Bhala Thandanana Movie Streaming On Disney Plus Hotstar From May 20th - Sakshi

Bhala Thandanana OTT Release: ఓటీటీకి శ్రీవిష్ణు ‘భళా తందనాన’, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

May 13 2022 1:42 PM | Updated on May 13 2022 3:22 PM

Bhala Thandanana Movie Streaming On Disney Plus Hotstar From May 20th - Sakshi

Bhala Thandanana Streaming On Disney Plus Hotstar: యంగ్‌ హీరో శ్రీవిష్ణు సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఎందుకంటే అతడు ఎంచుకునే క‌థ‌లు, మూవీ టైటిల్స్‌ కాస్తా విభిన్నంగా ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయ‌న ఎక్కువ‌గా మొగ్గు చూపుతుంటాడు. దీంతో అతడి సినిమాల్లో ఓ మెసెట్‌ ఉంటుందని ప్రేక్షకుడి అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా నటించిన మూవీ ‘భళా తందనాన’. మే 6న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో ఇప్పుడీ మూవీ డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

చదవండి: కరాటే కల్యాణిపై యూట్యూబర్‌ శ్రీకాంత్‌ సంచలన ఆరోపణలు

డిస్నీప్లజ్‌ హాట్‌స్టార్‌ ఈ సినిమా విడుదల కానుందని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. మే 20 నుంచి ఈ మూవీ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్‌. వెండితెరపై పెద్ద ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం డిజిటల్‌ స్క్రీన్‌పై ఏంతమేర ఆకట్టుకుందో చూడాలి.  ‘బాణం’ ఫేమ్‌ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్‌ హీరోయిన్‌గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement