రాజ రాజ చోర: మందు గ్లాసు పట్టుకున్న గంగవ్వ, శ్రీవిష్ణు | Sree Vishnu Movie Raja Raja Chora Teaser Out Now | Sakshi
Sakshi News home page

రాజ రాజ చోర టీజర్‌ వచ్చేసింది, బహుపరాక్‌!

Published Fri, Jun 18 2021 1:44 PM | Last Updated on Fri, Jun 18 2021 2:33 PM

Sree Vishnu Movie Raja Raja Chora Teaser Out Now - Sakshi

డిఫరెంట్‌ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. ఆయన తాజాగా నటించిన చిత్రం రాజ రాజ చోర. మేఘా ఆకాశ్‌, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టిజి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. ఇందులో శ్రీవిష్ణు, బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వ మందు గ్లాసు పట్టుకుని కనిపించారు. తనో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని చెప్పిన హీరో నిజానికి దొంగతనం చేస్తాడన్నట్లుగా చూపించారు. ఇందులో కామెడీకి కూడా ఎటువంటి ఢోకా లేనట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో గంగవ్వతోపాటు తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్‌ అయ్యంగార్, అజయ్‌ ఘోష్, వాసు, ఇంటూరి తదితరులు నటించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చారు.

చదవండి: పాపం 'గాలి సంపత్‌' అప్పుడే ఓటీటీ బాట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement