ట్రంప్‌ సంచలన నిర్ణయం.. హెచ్‌-1బీ వీసాలో మార్పులు | US SAys H-1B visa Applications To Be deleted March 20 | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. హెచ్‌-1బీ వీసాలో మార్పులు

Published Thu, Mar 20 2025 8:41 AM | Last Updated on Thu, Mar 20 2025 10:02 AM

US SAys H-1B visa Applications To Be deleted March 20

వాషింగ్టన్‌: అమెరికాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా హెచ్‌-1బీ వీసా అమలులో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పాత దరఖాస్తులను ఫారిన్‌ లేబర్‌ యాక్సెస్‌ గేట్‌వే(ఫ్లాగ్) డిలీజ్‌ చేస్తోంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం మరో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వారి విషయంలో ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే పలు దేశాల వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు. పలు దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ సైతం విధించారు. ఇక, తాజాగా అమెరికా హెచ్1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇందులో భాగంగానే అమెరికా హెచ్‌-1బీ వీసా అమలులో మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే పాత దరఖాస్తులను ఫారిన్‌ లేబర్‌ యాక్సెస్‌ గేట్‌వే(ఫ్లాగ్) డిలీట్‌ చేస్తోంది. త్వరలోనే వీసాల జారీ కోసం యూఎస్‌ ఇమిగ్రేషన్‌ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ సర్కారు వెల్లడించింది. అందుకే, పాత రికార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం కొత్త వ్యవస్థను యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ప్రవేశపెట్టనుంది.

తాజా ఆదేశాల ప్రకారం.. మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్‌ నుంచి తొలగించనున్నారు. అంటే.. ఉదాహరణకు ఓ దరఖాస్తుకు సంబంధించిన 2020 మార్చి 22న తుది నిర్ణయం వెలువడి ఉంటే.. ఈ ఏడాది మార్చి 22న దాని రికార్డులను తొలగిస్తారు. హెచ్‌-1బీ సహా అన్ని తాత్కాలిక లేబర్‌ కండిషన్‌ అప్లికేషన్స్‌, శాశ్వత లేబర్‌ సర్టిఫికేట్‌ అఫ్లికేషన్లపై ఈ తొలగింపు ప్రభావం పడనుందని ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ విభాగం నోటీసులు జారీ చేసింది.

ఇక, ఫారిన్‌ లేబర్‌ యాక్సెస్‌ గేట్‌వే(ఫ్లాగ్) అనేది అమెరికాలో కార్మికులకు సహాయపడే పోర్టల్‌. ఇదిలా అమెరికా, విదేశీ కార్మికులకు రక్షణ కల్పిస్తుంది. ఈ పోర్టల్‌లో H-1B, H-1B1, H-2A, H-2B, E-3 వీసాలు, శాశ్వత కార్మిక ధృవీకరణ దరఖాస్తులు సేవ్‌ చేసి ఉంటాయి. ఇక, ట్రంప్‌ నిర్ణయంతో గత ఐదేళ్లకు ముందుగా సేవ్‌ చేయబడిన దరఖాస్తులను ఈరోజు రాత్రి నుంచి తొలగించనున్నట్టు కార్మిక శాఖ ఉపాధి మరియు శిక్షణ పరిపాలన, విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం (OFLC) తెలిపింది. ఉద్యోగులకు సంబంధించి ఐదు సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement