చిక్కుల్లో వనిత, రాబర్ట్
చిక్కుల్లో వనిత, రాబర్ట్
Published Tue, Jan 21 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
నటి వనిత, నృత్య దర్శకుడు రాబర్ట్‌లు పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తామింకా పెళ్లి చేసుకోలేదని కలిసి చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు వీరిద్దరు ఇటీవల సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వనిత నటుడు విజయకుమార్, మంజుల దంపతుల కూతురన్న విషయం తెలిసిందే. ఈమె ఇంతకు ముందే రెండు సార్లు పెళ్లి చేసుకుని మనస్పర్థల కారణంగా ఆ భర్తల నుంచి విడిపోయారు. బుల్లితెర నటుడు ఆకాష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి శ్రీహరి అనే కొడుకు కూడా ఉన్నాడు. ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయారు.
వీరి కొడుకు శ్రీహరి తన తండ్రితోనే ఉంటాననడంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. చివరికి శ్రీహరి తండ్రితో ఉండడాన్ని కోర్టు సమర్థించింది. అనంతరం ఆనందరాజ్ అనే వ్యాపార వేత్తను వనిత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురు పుట్టింది. తరువాత ఆనందరాజ్‌తో కూడా విడాకులు తీసుకుంది. మళ్లీ మొదటి భర్త ఆకాష్‌కు దగ్గరయ్యారు. కొడుకు శ్రీహరి కోసమే వీరిద్దరు కలిసి జీవించాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో నృత్య దర్శకుడు, నటి అల్ఫోన్సా తమ్ముడు రాబర్ట్‌ను వనిత రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రేమ జంట మాత్రం తమ పెళ్లి ఇప్పుడుకాదంటూ ప్రకటించారు. వనిత, రాబర్ట్‌ల వివాహాన్ని విజయకుమార్ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో వీరి పెళ్లికి చిక్కులేర్పడినట్లు తెలిసింది.
Advertisement
Advertisement