. ఇక హీరోయిన్ అమృత గ్రామ వాలంటీర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 50 శాతం అడవుల్లోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. -
మంచి పాత్రలు వస్తున్నాయి కానీ..!
‘‘ఇప్పటివరకూ నాకు సంప్రదాయమైన పాత్రలే వచ్చాయి. మంచి పాత్రలొస్తున్నాయి కానీ, నేనేంటో నిరూపించుకునే సవాల్‌తో కూడిన పాత్రలు ఇంకా రాలేదు’’ అని హీరోయిన్ అమృతా అయ్యర్ అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘స్నేహం నేపథ్యంలో ‘అర్జున ఫల్గుణ’ ఉంటుంది. ఆపదలో ఉన్న ఓ స్నేహితురాలికి ఐదుగురు స్నేహితురాళ్లు ఎలా సాయపడ్డారన్నది ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ 50 శాతం అడవుల్లో జరిగింది. సల్వార్ వేసుకుని అడవుల్లో పరిగెత్తడం కష్టంగా అనిపించింది. కొండలపై షూటింగ్ కోసం రాను పోను మూడు గంటలు నడిచేవాళ్లం. ‘నువ్వు ఏదైనా చేయగలవు’ అంటూ తేజ మార్నిగారు స్పూర్తి నింపారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్గారి సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ‘రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాల్లో నా పాత్రల పరంగా సంతృప్తిగా ఉన్నాను. నాకు గ్లామర్ పాత్రలు సౌకర్యంగా అనిపించవు.. ప్రస్తుతానికి చేయాలనుకోవడం లేదు కూడా. ప్రస్తుతం చేస్తున్న ‘హనుమాన్’ 70 శాతం పూర్తయింది. వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచన లేదు’’ అన్నారు. -
ఓటీటీలో దూసుకుపోతున్న 'రాజ రాజ చోర'
దసరా కానుకగా 'జీ 5'లో 'రాజ రాజ చోర' విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు నచ్చడంతో దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసిన నెటిజన్లు సోషల్‌మీడియాలో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ... అనేకమంది కామెంట్లు పోస్టులు పెడుతున్నారు. థియెట్రికల్ రిలీజ్ తర్వాత అపూర్వమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన సినిమా ఇదేనని చెప్పాలి. ఈ సందర్భంగా పబ్లిసిటీ మారథాన్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలీకి 'జీ5' టీం కృతజ్ఞతలు తెలిపింది. రచయిత - దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ఓ బేబీ' దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించి సోషల్ మీడియాలో "మీరు వెండితెరపై అద్భుతమైన ఈ సినిమాను చూడడం మిస్ అయితే... ఇప్పుడు డిజిటల్ తెరపై చూసే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది" అన్నారు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ సినిమా అని రచయిత - దర్శకుడు బివిఎస్ రవి పేర్కొన్నారు. టీవీ, ప్రింట్ ప్రమోషన్ల నుంచి డిజిటల్ మీడియా వరకు... ఇన్ఫ్లుయెన్సర్ల నుండి మీమ్ పేజీల వరకూ... సినిమాలో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చూస్తుంటే 'రాజ రాజ చోర' ప్రజలు మెచ్చిన ఎంటర్టైనర్ అని స్పష్టమవుతుంది. 'జీ 5'లో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అద్భుత స్పందన అందుకున్న ఈ సినిమాను దసరా వీకెండ్ లో మరింత మంది చూసే అవకాశం ఉంది. అక్టోబర్ 22న 'జీ 5'లో 'హెడ్స్ & టేల్స్' విడుదల కానుంది. దీంతో మరింత ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన 'కలర్ ఫోటో' సినిమా టీమ్ నుంచి వస్తున్న సినిమా ఇది. ముగ్గురు మహిళలు, భగవంతుడు చుట్టూ తిరిగే అందమైన కథతో 'హెడ్స్ అండ్ టేల్స్' రూపొందింది. ఇందులో భగవంతుడిగా సునీల్ నటించగా... 140కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు ప్రజలు కంటెంట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చదవండి: MAA: బాలయ్యను కలిశాను, త్వరలో చిరంజీవిని కలుస్తా: మంచు విష్ణు -
ఆసక్తికరంగా ‘14’ మూవీ టీజర్
రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయల్, విశాఖ ధీమాన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగార్, రతన్,జబర్దస్త్ మహేష్ నటీ,నటులుగా లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మిస్తున్న ‘14’.ఈ చిత్రం టీజర్‌ను తాజాగా యంగ్ హీరో శ్రీవిష్ణు విడుదల చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్లకు, దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దర్శకుడు చెప్పినట్లు తన మంచి కథ తీసుకొని వస్తే కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నోయల్ కు ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 15 సంవత్సరాల క్రితం మేమంతా సినిమాలలో అవకాశం కోసం ట్రై చేసే వాళ్ళం .ఇప్పుడున్నటువంటి వాట్సాప్,ఫేస్ బుక్ లాంటి ఫాస్ట్ జనరేషన్ అప్పుడు లేదు. మేము ప్రతి రోజు సుభాష్ మాస్టర్ అడ్డా దగ్గర అసెంబ్లింగ్ అయ్యేవాళ్ళం. ఫిలింనగర్ కి మేము దూరంగా ఉన్నా.. మేము ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే అందరం కలిసి ఒకే బైక్ మీద ఒకే కారులో ఆఫీస్ లకు వెళ్ళేవాళ్ళం .నవీన్ , నోయల్, సుభాష్ చాలా మంచి వారు వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఈ సినిమా నోయల్ కు అద్భుతమైన పేరు వచ్చి ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుతున్నాను సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు శ్రీవిష్ణు మా చిత్రానికి వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.తన ద్వారా మా చిత్రానికి మంచి బూస్టప్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా ఉన్న ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా శ్రీ విష్ణు తో చేసే అవకాశం వస్తుందని కచ్చితంగా నమ్ముతున్నాను’అన్నాడు హీరో నోయల్. -
ఓటీటీలో ‘రాజ రాజ చోర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Raja Roja Chora OTT Release Date Out: యంగ్ హీరో శ్రీవిష్ణు ఇటీవలె నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’.కామెడీ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ చితం త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. హితేశ్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లు. జిరాక్స్ షాపులో పనిచేసే భాస్కర్ (శ్రీవిష్ణు) అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పైకి మాత్రం తాను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. చదవండి : 'మా'లో మార్పు తీసుకొస్తా: మంచు విష్ణు అలా చెప్పుకొనే సంజన అలియాస్ సంజు(మేఘ ఆకాశ్)తో ప్రేమాయణం సాగిస్తాడు.అయితే భాస్కర్‌కు అప్పటికే విద్య( సునైన)తో పెళ్లి జరిగుతుంది. వాళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఓ కేసులో ఇరుక్కున్న భాస్కర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే సినిమా కథ. ఇప్పటికే థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 8నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి : గ్రాండ్‌గా సుకుమార్ భార్య బర్త్‌డే సెలబ్రేషన్స్ -
‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
-
‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
టైటిల్ : రాజ రాజ చోర నటీనటులు : శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్ తదితరులు నిర్మాణ సంస్థ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ దర్శకత్వం : హసిత్ గోలి సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ : వేద రమణ్ శంకరన్ ఎడిటింగ్: విప్లవ్ విడుదల తేది : ఆగస్ట్ 19,2021 చిత్ర పరిశ్రమలో ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. విలక్షణ నటనతో, వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరో సెక్సెస్కి ‘గాలి సంపత్’ బ్రేక్ వేశాడు. దీంతో కాస్త వెనకడుగు వేసిన శ్రీవిష్ణు.. ఈ సారి ఎలాగైనా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలనే కసితో ‘రాజ రారజ చోర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రాజ రాజ చోర’ఏ మేరకు అందుకుంది? ఈ సినిమాతో శ్రీవిష్ణు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం. రాజ రాజ చోర కథేంటంటే భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ చిన్న దొంగ. ఓ జిరాక్స్ షాపులో పని చేస్తూ అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పైకి మాత్రం తాను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. అలా చెప్పుకొనే సంజన అలియాస్ సంజు(మేఘ ఆకాశ్)తో ప్రేమాయణం సాగిస్తాడు. అయితే భాస్కర్‌కు అప్పటికే విద్య( సునైన)తో పెళ్లి జరిగుతుంది. వాళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. అయినప్పటికీ భాస్కర్ సంజనతో ఎందుకు ప్రేమాయణం సాగించాడు? తాను ప్రేమించిన వ్యక్తి సాఫ్టవేర్ ఇంజనీర్ కాదనీ, అతనికి పెళ్లై, బాబు కూడా ఉన్నాడని తెలిసిన తర్వాత సంజన పరిస్థితి ఏంటి? దొంగగా పట్టుబడి పోలీసులకి చిక్కిన భాస్కర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. దొంగగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా రెండు కోణాల్లో అద్భుత నటనను కనబరిచాడు. తనదైన మేనరిజమ్స్‌తో నవ్విస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా మొత్తం తన భూజాల మీద వేసుకొని కథని నడిపించాడు. హీరో భార్య విద్య పాత్రలో సునైనా ఒదిగిపోయింది. మధ్యతరగతికి చెందిన వివాహితగా ఆకట్టుకుంది. ఇక సంజూగా మేఘా ఆకాశ్ పర్వాలేదనిపించింది. పోలీస్ అధికారి విలియమ్ రెడ్డి పాత్రలో రవిబాబు ఒదిగిపోయిన తీరు బాగుంది. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. అవినీతి పోలీసు అధికారిగా అదరగొట్టేశాడు. అంజమ్మ పాత్రలో గంగవ్వ మెప్పించింది. తనదైన పంచులతో నవ్వులు పూయిచింది. శ్రీకాంత్ అయ్యంగర్, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? అవసరాల కోసం దొంగగా మారిన ఓ వ్యక్తి.. తన తప్పును తెలుసుకొని మంచి వాడిగా ఎలా మారాడనేదే ఈ సినిమా కథ. మనసు మాట వినకుండా.. డబ్బు కోసం ఆశ పడి చేసే ఏ పనైనా తప్పే అనే సందేశాన్ని కామెడీ యాంగిల్లో చూపించాడు దర్శకుడు హసిత్ గోలి. దానికి కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చి కథను నడిపించాడు. సాధారణంగా దర్శకులు సేఫ్‌గా ఉండేందుకు తమ తొలి సినిమాని ప్రేమ కథతో ప్రారంభిస్తారు. కానీ డైరెక్టర్ హిసిత్ మాత్రం తన డెబ్యూ మూవీనే ఇలాంటి కొత్త తరహా కథను చెప్పాలనుకొనే ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. అనుకున్నది తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. భాస్కర్, విద్యల సంబంధించిన సన్నివేశాలు మొదలయ్యాక కథలో వేగం పెరుతుంది. అయితే కథను సాగదీస్తూ అసలు విషయాన్ని ఇంటర్వెల్ వరకు లాగడం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇంటర్వెల్ ముందు పోలీసులకు శ్రీవిష్ణు పట్టుబడినప్పుడు వచ్చే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. అంతేకాదు సెండాఫ్‌పై అంచనాలను పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథను నెమ్మదిగా సాగడం కాస్త మైనస్. కథను ఎమోషనల్‌గా డీల్ చేయడానికి స్కోప్ ఉన్నప్పటీ.. డ్రామాపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు దర్శకుడు. సెకండాఫ్‌లో భాస్కర్ దొంగతనం చేసే సీన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, తనికెళ్ల భరణి చెప్పే ప్రవచనాలతో ముడిపెడుతూ కథని నడిపించిన విధానం బాగుంటుంది. ఇక ఈసినిమాకు ప్రధాన బలం వివేక్ సాగర్ సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సెకండాఫ్‌లో వచ్చే సిధ్ శ్రీరామ్ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించేవిధంగా ఉంటుంది. వేద రమణ్ శంకరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ విప్లవ్ తన కత్తెరకు ఇంకా చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అప్పటి వరకు వెంకటేశ్‌ని కలవొద్దని టార్గెట్ పెట్టుకున్నా : శ్రీవిష్ణు
సాక్షి, వెబ్‌డెస్క్: రాజ శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శ్రీవిష్ణు. ఆయన చెప్పిన సంగతులేంటో చదివేయండి. అలాంటి వారికి ఇది రైట్ సినిమా ఇది కొత్త స్టోరీ. ఇందులో నేను దొంగ. పెద్ద స్కామ్ చేసే దొంగ కాదు. కొంటె దొంగని. 10 నిమిషాల్లోనే సినిమా క్యారెక్టర్లు అన్ని తెలిసిపోతాయి. ఆ తర్వాత నా క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుంది. మనం ఓటీటీలో ఇతర భాషల సినిమాలను చూసి పొగిడేస్తున్నాం కదా? అలాంటి వారికి ఇది రైట్ సినిమా. మన తెలుగు వాళ్లు ఈ జానర్లో చేసిన తొలి సినిమా ఇది. కచ్చితంగా అందరికి కనెక్ట్ అవుతుంది. కథే అలా మాట్లాడించింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంత ఎమోషనల్‌గా మాట్లాడానికి కారణం ‘రాజ రాజ చోర’కథే. నిజంగా ఈ కథ బాగా కుదిరింది. స్టోరీని ఎక్కువగా రివీల్ చేయడానికి వీల్లేదు. పబ్లీసిటీ కోసం అయితే అలా మాట్లాడలేదు. కథ గురించి చెప్పేసి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి నిరుత్సాహపరచడం నాకు ఇష్టం ఉండదు. నా కథ, షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని మాత్రమే ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్తా. ఇందులో సిద్ శ్రీరామ్ ఓ పాట పాడారు. ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే థియేటర్లకు వచ్చిన తర్వాత ఆ సాంగ్ వింటేనే ఓ ఫీల్ కలుగుతుంది. అందుకే పబ్లిసిటీ కోసం వాడకుండా.. నిజాయతీగా సినిమాను థియేటర్లోకి తీసుకొస్తున్నాం. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడానికి ఆలోచిస్తుంటారు. అలాంటి భయానికి ముందు నా కాన్ఫిడెన్స్‌ని ప్రెజంట్ చేస్తే బావుంటుందనిపించి స్టేజ్‌పై అలా మాట్లాడాను. అయితే నేను చెప్పిన మాటలు హృదయంలో నుంచి వచ్చినవే. టార్గెట్ పెట్టుకొని వెంకటేశ్‌ని కలిశా నేను వెంకటేశ్‌కు చాలా పెద్ద అభిమానిని. నటుడిగా మారాక ఆయనను కలిసే అవకాశం వచ్చినప్పటికీ కలవలేదు. మంచి సినిమాలు చేసి ఆయన నుంచి పిలుపు వచ్చే వరకు కలవొద్దని చిన్న టార్గెట్ పెట్టుకున్నాను. లక్కీగా ‘నీదీ నాదీ ఒకే కథ’తర్వాత వెంకటేశ్ నుంచి పిలుపు వచ్చింది. వెళ్లి కలిశా.. చాలా బాగా చేస్తున్నావని అభినందించారు. కథలు ఎంచుకునే విషయంలో డౌట్స్ ఉంటే ఆయన సలహాలు తీసుకుంటాను. పర్సనల్‌గా నాకవి ఎంతో హెల్ప్ అవుతూ వచ్చాయి. ‘రాజా రాజ చోర’ట్రైలర్ విడుదలైన వెంటనే.. ఫోన్ చేసి కామెడీ బాగుందని చెప్పారు. తాజాగా ఆయన ఇచ్చిన సలహా ఏటంటే.. అన్ని జానర్స్‌లో బాగా చేస్తున్నావు. మాస్ జానర్ కూడా ట్రై చేయమని చెప్పారు. లక్కీగా నేను తర్వాత చేయబోయే సినిమాలన్నీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలే. అవి మాస్ ఆడియన్స్‌ని తప్పకుండా అలరిస్తాయి. పాన్ ఇండియా చిత్రమే నా గత సినిమాలన్నీ ఇతర భాషల్లో రిమేక్ చేశారు. కానీ ఎక్కడా చెప్పలేదు. రాజ రాజ చోర కచ్చితంగా ఇతర భాషల్లో రీమేక్ అవుతుంది. పాన్ ఇండియా స్టఫ్ ఉన్న సినిమా ఇది. కొత్త దర్శకులతో ఈజీ హిట్ ఇచ్చిన దర్శకులతో పనిచేస్తే రిలాక్స్ అయిపోతాం. అలా ఉండటం నాకిష్టముండదు. కొత్త దర్శకులతో చేసేటప్పుడు భయం, బాధ్యత ఉంటాయి. హ్యాండిల్ చేస్తారని నమ్మకం వచ్చినప్పుడు వాళ్లు బిడ్డలాగే భావించే సినిమా కరెక్ట్ వస్తుంటే వాళ్లు పడే ఆనందం చూస్తే నాకొక కిక్ వస్తుంది. ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటైంది. అంతేకాకుండా కొత్త వాళ్లతో సినిమా చేయడం కిక్. వాళ్లతో సినిమా చేస్తే మన బుర్ర కూడా పదునెక్కుతుంది. నా సినిమాల్లో ఎక్కువగా కొత్తవాళ్లతో చేసినవే హిట్ అయ్యాయి. ఈ సినిమా చూసిన తర్వాత ముందు మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గురించే మాట్లాడుతారు. తొలిసారి ఇద్దరితో తొలిసారి ఇద్దరు హీరోయిన్లు మేఘా ఆకాశ్, సునైనతో సినిమా చేశా. ఇద్దరు తెలుగు వాళ్లే. కానీ తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు. ఈ సినిమా తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్ వస్తాయనే నమ్మకముంది. ప్రేక్షకుల మనసును దోచుకుంటా సినిమా జయా, అపజయాలు నా చేతుల్లో ఉండవు. కష్టపడి సినిమాలు చేస్తాం.. కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అవుతుంటాయి. ఏ కారణాల వల్ల సినిమా పోయిందో చూసుకొని తదుపరి సినిమాల్లో తప్పిదాలు లేకుండా చూసుకుంటా. ప్రస్తుతం అర్జున పాల్గుణ, భళా తందనాన సినిమాలతో పాటు కాప్ బయోపిక్ చేస్తున్నా. ‘రాజ రాజ చోర’తో ప్రేక్షకుల మనసును కచ్చితంగా దోచుకుంటాను. -
‘నారప్ప’ ఓటీటీలోకి రావడంతో రెండ్రోజులు భోజనం చేయలేదు
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘నేను వెంకటేశ్‌గారి వీరాభిమానిని. ‘నారప్ప’ చిత్రం ఓటీటీలోకి రావడంతో బాధ వేసి రెండు రోజులు భోజనం చేయలేదు. పెద్ద సినిమాలు థియేటర్లలోకి రావాలంటే మాలాంటి చిన్న సినిమాలను బాగా ఆదరించాలి.. అప్పుడే మన సూపర్‌స్టార్ సినిమాలను స్క్రీన్‌పై చూసుకుంటాం. అందరి హీరోల అభిమానులు మా సినిమాని ఆదరిస్తే అనిల్‌గారు చెప్పినట్లు ప్యాన్ ఇండియా చిత్రం అవుతుంది. రాజ రాజ చోర సినిమా చూసే మహిళలకు నేను చాలా రోజులు గుర్తిండిపోతాను. నన్ను చాలా అభిమానిస్తారు. ‘రాజరాజ చోర’ సినిమా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. ఇది మన తెలుగు సినిమా. విడుదల తర్వాత ప్రతి భాషలోనూ ఈ చిత్రాన్ని కచ్చితంగా రీమేక్ చేస్తారు’ అని అన్నాడు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. శ్రీ విష్ణు కథల ఎంపిక బాగుంటుందని, ఈ చిత్రం తన కెరీర్లో ఓ బెస్ట్ మూవీ కావాలని కోరుకుంటున్నానన్నాడు. ‘రాజ రాజ చోర’ సినిమా చూశా.. కచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’ అని హీరో నారా రోహిత్ చెప్పుకొచ్చాడు. అలాగే డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. ‘నేను కూడా శ్రీవిష్ణుకు పెద్ద అభిమానిని. ఈ సినిమాలో కొంటె శ్రీవిష్ణును చూస్తారు’అని అన్నాడు. కాగా కార్యక్రమంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ, నటుడు తనికెళ్ల భరణి, హీరోయిన్స్ మేఘా ఆకాష్, సునైన పాల్గొన్నారు. -
అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా: హీరోయిన్
‘లై, ఛల్ మోహన రంగ’ చిత్రాల తర్వాత తెలుగులో నాకు సరైన కథలు రాలేదు.. అందుకే ఏదీ ఒప్పుకోకపోవడంతో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో తమిళంలో మంచి స్క్రిప్ట్స్ రావడంతో అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. ప్రస్తుతం తెలుగులోనూ మంచి కథా బలం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నాను’ అని హీరోయిన్ మేఘా ఆకాశ్ అన్నారు. శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్ గోలి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేఘా ఆకాశ్ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ భాష ఆధారంగా స్క్రిప్ట్స్ ఒప్పుకోను. మంచి కథ ఏ భాషలో ఉన్నా నటిస్తా. ‘రాజరాజ చోర’ కథ వైవిధ్యంగా ఉంది. నా నిజ జీవితానికి భిన్నమైన పాత్రను ఇందులో చేశాను. ఇప్పుడు ఓ స్థాయికి వచ్చాను కాబట్టి ప్రయోగాత్మక పాత్రలు చేయాలనుకుంటున్నాను. మా అమ్మ, నాన్న నా సినిమాల ఎంపికలో జోక్యం చేసుకోరు. అమ్మ కథ వింటుంది కానీ చేయాలా? వద్దా? అనే నిర్ణయం నాదే. ప్రస్తుతం ‘డియర్ మేఘ, మనుచరిత్ర, గుర్తుందా శీతాకాలం (అతిథి పాత్ర)’ చేస్తున్నాను. మరో సినిమా ప్రకటన త్వరలో వస్తుంది’’ అన్నారు. -
శ్రోతల్ని అలరిస్తున్న రాజ రాజు
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘రాజా రాజు వచ్చె లోకాలు మెచ్చే..’ అనే పాటను బుధవారం విడుదల చేశారు. ‘దొరలని మీకు మీరు దొర్లుతూ తిరిగారు.. చొరబడి చెడిపోతే చతికిల పడతారు.. రాజా రాజు వచ్చె లోకాలు మెచ్చే..’ అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ ట్యూన్స్ ఇచ్చారు. హసిత్ గోలి సాహిత్యం అందించగా, మోహనా భోగరాజు ఆలపించారు. మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్ ఘోష్ నటిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తీ చౌదరి, కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల, సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: వేదరామన్. -
‘భలా తందనాన’ మూవీ: ఆసక్తిగా గరుడ రామ్ ఫస్ట్‌లుక్
యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా చైతన్య దంతులూరి దర్శకత్వంతో తెరకెక్కుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘భళా తందనాన’. ఇందులో కేథరిన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల ఈమూవీ షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో విలన్‌గా కేజీఎఫ్ ఫేం రామచంద్రరాజు(గరుడ) నటిస్తున్నాడు. అయితే ఈ రోజు రామచంద్రరాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీలో ఆయన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. అంతేగాక ఈ సందర్భంగా అతడి పాత్రను కూడా మూవీ యూనిట్ వెల్లడించింది. ‘ఆనంద్ బలిగా గరుడ రామ్’ అంటూ చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసింది. ఇందులో గడ్డంతో ఉన్న రామ్‌ను చూస్తుంటే ఆనంద్ బలిగా పవర్ ఫుల్ విలన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. -
గంగవ్వ నోటి వెంట శ్రీవిష్ణు ‘చోర గాథ’
శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన, మేఘా ఆకాశ్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ‘చోర గాథ బై గంగవ్వ’ పేరుతో చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ‘నీకు ఊ.. కొట్టే కథ తెలుసా? ఏది చెప్పినా ఊ.. కొట్టాలి’ అని అసలు కథ మొదలు పెడుతుంది గంగవ్వ. ‘అనగనగా ఓ సూర్యుడు ఉంటడు. ఆ సూర్యడేమో భూమికి ప్రాణం ఇచ్చాడు. భూమి నుంచి కోతి, బంగారం వచ్చాయి’ అంటూ సాగే ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గంగవ్వ చెప్పుకొచ్చిన ఈ కథ రాజు, దొంగ, కిరీటం చూట్టు తిరగనుందనేది అర్థమైంది. చివరకు ఈ మూడింటి మధ్య ఏం జరిగింది, రాజు కిరీటాన్ని ఎత్తుకెళ్లిన ఆ దొంగ దొరుకుతాడా? లేదా? అనే ప్రశ్నతో ముగించిన గంగవ్వ చోర గాథ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ జూన్ 18న విడుదల కానుంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో తనికెళ్ల భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
ఆయనకి జాతీయ అవార్డు రావాలి
‘‘మా స్రవంతి మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయిందే రాజేంద్రప్రసాద్‌గారి ‘లేడీస్ టైలర్’ సినిమాతో. ఆయన పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చిన్నదే అవుతుంది. ‘గాలి సంపత్’ సినిమాతో ఆయనకు జాతీయ అవార్డు రావాలి.. వస్తుందనుకుంటున్నా’’ అని హీరో రామ్ అన్నారు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్.కృష్ణ, హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ మాట్లాడుతూ–‘‘గాలి సంపత్’ ట్రైలర్ చూశాక రాజ్‌కుమార్ హిరాణీ చిత్రంలా అనిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్’’ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘జీవితంలో నన్ను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా ‘లేడీస్ టైలర్’ స్రవంతి మూవీస్‌దే.. ఆ సినిమా లేకుంటే ఇవాళ నేను ఇక్కడ లేను. ‘గాలి సంపత్’ నా జీవితంలో ఒక ఆణిముత్యం’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథ ఆసక్తిగా అనిపించింది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘తండ్రీ కొడుకుల మధ్య సాగే ఫన్ అండ్ ఎమోషన్ జర్నీ ‘గాలి సంపత్’’ అన్నారు అనీష్. ‘‘మా ‘గాలి సంపత్’ చూస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన రామ్. ‘‘హీరో రామ్‌గారితో పాటు సాహు, హరీష్గార్లతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నేనెప్పుడూ నా క్యారెక్టర్ చూసి సినిమాలు చేయను.. కథ చూసి చేస్తా’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ కార్యక్రమంలో లవ్లీ సింగ్, కెమెరామెన్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు అచ్చురాజమణి, దర్శకులు గోపీచంద్ మలినేని, బీవీఎస్ రవి, శివ నిర్వాణ పాల్గొన్నారు. -
పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి
‘‘దాసరి నారాయణరావుగారు, రాఘవేంద్రరావుగారు, కోడి రామకృష్ణగారు వంటి వారు పెద ్దసినిమాలతో పాటు చిన్న సినిమాలూ తీశారు. అందుకే వారు వంద సినిమాల మార్క్‌ను ఈజీగా దాటగలిగారు. పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి. పెద్ద డైరెక్టర్ యాడ్ అయితే చిన్న సినిమా పెద్ద సినిమా అవుతుంది. ‘గాలి సంపత్’ అలాంటి పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో అనీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాలి సంపత్’. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ, సమర్పణలో ఎస్. కృష్ణ, హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. అనిల్æరావిపూడి మాట్లాడుతూ – ‘‘గాలి సంపత్ (రాజేంద్రప్రసాద్ పాత్ర) గొంతుకు ప్రమాదం జరిగి, మాట బయటకు రాదు. గాలి మాత్రమే వస్తుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారిది చిలిపిగా మాట్లాడే ఫీ..ఫీ..ఫీ భాష’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు అనీష్. ‘‘చిన్న సినిమాగా మొదలైన ‘గాలిసంపత్’ అనిల్ రావిపూడి రాకతో పెద్ద సినిమాగా రిలీజ్ కాబోతోంది’’ అన్నారు సాహు గారపాటి, ఎస్. కృష్ణ. -
శ్రీ విష్ణు భళా.. ప్రారంభం
వైవిధ్యమైన చిత్రాలు నిర్మించే సాయి కొర్రపాటి తాజాగా ‘భళా తందనాన’ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. శ్రీ విష్ణు హీరోగా ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ కథానాయిక. మంగళవారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కెమెరా స్విచ్చాన్ చేయగా, శ్రీశైల దేవస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణపండ శ్రీనివాస్ క్లాప్‌నిచ్చారు. కీరవాణి సతీమణి శ్రీవల్లి, రాజమౌళి సతీమణి రమా రాజమౌళి స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించారు. మార్చిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
ఆసక్తి పెంచుతున్న ‘అర్జున ఫల్గుణ’ థీమ్ పోస్టర్
వైవిధ్యభరిత చిత్రాలు తీస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యండ్ హీరో శ్రీవిష్ణు. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడతాడు. ఇప్పటికే ‘గాలి సంపత్’ అనే వెరైటీ చిత్రం చేస్తున్న ఈ యువ హీరో..తాజాగా మరో ఆసక్తికర కాన్సెప్ట్‌తో కొత్త సినిమాను ప్రకటించారు. ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రానికి ఆదివారం 'అర్జున ఫల్గుణ' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్లో ఐదుగురు వ్యక్తులు పరుగులు పెడుతుంటే, వారిని ఓ పోలీస్ జీప్ వెంటాడుతోంది. పైన వ్యక్తుల ముఖాలు మాత్రం కనిపించడం లేదు. కానీ వారు పరుగెత్తుతుండగా, పక్కనే ఉన్న కాలవలో వారి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రతిబింబాలు ఎవరివో వెల్లడవుతున్నాయి. హీరో హీరోయిన్లు, వారి ముగ్గురు ఫ్రెండ్స్.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నారని ఆ పోస్టర్ తెలియజేస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇప్పటికే 75% షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో.. శ్రీ విష్ణు సరసన బ్యూటీ ఫుల్ హీరోయిన్ అమృత అయ్యర్ నటిస్తోంది. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా ఉన్నారు. -
‘గాలి సంపత్’ కోసం రంగంలోకి అనిల్ రావిపూడి
శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్ గాలి సంపత్‌గా టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో అనీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అనిల్ రావిపూడి సమర్పణ, స్క్రీన్ ప్లేతో ఆయన కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మాకు చాలా స్పెషల్. అందుకే నా పూర్తి సహకారాన్ని అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాను’’ అన్నారు. ఎస్. కృష్ణ మాట్లాడుతూ – ‘‘నా మిత్రుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి బ్యాక్ బోన్‌గా నిలబడడమే కాకుండా స్క్రీన్ ప్లే, సమర్పణతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేయడానికి అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: ఎస్. కృష్ణ, రచనా సహకారం: ఆదినారాయణ, మాటలు: మిర్చి కిరణ్, కెమెరా: సాయి శ్రీ రామ్, సంగీతం: అచ్చు రాజమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్ When #GaaliSampath was first announced, I planned to present and write screenplay for the film. This film is extra special for us and now I am extending my complete support by providing direction supervision as well. I always believe that team work means more meaningful work !! pic.twitter.com/mmFBnYWYk9 — Anil Ravipudi (@AnilRavipudi) January 21, 2021 -
సరికొత్త పాత్రలో
వైవిధ్యమైన కథలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలతో దూసుకుపోతున్నారు శ్రీ విష్ణు. ఆయన నటిస్తున్న ‘రాజ రాజ చోళ’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ‘గాలి సంపత్’ చిత్రంతో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉండగా తాజాగా మరో సినిమా అంగీకరించారు శ్రీ విష్ణు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ చేయని సరికొత్త పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తారు. 2021 మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
వినోదం.. సాహసం
‘క్షణం, ఘాజి, గగనం’ లాంటి కమర్షియల్ హిట్స్ అందించి, ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’, నాగార్జునతో ‘వైల్డ్ డాగ్’ లాంటి క్రేజీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇటీవల ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు సంస్థ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి. తాజాగా తమ సంస్థ రూపొందించనున్న తొమ్మిదో చిత్రాన్ని గురువారం ప్రారంభించారు. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా ‘జోహార్’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ క్లాప్ ఇచ్చారు. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ సినిమా స్క్రిప్టును దర్శక–నిర్మాతలకు అందజేశారు. ‘‘వినోద ప్రధానంగా సాగే అడ్వంచరస్ రోడ్ మూవీగా రూపొందనున్న చిత్రమిది. వైవిధ్యమైన కథ, కథనాలు ఉంటాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎన్.ఎమ్. పాషా, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్, కెమెరా: జగదీష్ చీకటి. -
అరకులో గాలి సంపత్
శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, డా. రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఎస్. క్రిష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అరకులో జరుగుతోంది. ‘‘తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక వైవిధ్యమైన భావోద్వేగంతో రూపొందుతోన్న చిత్రమిది. అనిల్ రావిపూడి మార్క్ వినోదంతో అందమైన ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం అరకులో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణుతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: అచ్చు రాజమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్. -
అచ్చ తెలుగు కథ
దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా ‘గాలి సంపత్’ చిత్రం ప్రారంభమైంది. టైటిల్ రోల్‌ను రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఎస్.కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సీన్‌కి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. వరుణ్ తేజ్ గౌరవ దర్శకత్వం వహించగా, స్క్రిప్ట్‌ను అనీష్ కృష్ణకు నిర్మాత ఎస్వీసీ శిరీష్ అందజేశారు. ‘‘నేనీ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘అచ్చ తెలుగు స్క్రిప్ట్ ఇది’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగమోహన్ బాబు ఎమ్. -
రాజరాజచోర ప్రారంభం
శ్రీ విష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజ రాజ చోర’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా బ్రేక్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం తిరిగి ప్రారంభం అయింది. మేఘా ఆకాశ్, సునయిన కథానాయికలు. యస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నివాళులు అర్పించి, చిత్రీకరణ ప్రారంభించారు. ‘ఒక వినూత్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్. ‘సినిమా పూర్తయ్యేవరకూ రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం’ అన్నారు సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. తనికెళ్ల భరణి, రవిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: వేదరామన్, సంగీతం: వివేక్ సాగర్. -
దొంగల రారాజు
వెరైటీ కథలను ఎంచుకొని నటించే నటుల్లో శ్రీవిష్ణు ఒకరు. శనివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన నూతన చిత్రం ‘రాజ రాజ చోర’ తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘రాజ రాజ చోర’ అంటే దొంగలందరికీ రాజు లాంటివాడు అని అర్థం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హసిత్ గోలి దర్శకునిగా పరిచయమవుతున్నారు. సునయన కథానాయిక. చిత్రనిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిష్ణు, హసిత్ గోలి లాంటి ఇద్దరు యువ ప్రతిభావంతులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం, మా హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఏప్రిల్ నాటికి ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తి చౌదరి, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
వేసవిలో సవారి
నందు, ప్రియాంకా శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘సవారి’. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీ విష్ణుతో కలిసి ట్రైలర్‌ను విడుదల చేసిన సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రంలో నందు నటించాడు. మొదట అతని పాత్రకు వేరొకరని తీసుకుందామని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణను అడిగాను. కానీ ఆ పాత్రను నందూయే చేయాలన్నారు. నందు బాగా నటించాడు. నేను, తను దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. నందు ఎలాంటి క్యారెక్టర్లో అయినా ఒదిగిపోగలడు. ఈ చిత్రదర్శకుడు సాహిత్ నాకో కథ చెప్పాడు. ఆ కథ నచ్చినప్పటికీ సినిమా చేయలేకపోయాం. ‘సవారి’ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. సాహిత్ భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం నందు పడ్డ కష్టం ఎక్కడికీ పోదు. విడుదల తర్వాత ‘సవారి’ చిత్రం పెద్ద సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాటలు నాకు బాగా నచ్చాయి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘డబ్బుల కోసం నేను చాలా సినిమాలు చేశాను. నటుడిగా అవి నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. ‘సమ్మోహనం’ తర్వాత మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘సవారి’ చిత్రం చేశాను. తొలి పోస్టర్ రిలీజ్ నుంచే ఈ సినిమాకు మంచి బజ్ వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తాను’’ అన్నారు నందు. ‘‘ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాను మా అన్నయ్య, స్నేహితుడు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులోని రెండు పాటలకు 10 మిలియన్ (కోటి) వ్యూస్ రావడం చిన్న విషయం కాదు’’ అన్నారు సాహిత్ మోత్కూరి. ఈ కార్యక్రమంలో శివ, జీవన్, మ్యాడీ, శ్రీకాంత్ రెడ్డి, బల్వీందర్, పూర్ణాచారి, కరిముల్లా, ఎడిటర్ సంతోష్ మేనం పాల్గొన్నారు. -
ఏడ ఉన్నావే...
శ్రీ మానస్, సమ్మోహన జంటగా తెరకెక్కిన చిత్రం ‘పటారుపాళెం ప్రేమ కథ’. జె.ఎస్ ఫిలిమ్స్ పతాకంపై దొరైరాజు వూపాటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. బాలు ధాకే స్వరపరచిన ఈ సినిమాలోని ‘ఏడ ఉన్నావే ఏడ ఉన్నావే..’ అనే తొలి పాటను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది దొరైరాజుగారే. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాట చాలా బాగుంది’’ అన్నారు. దొరైరాజు మాట్లాడుతూ– ‘‘పరువు హత్యల నేపథ్యంలో, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బాలు ధాకే, సమర్పణ: జిఎస్ రెడ్డి, నిర్మాతలు: వి.లతా రెడ్డి, వి. సౌజన్యా దొరైరాజు, బి.ఆర్. బాలు, కె. రామకృష్ణ ప్రసాద్. -
రూట్ మార్చారా?
సౌత్ ఇండస్ట్రీల్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించారు కాజల్ అగర్వాల్. ఇప్పుడు యంగ్ హీరోలతోనూ ఆమె సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా కాజల్ నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. శ్రీవిష్ణుతో కాజల్ నటించడం ఇదే తొలిసారి. మరి.. ఇలానే యంగ్ హీరోలతోనూ వరుసగా కాజల్ జోడీ కట్టాలనుకుంటున్నారా? వేచి చూడాలి. -
సమయానికి వస్తాను... చెప్పింది చేస్తాను
‘‘ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. కంటెంట్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలవైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ పెద్ద హీరోలు చేసిన కాన్సెప్ట్ సినిమాలు మాత్రమే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరుతున్నాయి. ‘రంగస్థలం’ అందుకు ఓ ఉదాహరణ. మధ్య స్థాయి హీరోలు చేసిన కాన్సెప్ట్ సినిమాలు మల్టీఫ్లెక్స్‌లకే పరిమితం కాకూడదు. అందుకే స్క్రిప్ట్‌లో ఏయే అంశాలు కావాలో వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని శ్రీవిష్ణు అన్నారు. విజయ్‌కృష్ణ. ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తిప్పరామీసం’. రిజ్వాన్ నిర్మించిన ఈ చిత్రం గ్లోబల్ సినిమాస్ ద్వారా రేపు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చెప్పిన విశేషాలు. ► ‘తిప్పరామీసం’ సినిమాలో నేను నైట్ క్లబ్లో పని చేసే డీజే పాత్ర చేశాను. క్యారెక్టర్లో నెగటీవ్ షేడ్స్ ఉంటాయి. కాస్త రఫ్‌గా కనిపిస్తాను. ఈ సినిమా కోసం నేను బరువు పెరిగాను. ఫుల్‌గా మాస్ క్యారెక్టర్ కాదు. కానీ మాస్ అప్పీల్ ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా ఉండే క్యారెక్టర్. తినడం.. తాగడం.. పడుకోవడం. అలాంటి అతని జీవితం కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఎలా ప్రభావితం అయ్యిందన్నదే కథ. తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని మూడు సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అవి ప్రేక్షకులకు నచ్చుతాయని ఆశిస్తున్నాం. ► సినిమాలో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. అమ్మ కోసం హీరో ఏ పని చేసి గర్వంగా ఫీల్ అయ్యాడో, ఏ పరిస్థితుల్లో మీసం తిప్పాడో వెండితెరపై చూసినప్పుడు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. తల్లి పాత్రలో రోహిణిగారు అద్భుతంగా నటించారు. దర్శకుడు విజయ్ సినిమాను బాగా తీశాడు. ► విజయ్ అసోసియేషన్‌లో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేకమైన కారణం లేదు. నేను, నారా రోహిత్, విజయ్ భాగస్వాములం. నాతో పని చేసిన ఎవరైనా నాతో మళ్లీ వెంటనే సినిమా చేస్తామంటారు. కానీ నాకు ఉన్న ఇతర కమిట్మెంట్స్ గురించి కూడా ఆలోచించాలి. నాతో వర్క్ చేయడం కంఫర్ట్‌గా ఉంటుందని దర్శకుడు విజయ్ కృష్ణ చెప్పారంటే సంతోషంగా ఉంది. నేను ఎవరితో సినిమా చేసినా సమయానికి వెళతాను.. దర్శకులు చెప్పింది చేస్తాను. ► ‘బ్రోచెవారెవరురా’ సినిమా నన్ను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసింది. ఈ సినిమాలో క్రేజీ కామెడీ ఉంది. కానీ కామెడీ మాత్రమే ప్రేక్షకులకు చాలదు. కథలో కంటెంట్ కూడా బాగుండాలి. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత వస్తున్న నా చిత్రాలపై అంచనాలు ఉండొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. ► నా కెరీర్ మొదట్లో నా దగ్గరకు కమర్షియల్ కథలు వచ్చేవి. కానీ ఇప్పుడు భిన్నమైన కథలే వస్తున్నాయి. నేను కూడా రెగ్యులర్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. కానీ పెద్ద హీరోలు చేసే కమర్షియల్ సినిమాలు చూస్తాను. ఎంజాయ్ చేస్తాను. అయితే నేను కాన్సెప్ట్ సినిమాలు చేస్తాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధమే. కథ నచ్చాలి. ► ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయ్యాను. ఈ సినిమాల చిత్రీకరణ పూర్తయ్యాక పారితోషికం పెంపుదల గురించి ఆలోచిస్తాను. నారా రోహిత్‌తో కలిసి నేను నటించాల్సిన ఓ పీరియాడికల్ మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. బహుశా వచ్చే ఏడాది మొదలుకావొచ్చు. -
శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు
‘‘మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, ఆ కథల్లో తాను ఇన్వాల్వ్ అవుతూ కొత్త రకం సినిమాలు చేస్తున్నాడు శ్రీవిష్ణు. తను నటించిన సూపర్‌హిట్ సినిమా ‘బ్రోచేవారెవరురా’ని మూడుసార్లు చూశాను’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా ‘అసుర’ చిత్ర దర్శకుడు విజయ్‌కృష్ణ. ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో రిజ్వాన్ నిర్మించారు. గ్లోబల్ సినిమాస్ ద్వారా ఈ నెల 8న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో మంచి గౌరవం సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. ఇకముందు కూడా ఇలాగే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్స్ చాలా బావున్నాయి’’ అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. అద్భుతమైన సినిమా. శ్రీవిష్ణు ఇంకా పెద్ద సినిమాలు చేయాలి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘చాలా దగ్గరగా నన్ను చూసిన దర్శకుడు విజయ్ నాకు నెగటివ్ క్యారెక్టరు డిజైన్ చేశాడు. ప్రపంచంలో ఏదైనా మారొచ్చు కానీ అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. తల్లి గొప్పదనం గురించి చెప్పే చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ– ‘‘మేం చేసిన ఈ మంచి ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. శ్రీవిష్ణు పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తల్లి పాత్రలో నటించిన రోహిణి గారికి అంతే ఇంపార్టెన్స్ ఉంది’’ అన్నారు. ‘‘నా పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు’’ అన్నారు నటి రోహిణి. రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘విజయ్ ది బెస్ట్ ఫిల్మ్‌ను ఇచ్చాడు.. సురేశ్ బొబ్బిలి సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అన్నారు. ఇంకా ఈ వేడుకలో నిర్మాత యం.ఎల్. కుమార్ చౌదరి, బెనర్జీ, అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది
‘‘అసుర’ సినిమా నుంచి విజయ్ కృష్ణ, నా ప్రయాణం కొనసాగుతోంది. మాకు ఒక ప్లాట్‌ఫామ్ కావాలని రెండు మూడు సినిమాలు నిర్మించాం. అందులో నేను చిన్న చిన్న వేషాలు వేశాను. నేను కొంచెం మంచి సినిమాలు చేశాక ఇద్దరం సినిమా చేద్దామనుకున్నాం. తను ఇచ్చిన మాట కోసం నాతో ‘తిప్పరా మీసం’ సినిమా చేశాడు’’ అని శ్రీవిష్ణు అన్నారు. ‘అసుర’ ఫేమ్ విజయ్ కృష్ణ ఎల్. దర్శకత్వంలో శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 8న గ్లోబల్ సినిమాస్ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో దర్శకుడు విజయ్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమా చేద్దామని నేను, శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత నా ఫ్రెండ్ అచ్యుత రామారావు, రిజ్వాన్ జాయిన్ అయ్యారు. శ్రీవిష్ణు, నిక్కి బాగా నటించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రిజ్వాన్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు నిక్కీ తంబోలి. ‘‘ఈ సినిమాకి విజయ్ హార్ట్ అయితే, శ్రీవిష్ణు ప్రాణం. వారిద్దరూ కష్టపడి ఈ సినిమా చేశారు’’ అన్నారు రిజ్వాన్. సహనిర్మాత అచ్యుత రామారావు, హాస్యనటుడు నవీన్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి పాల్గొన్నారు. -
తిప్పరా మీసం
అనుకున్నది సాధించినప్పుడో, పందెంలో గెలిచినప్పుడో మీసం తిప్పుతారు. ఇప్పుడు శ్రీవిష్ణు కూడా మీసం తిప్పుతున్నారు. మరి ఆయనేం చేశారో సినిమా చూసి తెలుసుకోవాలి. శ్రీవిష్ణు హీరోగా ఎల్. కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. నికీ తంబోలీ హీరోయిన్. శ్రీ ఓం బ్యానర్ సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ట్రైలర్, ఆడియోను త్వరలోనే రిలీజ్ చేస్తాం. థియేట్రికల్ రైట్స్‌ను ఏషియన్ సినిమాస్ బ్యానర్ తీసుకున్నారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: సి«ద్. -
వినూత్నమైన కథతో...
‘నీదీ నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా’ ఫేమ్ శ్రీవిష్ణు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ వంటి చిత్రాలతో విజయం అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దగ్గర రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన హాసిత్ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్రనిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిష్ణు, హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో సినిమా నిర్మించనుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, కీర్తీ చౌదరి. -
శత్రువు కూడా వ్యసనమే
‘మందు, సిగరెట్, అమ్మాయిలా.. శత్రువు కూడా వ్యసనమే.. ఆ వ్యసనానికి నేనూ బానిసనే’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ‘తిప్పరా మీసం’ చిత్రం టీజర్ విడుదలైంది. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా కృష్ణ విజయ్.ఎల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్, శ్రీ ఓం సినిమా పతాకాలపై రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా టీజర్‌కు, శ్రీవిష్ణు డైలాగ్‌కి అనూహ్య స్పందన వస్తో్తంది. శ్రీవిష్ణుని కృష్ణ విజయ్ ఆవిష్కరించిన తీరు, లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ఖుషీ, అచ్యుత్ రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావిళ్ల, సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: సిద్. -
ఇద్దరం.. వెంకటేష్ అభిమానులమే..
ఒకప్పుడు వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. ఒకరికొకరు పరిచయం కూడా లేదు. కానీ ఇద్దరి గమ్యం ఒక్కటే.. అదే ‘సినిమా’. ఇప్పుడు వారిద్దరూ ఒక్కటే. వారిని సినిమా ప్రపంచమే కలిపింది. ఒకరు సినీ హీరో అయితే, మరొకరు దర్శకుడిగా మారారు. వారే హీరో శ్రీవిష్ణు, దర్శకుడు వివేక్ ఆత్రేయ. విష్ణు బీబీఎం చదివి హైదరాబాద్ పయనమవగా.. వివేక్ బీటెక్ చేసి ఓ ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. మనసంతా సినిమా వైపు లాగడంతో ఉద్యోగాన్ని వదిలేసి నగరానికి వచ్చేశాడు. వీరిద్దరూ తమ గమ్యాన్ని చేరుకుని ‘మెంటల్ మదిలో’ చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచేశారు. తర్వాత ‘బ్రోచేవారెవరురా’తో మరో హిట్ కొట్టారు. ఈ మిత్ర ద్వయం తమ సినీ ప్రయాణాన్ని.. అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే.. -సత్య గడేకారి అమలాపురంలో మొదలై.. శ్రీవిష్ణు: నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లపైనే అయింది. మాది అమలాపురం సమీపంలోని గోడి గ్రామం. బీబీఎం చదివా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. వెంకటేష్ సినిమాలు అదేపనిగా చూసేవాణ్ని. చదువు, జాబ్ మనకు సెట్ కావని హైదరాబాద్ వచ్చేశా. వినయ్‌వర్మ వద్ద థియేటర్ ఆర్టిస్ట్‌గా చేరా. నటనలో కొన్ని మెళకువలు నేర్చుకున్నా. సినిమా కష్టాలను అనుభవించా. చిన్నచిన్న వేషాలు వేసింతర్వాత ‘బాణం’ చిత్రంలో చిన్న పాత్ర వేసి పేరు తెచ్చుకున్నా. తర్వాత ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ నటుడిగా గుర్తింపు వచ్చింది. అల్లు అర్జున్ ప్రశంసించారు.. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా చూశాక హీరో అల్లు అర్జున్ ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు. తమిళంలో విజయ్ సేతుపతి, శివకార్తికేయన్‌లా నీకు మంచి టాలెంట్ ఉందని కితాబిచ్చారు. విభిన్న కథలను చేయమంటూ సలహా ఇచ్చారు. ఓ పెద్ద హీరో అభినందించడం చాలా సంతోషంగా అనిపించింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో బన్నీతో కలిసి నటించాను. మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ‘నీది నాది ఒకటే కథ’.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు చేశాను. ఇద్దరం.. వెంకటేష్ అభిమానులమే.. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ: మేమిద్దరం చిన్నప్పటి నుంచి వెంకటేష్ అభిమానులమే. ఆయన తన ఇంటికి పిలిచి అభినందించడం మరిచిపోలేని అనుభవం. మమ్మల్ని ప్రోత్సహించిన సినీ పెద్దలకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఓ డిఫరెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాం. మేం వచ్చింది ఆంధ్రా ప్రాంతం నుంచే అయినా మాకు తెలంగాణ వంటలంటే ఎంతో ఇష్టం. హైదరాబాదీ కల్చర్‌పై మమకారం ఎక్కువ. తెలంగాణ స్నేహితులే ఎక్కువ. వారితో సాన్నిహిత్యం బాగా పెరిగింది. గుంటూరులో షురువై.. వివేక్ ఆత్రేయ: మాది గుంటూరు. తమిళనాడులోని శాస్త్రి యూనివర్సిటీలో బీటెక్ చేశా. అప్పుడే కొంత మందిమి జట్టుగా ఏర్పడి షార్ట్ఫిలింస్ చేశాం. కావ్యం అనే షార్ట్‌ఫిలింకి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఐబీఎంలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. జాబ్‌లో జాయిన్ అయినా ఎక్కడో ఏదో వెలితి అనిపించింది. జాబ్ మానేసి హైదరాబాద్ వచ్చేశా. కథలను రాసి యువ హీరోలతో పాటు నిర్మాతలను వినిపించడం మొదలుపెట్టా. భిన్నమైన కథతో వచ్చాను నేను రాసిన కథతో నిర్మాత రాజ్ కందుకూరిని కలిశాను. అప్పటికే ‘పెళ్లిచూపులు’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ‘మెంటల్ మదిలో’ కథ చెప్పాను. ఆయనకు అది బాగా నచ్చింది. శ్రీవిష్ణుని రికమెండ్ చేశారు. శ్రీ విష్ణుని కలిశాక ‘మెంటల్ మదిలో’ హీరో కన్‌ప్యూజ్డ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా రెప్లికాలా అనిపించాడు. అతనికీ కథ బాగా నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. కథలోలీనమయ్యా.. శ్రీవిష్ణు: వివేక్ వచ్చి కలిసి కథ చెప్పడం మొదలుపెట్టాక. కథలో లీనమైపోయా. చాలా సూపర్బ్‌గా అనిపించింది. కానీ చెప్పిన విధంగా సినిమా తీస్తాడా అని కొద్దిగా భయం. అయితే, అతడిలో కాన్ఫిడెన్స్ కనిపించింది. చాలామంది నన్ను రిజర్వ్డ్ పర్సన్ అని అంటుంటారు. కానీ నేను అలా కాదు. వివేక్ కథ చెప్పాడు. ఈ కథ నీకే సూటవుతుందన్నాడు. అంతే సినిమా చకచకా సాగిపోయింది. 2017లో వచ్చిన ఈ పిక్చర్ మదిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాలో కాన్ఫిడెంట్ రెట్టింపు చేసింది. టీంవర్క్‌తో విజయం సాధించాం వివేక్ ఆత్రేయ: నేను బీటెక్ చేస్తున్న సమయంలో మేము సెట్ అయిన టీం.. మా జూనియర్స్ కలిసి టీంగా ఏర్పడ్డాం. అందులో చాలా మంది మంచి జాబ్స్ వదులుకొని వచ్చారు. సినిమా రిలీజ్‌కి దగ్గలో ఉన్నా సినిమాకి సంబంధించిన వర్క్ చాలా ఉంది. టీమంతా కష్టపడటంతో ‘బ్రోచేవారెవరురా’ చిత్రం విజయాన్ని నమోదు చేసుకుంది. చాలామంది ఫోన్లు చేసి అభినందించారు. అల్లు అర్జున్, వెంకటేష్, నాగచైతన్య, అడవిశేషు, సుప్రియల అభినందనలు ఆనందాన్నిచ్చాయి. -
ఇది సమష్టి విజయం
‘‘బ్రోచేవారెవరురా’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇందులో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ఇది మా టీమ్ సమష్టి కృషితో సాధించిన విజయం’’ అన్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్‌కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ‘‘సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది’’ అని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘థాంక్స్ మీట్’లో విజయ్‌కుమార్ మన్యం మాట్లాడుతూ –‘‘మా సినిమా చూసి ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కేటీఆర్‌గారు, సురేశ్‌బాబుగారు, వెంకటేశ్‌గారు, నానిగారు, అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్, రామ్.. ఇలా మా సినిమా గురించి మంచి మాటలు చెప్పిన అందరికీ థ్యాంక్స్. మంచి కలెక్షన్లు, మంచి ఓపెనింగ్స్ రావడానికి మంచి రివ్యూలు దోహదపడ్డాయి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసి సురేష్‌బాబుగారు బావుందన్నారు. ప్రీ రిలీజ్‌కి రామ్‌గారు, రోహిత్‌గారు వచ్చారు. దానివల్ల అందరికీ రీచ్ అయింది. ముందు రోజు నానిగారు చూసి బావుందని చెప్పడంతో అందరూ థియేటర్లకు వచ్చి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
నా నటనలో సగం క్రెడిట్ అతనిదే
‘‘సినిమా రిలీజైన తర్వాత తెలుస్తుంది.. మనం చిన్న సినిమా చేశామా? పెద్ద సినిమా చేశామా? అని. ‘మెంటల్ మదిలో’ సినిమా చూశా. వివేక్ ఆత్రేయ చాలా బాగా తీశాడు. ఇలాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్‌కి ‘బ్రోచేవారెవరురా’ సినిమాకి మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు’’ అన్నారు హీరో రామ్. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రామ్ మాట్లాడుతూ– ‘‘నిన్నుకోరి’లో తొలి షాట్ చూసిన తర్వాత నివేదా మంచి నటి అని తెలిసింది. వివేక్ మ్యూజిక్ బావుంటుంది. నా ఫేవరేట్ లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి. ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలో ‘తదుపరి జన్మకైనా...’ పాట రాశారు. ఈ సినిమాకి కూడా మంచి పాటలు రాశారు. శ్రీవిష్ణుని ఫస్ట్ టైమ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ టైమ్‌లో కలిశా. ఆ సినిమాలో నా నటనలో సగం క్రెడిట్ శ్రీవిష్ణుదే. తను చాలా మంచి నటుడు. నాకు నటన నేర్పించిన అరుణ భిక్షుగారు ఈ చిత్రానికి చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలు తీయగానే సురేష్ బాబుగారిలాంటి వాళ్లు ఇన్వాల్వ్ అయి సపోర్ట్ చేస్తున్నారు.. ఇందుకు చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్‌గారికి వీరాభిమానిని. ఈ సినిమాలో నేను ఆయన ఫ్యాన్‌గా చేయడం ఆనందంగా ఉంది. ‘బ్రోచేవారెవరురా’ కథని వివేక్ ఆత్రేయ చెప్పినప్పుడు చాలా నచ్చింది. మిత్ర పాత్రలో నివేదా బాగా నటించారు. ఆ పాత్రకోసం, కేవలం మహిళల కోసం ఈ సినిమా చేశా’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు సురేష్ బాబు. ‘‘మహిళలు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నివేదా థామస్. ‘‘విజువల్‌గా సినిమా రిచ్‌గా ఉంటుంది’’ అన్నారు విజయ్ కుమార్ మన్యం. ‘‘ఈ చిత్రం గురించి నేను మాట్లాడటం కన్నా సినిమా చూస్తేనే మంచిది’’ అన్నారు వివేక్ ఆత్రేయ. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నా’’ అన్నారు నారా రోహిత్.