అంబటి రాయుడిని అప్పట్లో నెక్ట్స్ సచిన్ అన్నారు: హీరో శ్రీ విష్ణు | Actor Sree Vishnu Comments On Under 19 Cricket | Sakshi
Sakshi News home page

Sree Vishnu: ఆంధ్రా తరఫున నేను అండర్-19 క్రికెట్ ఆడా

Published Tue, Oct 1 2024 3:31 PM | Last Updated on Tue, Oct 1 2024 4:36 PM

Actor Sree Vishnu Comments On Under 19 Cricket

చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ తెలుగు హీరో శ్రీ విష్ణు మాత్రం క్రికెటర్ కాబోయి హీరో అయినట్లు ఉన్నాడు. గతంలో ఓసారి చెప్పాడు. ఇప్పుడు మరోసారి తన క్రికెట్ కెరీర్ గురించి బయటపెట్టాడు. అదే టైంలో అంబటి రాయుడు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)

అతిథి పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన శ్రీ విష్ణు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఇతడు నాలుగు పాత్రల్లో నటించిన 'స్వాగ్' మూవీ అక్టోబరు 4న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్‌లో తన క్రికెట్ జర్నీ గురించి రివీల్ చేశాడు.

తాను ఆంధ్రా జట్టు తరఫున అండర్-19 క్రికెట్ ఆడానని, తన టైంలో అంబటి రాయుడు.. హైదరాబాద్ తరఫున ఆడేవాడని, అప్పట్లో అతడిని నెక్స్ట్ సచిన్ అని పిలిచేవారని శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో క్రికెటర్ కానప్పటికీ 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే మూవీలో మాత్రం శ్రీ విష్ణు క్రికెటర్‌గా నటించాడు. రాయుడు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement