Robert
-
ఇదేందయ్యా ఇది..! మొన్న విషం.. ఇప్పుడేమో కలిసి పంచుకున్నాడు
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో ఆరోగ్య శాఖకు అధిపతిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను నియమించారు. ఈయన అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ తినే ఫాస్ట్ ఫుడ్‌ను విషంగా అభివర్ణించి, ఇప్పుడు ట్రంప్ పక్కన కూర్చుని ఫాస్ట్ ఫుడ్‌ను తింటున్న ఉదంతానికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ షేర్ చేసిన ఫొటోలో ఎలన్ మస్క్, ట్రంప్, యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా ఉన్నారు. అలాగే ఈ ఫొటోలో కెన్నెడీ జూనియర్ మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను చేతిలో పట్టుకోవడం కనిపిస్తుంది. అక్కడి టేబుల్‌పై కోకా-కోలా బాటిల్ కూడా కనిపిస్తోంది. దీనికితోడు మెక్‌డొనాల్డ్స్ బర్గర్, ఫ్రైస్ ఉన్న ప్లేటు ట్రంప్, మస్క్ ముందు ఉంచారు. ట్రంప్ జూనియర్ ‘మేక్ అమెరికా హెల్దీ అగైన్ టుమారో స్టార్ట్స్’ అనే క్యాప్షన్‌తో చిత్రాన్ని షేర్ చేశారు. Make America Healthy Again starts TOMORROW. 🇺🇸🇺🇸🇺🇸 pic.twitter.com/LLzr5S9ugf— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 17, 2024ఇటీవల ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో కెన్నెడీ జూనియర్ ట్రంప్ తినేవాటిని ‘విషం’గా అభివర్ణించారు. ప్రచార సమయంలో ఆయన ట్రంప్ చెడ్డ ఆహారం తింటున్నారని పేర్కొన్నారు. ఈయన గతంలో దుకాణాల్లోని షెల్ఫ్‌ల నుండి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ప్యాకెట్లను తొలగించాలని కోరారు. అయితే అమెరికాలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్కున్న ప్రాముఖ్యతను కెన్నెడీ జూనియర్ ఒప్పుకున్నారు.ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది
తమిళ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి అని న్యూస్. గత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తోనే ఏడడుగులు వేయనుందని అందరూ అనుకున్నారు. కానీ ఇది నిజం కాదని స్వయంగా ఇప్పుడు ఈమెనే తేల్చేసింది. ఎందుకంటే ఇదంతా తమ కొత్త మూవీ కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్. దీంతో అందరూ ఫూల్ అయ్యారని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రాకింగ్ రాకేష్, సుజాత దంపతులు)రెండు మూడు రోజుల క్రితం రాబర్ట్‌కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఫొటోని నటి వనితా విజయ్ కుమార్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అక్టోబరు 5వ తేదీని గుర్తుంచుకోండి అని రాసుకొచ్చింది. ఇది చూసిన అందరూ నాలుగో పెళ్లికి రెడీ అయిందని ఫిక్స్ అయ్యారు. రాబర్ట్‌తో ఈమె రిలేషన్లో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. దీంతో అందరూ పెళ్లి వార్త నిజమే అనుకున్నారు. కానీ ఇదంతా 'మిసెస్ & మిస్టర్' కోసమని ఇప్పుడు బయటపెట్టారు.ఈ సినిమాలో వనితా విజయ్ కుమార్, రాబర్ట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వనితనే దర్శకత్వం వహించింది. ఈమె కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరించింది. ఇలానే గతంలో తెలుగులో నరేశ్-పవిత్ర కూడా తొలుత పెళ్లి అన్నట్లు హడావుడి చేశారు. తీరా చూస్తే 'మళ్లీ పెళ్లి' సినిమా కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఐడియానే వనిత కాపీ కొట్టేశారా అనిపించింది. కాగా వనిత విజయ్‌కుమార్ తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్, బిగ్‌బాస్ అల్టిమేట్ మొదటి (ఓటీటీ) సీజన్లో పాల్గొంది.(ఇదీ చదవండి: పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ) View this post on Instagram A post shared by Vanitha (@vanithavijaykumar) -
నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్
తమిళ నటి వనిత విజయకుమార్ నాలుగో పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం ఈ విషయమై రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయాయి. చాలాకాలం నుంచి తనకు తెలిసిన కొరియోగ్రాఫర్తోనే ఏడడుగులు వేయబోతుంది. అక్టోబరు 5న పెళ్లి జరగనుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.ప్రముఖ నటుడు విజయ కుమార్ పెద్ద కూతురు వనిత. 1995లో 'చంద్రలేఖ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. అనంతరం పలు మూవీస్ చేసింది. 2000లో నటుడు ఆకాశ్‌ని పెళ్లి చేసుకోగా కొడుకు, కూతురు పుట్టారు. మనస్పర్థల కారణంగా 2005లో విడాకులు తీసుకున్నారు. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లకు కూతురు పుట్టింది. ఐదేళ్ల కాపురం తర్వాత 2012లో ఇతడి నుంచి కూడా విడాకులు తీసుకుంది.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే పిల్లల గురించి శోభిత కామెంట్స్)కాగా కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో కొన్నాళ్ల పాటు సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కానీ 2020లో ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్ని మూడో పెళ్లి చేసుకుంది. కేవలం నాలుగు నెలల్లోనే ఇది పెటాకులైంది. అయితే ఆయనతో తన పెళ్లి జరగలేదని, ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందని వనిత వివరణ ఇచ్చింది.ఇవన్నీ పక్కనబెడితే గతంలో సహజీవనం సాగించిందనే రూమర్ వచ్చింది కదా.. సదరు కొరియోగ్రాఫర్ రాబర్ట్‌నే ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోనుంది. వనిత వయసు 43 ఏళ్లు. ఈమె కూతురు జోవిక కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పోటీ పడింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ పడుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
స్లొవాకియా ప్రధానికి మరో శస్త్రచికిత్స
బ్రాటిస్లావా: హత్యాయత్నానికి గురైన స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోకు శుక్రవారం మరో శస్త్రచికిత్స జరిగింది. 59 ఏళ్ల ఫికో పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం హండ్లోవా పట్టణంలో ప్రభుత్వ సమావేశం తర్వాత బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తుండగా ఒక దుండగుడు ఫికోపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను బన్స్కా బి్రస్టికాలోని ఎఫ్.డి.రూజ్వెల్ట్ ఆసుపత్రికి తరలించారు. ఫికోకు సి.టి. స్కాన్ తీశామని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ విషమంగానే ఉందని రూజ్వెల్ట్ ఆసుపత్రి డైరెక్టర్ మిరియమ్ లపునికోవా తెలిపారు. ఫికో స్పహలోనే ఉన్నారని చెప్పారు. శరీరంలో మృత టిçష్యూను తొలగించడానికి శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. -
నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
బన్స్కా బిస్ట్రికా: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59) పరిస్థితి విషమమే అయినప్పటికీ నిలకడగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయనతో గురువారం మాట్లాడినట్లు ఎన్నికైన అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ చెప్పారు. ఫికో ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రధాని ఫిగోకు ఐదు గంటలపాటు ఆపరేషన్ చేసినట్లు బన్స్కా బిస్ట్రికాలోని ఎఫ్డీ రూజ్వెల్ట్ హాస్పిటల్ డైరెక్టర్ మిరియమ్ లపునికోవా గురువారం చెప్పారు. విషమమే అయినప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇలా ఉండగా, ప్రధాని ఫికోపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి(71) ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేనట్లుగా తేలిందని ఇంటీరియర్ మంత్రి మటుస్ సుటాజ్ ఎస్టోక్ తెలిపారు. ప్రధానిపై హత్యాయత్నం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. ఫికో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు అతడు తెలిపాడన్నారు. కవి కూడా అయిన నిందితుడు గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. బుధవారం హండ్లోవా పట్టణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఫికోపై దుండగుడు తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటన యూరప్ వ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఉక్రెయిన్‌కు అనుకూలంగా వ్యవహరించిన స్లొవాకియా అనంతరం రష్యా అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకుంది. ఫికో రాజకీయ ప్రత్యర్థి, మరికొద్ది రోజుల్లో పదవిని వీడనున్న అధ్యక్షురాలు జుజానా కపుటోవా గురువారం రాజధాని బ్రాటిస్లావాలో మీడియాతో మాట్లాడు తూ.. ‘సమాజంలో పెరుగుతున్న విద్వేషాలకు నిదర్శనం ఈ ఘటన. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తాం’అని తెలిపారు. ఈ సమయంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా మెలగాలని ఆమె కోరారు. -
స్లొవాకియా ప్రధానిపై కాల్పులు
ప్రేగ్: స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై హత్యాయత్నం జరిగింది. ఆయన బుధవారం మధ్యాహ్నం హండ్లోవా నగరంలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్తూ భవనం బయట గుమిగూడిన అభిమానులకు అభివాదం చేస్తుండగా ఓ దుండగుడు తుపాకీతో ఆయనపై నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ ఫికోను హుటాహుటిన బాన్స్క్ బై్రస్టికాలోని ఆస్పత్రికి హెలికాప్టర్లో తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రధాని అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తూటాలు పొట్టలోంచి దూసుకుపోయినట్టు చెబుతున్నారు. ఫికో తలకు, ఛాతీకి కూడా గాయాలైనట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అనుమానితున్ని ప్రధాని బాడీగార్డులతో పాటు అభిమానులు నిర్బంధించినట్టు సమాచారం. దీన్ని దేశ ప్రజాస్వామ్యంపైనే దాడిగా అధ్యక్షురాలు జుజానా కపుటోవా అభివరి్ణంచారు. దుండగునిగా భావిస్తున్న 71 ఏళ్ల అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అతను రచయిత అని, ప్రత్యర్థి పారీ్టకి చెందిన రాజకీయ కార్యకర్త అని రకరకాలుగా వార్తలొస్తున్నాయి. దుండగుడు తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డట్టు సమాచారం. దాడికి కారణం తెలియరాలేదు. దాడి సమయంలో స్లొవాకియా పార్లమెంటు సమావేశాలు జరుగుతు న్నాయి. ఘటనపై స్పీకర్ ప్రకటన అనంతరం సభ వాయిదా పడింది. మూడు వారాల్లో యూరోపియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఫికో పారీ్టతో కూడిన అతివాద పక్షాల కూటమిదే పై చేయి అవుతుందని భావిస్తున్న వేళ ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్, పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు.రష్యా అనుకూలుడు ఫికో రష్యా అనుకూలునిగా పేరుబడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు. గత సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రష్యా అనుకూల, అమెరికా వ్యతిరేక ప్రచారంతో తన జాతీయవాద సంకీర్ణ కూటమికి విజయం సాధించిపెట్టి మూడోసారి ప్రధాని అయ్యారు. వెంటనే ఉక్రెయిన్‌కు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫికో రాకతో స్లొవాకియా పాశ్చాత్య అనుకూల విధానాలకు తెరపడుతుందని, హంగరీ వంటి యూరప్ దేశాల మాదిరిగా రష్యా అనుకూల వైఖరితో దేశ భద్రతను ఆయన ప్రమాదంలోకి నెడతారని విమర్శకులు అంటున్నారు. ఫికో విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా రాజధానిలో వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి జరిగింది. ఫికో, దేశాధ్యక్షుడు కపుటోవా రాజకీయ ప్రత్యర్థులు. ఫికో రాజకీయ మిత్రుడైన పీటర్ పలెగ్రినీ ఇటీవలే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దేశ ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న పెను ముప్పుకు ఫికోపై దాడి తాజా ఉదాహరణ అని పలెగ్రినీ అన్నారు. రాజకీయ అభిప్రాయాలను పోలింగ్ బూత్‌ల్లో కాకుండా ఇలా తూటాల ద్వారా వ్యక్తం చేస్తూ పోతే దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడేందుకు 30 ఏళ్లుగా చేసిన కృషి మట్టిపాలవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. చెకస్లొవాకియా 1992లో చెక్ రిపబ్లిక్, స్లొవాకియాగా విడిపోవడం తెలిసిందే. -
మిస్టరీ: ఓక్చా వోర్ట్మన్!
జీవితంలో అసంపూర్ణంగా ఆస్వాదించిన కొన్ని మధురక్షణాలు.. మళ్లీ తిరిగిరాని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు పొంగుకొచ్చే భావోద్వేగాన్ని వర్ణించడం మహా కష్టం. ఇక ఆ తర్వాత అంతకుమించిన సంతోషాలెన్నొచ్చినా.. మనసు మాత్రం గతాన్నే నెమరువేసుకుంటుంది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లమని కోరుకుంటుంది. ‘స్టెల్లా హట్’ జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె ఆలాపన, అన్వేషణ, ఆవేదన అంతా తన కన్నతల్లి కోసమే. అసలేంటా కథ? స్టెల్లా కథ.. ఓ అమెరికన్ అయిన ఆమె తండ్రి రాబర్ట్ వోర్ట్మన్ కథతోనే మొదలవుతుంది. అది 1971, జపాన్ . అప్పుడు రాబర్ట్‌కి 22 ఏళ్లు. తను జపాన్ లో ఎయిర్‌మన్ గా పనిచేసేవాడు. ఒకరోజు ఓ ప్రయాణంలో.. ఓక్చా అనే 20 ఏళ్ల కొరియన్ అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. పెళ్లి అయిన ఏడాదికే స్టెల్లా పుట్టింది. రాబర్ట్.. తన భార్య ఓక్చాను ముద్దుగా ‘సన్నీ’ అని పిలుచుకునేవాడు. కొన్ని నెలలకు జపాన్ కి చెందిన ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌కు.. రాబర్ట్ సెలెక్ట్ అయ్యాడు. దాంతో స్టెల్లాను సన్నీ(ఓక్చా)కి అప్పగించి.. అతడు అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లాల్సి వచ్చింది. మధ్యమధ్యలో వచ్చి.. భార్యాబిడ్డలతో గడిపేవాడు. తండ్రి దూరంగా ఉండటంతో.. స్టెల్లాకు తల్లితో మరింత అనుబంధం పెరిగింది. ఐస్‌క్రీమ్ పార్లర్లో ఉద్యోగం చేసే సన్నీ.. కూతురు స్టెల్లాను చాలా ప్రేమగా చూసుకునేది. చాలా ప్రదేశాలకు తిప్పేది. వాటన్నిటినీ తల్లి ప్రేమకు గుర్తుగా గుండెలో దాచుకుంది స్టెల్లా. కొంతకాలానికి సన్నీకి బార్లో వెయిట్రెస్ జాబ్ వచ్చింది. అది నైట్ డ్యూటీ కావడంతో.. స్టేల్లాను న్యూజెర్సీలో ఉండే రాబర్ట్ బంధువులకు అప్పగించాల్సి వచ్చింది. తనతో స్టెల్లా కూడా లేకపోవడంతో.. సన్నీకి బయట స్నేహాలు పెరిగాయి. ఇంట్లో గడిపే సమయం తగ్గి.. బయట గడిపే సమయం పెరిగిపోయింది. దాంతో ఫ్యామిలీ వెకేషన్ ్స తగ్గిపోయాయి. రాబర్ట్‌తో గొడవలు మొదలయ్యాయి. కాల్ చేసుకున్నా, కలుసుకున్నా.. ఆ రోజంతా గొడవలతోనే ముగిసేది. పరిస్థితి చేయిదాటిపోతుందని గుర్తించిన రాబర్ట్.. సామరస్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భార్యతో ఓ ఒప్పందానికి వచ్చాడు. ‘ఇక నుంచి మనం కలసే ఉందాం.. నాతో పాటు అమెరికా వచ్చెయ్. న్యూజెర్సీ వెళ్లి స్టెల్లాతో సంతోషంగా ఉందాం’ అని కోరాడు. అందుకు సన్నీ సరే అంది. ఇద్దరూ న్యూజెర్సీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. దాంతో తన జాబ్‌ని న్యూయార్క్ నుంచి న్యూజెర్సీకి మార్పించుకున్నాడు రాబర్ట్. సన్నీని తీసుకెళ్లడానికి తిరిగి జపాన్ చేరుకున్నాడు. అయితే భర్త వెంట వెళ్లడానికి అభ్యంతరం చెప్పింది సన్నీ. ‘నేను ఇప్పుడే నీతో రాలేను. ఒకసారి మా కుటుంబాన్ని కలుస్తాను. వచ్చాక మనం న్యూజెర్సీ వెళ్లిపోదాం’ అని చెప్పి.. దక్షిణ కొరియాలోని సియోల్‌కి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. ఆమె గురించి ఎంత వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదు. ‘ఆమె అసలు పేరు ఓక్చా అని, ఆమె సొంత ఊరు దక్షిణకొరియాలోని సియోల్’ అని తప్ప.. మరే వివరాలూ రాబర్ట్‌కి తెలియవు. ఆ మాటకొస్తే తను వెళ్లింది సియోల్కేనో కాదో కూడా తెలియదు. ఆ తర్వాత సన్నీ ఎప్పుడూ కూతురు స్టెల్లాని కలవలేదు. కానీ.. స్టెల్లా మాత్రం తల్లి జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయేది. సరిగ్గా రెండేళ్లకు.. రాబర్ట్ తల్లి ఓ ఫోన్ లిఫ్ట్ చేసింది. ‘స్టెల్లా స్టెల్లా’ అనే పిలుపుతో ఓ ఆడ గొంతును అవతలి నుంచి విన్నది. మరే మాట ఆమెకు అర్థం కాలేదు. దానికి కారణం.. రాబర్ట్ తల్లికి ఇంగ్లిష్ మాత్రమేవచ్చు. దాంతో ఫోన్ లో వినిపించిన మాటలేవీ రాబర్ట్ తల్లికి అర్థం కాలేదు. ఒక్క స్టెల్లా అనే పేరు తప్ప. అందుకే ఆ కాల్ చేసింది సన్నీయే కావచ్చు అన్న అనుమానం కలిగింది ఆ కుటుంబానికి. ఎందుకంటే.. సన్నీకి కొరియన్ మాత్రమే వచ్చు. తన తల్లి మాట్లాడే భాష అర్థంకాకే ఆ రోజు సన్నీ కాల్ కట్ చేసుంటుందనుకున్నాడు రాబర్ట్. 1985లో స్టెల్లాకు 4 గౌన్లు, ఓ కుక్కపిల్ల గిఫ్ట్‌గా వచ్చాయి. అయితే ప్యాకింగ్ మీద కాలిఫోర్నియా పోస్ట్ మార్క్ ఉంది. అది కచ్చితంగా తన తల్లే తనకోసం పంపించిందని ఇప్పటికీ నమ్ముతుంది స్టెల్లా. అయితే సన్నీ గురించి ఎలాంటి ఆధారం దొరకలేదు. కొన్నాళ్లకు తండ్రి రాబర్ట్.. మరో పెళ్లి చేసుకున్నాడు. అతడికి మరో పాప పుట్టింది. సవతి తల్లి కూడా స్టెల్లాను ప్రేమగా చూసుకునేది. కానీ కన్నతల్లిని చూడాలనే ఆశ.. స్టెల్లాలో చావలేదు. స్టెల్లాకు పెళ్లి అయ్యి.. ఒక బాబు కూడా పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా తన తల్లిని చూడలేకపోయానన్న వెలితి.. ఆమెను ఇప్పటికీ వెంటాడుతోంది. సన్నీ అలియాస్ ఓక్చాకి ప్రస్తుతం 73 ఏళ్లు దాటే ఉంటాయి. అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియని తల్లి కోసం స్టెల్లా మాత్రం ఇంకా అదే ఆశతో ఎదురుచూస్తోంది. మరి సన్నీ ఏమైంది? ఎందుకు చెప్పాపెట్టకుండా వాళ్ల జీవితాల్లోంచి వెళ్లిపోయింది.? ఒకవేళ మోసం చేయాలని తనకు లేకపోయినా.. అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురైందా? అలా అయితే.. స్టెల్లా గురించి కాల్ చేసింది ఎవరు? స్టెల్లాకు గిఫ్ట్స్ పంపించింది ఎవరు?’ లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు. దాంతో ఓక్చా కథ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం' -
గురక పెట్టొద్దన్నందుకు పొడిచేశాడు
మేరీల్యాండ్: చెవులకు చిల్లులు పడేలా గురుక పెట్టకురా అన్నందుకు ఓ పెద్దాయనను పొడిచి చంపిన ఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రం మోంట్గోమేరీ కౌంటీలో 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అదే డూప్లెక్స్ భవనంలో 55 ఏళ్ల క్రిస్టఫర్ కేసీ ఒంటరిగా ఉంటున్నాడు. క్రిస్టఫర్ పెడుతున్న భారీ గురకను వినలేకపోతున్నానని ఏడాదిన్నరగా రాబర్ట్ చెప్పీచెప్పీ విసిగిపోయాడు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. వాళ్లు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. క్రిస్టఫర్, రాబర్ట్‌ల పడక గదులు పక్కపక్కనే ఉండటం, ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గురక రాబర్ట్‌కు బాగా ఇబ్బందిపెట్టేది. విసిగిపోయిన పెద్దాయన చివరకు జనవరి 15న సాయంత్రం క్రిస్టఫర్ వరండా దగ్గరికొచ్చి బెదిరించాడు. వినకపోవడంతో అతని కిటికీ స్క్రీన్‌ను చింపేసి చంపేస్తానని అరిచాడు. ఒకనొక సమయంలో నీ గురక సమస్యకు శస్త్రచికిత్స చేయిస్తానని కూడా మాట ఇచ్చాడు. వాగ్వాదం చాలాసేపు జరిగి ఆగిపోయే సమయానికి క్రిస్టఫర్ తలుపుతీయడంతో రాబర్ట్ మళ్లీ తిట్లపురాణం మొదలెట్టాడు. వీరావేశంతో ఉన్న గురకమహాశయుడు వెంటనే కత్తితో రాబర్ట్ గుండెలపై పలుమార్లు పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
రాబర్ట్ లాంగర్‌కు జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నియంత్రణకు ఎంఆర్ఎన్ఏ టీకాను అభివృద్ధి చేసిన మొడెర్నా సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ ఎస్.లాంగర్ ఈ ఏడాదికిగాను జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి 26 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న 20వ బయో ఆసియా సదస్సులో ఆయనకు ఈ అవార్డు అందించనున్నట్లు బయో ఆసియా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని డేవిడ్ హెచ్.కోచ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకుడైన రాబర్ట్ ఎస్.లాంగర్... వ్యాధుల చికిత్సకు మందులను నియంత్రిత పద్ధతుల్లో అందించే వ్యవస్థలను అభివృద్ధి చేశారు. వాటిని ప్రస్తుతం కేన్సర్ సహా పలు రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. లాంగర్ ల్యాబ్స్ డైరెక్టర్‌గా ఆయన చేసిన పరిశోధనల కారణంగానే తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారైంది. 2010లో లాంగర్ స్థాపించిన కంపెనీ మొడెర్నా కోవిడ్–19 నియంత్రణకు టీకా తయారు చేయడం తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్ ప్రైజ్ ఫర్ ఇంజినీరింగ్‌తోపాటు అనేక ఇతర అవార్డులను అందుకున్న రాబర్ట్ ఎస్.లాంగర్ ఇప్పటివరకూ దాదాపు 1,500 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు రాబర్ట్ ఎస్.లాంగర్ అన్ని విధాలుగా అర్హుడని, ఆయన పరిశోధనలు రానున్న కాలంలోనూ సమాజంపై ప్రభావం చూపనున్నాయని తెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. -
48 ఏళ్లుగా.. అంతుచిక్కని ‘దెయ్యపు’ బొమ్మ!!
ఒక బొమ్మ.. దానిని ఇష్టపడే వ్యక్తులు. కానీ, అన్యాయంగా చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ అందులో దూరి.. అందరికీ వణుకు పుట్టిస్తూ ఉంటుంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. అన్ని భాషల్లో ఈ స్టోరీ లైన్‌తో బొమ్మల్ని బేస్ చేసుకుని బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే నిజజీవితంలోనూ అమ్మో బొమ్మ తరహా కథలు ప్రచారంలో ఉండడం మీరెప్పుడైనా విన్నారా? రాబర్ట్.. హాంటెడ్ డాల్. అలా ఇలా కాదు.. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన బొమ్మ అదట. 1994 నుంచి యూఎస్ స్టేట్ ఫ్లోరిడా కీ వెస్ట్‌లోని ఫోర్ట్ ఈస్ట్ మార్టెల్లో మ్యూజియంలో అది ఉంటోంది. ఒక చిన్నారికి నావికుడి గెటప్ వేసినట్లు ఉండే ఆ బొమ్మ.. చేతిలో మరో బొమ్మను పట్టుకున్నట్లు ఉంటుంది. అయితే ఈ బొమ్మ వల్లే ఎన్నో అనర్థాలు జరిగాయనే ప్రచారం.. ఇదొక దెయ్యం బొమ్మనే ముద్రను వేశాయి. 1904 సంవత్సరంలో కీ వెస్ట్‌కి చెందిన రాబర్ట్ ఎయుజెనె ఒట్టో అనే చిన్నారికి బర్త్‌డే గిఫ్ట్‌గా.. అతని తాత జర్మనీ నుంచి తీసుకొచ్చి మరీ ఈ బొమ్మను కానుకగా తీసుకొచ్చాడు. రాబర్ట్ ఆ బొమ్మను ఎంతగా ప్రేమించాడంటే.. దానికి కూడా తన పేరే పెట్టుకున్నాడు. పెద్దయ్యాక కూడా దాన్ని అతను వదల్లేదట. చివరికి ప్రాణం పోయే సమయంలోనూ ఆయన హత్తుకుని పడుకున్నాడని ఆ బొమ్మ హిస్టరీ నోట్లో పేర్కొని ఉంటుంది. అయితే.. 118 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ బొమ్మ ఆ తర్వాత వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. కానీ.. రాబర్ట్ బొమ్మ వేరే వాళ్ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు.. ఏదో ఒక అపశ్రుతి జరిగేదన్న వాదన ఒకటి ఉంది. ప్రమాదాలు జరగడం, గాయాలు, ఎముకలు విరిగిపోవడాలు, విడాకులు.. ఇలా ఏదో ఒక చెడు జరిగేదన్న నమ్మకం ముద్రపడిపోయింది. 1974లో రాబర్ట్ ఒట్టో కన్నుమూశాడు. రెండేళ్ల తర్వాత అతని భార్య సైతం చనిపోయింది. ఆ తర్వాత కీవెస్ట్ ఈయేటన్ స్ట్రీట్‌లోని వాళ్ల ఇంట్లో ఆ బొమ్మ అలాగే ఉండిపోయింది. మైర్టెల్ రూటర్ అనే వ్యక్తి 20 ఏళ్ల పాటు ఆ ఇంటిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆపై మరొకరికి దానిని అమ్మేయగా.. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ గెస్ట్ హౌజ్‌గా మార్చేశారు. అయితే.. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. రాబర్ట్ మరణం తర్వాతే ఈ అనుభవాలు ఎదురయ్యాయని చాలా మంది అంటున్నారు. అదీ దానిని సరిగ్గా పట్టించుకోని తరుణంలోనేనట. దీంతో దానికి అతీత శక్తులు ఉన్నాయని, దాని వల్ల ఏదో ఒక అనర్థం జరిగేదన్న నమ్మకం బలంగా స్థిరపడింది స్థానికుల్లో. దీంతో 1994లో ఆ బొమ్మను భద్రంగా ఉంచేందుకు కీ వెస్ట్‌లో ఉన్న మ్యూజియానికి అప్పజెప్పారు. అప్పటి నుంచి అదొక టూరిస్ట్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. అయితే అక్టోబర్‌లో మాత్రం దీనికి ఓల్డ్ పోస్టాఫీస్‌కు తరలిస్తుంటారు ఎందుకనో!. రకరకాల కథలు.. రాబర్ట్ బొమ్మ గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. దానిలో ఏదో శక్తి దాగి ఉందని, అప్పుడప్పుడు ముఖకవళికలు మారుస్తుందని, ఒక్కోసారి విచిత్రమైన శబ్దాలు చేస్తుందని కొందరు చెప్తుంటారు. అంతేకాదు.. గతంలో అది మాయమై .. మరొచోట ప్రత్యక్షమైన సందర్భాలు కూడా ఉన్నాయట. ఏదేమైనా ఆ బొమ్మకు మంచి స్థానం కల్పించకపోతే కోపం వచ్చి ఏదో ఒక చెడు చేస్తుందనే నమ్మకం బలంగా ముద్రపడడంతో.. ఇప్పటికీ దానిని భద్రంగా చూసుకుంటున్నారు. ఈ బొమ్మ కథను ఆసరాగా చేసుకునే రాబర్ట్ సిరీస్‌లో నాలుగు సినిమాలొచ్చాయి కూడా. అలా ఓ సాధారణ బొమ్మ.. దెయ్యపు బొమ్మగా మ్యూజియంలో సకల మర్యాదలు అందుకుంటోంది. -
నిర్మాత హత్యకు కుట్ర! రౌడీ షీటర్ అరెస్ట్
యశవంతపుర: 'రాబర్ట్' సినిమా నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ హత్యకు ప్లాన్ వేసిన రౌడీషీటర్ రాజీవ్ అలియాస్ కరియను బెంగళూరు దక్షిణ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ సరిహద్దుల్లో దాగి ఉన్న కరియాను కేజే నగర సీఐ చేతన్ సిబ్బందితో వెళ్లి పట్టుకొని బెంగళూరుకు తీసుకొచ్చారు. బాంబే రవి గ్యాంగ్‌లో గుర్తింపు పొందిన రౌడీ రాజీవ్ ఇట్టమడు జంట హత్యల కేసులో నిందితుడుగా ఉన్నాడు. చదవండి: ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు సలార్ నిర్మాత ఆర్థిక సాయం -
ఈ వీకెండ్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా భయం భయంగానే ఉంటోంది. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలకు చూస్తూ ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలేంటి? ఏ ప్లాట్‌ఫాంలో ఎప్పుడు రిలీజ్ కానున్నాయి వంటి వివరాలు చూసేద్దాం. అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా నటించారు. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ, సినిమాకు మంచి స్పందన వచ్చింది. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్22న విడుదలయ్యింది. కార్తీ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'సుల్తాన్. ‘ఖైదీ’, ‘దొంగ’ వంటి సూపర్ హిట్స్ తర్వాత కార్తీ ఈ మూవీలో నటించారు.తమిళంలో రష్మికకు ఇదే తొలి చిత్రం.బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా మే 2 ఆహాలో విడుదల కానుంది. బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా కథానాయికగా నటించిన చిత్రం ‘సైనా’. ఈ మూవీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్23న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం "రాబర్ట్". తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజ్ అయ్యింది. అనుకోని పరిస్థితుల్లో కొడుకు ఓ గ్యాంగ్‌స్టర్‌తో పడిన ఇబ్బందుల నుంచే ఎలా భయపడ్డాడు అన్నదే ఈ సినిమా కథ. ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కన్నడలో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. జగపతి బాబు రవి కిషన్, వినోద్ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 25న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. ‘ఆహా’లో ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో పవన్‌తేజ్. ఈయన నటించిన డెబ్యూ మూవీ ఈ కథలో పాత్రలు కల్పితం. మేఘనా, లక్కీ, రఘు బాబు, అభయ్ బేతిగంటి ప్రధాన పాత్రలు పోషించారు. తొలి సినిమాతోనే పవన్ తేజ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 24న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. -
మేక బహుకరణ: ఇంటికి రమ్మన్న స్టార్ హీరో
అభిమాన హీరోను కలవాలని తహతహలాడేవారు ఎందరో! కానీ ఆ కల నెరవేరేది కొందరికే. హీరోను కలిసినప్పుడు అతడికి నచ్చిన బహుమతులను ఇచ్చి వారి మీద ప్రేమను అభివ్యక్తీకరిస్తుంటారు. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరోకు ఓ అభిమాని తను ప్రేమగా పెంచుకుంటున్న గొర్రెను బహుకరించాడు. అతడి ప్రేమకు సంతోషించిన హీరో అభిమానికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ వివరాలేంటో కింది స్టోరీలో చదివేయండి.. కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం "రాబర్ట్". తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్ణాటకలోని హుబ్బలిలో జరిగింది. తన అభిమానులను కలవాలన్న దర్శన్ కోరిక మేరకు ప్రత్యేకంగా హుబ్బలిలోనే ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్లు నిర్మాత వెల్లడించాడు. ఇక హుబ్బలిలో ప్రీ రిలీజ్ కార్యక్రమం ముగిసిన తర్వాత దర్శన్ తన కారులో బెంగుళూరు పయనమవగా ఎందరో అభిమానులు ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు. దీంతో అతడు కారులో నుంచి దిగి వారికి ఆటోగ్రాఫులు ఇస్తూ ఫొటోలు దిగాడు. ఈ క్రమంలో ఎంతో దూరం నుంచి ఈ ఈవెంట్‌కు చేరుకున్న శంబు గడగి అనే వ్యక్తి హీరోకు తను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ మేకను బహుమతిగా ఇచ్చాడు. అయితే వర్క్ బిజీలో ఉన్న హీరో దాన్ని స్వీకరించలేదు. కానీ మైసూర్‌లోని తన ఫామ్ హౌస్‌కు దీన్ని తీసుకొని రమ్మని అభిమానికి సూచించాడు. అంతేకాకుండా అతడి ఫోన్ నెంబర్ సైతం తీసుకున్నాడు. ఫామ్ హౌస్‌కు వచ్చేందుకు అభిమాని ఇంటికి తనే స్వయంగా కారు పంపుతానని మాటిచ్చాడు. ఈ ఆహ్వానానికి అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. చదవండి: రష్మిక జడలో మల్లెపూలు పెట్టిన అభిమాని! 5 కోట్ల లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్ -
2020 ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌గా లెవన్డౌస్కీ
జెనీవా: ప్రస్తుత ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరనగానే ఠక్కున లియోనల్ మెస్సీ లేదా క్రిస్టియానో రొనాల్డో పేరు చెప్పేస్తారు. కానీ ఇప్పుడు పోలాండ్ కెపె్టన్ రాబర్ట్ లెవన్డౌస్కీ పేరును కూడా గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే 2020 ఏడాదికి ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అత్యుత్తమ ప్లేయర్‌గా లెవన్డౌస్కీ ఎంపికయ్యాడు. ఈ ఏడాది బయార్న్ మ్యూనిక్ జట్టు తరఫున 55 గోల్స్‌తో చెలరేగిన లెవన్డౌస్కీని ‘బెస్ట్ ప్లేయర్’ పురస్కారంతో ‘ఫిఫా’ గౌరవించింది. అతను ఈ అవార్డు కోసం మెస్సీ, రొనాల్డోలతో పోటీపడి విజేతగా నిలవడం విశేషం. గత 13 ఏళ్లలో మెస్సీ, రొనాల్డోకు దక్కకుండా ఫిఫా బెస్ట్ ప్లేయర్ పురస్కారం మరొకరిని వరించడం ఇది రెండోసారి మాత్రమే. 2018లో రియల్ మాడ్రిడ్ మిడ్‌ఫీల్డర్ లుకా మోడ్రిక్, తాజాగా రాబర్ట్ ఈ అవార్డును అందుకున్నారు. మహిళల విభాగంలో ఈ ఏడాది అత్యుత్తమ ప్లేయర్‌గా లూసీ బ్రాంజ్ (ఇంగ్లండ్) నిలిచింది. -
కలల కుండీ
ఆశల కలలు.. నింగిలో మొలకెత్తే పూల విత్తనాలు. మట్టినేలపై కూడా విరిసే ఇంద్ర ధనుస్సులు. లేమికి చెరగని చిరునవ్వులు... ఈదురు గాలులకు చెదరని వెదురు తడికెల గదులు. మలీషా కళ్ల నిండా ముంబై పట్టనన్ని కలలు. మోడలింగ్.. డ్యాన్స్.. మంచి లైఫ్.. ఫ్యామిలీకి ఫుడ్. మరో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ స్టోరీ ఉందిక్కడ! ఆ స్టోరీని కుండీలో నాటి వెళ్లాడు ఓ హాలీవుడ్ హీరో. మలీషా జీవితానికి లాక్డౌన్ ఇచ్చిన స్క్రీన్‌ప్లే ఇది! పన్నెండేళ్ల మలీషా ఖర్వాకు మోడలింగ్ అంటే ఇష్టం. ‘ఏముంటుంది అందులో ఇష్టపడటానికి?’ అని అడిగితే.. ‘కెమెరా వైపు చూస్తూ నడుము మీద చేతులు వేసుకుని పోజులు ఇవ్వడం బాగుంటుంది’ అంటుంది నవ్వుతూ మలీషా! తనెక్కడో చూసి ఉండాలి మోడల్స్ అలా చేస్తారని. ఎక్కడైనా చూసి ఉండాలి కానీ, తనింట్లో మాత్రం కాదు. ఎందుకంటే ముంబైలోని బాంద్రాలో ఓ మురికివాడలో తండ్రి, తమ్ముడు సాహిల్ (7)తో పాటు ఒక వెదురు గొట్టాల రేకుల షెడ్డులో ఉంటున్న మలీషా ఇంట్లో టీవీ లేదు. అలాంటి ఇంటికి హాలీవుడ్ నటుడు, డాన్సర్, కొరియోగ్రాఫర్ రాబర్ట్ హాఫ్‌మ్యాన్ వచ్చాడు! డ్యాన్స్ సినిమా ‘ది స్టెప్ అప్ 2: ది స్ట్రీట్స్’ ఫేమ్ అతడు. గత మూడు నెలలుగా ముంబైలోనే ఉంటూ మలీషా ఇంటికి వెళ్లొస్తూ అక్కడ ఉన్నంతసేపు సరదాగా హిందీ నేర్చుకుంటున్నాడు. అతడి వల్ల మలీషాకూ కాస్త ఇంగ్లిష్ వచ్చింది. అయితే రాబర్ట్ ముంబై వచ్చిన పని వేరే. ముందు డ్యాన్సర్, ఆ తర్వాతే నటుడు హాఫ్‌మ్యాన్. తాను నటించిన సినిమాలలో ఎక్కువగా అతడు డ్యాన్సర్ పాత్రలోనే కనిపిస్తాడు. తూర్పు ఐరోపా దేశాల్లో డ్యాన్స్ టీచింగ్ క్లాసుల టూర్ పెట్టుకుని ఫిబ్రవరిలో ముంబైలో దిగాడు హాఫ్‌మ్యాన్. టూర్లో భాగంగా తను ప్లాన్ చేసిన మ్యూజిక్ వీడియో లో నటించడానికి అతడికి మురికివాడల నుంచి కాస్త డ్యాన్స్ తెలిసిన అమ్మాయి కావలసి వచ్చింది. అప్పుడే మలీషా ఖర్వా గురించి అతడికి తెలిసింది. ముంబైలో హాఫ్మ్యాన్కి ఆతిథ్యం ఇచ్చిన అభిమాని అతడిని మలీషా ఇంటికి తీసుకెళ్లింది. ‘‘మలీషాది చక్కటి నవ్వుముఖం. చక్కగా డ్యాన్స్ కూడా చేస్తుందని మా పనమ్మాయి చెప్పింది’’ అని ఆమె చెప్పిన మాట నిజమేననిపించింది మలీషాను చూడగానే. అయితే మ్యూజిక్ వీడియోలోని స్లమ్ పాత్రకు అంతకన్నా తక్కువ ‘వెలుగు’ ఉండే అమ్మాయి కావాలి. మలీషా కజిన్‌ని తీసుకున్నాడు హాఫ్‌మ్యాన్. షూట్ పూర్తయింది. ఈలోపు లాక్డౌన్. చాన్స్ రానందుకు తనేమీ బాధపడలేదు మలీషా. అందుకు కారణం హాఫ్‌మ్యాన్. ‘‘మలీషా.. నువ్వు మోడలింగ్‌కి చక్కగా పనికొస్తావు. అయితే వెంటనే కాదు. ఇంకా కొన్ని రోజులకు. అప్పుడు నువ్వు డ్యాన్స్ కూడా ఇంకా బాగా చేయగలుగుతావు’’ అన్నాడు. ఇంకా కొన్నాళ్లు తను ముంౖ»ñ లోనే ఉంటాడు కాబట్టి తనకు హిందీ నేర్పించమని అడిగాడు. ఆ రేకుల షెడ్డులోనే మలీషా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మలీషా చెబుతుంటే ఒక్కో మాటా నేర్చుకున్నాడు. ‘మేరా ఫోన్ ఖరాబ్ హోగయా’ అని మలీషా చెప్పమన్నప్పుడు.. ‘హోగయా’ అనే మాటను సరిగా పలకలేక ఆ అమెరికా ఆయన ‘హోపలా’ అనగానే మలీషా ఎలా పడీ పడీ నవ్విందో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హాఫ్‌మ్యాన్ అప్లోడ్ చేసిన వీడియోలో చూడొచ్చు. రాబర్ట్ హాఫ్మ్యాన్తో మలీషా మలీషా కోసం అతడే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. తనే మలీషా ఫొటోలు తీసి అందులో పోస్ట్ చేశాడు. ‘హాయ్, నేను ఉంటున్న చోటును మురికివాడ అని అంతా అంటుంటారు. కానీ ఐ లవ్ మై హోమ్. నా ఫ్యామిలీని పోషించుకోవడం కోసం నేను మోడల్ని కావాలని అనుకుంటున్నాను. ఇదీ నా జర్నీ. నా వయసు 12’ అని ఇన్‌స్టాలో సైడ్ యాంగిల్లో కనిపిస్తూ ఉంటుంది మలీషా. హాఫ్మ్యాన్కు ఒకటే ఆశ్చర్యం. ఇంత ముఖసిరి గల అమ్మాయిని ఇంకా ఎవరూ మోడలింగ్‌కి తీసుకోకపోవడం ఏంటని! బహుశా ఇండియన్స్‌కి చర్మం రంగు మీద ఉన్న పట్టింపు ఇందుకు కారణం కావచ్చునని అనుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లోనైతే మలీషా ఫాలోవర్లు ఆమెను ‘స్లమ్ ప్రిన్సెస్’ అని కీర్తించడం మొదలుపెట్టేశారు. ‘‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది’’ అని మలీషా తండ్రితో హాఫ్‌మ్యాన్ అన్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోయింది. కూతుర్ని మురిపెంగా దగ్గరకు తీసుకున్నాడు. (పైన పన్నెండేళ్ల క్రితం ఆస్కార్ వేడుకలో రుబీనా (9), (కింద) ప్రస్తుతం రుబీనా (21) లాక్‌డౌన్‌కి సడలింపులు రాగానే హాఫ్‌మ్యాన్ తిరిగి టూర్‌కి రెడీ అయ్యారు. ఈలోపు మలీషా ‘వ్లోగింగ్’ (వెబ్సైట్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం) కోసం మంచి కెమెరా ఉన్న సెల్‌ఫోన్‌ను గిఫ్టుగా ఇవ్వబోతున్నాడు. అప్పటికే అతడు మలీషా పేరు మీద ‘గోఫండ్‌మి’ అనే వెబ్ పేజీని క్రియేట్ చేశాడు. ఇంతవరకు మలీషాకు 76 వేల రూపాయల విరాళాలు వచ్చాయి. హాఫ్మ్యాన్ని రాబర్ట్ అంటుంది మలీషా. ‘‘నా కలల్ని నిజం చేసుకోడానికి రాబర్ట్ నాకు చాలా హెల్ప్ చేశారు’’ అంటోంది తను. పన్నెండేళ్ల క్రితం రుబీనా బాంద్రాకు సమీపంలోని మురికివాడల మట్టి నుంచే పన్నెండేళ్ల క్రితం రూబినా అలీ అనే మాణిక్యం బయటపడింది. ఎనిమిది కేటగిరీలలో ఆస్కార్ గెలుచుకున్న ‘స్లమ్‌డాక్ మిలియనీర్’ చిత్రంలోని బాలనటిగా రుబీనాకు గుర్తింపు వచ్చింది. ఆ సినిమా దర్శకుడు డ్యానీ బోయల్ ‘జయహో ట్రస్టు’ కింద బాంద్రాలోనే కట్టించి ఇచ్చిన సొంత ఇంట్లో ఇప్పుడు రుబీనా కుటుంబం ఉంటోంది. రుబీనా ప్రస్తుతం (లాక్డౌన్ ముందు వరకు) ఓ మేకప్ స్టూడియోలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. బాంద్రా మురికివాడలో మలీషా ఉంటున్న ఇల్లు -
అతనే నా మొదటి ప్రియుడు: నటి
హాలీవుడ్లో మంచి వసూళ్లను సాధించిన ‘ట్విలైట్’ చిత్రంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుక్ను హీరోయిన్ క్రిస్టెన్ స్టీవార్ట్. ఈ హీరోయిన్ గతంలో పలువురు సెలబ్రిటీలతో డేటింగ్లో పాల్గొనగా ప్రస్తుతం స్వలింగ సంపర్కురాలిగా ముద్ర వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్విలైట్ సినిమాల సిరీస్‌లో తనతోపాటు స్క్రీన్ షేర్ చేసుకున్న హీరో రాబర్ట్ పాటిన్సన్తో ఉన్న రిలేషన్‌ను మరోసారి ఆమె బయటపెట్టింది. ట్విలైట్ సిరీస్‌లో తెరపై కనిపించే ప్రేమ నిజజీవితంలోనూ అలాగే ఉండేదని తెలిపింది. ఆ ప్రేమ అబద్ధం కాదని స్పష్టం చేసింది. గతంలో విచ్చలవిడిగా తిరిగిన ఈ జంట డేటింగ్ కూడా చేసింది. గతంలో రాబర్ట్‌తో సాగిన ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా తాము చాలా సంవత్సరాలు కలిసి ఉన్నామని, అతనితో చిగురించిన ప్రేమే తనకు ఫస్ట్ లవ్ అని క్రిస్టెన్ చెప్పుకొచ్చింది. అతనే తన బెస్ట్ అని ప్రకటించింది. ఇక పాటిన్సన్ నిన్ను పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకుంటారా అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు చెప్పలేమన్నట్టుగా మాట దాటవేసింది. లెస్బియన్‌గా ప్రకటించుకున్న స్టీవార్ట్ ప్రస్తుతం డైలన్ మేయర్ అనే సహనటితో డేటింగ్లో ఉంది. ఇక క్రిస్టెన్ స్టీవార్ట్, నవోమీ స్కాట్, ఎల్లా బాలిన్స్కా ప్రధాన పాత్రల్లో నటించిన చార్లెస్ ఏంజెల్స్ నవంబర్ 15న విడుదల కానుంది. మరోవైపు క్రిస్టెన్ మాజీ ప్రియుడు పాటిన్సన్ బాట్మన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం 2021, జూలై 25న విడుదల కానుంది. -
ఎలుకల మందు పరీక్షించబోయి..
కృష్ణా జిల్లా: ఓ యువకుడి తెలివితక్కువతనం అతడి ప్రాణాలు పోయేలా చేసింది. తాను కొనుక్కొచ్చిన మందు సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి రుచి చూశాడు. దీంతో అస్వస్థతకు లోనైన ఆ యువకుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రాబర్ట్ అనే యువకుడు ముసునూరు మండలంలోని చర్చిలో పాస్టర్‌గా శిక్షణ పొందుతున్నాడు. చర్చిలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో ఎలకల నివారణ మందు తీసుకువచ్చి రుచి చూసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాబర్ట్ కిస్పోటా మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పేవుల్లో బ్లూటూత్ ట్యాబ్లెట్!
కడుపు, పేవుల్లో ఏదైనా ఒక సమస్య వస్తే డాక్టర్ మందిస్తాడు. ఇలా కాకుండా, సమస్య వచ్చిందని తెలిసిన వెంటనే అక్కడికక్కడే కొన్ని మందులు విడుదలైపోతే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని త్వరలో ఈ అద్భుతం సాకారం కానుంది. పేవుల్లోకి చేరి నెలరోజులపాటు అక్కడే ఉంటూ క్రమక్రమంగా మందులు విడుదల చేసే సరికొత్త గాడ్జెట్ ఒకదాన్ని వీరు తయారు చేశారు. అంతేకాదు, శరీరం లోపలి నుంచే ఈ గాడ్జెట్ బ్లూటూత్ టెక్నాలజీ సాయంతో సమాచారాన్ని బయటకు పంపుతూ ఉంటుంది కూడా! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో ప్రత్యేకమైన ప్లాస్టిక్‌తో తయారైన ఈ గాడ్జెట్ నెల రోజుల తరువాత నిరపాయకరంగా శరీరం నుంచి బయటపడిపోతుంది. ఈ గాడ్జెట్‌ను ఇప్పటికే తాము పందుల్లో ఉపయోగించి పరీక్షించామని సానుకూల ఫలితాలు రాబట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రాబర్ట్ లాంగర్ తెలిపారు. బ్లూటూత్ సంకేతాల ద్వారా అవసరమైనప్పుడు మందులు విడుదల చేసేందుకూ అవకాశం ఉంటుందని చెప్పారు. పరిశోధన వివరాలు అడ్వాన్స్డ్ మెటీరియల్స్ టెక్నాలజీస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!
-
చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!
ఎప్పుడైనా సరదాగా చేపలు పట్టాలంటే ఏం చేస్తాం?. ఓ గాలం దానికి ఏర ఇలా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని వేటకు బయల్దేరుతాం. కానీ, అమెరికాలోని అలబామాలో నివసిస్తున్న రాబర్ట్ మాత్రం ఒట్టి చేతులతో చేపల వేటకు బయల్దేరతాడు. చిన్న చేపను ఎరగా చూపి పెద్ద చేపను పట్టేస్తాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. చిన్న చేపను ఎరగా చూపిన రాబర్ట్.. పెద్ద చేప దాన్ని తినడానికి నోరు తెరిచింది. అంతే తన వేళ్లతో చేపను గట్టిగా పట్టుకుని బయటకు తెచ్చేశాడు రాబర్ట్. ఆ తర్వాత మళ్లీ దాన్ని తిరిగి నీటిలోకి వదిలేశాడు. మరి చేపలను చేతితో పట్టే టెక్నిక్ మీరు కూడా చూసేయండి. -
ఇంజనీరింగ్ వైపు 80 శాతం యువత చూపు
అధిక జీతం, ఎక్కువ అవకాశాలే కారణం ముంబై: కొత్త కోర్సులు, కొత్త కొత్త ఉద్యోగాలు ఎన్నొస్తున్నా.. ఇంజనీరింగ్ చేసేందుకే భారత యువత ఆసక్తి చూపుతోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఈ రంగంలోనే ఎక్కువ సంపాదనతో పాటు సృజనాత్మకత కూడా ఎక్కువని యువత భావిస్తోందని క్వీన్స్ ఎలిజబెత్ ప్రైజ్ ఫర్ ఇంజనీరింగ్ సంస్థ సర్వేలో తేలింది. ఇండియా, టర్కీల్లో 16-17ఏళ్లున్న వారిలో 80 శాతం ఇంజనీరింగ్ పట్టా అందుకునేందుకే ఆసక్తి చూపుతోందని సర్వే చెప్పింది. ఎక్కువగా సంపాదించే అవకాశం, ఉజ్వలమైన కెరీర్ ఇంజనీరింగ్‌లోనే ఉందనే అభిప్రాయం అభివృద్ధి చెందుతున్న దేశాల యువతలో వ్యక్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ పట్టాకున్న విలువ కారణంగా అవకాశాలు సృష్టించుకోవచ్చని.. దీంతోపాటు సమాజ సేవ చేసేందుకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని.. 2015 సంవత్సరానికి క్వీన్స్ ఎలిజబెత్ ప్రైజ్ ఫర్ ఇంజనీరింగ్ విజేత డాక్టర్ రాబర్ట్ లాంగన్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంజనీరింగ్ విద్యకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుండటం కూడా యువత ఆసక్తి ఇటువైపు మారేందుకు కారణమని తేలింది. అమెరికా, జర్మనీ, భారత్‌లలో ఇలా ఆలోచించే యువత మరింత ఎక్కువగా ఉన్నారని రాబర్ట్ తెలిపారు. -
నిజం చంపుతుంది
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 4 కేప్కార్లోని ఐదు వందల ఇళ్లల్లో రాబర్ట్ది ఒకటి. అతని ఎదురిల్లు లిచీది. రెండు నెలల క్రితం రాబర్ట్ ఆ ఇంట్లోకి మారినప్పటినించి రాబర్ట్‌కి, అతని భార్య సిల్వియాకి ఓ సమస్య ఎదురైంది. అది ఎదురింటి లిచీయే. ఆమె సదా తమని గమనిస్తోందని వాళ్లు మొదటి వారంలోనే గ్రహించారు. వాళ్లు ఎప్పుడూ తలుపు తెరిచి బయటికి వెళ్లినా అంతసేపూ తెరిచి ఉన్న ఎదురింటి కిటికీ వెనీషియన్ బ్లైండ్స్ మూసుకుంటాయి. తమ కిటికీ వెనీషియన్ బ్లైండ్స్‌ని ఎప్పుడు ఎత్తిచూసినా ఆమె కిటికీ వెనీషియన్ బ్లైండ్స్ వెనక రెండు కళ్లు కనిపించసాగాయి. వాటిని తెరిచి లిచీ తమ ఇంటినే గమనిస్తోందని వారు ఇట్టే గ్రహించారు. అది వాళ్లకి ఇబ్బందిగా ఉంది. ‘తెల్లవారుఝామున నాలుగున్నరకి బాత్రూంలో లైట్ వెలిగిందే? నిన్న రాత్రి మీలో ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? మీ మధ్య పోట్లాటలే ఉండవనుకుంటా. మీ ఇద్దరి గొంతులూ నేనెప్పుడూ వినలేదు’ లాంటివి లిచీ తమ డోర్ బెల్ నొక్కి అడిగి తెలుసుకుని, తను చేసిన ‘ఏపిల్ పై’ నో, గుమ్మడి సూప్నో ఇచ్చి వెళ్తూంటుంది. రాబర్ట్, సిల్వియాలు ఆ సమస్య మీద చర్చించుకున్నారు. ‘‘ఆమెకి ఇంతదాకా పెళ్లికాలేదు. బహుశ ఓ జంటని గమనించడం ఆమెకి ఆనందాన్నిస్తుందేమో?’’ సిల్వియా చెప్పింది. ‘‘లేదా అసూయతో చూస్తోందేమో?’’ రాబర్ట్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘‘అసూయే అయితే కష్టమే. అది మనకి మంచిది కాదు.’’ సిల్వియా చెప్పింది. ‘‘ఆవిడతో మనకి స్నేహమూ లేదు. శత్రుత్వమూ లేదు. స్నేహం కలిగితే ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి లిచీ పలకరించినా ఆమెతో మాట్లాడకు. శత్రుత్వం ఉంటే మనమీద ఆసక్తి పోతుంది’’ రాబర్ట్ సూచించాడు. ‘‘నాకన్నా మీరే తెలివిగలవారు. కాబట్టి ఎలా శత్రువులం అవుతామో కూడా మీరే ఆలోచించండి.’’ రాబర్ట్ నాలుగైదు రోజులు ఆలోచించాక చెప్పాడు. ‘‘రేపు ఏప్రిల్ ఫస్ట్. మనకి లిచీతో శత్రుత్వం తెచ్చుకోడానికి ఓ మంచి అవకాశం వచ్చే రోజు.’’ ‘‘ఎలా?’’ సిల్వియా ప్రశ్నించింది. ‘‘మనం ఏదైనా నేరం చేసినట్లుగా లిచీ పోలీసులకి ఫిర్యాదు చేసేలా చేస్తే వాళ్లు మన దగ్గరికి వస్తారు. ఆ నేరం జరగలేదని తెలిశాక మనమీద తప్పుడు ఫిర్యాదు ఇచ్చినందుకు వాళ్లు లిచీని మందలిస్తారు. దాంతో తనని ఫూల్ చేసినందుకు ఆమెకి మనమీద ద్వేషం కలుగుతుంది.’’ ‘‘బావుంది. ఆ తర్వాత మన ఇంటి బయట ‘ఏప్రిల్ ఫూల్’ అనే బోర్డుని ఉంచుదాం. అది చూసినప్పుడల్లా ఆమె మనసు భగ్గుమంటుంది. ఇక మన జోలికి రాదు. కాని ఏం నేరం చేసినట్లుగా మనం నటించాలి?’’ సిల్వియా నవ్వుతూ ప్రశ్నించింది. ‘‘పోలీసులు తక్షణం చర్య తీసుకునే నేరం ఒకటి ఉండనే ఉందిగా’’ రాబర్ట్ నవ్వుతూ చెప్పాడు. ‘‘ఏమిటది?’’ సిల్వియా ఆసక్తిగా అడిగింది. ఇంటి బయట తన కారు దగ్గరికి వచ్చిన సిల్వియాకి ఎదురింటి కిటికీ బ్లైండ్స్ మూసుకోవడం కనపడింది. లిచీ అక్కడే ఉండి సన్నటి కంతలోంచి తనని గమనిస్తోందని ఆమెకి తెలుసు. ‘‘సిల్వియా. ఇంట్లోకి రా’’ రాబర్ట్ గుమ్మంలోంచి గట్టిగా పిలిచాడు. బయట కారు దగ్గర ఉన్న సిల్వియా లోపలకి రాకపోవడంతో రాబర్ట్ మళ్లీ అరిచాడు. ‘‘సిల్వియా. నిన్నే! రమ్మన్నాను.’’ ‘‘నేను రాను రాబర్ట్. నీతో విసిగిపోయాను. నువ్వో మృగానివి. ఇక నీతో కలసి జీవించలేను’’ సిల్వియా కోపంగా అరిచింది. లిచీ చెవిటిదైతే తప్ప ఆమెకి వారి మాటలు వినపడకుండా ఉండవు. రాబర్ట్ బయటికి పరిగెత్తుకు వచ్చి సిల్వియా చేతిని గట్టిగా పట్టుకుని లోపలికి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె విదిలించుకుని అరిచింది. ‘‘వదలండి. నన్నాపద్దు. మీరు సారీ చెప్పరు. నేను వెళ్తున్నాను. మీకు విడాకులు ఇవ్వదలచుకున్నాను.’’ ఆ కుటుంబ కలహాన్ని లిచీ కళ్లు పెద్దవి చేసుకుని ఆసక్తిగా గమనించసాగింది. ‘‘తప్పు నీది. ఐనా సారీ చెప్పనన్నావు. సారీ చెప్పి ఇంట్లోకి రా. నేనెందుకు సారీ చెప్పాలి?’’ రాబర్ట్ కంఠం పెంచాడు. ‘‘మీరు ఇప్పుడు సారీ చెప్పినా నేను రాను.’’ వెంటనే రాబర్ట్ ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్లి చేతిలో ఓ సుత్తితో బయటికి వచ్చి అడిగాడు. ‘‘ఆఖరిసారి అడుగుతున్నాను. మర్యాదగా ఇంట్లోకి రా.’’ ‘‘రాను. ఏం చేస్తారేమిటి?’’ సిల్వియా ఉక్రోషాన్ని నటిస్తూ అడిగింది. ఆమె కన్ను కొట్టింది. రాబర్ట్ నవ్వుని ఆపుకుని సుత్తితో ఆమె నెత్తిమీద కొట్టినట్లు నటించాడు. ముందు అనుకున్నట్లుగా సిల్వియా కెవ్వున అరిచి నేలమీద కూర్చుంది. రాబర్ట్ మరో రెండు దెబ్బలు వేయడం లిచీ చూసింది. కాని కారువెనక కూర్చున్న సిల్వియాకి అవి తాకాయో లేదో కనపడలేదు. ఆమె అరుపులు మాత్రం వినపడ్డాయి. రాబర్ట్ కారు డిక్కీ తలుపు తెరిచి అందులో సిల్వియా శరీరాన్ని ఉంచి మూసి కారెక్కి పోనించాడు. కొద్ది దూరం వెళ్లాక తమ పథకం ప్రకారం కారుని ఆపి సిల్వియాని ముందు సీట్లో ఎక్కించుకోవాలని కారుని ఆపబోయాడు. దాని వేగం తగ్గగానే వెనక నించి వచ్చే ఓ లారీ అతని కారు వెనక ఫెండర్‌ని ఎడమవైపు రాసుకుంటూ వెళ్లిపోయింది. ‘ఇడియట్’ అని తిట్టుకుంటూ కారు దిగి డిక్కీ తలుపు తెరిచాడు. సిల్వియా గడ్డం నించి కిందికి కారుతున్న రక్తాన్ని చూశాడు. ఆమె మరణించిందని కొద్ది నిమిషాల్లో తెలుసుకున్న రాబర్ట్‌కి ముచ్చెమటలు పోశాయి. జీవం లేకుండా చూేన సిల్వియా కళ్లని చూడలేక కనురెప్పలని మూసేశాడు. అతనిలో దుఃఖం, భయం రెండూ సమానంగా తన్నుకు వచ్చాయి. ఆ సరికే లిచీ పోలీసులకి ఫోన్‌చేసి ఉండచ్చు. తను ఇంటికి తిరిగి వెళ్లేసరికి వాళ్లు తనకోసం ఎదురు చూస్తూంటారు. ఎంతో నైపుణ్యంగా తను అల్లిన సాలెగూడులో తనే చిక్కుకున్నాడు! రక్తం డిక్కీలోకి కారకుండా దుప్పటి మీదకి కారడం అదృష్టం అనుకున్నాడు. ఆమె తప్ప మరో సాక్షి లేరు. ఒంగి ‘సిల్వియా! సారీ’ అని ఆమె శవాన్ని ఎత్తి భుజాన వేసుకున్నాడు. టూల్ బాక్స్‌లో తవ్వడానికి అణుగుణంగా ఓ పెద్ద స్క్రూ డ్రైవర్ కనిపించింది. ఉదయం పదిన్నరకి డోర్ బెల్ మోగితే రాబర్ట్‌కి మెలకువ వచ్చింది. గత రాత్రి జరిగింది గుర్తుకురాగానే పోలీసులు వచ్చి ఉంటారని అనుకున్నాడు. లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా లిచీ! చేతిలోని గిన్నెలో హేంబర్గర్, చికెన్ శాండ్విచ్లు కనిపించాయి. ‘‘సిల్వియా వెళ్లిపోయిందిగా. ఇక మీ ఆలనా పాలనా నేనే చూసుకుంటాను. ఇదవకండి.’’ చెప్పి దాన్ని ఇచ్చి వెళ్లిపోయింది. అతనికి చాలా రిలీఫ్ కలిగింది. ఆ మధ్యాహ్నం లిచీ మళ్లీ వచ్చింది. ‘‘రేపట్నించీ మా ఇంట్లోనే మీ తిండి, పడక. ఒకే పడక మనది. దీన్ని ఖాళీ చేసేయండి. ఇవాళ నేనే వండుతాను. దేనికి పోట్లాడుకున్నారు?’’ వంట చేస్తూ లిచీ ప్రశ్నించింది. ‘‘మా మధ్య పోట్లాట లేదు. మిమ్మల్ని దూరంగా ఉంచాలని...’’ నిజాన్ని దీనంగా లిచీకి వివరించాడు. ఆమె దాన్ని మౌనంగా విని దీర్ఘంగా నిట్టూర్చింది. లిచీ వంట అధ్వానంగా ఉంది. అతను తిన్నాక బయటికి వెళ్తూ గుమ్మం దగ్గర ఆగి చెప్పింది. ‘‘మీరు ఆ నిజం చెప్పకుండా ఉండాల్సింది. కొన్ని నిజాలు సుత్తి దెబ్బల కన్నా బాధిస్తాయి.’’ ‘‘సారీ’’ వెంటనే ఆమెకి క్షమాపణ చెప్పాడు. గంట తర్వాత డోర్ బెల్ మోగింది. ఆమె మనసు మార్చుకుని సారీ చెప్పడానికి వచ్చిందని అనుకుని లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా యూనిఫాంలోని పోలీసులు. ఒకడు అతని కారు డిక్కీ తలుపు తెరిచి చూస్తున్నాడు. ‘‘మీమీద ఓ ఫిర్యాదు అందింది’’ రెండో పోలీస్ అధికారి చెప్పాడు. లిచీ ఇంటి కిటికీ బ్లైండ్స్ కొద్దిగా పెకైత్తి ఉన్నాయి. -
కథ: చినిగిన చిత్తరువు
గత ఏడు నెలలుగా ప్రతి నెలా మొదటి శనివారం ప్లీ మార్కెట్టుకి వెళ్లడమే నా పని. రాబర్టుకి నేను ఉదయమే వెళ్లిపోవడం అస్సలు ఇష్టం ఉండదు. నిన్న రాత్రి నేను పడుకోబోయే ముందు చెప్పడానికి వెళ్లాను. నన్ను చూడగానే కంప్యూటర్లో ఒక బొమ్మ చూపించాడు. డెబ్భయ్యేళ్ల ముసలామె ఫొటో అది. అక్కడక్కడ నా పోలికలు కనిపిస్తున్నాయి. నలభయ్యేళ్ల తరువాత నేనిలా ఉంటానని చెప్పాడు, నేను ఎవరని అడిగినప్పుడు. రాబర్ట్ పెద్ద సాఫ్ట్వేర్ గీక్. ఇరవై నాలుగ్గంటలూ కంప్యూటరే అతని లోకం. ఫొటోలో ముఖ కవళికల్ని బట్టి వయసు నిర్ధారించవచ్చనీ, అలాగే వయసు మీద పడ్డాక, నా మొహంలో మార్పు కూడా ఈ సాఫ్ట్వేర్ చెబుతుందనీ అన్నాడు. ఇలాంటివి చాలా చూపిస్తూ ఉంటాడు. నేను ఇవేమీ పట్టించుకోను. నాకు కొన్ని అర్థం కావు కూడా. ఎప్పటిలాగే తిట్టుకుంటూ తల పట్టుకున్నాడు. కానీ నేను వెళ్లి తీరాలి. లేకపోతే నెలనెలా మనశ్శాంతి ఉండదు. నేను ఇలా ప్రతి నెలా ఠంచనుగా వెళ్లడానిక్కారణం ఉంది. మా అమ్మ శాండియేగోలో ఉండేది. మా అమ్మకి నేనొక్కత్తినే కూతుర్ని. పది నెలల క్రితం మా అమ్మ పోయింది. ఆవిడ పోయాక, వారసురాలిగా కొంత ఆస్తి నాకొచ్చింది. శాండియేగోలో ఇల్లు అమ్మేసి డబ్బు చేసుకున్నాను. కాలేజీ చదువుకి నేను చాలా అప్పులు చేయాల్సి వచ్చింది. అవన్నీ ఇల్లమ్మితే వచ్చిన డబ్బుతో కట్టేశాను. ఒక్కతే ఉన్నా అమ్మ ఇంటి నిండా సామాన్లే. దానికితోడు అమ్మకి పెయింటింగ్ పిచ్చి. పోయేవరకూ ఆవిడకి అదే కాలక్షేపం. అమ్మ పోయాక, ఆవిడ దగ్గరున్న నలభైకి పైగా మంచి పెయింటింగులు నాతో తెచ్చుకున్నాను. చాలావరకూ బాక్సుల్లో పెట్టి గరాజ్ మొత్తం నింపేశాను. ప్రతి నెలా అమ్మ దాచుకున్న కొన్ని వస్తువులు, పెయింటింగులు ప్లీ మార్కెట్లో అమ్మడానికి వెళతాను. మొదట్లో ఈ సలహా ఇచ్చింది రాబర్టే! గరాజ్ అంతా సామాన్లతో నిండిపోయి, రెండు కార్లూ పార్క్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది. దానికితోడు పిల్లల ఆటబొమ్మలు ఇల్లంతా ఉన్నాయి. గరాజ్ సేల్ పెడదామని మొదట్లో అనుకున్నాను. కానీ రాబర్టే ప్లీ మార్కెట్లో పెడితే అమ్మ పెయింటింగులు అమ్ముడుపోతాయని అన్నాడు. ఇంతకుముందు రాబర్ట్ శాన్ఫ్రాన్సిస్కో వెళ్లి గ్యాలరీల వాళ్లని అడిగి చూశాడు. ఎవరూ అంత ఉత్సాహం చూపించలేదు. అమ్మ పెయింటింగ్స్ అత్యద్భుత కళాఖండాలు కాకపోయినా, ఇంట్లో గోడలకి తగిలించుకోవచ్చు. నా చిన్నప్పుడు కొన్ని పెయింటింగ్ ప్రదర్శనలు కూడా నిర్వహించడం నాకింకా గుర్తుంది. కుపర్టినో డీ యాంజా కాలేజీ ఆవరణలో ప్రతి నెలా మొదటి శనివారం ప్లీ మార్కెట్ పెడతారు. అందులో మనం స్టాల్ పెట్టాలంటే కొంత ఫీజు కట్టాలి. చుట్టుపక్కల ఊళ్ల నుండి అనేకమంది వచ్చి రకరకాల వస్తువులు అమ్ముతారు. కొన్ని కొత్తవి, మరికొన్ని పాతవి. బేరం చేయవచ్చు కూడా. నాకూ గరాజ్ సేల్ కంటే ఇదే బెటరనిపించింది. మొదటిసారి చాలా బీరువా బొమ్మలు అమ్ముడయ్యాయి. కానీ ఒక్క పెయింటింగూ అమ్మకానికి పోలేదు. అక్కడికీ ఒక్కోటి రెండు వందల డాలర్లు పెట్టాను. అసలు బొమ్మ కంటే ఫ్రేములే ఎక్కువ ఖరీదు చేస్తాయి. రెండో విడత నెలలో నా స్టాలు దగ్గరికి ఒక గడ్డం వ్యక్తి వచ్చాడు. ఎర్రటి రాగి జుట్టు, మాసిన బట్టలతో చూడ్డానికి బికారిలా అనిపించాడు. ఆ పెయింటింగులన్నీ ఎంతో తీక్షణంగా చాలాసేపు పరిశీలించి చూశాడతను. కొంతసేపయ్యాక, అందులో ఒక రెడ్ ఇండియన్ బొమ్మ ఉన్న పెయింటింగ్ అమ్ముతావా అని అడిగాడు. నేను దాని ఖరీదెంతో చిన్న కాగితమ్మీద రాసి పెట్టి తగిలించాను. అయినా చెబుదామని అనుకుంటుండగానే జేబులోంచి ఇరవై డాలర్లు చేతిలో పెట్టాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. అది రెండు వందలకి తక్కువగా అమ్మలేనని చెప్పాను. చాలాసేపు బతిమాలాడు. కుదరదని గట్టిగా చెప్పడంతో నాకేసి గుర్రుగా చూస్తూ వెళ్లిపోయాడు. మళ్లా తర్వాతి నెల ఇదే భాగోతం. ఈసారి మరో పది డాలర్లు పెంచి ముప్పైకి అమ్మమన్నాడు. కుదరదని చెప్పి వేరే కస్టమర్ల వైపు దృష్టి మళ్లించాను. కొంతసేపు ఆ పెయింటింగ్కేసి చూసి చూసి వెళ్లిపోయాడు. చూడ్డానికి అతను బీదవాడిలా అనిపించాడు. అతని వాలకం చూస్తే, అలాగే ఉన్నాడు మరి. ఈసారీ అతన్ని పట్టించుకోకపోవడంతో గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. ఇంటికెళ్లాక, రాబర్టుతో చెప్పాను. ‘అమ్మలేకపోయావా?’ అన్నాడు. అమ్మ ఎంతో ఆప్యాయంగా దాచుకున్నవి, మరీ అంత చౌకగా అమ్మలేనని చెప్పాను. ‘‘మీ అమ్మ గుర్తుగా ఉంచుకో; కాదనను. కానీ వాటి నుండి లాభం ఆశిస్తున్నావెందుకు? మీ అమ్మ నుండి నీకూ అప్పనంగా వచ్చినవే కదా?’’ అన్నాడు. చూస్తూ చూస్తూ అంత మంచి పెయింటింగు మరీ ముప్పై డాలర్లకి అమ్మలేనని చెప్పాను. వచ్చే నెల నాతో రమ్మనమని చెప్పాను. మొదట్లో రానన్నాడు. కానీ ఆ గడ్డం వ్యక్తి గురించి చెప్పాక, సరేనన్నాడు. తరువాత నెలలో ప్లీ మార్కెట్టుకి ఎప్పటిలాగే ఆ గడ్డం వ్యక్తి వచ్చాడు. ఈసారి మరో పది డాలర్లు పెంచి నలభయ్యన్నాడు. నేను అతన్ని చూశాను కానీ పట్టించుకోలేదు. రాబర్టే అతనికి జవాబు చెప్పాడు. గత మూడుసార్లుగా వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావని చెబుతూ, అతనికి అమ్మనని కరాకండిగా చెప్పేశాడు. ఈసారి వస్తే పోలీసు కంప్లయింట్ ఇస్తానని బెదిరించాడు. రాబర్టుకేసి కొరకొరా చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతని రూపం చూస్తే స్ట్రీట్ బెగ్గర్లా ఉన్నాడని అన్నాడు. ఈ నెల ఒక్క పెయింటింగూ అమ్ముడు పోలేదు. వచ్చే నెల నుండి ఇహ రాకూడదని నిశ్చయించుకున్నాను. రోజంతా ఈ ప్లీ మార్కెట్ పనే తినేస్తోంది. ఓ రెండు వారాల తర్వాత రాబర్టు కొలీగ్ మేనల్లుడు ఒకతను శాన్ ఫ్రాన్సిస్కో ఆర్ట్ గ్యాలరీలో పనిచేస్తాడనీ, అతణ్ని ఇంటికి తీసుకొస్తాననీ చెప్పాడు. అతన్ని వెంటబెట్టుకుని ఓ రోజు వచ్చి అన్ని పెయింటింగులూ చూపించాడు. అన్నీ చాలా బావున్నాయి కానీ పాతబడిపోయాయని పెదవి విరిచాడు. వచ్చే నెల శాంతా క్లారాలో పురాతన వస్తు ప్రదర్శనలో పెట్టమని చెప్పాడు. దానికి తన దగ్గర రెండు ఫ్రీ పాసులున్నాయని చెప్పాడు. అక్కడ వీటికి వెల కట్టవచ్చని, అక్కడికి వచ్చినవాళ్లలో ఎవరైనా కొనే అవకాశం ఉంటుందని చెప్పాడు. లేదంటే క్రైగ్స్ లిస్టు వెబ్సైటులో పెట్టమని సలహా ఇచ్చాడు. ఓ రెండు వారాల తర్వాత మాకు యాంటీక్ షో పాసులు పట్టుకొచ్చి ఇచ్చాడు. ప్రతి ఊళ్లోనూ ఏడాదికి రెండుసార్లు ఈ యాంటిక్ షో పెడతారని తరువాత తెల్సింది. మన దగ్గరవున్న అరుదైన పురాతన వస్తువులుంటే వాటికి వెల కడతారు. ఒక్కోసారి మనం పనికిరానివనుకున్న వస్తువులు వేలకొద్దీ అమ్ముడుపోయే అవకాశం ఉంది. పురాతన వస్తువుల అమ్మకం అమెరికాలో చాలా పెద్ద వ్యాపారం అని మెల్లగా అర్థమైంది. ఈ యాంటీక్ షోకి చచ్చేటంతమంది జనం వచ్చారు. వచ్చినవాళ్లలో సగం జనాభా నాలాంటి వాళ్లేననిపించింది. మాకు మధ్యాహ్నం మూడింటికి సమయం కేటాయించారు. అంతవరకూ ఒక గోడకి ఆనించి మూలగా ఒకవైపు పెట్టాను. వచ్చిపోయేవాళ్లు కొంతమంది వచ్చి చూసిపోతున్నారు. మా వంతు వచ్చింది. మమ్మల్ని పిలవగానే అక్కడికి వెళ్లాం. ఒకతను వచ్చి పెయింటింగులన్నీ చూశాడు. మేం పట్టుకెళ్లినవాటిలో మూడొంతులు పైగా ఆరువందలకి మించి వెల కట్టలేనని చెప్పాడు. చివర్లో వెళుతూ అక్కడ వెనక్కి తిప్పబడున్న మరో పెయింటింగ్ తిప్పి చూశాడు. కొంతసేపు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఈ పెయింటింగ్ ఎక్కడిదని తేరిపార చూస్తూ అన్నాడు. మా అమ్మ ఆర్టిస్ట్ అనీ, ఇవన్నీ ఆవిడ సేకరించుకున్న చిత్రాలనీ చెప్పాను. అతను ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘ఇది చాలా అరుదైన పెయింటింగ్. దీని విలువ కనీసం వంద వేల డాలర్లుండొచ్చు’’ అన్నాడు. రాబర్టుకి, నాకు నోట మాట రాలేదు. ఈ చిత్రం విశేషం తెలుసాని అడిగాడు. చెప్పొద్దూ, నాకు చిన్నప్పట్నుండీ ఈ చిత్రకళ మీద అస్సలు ఇష్టం లేదు. అమ్మ ప్రయత్నించింది కానీ, నాకు అబ్బలేదు. బలవంతపు ప్రోత్సాహం వలన కళలు అబ్బవని అమ్మ చాలా ఆలస్యంగా గ్రహించింది. నేనూ ఆ చిత్రం కేసి మరోసారి పరిశీలనగా చూశాను. కొట్టొచ్చినట్లు రంగులు కనిపిస్తూ ఒక రెడ్ ఇండియన్ చిత్రం. ఆ రెడ్ ఇండియన్ చేతిలో ఒక పెద్ద దండం ఉంది. రంగు రంగుల పక్షి ఈకల కిరీటమూ, అటవిక దుస్తులు ధరించి ఉన్నాడు. రంగులతో ప్రత్యేకంగా కనిపిస్తోంది కానీ అంతకుమించి నాకేం కనిపించలేదు. అదే ఆ మదింపు వేసే వ్యక్తితో అన్నాను. ‘‘ఈ చిత్రంలో గొప్పదనం ముందున్న రెడ్ ఇండియన్‌ది కాదు. వెనుక ఉన్న బ్యాక్గ్రౌండుది. పరిశీలనగా చూడండి. అది ఒక ఆవర్జా చిట్టా బ్యాక్గ్రౌండులో వేశారు. ఈ చిత్రం వేసింది బలూయీ అన్న చిత్రకారుడు. ఇది సుమారు అరవయ్యేళ్ల నాటి అరుదైన చిత్రం. ఇదొక్కటే కాదు దీని వెనుకాల చరిత్ర చాలా ఉంది’’ అని అన్నాడు. నేను, రాబర్ట్ దాని వెల ఊహకందనంతగా ఉండటం అన్న ఆశ్చర్యంలోనే ఇంకా మునిగి ఉన్నాం. అతని మాటలు అంతగా మా బుర్రకెక్కలేదు. మరలా అతనే చెప్పుకొచ్చాడు. ‘‘పద్దెనిమిది వందల డెబ్భై, ఎనభై ప్రాంతాల్లో సైంట్ అగస్టీన్, ఫ్ల్లారిడా పరిసరాల దగ్గర తెల్లవాళ్లకి, రెడ్ ఇండియన్ జాతులు కియోవా, చెయన్నే, కమాడో, చెరోకీ వారికీ మధ్య యుద్ధం జరిగింది. దీన్నే రెడ్ రివర్ యుద్ధం అంటారు. ఈ ఇండియన్ తెగలకి ప్రత్యేక ప్రతిపత్తికి వ్యతిరేకంగా తెల్లవాళ్లు చాలాకాలం యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చాలామంది రెడ్ ఇండియన్ తెగలవాళ్లు బందీలయ్యారు. సరిగ్గా ఆ సమయంలో కల్నర్ రిచర్డ్ ప్రాట్ అనే అధికారి ఈ బందీలైన రెడ్ ఇండియన్లని అమెరికన్ జీవన స్రవంతిలో భాగం చేయాలన్న ఉద్దేశ్యంతో, వెస్ట్రన్ అమెరికన్ కల్చరు గురించి వారికి అవగాహన ఏర్పరిచే నెపంతో చిత్రకళని ప్రోత్సహించాడు. వాళ్లకి రంగు రంగుల పెన్సిళ్లు, రంగులు అందించాడు. ఈ రెడ్ ఇండియన్స్‌నే నేటివ్ అమెరికన్స్ అని అంటారని తెలుసు కదా! ఆ బందీలు తమ సంస్కృతినీ, అప్పటి యుద్ధం తాలూకు అణచివేతనీ బొమ్మల రూపంలో వేసి ఈ అవకాశాన్ని వాడుకున్నారు. చూస్తూండగా కాగితం కొరత ఏర్పడింది. కాగితం దొరక్కపోయేసరికి వాళ్లు దుకాణాల్లో పాతబడిన ఆవర్జా చిట్టా కాగితాల మీద బొమ్మలేసేవారు. దీన్నే లెడ్జర్ పెయింటింగ్ అంటారు. చాలామంది ఈ చిత్రాలని ఒక జాతి సాంస్కృతిక విధ్వంసానికి ప్రతీకలుగా పరిగణిస్తారు. పాల్ కరిల్, వోహా, హౌలింగ్ లాంటి ఎంతోమంది ఆర్టిస్టులు అద్భుత కళాఖండాలు చిత్రీకరించారు. మీ దగ్గరున్న చిత్రం ఆ లెడ్జర్ పెయింటింగ్ ఆధారంగా 1930-40 ప్రాంతాల్లో వేసిన చిత్రం. మీ అమ్మగారు చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. ఇది చాలా అరుదైన పెయింటింగ్. మరికొంతమంది ఎక్స్పర్టులకి చూపించి కచ్చితమైన విలువ, కాలము అంచనా వేయొచ్చు. ఒకటైతే చెప్పగలను, ఇది మాత్రం బలొయీ సంతకం. ఇతను ఆ కాలం వాడే! 1940 ప్రాంతాల్లో పోయాడు’’ అంటూ వివరం చెప్పాడు. నాకు, రాబర్టుకి నోట మాట రాలేదు. కళ్లప్పగించి వింటున్నాం. నాకైతే ఒక్కసారి ప్లీ మార్కెట్లో బికారతను గుర్తుకొచ్చాడు. బహుశా వాడు బలొయీ సంతకం గుర్తుపట్టుండవచ్చు. అందుకే రెండు మూడుసార్లు మరలా మరలా వచ్చాడు. ఆ షోలో చిత్రం వెలకట్టినతను మాచేత చాలా కాయితాలు పూర్తిచేయించాడు. తనకి తెలిసున్న కొంతమందికి ఈ చిత్రం గురించి చెబుతానని చెప్పాడు. మాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఇంటికొస్తూ దారి పొడుగునా దీని గురించే చర్చ. ఆ బికారతనికి రాబర్టు పోరు పడలేక నేను అమ్మేసుంటే ఎంత నష్టపోయుండేవాళ్లమో కదా అనుకున్నాను. ఆ మర్నాడు ఒక పెయింటింగ్ గ్యాలరీ ఏజెంట్ శాన్ఫ్రాన్సిస్కో నుండి కాల్ చేశాడు, పెయింటింగ్ చూడ్డానికి వస్తానని. వచ్చి చూసి అతను వంద వేల డాలర్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇది బలొయీ ఒరిజినల్ పెయింటింగ్ అని అతనితో వచ్చిన మరో వ్యక్తి నిర్ధారణ చేశాడు. రేపు శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి డీల్ సైన్ చేయాలని అన్నాడు. మా ఆనందానికి అవధుల్లేవు. వాళ్లు వెళ్లాక, బలొయీ గురించి రాబర్ట్ ఇంటర్నెట్లో వివరాల కోసం వెతికాడు. చాలా వివరాలే సంపాదించాడు. అతను 1945లో పోయాడనీ, అతను వేసిన బొమ్మలు చాలా మ్యూజియాల్లో ఉన్నాయనీ తెలిసింది. అతని ఫొటో కూడా ఒక చోట దొరికిందతనికి. బలొయీ నలభయ్యేళ్ల వయసులో ఉండగా ఉన్న చిత్రం. అదీ ఒకతను వేసిన పెయింటింగ్. కొంతసేపయ్యాక నన్ను గట్టిగా పిలిచాడు. ఏమయ్యిందాని పరిగెడుతూ అతని దగ్గరికొచ్చాను. ‘‘నేను ఆ బలొయీ ఫొటోకి మనం చూసిన బికారతని గెడ్డం పెట్టి ఏజ్ డిటెక్షన్ సాఫ్ట్‌వేర్‌లో రకరకాలుగా ప్రయత్నించా. ఈ ఫొటో చూడు. అచ్చం మనం ప్లీ మార్కెట్లో కలిసినతనిలాగే లేడూ?’’ పరిశీలనగా చూస్తే అచ్చం అలాగే ఉన్నాడు. అంటే ఆ చిత్రాలు కొంటానన్న వ్యక్తి ఈ బలొయీ బంధువా? ‘‘రాబర్ట్! ఈ ఫొటోలో ఉన్న ఇతని వయసెంత ఉండచ్చు?’’ అని అడిగాను. కొంత లెక్కలు కట్టి అరవై దాటుండచ్చని అన్నాడు. అయితే మనం చూసినతను బలొయీ కొడుకయ్యుండచ్చని నిర్ధారణకొచ్చాం. ఇది మా ఊహ మాత్రమే! ‘‘నాకైతే అతనికి, బలొయీకి పోలికలు స్పష్టంగా కనిపించాయి. అందుకే అతను పదే పదే ఆ ఒక్క చిత్రం కోసమే మూడు సార్లొచ్చాడు.’’ ‘‘అయితే కొనచ్చుగా! మరీ గీకి గీకి బేరాలాడాడు కదా?’’ అన్నాను. ‘‘బహుశా అతని దగ్గరంత డబ్బుల్లేవేమో? మనకి తెలియదు కదా? నిజంగా అతను బలొయీ కుటుంబానికి చెందినవాడైతే ఈ చిత్రం అతనికి దక్కాల్సిందే!’’ అన్నాడు. నేను దానికి ఒప్పుకోలేదు. అది మా అమ్మ కొనుక్కుని ఉండొచ్చు. లేదా ఎవరైనా బహుమతిగా ఇచ్చుండొచ్చు. అయినా అది మా అమ్మ ఆస్తి. ‘‘నేను చెప్పేది హక్కుల గురించి కాదు. మన అవగాహనా లేమి గురించి. మనకి ఈ పెయింటింగుల విలువ తెలీదు. అందులో ఉండే కష్టము, వాటి వెనకాల కథ, చరిత్ర తెలీదు. మనలాంటి వాళ్ల వల్ల చరిత్ర చాలా ధ్వంసం అవుతుందనిపిస్తోంది. నువ్వూ నేనూ దీన్ని కాపాడాల్సింది పోయి, లాభపడాలనుకుంటున్నాం. ఇదే కాదు, మీ అమ్మ దాచుకున్న వస్తువుల్లో చాలా భాగం అమ్మేశాం. అందులో ఏది పనికొచ్చేదో ఏది పనికిరానిదో మనకి తెలియదు. నిజానికి మనం ఆ యాంటీక్ షోకి వెళ్లకపోయుంటే ఓ వంద డాలర్లకి అమ్మేసుండేవాళ్లం కాదా? అందుకే అతనికి చెందాలన్నాను. అయినా ఇది నీ ఆస్తి. ఏం చెయ్యాలన్నది నీ ఇష్టం.’’చాలాసేపు ఆలోచనలో పడిపోయాను. పదే పదే ఆ గడ్డపు వ్యక్తి గుర్తుకొచ్చాడు. నేను అతనితో ఎంతో అగౌరవంగా ప్రవర్తించాను. కనీసం ఒక్కసారైనా అతని గురించి అడిగే ప్రయత్నం చేయలేదు. ఎంత ఇష్టం లేకపోతే అతను ప్రతి నెలా పని కట్టుకొస్తాడు. రాబర్ట్ చెప్పినట్లు అతని దగ్గర అంత డబ్బులేదేమో? రాత్రంతా ఆలోచనలతో నిద్రపట్టలేదు. నాకు అమ్మ ద్వారా చిత్ర కళంటే పరిచయం ఉంది కానీ దాని విలువ తెలీదు. అమ్మకి విలువైనది, నాకు పనికి రాలేదు. అందులోనూ లాభం వెతుక్కున్నా. దాని విలువ తెలిసినవాడు వెలకడితే ఆనందంగా డాలర్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకో గిల్టీగా అనిపించింది. తెల్లారి లేచేసరికి రాబర్ట్ అప్పటికే వర్కుకి వెళ్లిపోయాడు. సాయంత్రం రాబర్ట్ ఇంటికొచ్చాక, నా నిర్ణయం చెప్పాను, శాన్ ఫ్రాన్సిస్కో గ్యాలరీ ఏజెంటు డీల్ క్యాన్సిల్ చేసేయమని. నా మాట విని ఆశ్చర్యపోతూ ఒకటికి రెండుసార్లు రెట్టించి మరీ అడిగాడు. వచ్చే నెల డీ యాంజా ప్లీ మార్కెట్టుకి వెళదామని అన్నాను. ఆ గడ్డం వ్యక్తి కోసం ఎదురుచూస్తూనే ఉంటాను; ఎప్పటికైనా రాకపోతాడా అన్నదే నా ఆశ. - సాయి బ్రహ్మానందం గొర్తి -
చిక్కుల్లో వనిత, రాబర్ట్
నటి వనిత, నృత్య దర్శకుడు రాబర్ట్‌లు పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తామింకా పెళ్లి చేసుకోలేదని కలిసి చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు వీరిద్దరు ఇటీవల సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వనిత నటుడు విజయకుమార్, మంజుల దంపతుల కూతురన్న విషయం తెలిసిందే. ఈమె ఇంతకు ముందే రెండు సార్లు పెళ్లి చేసుకుని మనస్పర్థల కారణంగా ఆ భర్తల నుంచి విడిపోయారు. బుల్లితెర నటుడు ఆకాష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి శ్రీహరి అనే కొడుకు కూడా ఉన్నాడు. ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరి కొడుకు శ్రీహరి తన తండ్రితోనే ఉంటాననడంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. చివరికి శ్రీహరి తండ్రితో ఉండడాన్ని కోర్టు సమర్థించింది. అనంతరం ఆనందరాజ్ అనే వ్యాపార వేత్తను వనిత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురు పుట్టింది. తరువాత ఆనందరాజ్‌తో కూడా విడాకులు తీసుకుంది. మళ్లీ మొదటి భర్త ఆకాష్‌కు దగ్గరయ్యారు. కొడుకు శ్రీహరి కోసమే వీరిద్దరు కలిసి జీవించాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో నృత్య దర్శకుడు, నటి అల్ఫోన్సా తమ్ముడు రాబర్ట్‌ను వనిత రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రేమ జంట మాత్రం తమ పెళ్లి ఇప్పుడుకాదంటూ ప్రకటించారు. వనిత, రాబర్ట్‌ల వివాహాన్ని విజయకుమార్ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో వీరి పెళ్లికి చిక్కులేర్పడినట్లు తెలిసింది. -
కొరియోగ్రాఫర్ తో పెళ్లివార్తలను ఖండించిన సినీ తార!
కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో పెళ్లైందంటూ వస్తున్న వార్తలను దివంగత నటి మంజుల, విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ ఖండించారు. తాను రాబర్ట్ ఇంకా పెళ్లి చేసుకోలేదని వనిత స్సష్టం చేశారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం. ప్రస్తుతం ఓ ప్రొడక్షన్ హౌజ్ ను ఏర్పాటు చేయడంపైనే దృష్టిని కేంద్రీకరించాం అని వనిత వెల్లడించింది. అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. మా రిలేషన్ గురించి మా కుటుంబాలకు తెలుసు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అని వనితా ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేస్తాం. మేం కెరీర్ పరంగా విజయం సాధిస్తాం అని అన్నారు. ఇదిలా ఉండగా, వనితకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి వివాహం తమిళ నటుడు ఆకాశ్ తో, రెండవ వివాహం ఎన్నారై ఆనంద్ రాజ్ తో జరిగింది. ఇద్దరు భర్తల నుంచి విడాకులు పొందిన వనితకు శ్రీహరి అనే కుమారుడు ఉన్నాడు. తమిళంలో చంద్రలేఖ, మానిక్కం అనే రెండు చిత్రాల్లో నటించింది.