శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘భళా తందనాన’ చిత్రీకరణ పూర్తయింది. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించారు. కేథరిన్ థ్రెసా హీరోయిన్‌గా నటించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో శ్రీ విష్ణుని ఇప్పటిదాకా చూడని డిఫరెంట్ లుక్‌లో చూపించనున్నారు చైతన్య. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్‌లకు కొదవే ఉండదు. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రతినాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్ర రాజు రోల్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేష్ రగుతు.
Comments
Please login to add a commentAdd a comment