
శ్రీవిష్ణు హీరోగా...
‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనుంది. సినిమా ప్రమోషన్ రంగంలో పేరు తెచ్చుకున్న ఆర్.కె. మీడియా అధినేత రవికుమార్ పనస, హాంకాంగ్‌కు చెందిన హౌస్‌ఫుల్ మూవీస్ ఇండియా ప్రై. లిమిటెడ్‌తో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. దర్శకుడు మదన్ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన వేణు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఓ ప్రముఖ కథానాయిక నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ యువన్, కెమెరా: విజయ్ సి. కుమార్.