నీలో... నాలో... | Sree Vishnu Swag Movie Song Launch | Sakshi
Sakshi News home page

నీలో... నాలో...

Published Sat, Sep 28 2024 4:10 AM | Last Updated on Sat, Sep 28 2024 4:10 AM

Sree Vishnu Swag Movie Song Launch

భవ భూతి, రేవతి ప్రేమలో పడ్డారు. ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం... లోలో ఎదలో వినిపించసాగే ఓ తాళం...’ అంటూ పాట అందుకున్నారు. భవ భూతిగా శ్రీవిష్ణు, రేవతిగా మీరా జాస్మిన్‌ నటించిన చిత్రం ‘శ్వాగ్‌’. హసిత్‌ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం...’ అంటూ సాగే పాటను శనివారం విడుదల చేశారు.

ఈ చిత్రంలో శ్రీవిష్ణు చేసిన నాలుగు పాత్రల్లో భవ భూతి ఒకటి. ఆ పాత్ర సరసనే మీరా జాస్మిన్‌ కనిపించనున్నారు. ఇక చిత్ర సంగీతదర్శకుడు వివేక్‌ సాగర్‌ స్వరపరచిన ఈ పాటకు భువనచంద్ర సాహిత్యం అందించగా రాజేశ్‌ కృష్ణన్, అంజనా సౌమ్య ఆలపించారు. ‘‘ఈ మెలోడీ ట్రాక్‌లో శ్రీవిష్ణు, మీరా జాస్మిన్‌ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఈ పాట ప్రేక్షకులను 1980, 90లలోకి తీసుకెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో దక్షా నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement