యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం భళా తందనాన. శుక్రవారం(జనవరి 28న) ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది.
'రాక్షసులను చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి. నేను మామూలు మనిషిని....' అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. 'నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్‌కు కూడా రిస్కే', 'ఈ రోజుల్లో లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు' అన్న డైలాగులు బాగా పేలాయి. ఇక ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్‌గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment