నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్ | Actress Vanitha Vijayakumar Announced Her Fourth Wedding Date | Sakshi
Sakshi News home page

Vanitha Vijaykumar: సడన్ సర్‌ప్రైజ్.. ముచ్చటగా నాలుగో పెళ్లి

Published Tue, Oct 1 2024 1:44 PM | Last Updated on Tue, Oct 1 2024 5:12 PM

Vanitha Vijayakumar 4th Wedding Details Latest

తమిళ నటి వనిత విజయకుమార్ నాలుగో పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం ఈ విషయమై రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయాయి. చాలాకాలం నుంచి తనకు తెలిసిన కొరియోగ్రాఫర్‌తోనే ఏడడుగులు వేయబోతుంది. అక్టోబరు 5న పెళ్లి జరగనుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ప్రముఖ నటుడు విజయ కుమార్ పెద్ద కూతురు వనిత. 1995లో 'చంద్రలేఖ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అనంతరం పలు మూవీస్ చేసింది. 2000లో నటుడు ఆకాశ్‌ని పెళ్లి చేసుకోగా కొడుకు, కూతురు పుట్టారు. మనస్పర్థల కారణంగా 2005లో విడాకులు తీసుకున్నారు. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లకు కూతురు పుట్టింది. ఐదేళ్ల కాపురం తర్వాత 2012లో ఇతడి నుంచి కూడా విడాకులు తీసుకుంది.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందే పిల్లల గురించి శోభిత కామెంట్స్)

కాగా కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో కొన్నాళ్ల పాటు సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కానీ 2020లో ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్‌ని మూడో పెళ్లి చేసుకుంది. కేవలం నాలుగు నెలల్లోనే ఇది పెటాకులైంది. అయితే ఆయనతో తన పెళ్లి జరగలేదని, ఎంగేజ్‌మెంట్‌ మాత్రమే జరిగిందని వనిత వివరణ ఇచ్చింది.

ఇవన్నీ పక్కనబెడితే గతంలో సహజీవనం సాగించిందనే రూమర్ వచ్చింది కదా.. సదరు కొరియోగ్రాఫర్ రాబర్ట్‌నే ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోనుంది. వనిత వయసు 43 ఏళ్లు. ఈమె కూతురు జోవిక కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పోటీ పడింది. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ పడుతుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement