Bhala Thandanana Movie
-
ఆర్ఆర్ఆర్, ఆచార్య.. ఫ్రైడే స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలేంటంటే?
స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అటు బాక్సాఫీస్ కూడా బాగానే కలెక్షన్లు దండుకుంటోంది. అయితే థియేటర్లను రఫ్ఫాడించేసిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే వసూళ్లు రాబట్టిన చిత్రాలు సైతం ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇంతకీ ఈరోజు(మే 20) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో చూసేయండి.. ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సినీవర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించిన ఈ చిత్రం తాజాగా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట రూ.100 కడితేనే ఈ సినిమా చూడనిస్తామంది జీ 5. ఈ నిర్ణయంపై అభిమానులు భగ్గుమనడంతో వెనక్కు తగ్గిన సదరు ఓటీటీ సంస్థ తమ సబ్స్క్రైబర్లు ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఒక్క హిందీ వర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఆచార్య చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన మల్టీస్టారర్ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలైంది. ఓ మోస్తరు కలెక్షన్లతో పర్వాలేదనిపించిన ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. భళా తందనాన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం భళా తందనాన. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో 15 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది. జెర్సీ నాని నటించిన హిట్ మూవీ జెర్సీ అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 22న థియేటర్లలో రిలీజైంది. ఇవేకాకుండా 12th మ్యాన్, ఎస్కేప్ లైవ్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుండగా జాంబీవ్లి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరింకెందుకాలస్యం. నచ్చిన సినిమాను ఇప్పుడే వీక్షించేయండి.. చదవండి 👇 ఓ వైపు చెల్లి పెళ్లి, మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ బిగ్‌బాస్ ఓటీటీ విజేతగా బిందు, రన్నర్‌గా అఖిల్! -
ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు..
Upcoming Movies Web Series Release Theatre OTT May 2nd Week: థియేటర్లలో పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు చేసిన రచ్చను 'సర్కారు వారి పాట' కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు సందడి చేశాయి. ఈ క్రమంలో ఈ వారం ఏ సినిమాలు అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పెద్ద సినిమాలు ఏవి థియేటర్లలో అడుగుపెట్టట్లేదు. చిన్న సినిమాలు మాత్రం ఈ వారం సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో లుక్కేద్దామా ! 1. శేఖర్ యాంగ్రీ ఎంగ్ మ్యాన్ రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. మలయాళంలో విజయం సాధించిన 'జోసేఫ్' సినిమాకు రీమేక్‌గా రానుంది. మనసున్న ప్రతి ఒక్కరికీ 'శేఖర్' నచ్చుతాడని, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని డైరెక్టర్ జీవిత ఆదివారం ప్రెస్ మీట్లో తెలిపారు. 2. ధగడ్ సాంబ నవ్వులు పంచేందుకు రెడీ అయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సంపూ, సోనాక్షి జంటగా నటించిన చిత్రం ధగడ్ సాంబ. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఎన్ఆర్ రెడ్డి డైరెక్టర్. 'సంపూర్ణేష్ బాబును ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో చూస్తారు. అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా మూవీ ఉంది.' అని చిత్ర యూనిట్ పేర్కొంది. 3. ధాకడ్ బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఏజెంట్ అగ్నిగా 'ధాకడ్' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే యాక్షన్ సీన్స్‌తో అదరిపోయింది. మరీ ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే. 4. భూల్ భులయా 2 హారర్, కామెడీ నేపథ్యంలో వస్తున్న హిందీ చిత్రం 'భూల్ భులయా 2'. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియరా అడ్వాణీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ డైరెక్షన్ చేశారు. టబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకులను భయంతో నవ్వించనుంది. ఓటీటీలో.. మే 20న ఓటీటీలో ఆర్ఆర్ఆర్, ఆచార్య, భళా తందనాన, 12th మ్యాన్, ఎస్కేప్ లైవ్, జాంబీవ్లీ చిత్రాలు, పంచాయత్ సీజన్ 2, నైట్ స్కై సీజన్ 1 వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. 1. ది ఇన్విజబుల్ మ్యాన్- మే 16 (నెట్‌ఫ్లిక్స్) 2. ది హంట్- మే 16 (నెట్‌ఫ్లిక్స్) 3. వూ కిల్డ్ సారా సీజన్ 3- మే 18 (నెట్‌ఫ్లిక్స్) 4. హనీమూన్- మే 20 (వూట్) చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌కు జీ5 షాక్.. సినిమాకు డబ్బులు చెల్లించాల్సిందే ! రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఫొటోలు వైరల్ -
ఓటీటీలో సినిమాల జాతర.. ఈ శుక్రవారం 13 చిత్రాలు
OTT Releases: 13 Upcoming Movies Web Series On May 20 2022: మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు థియేటర్లలో సందడి చేయగా, ప్రస్తుతం సర్కారు వారి పాట అలరిస్తోంది. ఇదిలా ఉంటే థియేటర్లలో ప్రతి వారం ఏదో ఒక సినిమా సందడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. కరోనా, లాక్డౌన్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల సందడి నెలకొంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ చిత్రాలు అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే శుక్రవారం (మే 20) ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో థియేటర్లలో విడుదలైన మూవీస్తోపాటు నేరుగా ఓటీటీల్లోకి రిలీజ్ అవుతున్నాయి. మరీ ఆ సినిమాలేంటో చూద్దామా ! 1. 12th మ్యాన్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2. ఎస్కేప్ లైవ్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 3. ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం..)- జీ5 4. ఆచార్య- అమెజాన్ ప్రైమ్ వీడియో 5. భళా తందనాన- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 6. జాంబీవ్లి- జీ5 7. చిప్ అండ్ డేల్: రెస్క్యూ రేంజర్స్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 8. పంచాయత్ (సీజన్ 2)- అమెజాన్ ప్రైమ్ వీడియో 9. మై నెక్స్ట్ గెస్ట్- నెట్‌ఫ్లిక్స్ 10. లవ్ డెత్ రోబోట్స్- నెట్‌ఫ్లిక్స్ 11. ది లాడ్జ్- నెట్‌ఫ్లిక్స్ 12. జాకస్ 4.5- నెట్‌ఫ్లిక్స్ 13. నైట్ స్కై సీజన్ 1- అమెజాన్ ప్రైమ్ వీడియో చదవండి: OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటీటీకి శ్రీవిష్ణు ‘భళా తందనాన’, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Bhala Thandanana Streaming On Disney Plus Hotstar: యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఎందుకంటే అతడు ఎంచుకునే కథలు, మూవీ టైటిల్స్ కాస్తా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దీంతో అతడి సినిమాల్లో ఓ మెసెట్ ఉంటుందని ప్రేక్షకుడి అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా నటించిన మూవీ ‘భళా తందనాన’. మే 6న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. చదవండి: కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు డిస్నీప్లజ్ హాట్‌స్టార్ ఈ సినిమా విడుదల కానుందని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. మే 20 నుంచి ఈ మూవీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్. వెండితెరపై పెద్ద ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్‌పై ఏంతమేర ఆకట్టుకుందో చూడాలి. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. Bhala re Bhala! Mee screen ki vachestundi #BhalaThandhanana #BhalaThandanaOnHotstar@sreevishnuoffl @CatherineTresa1 @chaitanyahead @SaiKorrapati_ #manisharma @SrikanthVissa @dopsureshragutu #GarudaRam #MarthandVenkatesh @PeterHeinOffl @VaaraahiCC @MangoMusicLabel pic.twitter.com/rnETXyzBrR — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 13, 2022 -
భళా తందనాన మూవీ రివ్యూ
టైటిల్: భళా తందనాన నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్, గరుడ రామ్, పొసాని కృష్ణమురళి, సత్య తదితరులు దర్శకుడు: చైతన్య దంతులూరి కథ, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా సంగీతం: మణిశర్మ బ్యానర్: వారాహి చలనచిత్రం నిర్మాత: రజనీ కొర్రపాటి సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్ విడుదల తేది: మే 6, 2022 కొత్తదనం అంటే చాలు రంకెలేస్తాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. డిఫరెంట్ కాన్సెప్టులకు తివాచీ పరుస్తాడు. సినిమా హిట్టా? ఫట్టా అని కాకుండా అది ప్రేక్షకుడి మనసును హత్తుకుందా? లేదా? అన్నదాని మీదే ఎక్కువగా దృష్టి పెడతాడు. అంతేకాదు, తెలుగు భాషపై మమకారంతో తన సినిమాలన్నింటికీ దాదాపు తెలుగు టైటిల్స్ ఉండేలా చూసుకుంటాడు. అలా అన్నమయ్య కీర్తనలో ఉన్న భళా తందనానా అనే పదాన్ని తీసుకుని అదే టైటిల్‌తో సినిమా చేశాడు. ‘బాణం’ఫేం చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు శ్రీవిష్ణు. మరి ఈ మూవీ శ్రీవిష్ణుకి విజయాన్ని అందించిందా? తన సినిమాతో ప్రేక్షకుడికి కొత్తదనం పంచాడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. భళా తందనాన కథేంటంటే.. శశిరేఖ(కేథరిన్) ఓ మీడియా సంస్థలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది. ఓ అనాథాశ్రమంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకొని.. ఆ న్యూస్ కవర్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ అనాథాశ్రమ అకౌంటెంట్ చందు అలియాస్ చంద్రశేఖర్(శ్రీవిష్ణు)తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు దగ్గరయ్యే క్రమంలో సిటీలో వరుస హత్యలు జరుగుతాయి. హత్యకు గురైన వారంతా హవాలా కింగ్ ఆనంద్ బాలి(గరుడ రామ్) మనుషులు కావడంతో.. ఈ కేసుని సీరియస్ తీసుకొని స్టడీ చేస్తుంది శశిరేఖ. ఈ క్రమంలో ఆనంద్ బాలి దగ్గర ఉన్న రూ.2000 కోట్ల హవాలా మనీ ఎవరో దొంగిచించారనే విషయం తెలుస్తుంది. ఈ వార్తను తన మీడియా సంస్థలో ప్రచురించి ప్రపంచానికి తెలియజేస్తుంది శశిరేఖ. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంతకీ రూ.2000 కోట్లను దొంగిలించిదెవరు? ఈ దొంగతనం కేసుతో చందుకి ఉన్న సంబంధం ఏంటి?అనేదే మిగతా కథ ఎలా ఉందంటే.. బాణం, బసంతి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న చైతన్య దంతులూరి.. చాలా గ్యాప్ తర్వాత క్రైమ్ థ్రిల్లర్ కథతో ‘భళా తందనాన’ తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్‌కి కామెడీ, ప్రేమను యాడ్ చేసి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే సినిమాకు కాస్త మైనస్ అయింది. కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఉత్కంఠ రేకెత్తించే సీన్స్ ఉన్నప్పటికీ.. కామెడీ, లవ్ ట్రాక్ కారణంగా రొటీన్ సినిమాగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఓ కిడ్నాప్ జరగడం..దానిని కనెక్ట్ చేస్తూ అసలు కథను ప్రేక్షకులకు చెప్పడంతో దర్శకుడు సఫలమయ్యాడు. వరుస హత్యలు.. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. పాట రూపంలో హీరో చెప్పే లవ్ ఫెయిలర్ స్టోరీ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథంతా రూ. 2000 కోట్ల హవాలా మనీ చుట్టే తిరుగుతుంది. ఆ డబ్బుతో చందుకు ఉన్న సంబంధం ఏంటి? అది ఎక్కడా దాచారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుడికి కలుగుతుంది. క్లైమాక్స్ కొత్తగా ఉన్నప్పటికీ.. సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అసలు హీరో ఎవరు? అతని గతం ఏంటి? రూ. 2000 కోట్లు ఎక్కడ దాచాడు? అనే విషయాలను తెలియజేయకుండా.. రెండో భాగం ఉందని చెప్తూ కథని ముగించాడు. ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా.. క్లీన్ ఎంటర్టైనర్గా సినిమా సాగుతుంది. ఎవరెలా చేశారంటే... ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు తన పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో అమాయక చక్రవర్తిగా, సెకండాఫ్‌లో ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా తనదైన నటనతో మెప్పించాడు. గత సినిమాలతో పోలిస్తే.. ఇందులో శ్రీవిష్ణు నటనలో పరిణితి కనిపించింది. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ మెప్పించే ప్రయత్నం చేసింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేథరిన్.. తెరపై కాస్త బొద్దుగా కనిపించింది. ఇక ఈ సినిమాకు ఆమే డబ్బింగ్ చెప్పుకుంది. అయితే అది కాస్త నప్పలేదు. ‘మేడమ్ మీరు మాట్లాడే తెలుగు.. ఇంగ్లీష్‌లా ఉంటుంది’అని హీరోతో ఓ డైలాగ్ చెప్పించి.. ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇక విలన్‌గా గరుడ రామ్ మెప్పించాడు. అయితే అతనికి బలమైన సీన్స్ లేకపోవడం మైనస్. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న దయామయం పాత్రలో పొసాని కృష్ణమురళి ఒదిగిపోవడమే కాకుండా..తనదైన కామెడీతో నవ్వించాడు. ఫస్టాఫ్‌లో సత్యతో వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. మిగిలిన నటీనటులు తమ, తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధానబలం మణిశర్మ సంగీతం.తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ ఇస్తాను- హీరో శ్రీవిష్ణు
‘అన్నమయ్య ఎన్నో కీర్తనలు రాశారు. అందులో‘దనానా భళాతందనానా’ ఒక్కటే విప్లవాత్మకమైన కీర్తన. ప్రకృతితో పాటు మనిషికి డబ్బు, కులం, మతం వంటి అంశాలు చర్చిస్తూ రాసిన ఈ గీతం చాలా హైలెట్ అయింది. మా కథకు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందనే మా చిత్రానికి ‘భళా తందనాన’అనే టైటిల్ పెట్టామని చెప్పారు హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా, కేథరిన్ థ్రెసా హీరోయిన్గా నటించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. మే 6 న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హీరో శ్రీవిష్ణు మీడియాతో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.ఆవెంటో ఆయన మాటల్లోనే.. ► చైతన్యతో నాకు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. ఈ కథను నాకు బాణం(2009) సినిమా అప్పుడే చెప్పారు. బసంతి టైంలో ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికీ పూర్తిగా కథ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత తను బిజీ అయ్యాడు నేను బిజీ అయ్యాను. నాలుగేళ్ళు తర్వాత కథకు ఒక రూపం రావడంతో బాగా నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. చైతన్యకు అన్ని శాఖలపై పట్టు వుంది. తను సెట్లో మోనిటర్ చూడరు. నాకు మొదట్లో అదే అనుమానం వచ్చి అడిగాను. నాకు ఫ్రేమ్ ఎలా వుందో, లైటింగ్ ఎట్లా పెట్టారో, నటీనటులు హావభావాలు అన్నీ నేను చెప్పినట్లే వస్తుంటాయి. అప్పడు మోనిటర్‌తో పనేంటి? అనేవారు. మొదటి సినిమాకే ఆయన అంత క్లారిటీగా వుండడంతో ఆయన ఆలోచన విధానం బాగా నచ్చింది. అందుకే ఆయనతో పనిచేయడం హ్యాపీగా అనిపించింది. ► ఈ సినిమాలో ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా ఉంటుంది. కేజీయఫ్ వంటి అంత పెద్ద సినిమాలో చేసిన ఆయన నా సినిమాలో చేయడం చాలా గొప్పగా ఉంది. ఆయనతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాను నిలబెడతాయి. ఒక అరుదైన కొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తారు. ► ఇది సస్పెన్స్ థ్రిల్లర్, ఇంటెన్సివ్ కథ. చాలా బాగుంటుంది. ఈ సినిమా చెప్పగానే నేను చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇందులో చాలా ఫన్ ఉంటుంది. ► ఈ చిత్రంలో నేను కామన్ మ్యాన్ గానటించాను. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ నటించింది. కామన్ మ్యాన్ గా చాలా చేయాలి అనుకుంటాం, కానీ చేయలేం. ఆ సందర్భంలో ఈ జర్నలిస్టు సహకారంతో తీసుకుంటే ఎలా వుంటుంది అనేది నా పాత్ర. ఆ ప్రాసెస్ లో చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ► కేథరిన్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె నాతో కంటే మిగిలిన చాలా పాత్రలతో కనెక్ట్ కావడంతో ఆమె నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర అది. ఆమె కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది. ► ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బీజియమ్స్ చాలా ఇంపార్టెంట్. మణిశర్మ చక్కటి బాణీలతోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా ఇచ్చారు ఇలాంటి సినిమాలకి సౌండ్ అనేది చాలా కీలకం. ఆ సౌండ్ విని చాలా మంది మళ్లీ మళ్లీ రావాలి అనిపించేటట్లుగా ఆయన మలిచారు ఇందులో. కొత్త బీజియమ్ మనం వింటాం. పాటలు కూడా సందర్భానుసారంగా ఉంటాయి ► ఇప్పటి వరకు నాకు సెన్సేషనల్ హిట్ అనేది లేదు. అయితే ఇప్పుడే మంచి మంచి కథలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో మాత్రం సెన్సేషనల్ హిట్ ఒకటి ఇస్తాను. ► ప్రస్తుతం అల్లూరి అనే సినిమా చేస్తున్నా. పోలీసు ఆఫీసర్ బయోపిక్. ఈ సినిమాతో మంచి హిట్ ఇవ్వగలననే నమ్మకముంది. -
‘భళా తందనాన’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఒకే రోజు ముచ్చటగా 3 సినిమాలు.. దేనికి ఆడియెన్స్ ఓటు !
Upcoming Telugu Movies On May 6 2022: మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, నిన్నటిదాకా నేడు కేజీఎఫ్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఈ శుక్రవారం (ఏప్రిల్ 29) కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య విడుదలైంది. ఇక సినీ ప్రియులు, సినిమా నిర్మాతల దృష్టి వచ్చే శుక్రవారం పడింది. అంటే మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముచ్చటగా మూడు చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దామా ! మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా చేసిన ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. మూడు పదుల వయసులో వివాహం అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. యాంకర్‌గా బాగా రాణిస్తున్న సుమ కనకాల నటించిన సినిమా 'జయమ్మ పంచాయతీ'. గ్రామీణ నేపథ్యంతో సాగే కథతో వస్తున్న ఈ 'జయమ్మ పంచాయతీ' ఎంటో మే 6న తెలియనుంది. ఇక శ్రీవిష్ణు హీరోగా, కేథరీన్ త్రేసా హీరోయిన్గా వస్తున్న చిత్రం 'భళా తందనాన'. వారాహి బ్యానర్‌పై చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ 1 ఫేమ్ గరుడ రామ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచారు. ఈ మూవీ కూడా తన సత్తా చాటేందుకు మే 6 తేదినే ఎంచుకుంది. ఈ మూడు చిత్రాల్లో ప్రజలు ఎక్కువగా ఏ సినిమాను ఆదరిస్తారో చూడాలి. చదవండి: తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్.. అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
శ్రీ విష్ణు మూవీ వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘భళా తందనాన’. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించారు. మే 6వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ థ్రెసా నటించింది. ‘బాణం’ సినిమా ఫేమ్ చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. -
శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
Sri Vishnu Bhala Thandanana Movie Release Date Lock: శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా జంటగా నటించిన చిత్రం ‘భళా తందనాన’. ‘బాణం’ సినిమా ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చదవండి: కార్తీకేయతో జతకట్టిన ‘డిజే టిల్లు’ హీరోయిన్ ‘‘కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భళా తందనాన’. మా సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. వేసవి సెలవులు, మే 3న రంజాన్ పండగను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30న మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించాం. మణిశర్మ సంగీతం అందించిన మా సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు. -
భళా తందనాన: లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు!
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం భళా తందనాన. శుక్రవారం(జనవరి 28న) ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. 'రాక్షసులను చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి. నేను మామూలు మనిషిని....' అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. 'నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్‌కు కూడా రిస్కే', 'ఈ రోజుల్లో లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు' అన్న డైలాగులు బాగా పేలాయి. ఇక ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. -
Bhala Thandanana: శ్రీవిష్ణు లుక్ అదిరిందిగా!
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘భళా తందనాన’ చిత్రీకరణ పూర్తయింది. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించారు. కేథరిన్ థ్రెసా హీరోయిన్గా నటించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో శ్రీ విష్ణుని ఇప్పటిదాకా చూడని డిఫరెంట్ లుక్‌లో చూపించనున్నారు చైతన్య. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్‌లకు కొదవే ఉండదు. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రతినాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్ర రాజు రోల్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేష్ రగుతు.