Swag Movie
-
నీలో... నాలో...
భవ భూతి, రేవతి ప్రేమలో పడ్డారు. ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం... లోలో ఎదలో వినిపించసాగే ఓ తాళం...’ అంటూ పాట అందుకున్నారు. భవ భూతిగా శ్రీవిష్ణు, రేవతిగా మీరా జాస్మిన్ నటించిన చిత్రం ‘శ్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం...’ అంటూ సాగే పాటను శనివారం విడుదల చేశారు.ఈ చిత్రంలో శ్రీవిష్ణు చేసిన నాలుగు పాత్రల్లో భవ భూతి ఒకటి. ఆ పాత్ర సరసనే మీరా జాస్మిన్ కనిపించనున్నారు. ఇక చిత్ర సంగీతదర్శకుడు వివేక్ సాగర్ స్వరపరచిన ఈ పాటకు భువనచంద్ర సాహిత్యం అందించగా రాజేశ్ కృష్ణన్, అంజనా సౌమ్య ఆలపించారు. ‘‘ఈ మెలోడీ ట్రాక్‌లో శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఈ పాట ప్రేక్షకులను 1980, 90లలోకి తీసుకెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో దక్షా నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
కన్ఫ్యూజ్ అవ్వరు: దర్శకుడు హసిత్ గోలి
‘‘మగవారు గొప్పా? ఆడవారు గొప్పా? అనే గొడవ ఎప్పట్నుంచో ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అలాగే లింగ వివక్ష కూడా ఉంది. ఈ రెండింటినీ మేళవించి ఓ కథ రెడీ చేస్తే బాగుంటుందని భావించి, కల్పిత కథగా ‘శ్వాగ్’ సినిమా తీశాం. తరతరాలుగా మగ – ఆడ గొడవలు ఎలా మారుతూ వస్తున్నాయి? అనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం’’ అని దర్శకుడు హసిత్ గోలి అన్నారు. ‘రాజ రాజ చోర’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘శ్వాగ్’. రీతూ వర్మ హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో హసిత్ గోలి పంచుకున్న విషయాలు. ⇒ నాలుగు తరాలకు చెందిన కథ ఇది. ప్రతి తరంలోనూ హీరోగా శ్రీవిష్ణుగారే కనిపిస్తారు. ఒక తరంలో భవభూతిగా, మరో తరంలో యయాతిగా, ప్రస్తుత తరంలో సింగాగా కనిపిస్తారు. కథ, గెటప్స్, క్యారెక్టర్స్ పరంగా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వరు. ఆ విధంగా మంచి స్క్రీన్ ప్లేని తయారు చేశాం. ⇒ శ్రీవిష్ణు గెటప్స్ కోసం ్రపోస్థెటిక్ మేకప్ చేశాం. జాతీయ అవార్డు గ్రహీత రషీద్గారు చాలా కష్టపడ్డారు. మగజాతి ఉనికిని నిలబెట్టే వంశమే శ్వాగణిక వంశమని, అతను లేకపోతే మగవారు అందరూ బానిసలుగానే ఉండిపోతారనేది భవభూతి (శ్రీవిష్ణుపాత్ర) మహారాజు ఫీలింగ్. ఈ వంశానికి అపోజిట్‌లో మాతృస్వామ్యం డామినేటెడ్‌గా ఉంటుంది వింజామర వంశం. ఈ వంశంలో రుక్మిణీ దేవిగా రీతూ వర్మ ఉంటారు. ⇒ ఓ సీరియస్ సబ్జెక్ట్‌నే వినోద పంథాలో చెప్పే ప్రయత్నం చేశాం. ఇంట్రవెల్ ఆడియన్స్‌ని ఆశ్చర్యపరుస్తుంది. సినిమాలో కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. ‘ఏడు తరాల’ నవలకు, మా ‘శ్వాగ్’కు ఏ సంబంధం లేదు. ఇక నా తర్వాతి సినిమాని ఫ్యాంటసీ జానర్లో తీయాలనుకుంటున్నాను. -
ఈ సినిమా చేయాలంటే దమ్ముండాలి: హీరో
‘‘శ్వాగ్’ చాలా గొప్ప కథ. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ ఇలాంటి కథ రాలేదు. ఇది మనందరి ఇళ్లలోని కామన్ పాయింట్ అయినా స్క్రీన్‌పై ఇప్పటి వరకూ రాలేదు. ఇలాంటి కథ నాకు ఇచ్చిన హసిత్కి థ్యాంక్స్. ‘శ్వాగ్’ లాంటి సినిమాలు చేయాలంటే చాలా దమ్ముండాలి.. కథను నమ్మి సినిమా చేసిన విశ్వప్రసాద్‌గారికి కృతజ్ఞతలు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్వాగ్’. రీతూ వర్మ, మీరా జాస్మిన్, సునీల్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో హసిత్ గోలి మాట్లాడుతూ– ‘‘తాతలు, ముత్తాతలతో కలిసి చూడగలిగేలా ఉంటుంది’’ అని తెలిపారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిష్ణు, హసిత్లతో కలసి ‘రాజ రాజ చోర’ సినిమా చేశాను. మా కాంబినేషన్లో ‘శ్వాగ్’ సెకండ్ మూవీ. కమల్‌హాసన్‌గారి ‘ఇంద్రుడు చంద్రుడు’ లాంటి సినిమాలు చూసిన అనుభూతిని ఇస్తుంది’’ అని చెప్పారు.