Sree Vishnu Talk About Bhala Thandanana Movie Full Deets Inside - Sakshi
Sakshi News home page

Bhala Thandanana: అరుదైన కొత్త క్లైమాక్స్ చూస్తారు : శ్రీవిష్ణు

Published Thu, May 5 2022 5:42 PM | Last Updated on Thu, May 5 2022 6:53 PM

Sree Vishnu Talk About Bhala Thandanana Movie - Sakshi

‘అన్నమయ్య ఎన్నో కీర్తనలు రాశారు. అందులో‘దనానా భళాతందనానా’ ఒక్కటే విప్లవాత్మకమైన కీర్తన. ప్రకృతితో పాటు మనిషికి డబ్బు, కులం, మతం వంటి  అంశాలు చర్చిస్తూ రాసిన ఈ గీతం చాలా హైలెట్ అయింది. మా కథకు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. ప్రతి ఒక్కరికి రీచ్‌ అవుతుందనే మా చిత్రానికి ‘భళా తందనాన’అనే టైటిల్‌ పెట్టామని చెప్పారు హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా, కేథరిన్ థ్రెసా హీరోయిన్‌గా నటించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. మే 6 న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హీరో శ్రీవిష్ణు మీడియాతో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.ఆవెంటో ఆయన మాటల్లోనే..

► చైతన్యతో నాకు 14 ఏళ్లుగా పరిచయం ఉంది.  ఈ కథను నాకు బాణం(2009) సినిమా అప్పుడే చెప్పారు. బసంతి టైంలో ఓ సినిమా చేద్దాం అనుకున్నాం.  కానీ అప్పటికీ పూర్తిగా కథ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత తను బిజీ అయ్యాడు నేను బిజీ అయ్యాను. నాలుగేళ్ళు తర్వాత కథకు ఒక రూపం రావడంతో బాగా నచ్చి  ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. చైతన్యకు అన్ని శాఖలపై పట్టు వుంది. తను సెట్లో మోనిటర్ చూడరు. నాకు మొదట్లో అదే అనుమానం వచ్చి అడిగాను. నాకు ఫ్రేమ్ ఎలా వుందో, లైటింగ్ ఎట్లా పెట్టారో, నటీనటులు హావభావాలు అన్నీ నేను చెప్పినట్లే వస్తుంటాయి. అప్పడు మోనిటర్‌తో పనేంటి? అనేవారు. మొదటి సినిమాకే ఆయన అంత క్లారిటీగా వుండడంతో ఆయన ఆలోచన విధానం బాగా నచ్చింది. అందుకే ఆయనతో పనిచేయడం హ్యాపీగా అనిపించింది.

► ఈ సినిమాలో ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా ఉంటుంది. కేజీయఫ్‌ వంటి అంత పెద్ద సినిమాలో చేసిన ఆయన నా సినిమాలో చేయడం చాలా గొప్పగా ఉంది. ఆయనతో వచ్చే ఫైట్ సీక్వెన్స్  సినిమాను నిలబెడతాయి. ఒక అరుదైన కొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తారు.

► ఇది  సస్పెన్స్ థ్రిల్లర్, ఇంటెన్సివ్ కథ. చాలా బాగుంటుంది. ఈ సినిమా చెప్పగానే నేను చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇందులో చాలా  ఫన్ ఉంటుంది.

► ఈ చిత్రంలో నేను కామన్ మ్యాన్ గానటించాను. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ నటించింది. కామన్ మ్యాన్ గా చాలా చేయాలి అనుకుంటాం, కానీ చేయలేం. ఆ సందర్భంలో ఈ జర్నలిస్టు సహకారంతో తీసుకుంటే ఎలా వుంటుంది అనేది నా పాత్ర.  ఆ ప్రాసెస్ లో చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది.

► కేథరిన్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె నాతో కంటే మిగిలిన చాలా పాత్రలతో కనెక్ట్ కావడంతో ఆమె నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర అది. ఆమె కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది.

► ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బీజియమ్స్ చాలా ఇంపార్టెంట్. మణిశర్మ చక్కటి బాణీలతోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  చక్కగా ఇచ్చారు ఇలాంటి సినిమాలకి సౌండ్ అనేది చాలా కీలకం. ఆ సౌండ్ విని చాలా మంది మళ్లీ మళ్లీ రావాలి అనిపించేటట్లుగా ఆయన మలిచారు ఇందులో. కొత్త బీజియమ్ మనం వింటాం. పాటలు కూడా సందర్భానుసారంగా ఉంటాయి

► ఇప్పటి వరకు నాకు  సెన్సేషనల్ హిట్ అనేది లేదు.  అయితే ఇప్పుడే మంచి మంచి కథలు వస్తున్నాయి.  ఈ ఏడాదిలో మాత్రం సెన్సేషనల్ హిట్ ఒకటి ఇస్తాను.

► ప్రస్తుతం అల్లూరి అనే సినిమా చేస్తున్నా. పోలీసు ఆఫీసర్ బయోపిక్. ఈ సినిమాతో మంచి హిట్ ఇవ్వగలననే నమ్మకముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement