Sri Vishnu Bhala Thandanana Movie Release On April 30th, Other Deets Here - Sakshi
Sakshi News home page

Sri Vishnu Movie: ‘భళా తందనాన’ మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మేకర్స్‌

Published Sat, Apr 23 2022 8:15 AM | Last Updated on Sat, Apr 23 2022 9:32 AM

Sri Vishnu Bhala Thandanana Movie Release On April 30th - Sakshi

Sri Vishnu Bhala Thandanana Movie Release Date Lock: శ్రీవిష్ణు, కేథరిన్‌ థ్రెసా జంటగా నటించిన చిత్రం ‘భళా తందనాన’. ‘బాణం’ సినిమా ఫేమ్‌ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. 

చదవండి: కార్తీకేయతో జతకట్టిన ‘డిజే టిల్లు’ హీరోయిన్‌

‘‘కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘భళా తందనాన’. మా సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. వేసవి సెలవులు, మే 3న రంజాన్‌ పండగను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30న మా చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని నిర్ణయించాం. మణిశర్మ సంగీతం అందించిన మా సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. పీటర్‌ హెయిన్‌ యాక్షన్‌ స్టంట్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. రామచంద్రరాజు, శ్రీనివాస్‌ రెడ్డి, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ రగుతు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement