వెతకక్కర్లేదు.. వచ్చేశాడు! | Sree Vishnu Swag trailer Launch | Sakshi
Sakshi News home page

వెతకక్కర్లేదు.. వచ్చేశాడు!

Published Tue, Oct 1 2024 12:01 AM | Last Updated on Tue, Oct 1 2024 12:01 AM

Sree Vishnu Swag trailer Launch

‘రాజ రాజ చోర’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్‌ గోలి కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘శ్యాగ్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘‘ఈ వంశ ఖజానా వారసుడు దొరకడం అంత సులువు కాదు.. ఈ తరంలో వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు...’, ‘వెతకక్కర్లేదు..వచ్చేశాడు!’, ‘మా వంశాన్ని వెతుక్కుంటూ వచ్చేసరికి ఇంతకాలం పట్టింది’ వంటి డైలాగ్స్‌ ‘శ్యాగ్‌’ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి. రీతూ వర్మ హీరోయిన్ గా, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్‌ నటించిన ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement