ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు వీలైనంత త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలానే తెలుగు డిఫరెంట్ మూవీ ఒకటి ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. అదే 'స్వాగ్'. హీరో శ్రీ విష్ణు ఏకంగా ఇందులో నాలుగైదు పాత్రలు పోషించడం విశేషం. ఇంతకీ ఏంటీ ఈ మూవీ స్పెషాలిటీ?
(ఇదీ చదవండి: టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ బెయిల్ రద్దు)
తెలుగులో కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. ఇతడు చేసిన 'రాజరాజచోర' మూవీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా తీసిన హసిత్ గోలి.. మరోసారి శ్రీ విష్ణుతో చేసిన ప్రయోగాత్మక చిత్రం 'స్వాగ్'. స్త్రీ, పురుషుల సమానత్వం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే విషయంలో కాస్త గందరగోళం వల్ల థియేటర్లలో ప్రేక్షకులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు.
ఇప్పుడు ఈ సినిమా కాస్త సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఒకవేళ ఓపిక ఉండి, ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే 'స్వాగ్' ప్రయత్నించండి. ఇందులో శ్రీ విష్ణు పోషించిన హిజ్రా తరహా క్యారెక్టర్ చాలా బాగుంటుంది.
(ఇదీ చదవండి: హడలెత్తించిన నిఖిల్, పృథ్వీ.. కూతురి కోసం హరి కన్నీళ్లు!)
Comments
Please login to add a commentAdd a comment