Vijayakumar
-
ఏడాదికి రూ.84.16 కోట్లు.. ఇండియాలో అధిక వేతనం తీసుకునే సీఈఓ
2023-24 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ సీ విజయకుమార్ అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా నిలిచారు. ఈయన మొత్తం జీతం సుమారు 10.06 మిలియన్ డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 84.16 కోట్లు. ఈ విషయాన్ని కంపెనీ నివేదికలో వెల్లడించింది. దీంతో ఈయన ఈ ఏడాది భారతీయ ఐటీ కంపెనీల సీఈఓలలో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు.హెచ్‌సీఎల్ టెక్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 ప్రకారం.. విజయకుమార్ వేతనం గత ఏడాది కంటే 190.75 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఈయన మొత్తం ప్యాకేజీలో 16.39 కోట్లు (1.96 మిలియన్ డాలర్లు) బేసిక్ శాలరీ కాగా.. పర్ఫామెన్స్ లింక్డ్ బోనస్ 1.14 మిలియన్ డాలర్లు లేదా రూ. 9.53 కోట్లు, లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ రూ. 2.36 మిలియన్ డాలర్లు (రూ. 19.74 కోట్లు). ఇతరత్రా ప్రయోజనాల కింద కూడా భారీ మొత్తంలోనే లభిస్తుంది. విజయకుమార్ వేతనం.. కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగుల జీతం కంటే 707.6 రెట్లు ఎక్కువని తెలుస్తోంది.ఇతర కంపెనీల సీఈఓల వేతనాల విషయానికి వస్తే.. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ. 66 కోట్లు, విప్రో సీఈఓ శ్రీని పల్లియా రూ. 50 కోట్లు, టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ రూ. 25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దేశంలోని దిగ్గజ కంపెనీలలో పని చేసే సీఈఓలలో ఎక్కువ వేతనం తీసుకునే వ్యక్తిగా విజయకుమార్ నిలిచారు. -
'గుడ్ లక్ స్టూడియోస్'ని ప్రారంభించిన నటుడు సూర్య (ఫొటోలు)
-
సరికొత్త ఫీచర్స్‌తో స్టూడియో నిర్మాణం.. బిజినెస్‌లో స్పీడు పెంచిన హీరోయిన్
పాపులర్ హీరోయిన్లు సినిమాల్లో బాగానే సంపాదిస్తారన్నది ఎవరూ కాదనలేరు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వారు దీటుగా సంపాదించవచ్చని కోలీవుడ్ హీరోయిన్ ప్రీతా విజయకుమార్ నిరూపిస్తున్నారు. నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల నలుగురు కూతుర్లలో ఒకరు ప్రీత. సినీ కుటుంబానికి చెందిన ఈమె కూడా 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రియమైనా నీకు, మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి సినిమాల్లో కనిపించిన ఆమె 2002లో దర్శకుడు హరితో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి భర్తతో పాటుగా వ్యాపార రంగంలో రాణిస్తుంది. కోలీవుడ్‌లో పక్కా మాస్ కమర్షియల్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న దర్శకుడు హరి. ఈయన గత ఏడాది 'గుడ్ లాక్' పేరుతో ఎడిటింగ్, మిక్సింగ్ కార్యక్రమాల కోసం చెన్నైలో స్టూడియోను ఏర్పాటు చేశారు. ఆది ఇప్పుడు ద్విగ్విజయంగా తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగిడింది. ఈ సందర్భంగా ఈ కపుల్స్ తన యూనిట్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు హరి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. గుడ్ లక్ స్టూడియో మొదటి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన స్టూడియోను మరింత ఆధునికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. 5.1 మిక్సింగ్, డబ్బింగ్ వసతులను సమకూర్చినట్లు తేలిపారు. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నానన్నారు. ఇలా మొత్తం మూడు స్టూడియోలను ఈ కపుల్స్ నిర్వహిస్తున్నారు. వాటి బాధ్యతలు ఎక్కువగా ప్రీతా చూసుకుంటారు. కాగా ప్రస్తుతం విశాల్ హీరోగా రత్నం చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నటి ప్రియభవానీ శంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్య క్రమాలు జరుపుకుంటోంది. పక్కా మాస్ మసాలా కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దర్శకుడు హరి, విశాల్ హీరోగా ఇంతకు ముందు భరణి, పూజై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో తాజా చిత్రం రత్నంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు ప్రేక్షకుల నుంచి స్పందన లభించడం గమనార్హం. ఈమె చైన్నె సముద్రతీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్ పేరుతో ఒక అందమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వాళ్లందరూ మహిళలు కావడం విశేషం. మద్రాస్ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఆమె ఇవ్వడం జరిగింది. View this post on Instagram A post shared by Pritha Hari (@pritha10hari) -
సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్
పాపులర్ హీరోయిన్లు సినిమాల్లో బాగానే సంపాదిస్తారన్నది ఎవరూ కాదనలేరు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వారు దీటుగా సంపాదించవచ్చని కోలీవుడ్ హీరోయిన్ ప్రీతా విజయకుమార్ నిరూపించారు. ఈమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల నలుగురు కూతుర్లలో ఒకరు ప్రీత. సినీ కుటుంబానికి చెందిన ఈమె కూడా 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తరువాత తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించిన ప్రీత నరసింహ చిత్రంలో రజనీకాంత్ కూతుర్లలో ఒకరిగా నటించి పాపులర్ అయ్యారు. ఆ తరువాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, చందు, వంటి చిత్రాల్లో నాయకిగా నటించారు. ఆ తరువాత 2002లో దర్శకుడు హరిని పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పి సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. నటనకు దూరంగా ఉంటున్న ప్రీత సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సోదరి శ్రీదేవి ఇతర స్నేహితురాళ్లతో కలిసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ లైవ్‌లో ఉంటున్న ప్రీత ఇతర వ్యాపారంలోనూ బిజీగా వున్నారు. ఈమె చైన్నె సముద్రతీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్ పేరుతో ఒక అందమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వాళ్లందరూ మహిళలు కావడం విశేషం. మద్రాస్ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఆమె ఇవ్వడం జరిగింది. వీరితో పాటు స్థానిక సాలిగ్రామంలోని సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోను నిర్వహిస్తున్నారు. ఇలా ప్రీత నెలకు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరో పక్క ఈమె భర్త హరి కమర్షియల్ దర్శకుడిగా మంచి ఫామ్‌లో వున్నారు. -
ప్రకృతి వ్యవసాయం భేష్
చిలమత్తూరు: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు చాలా బాగుందని ఆఫ్రికా దేశాల ప్రతినిధుల బృందం ప్రశంసించింది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ పరిధిలోని యగ్నిశెట్టిపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు బృందం శనివారం పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ విభాగం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.విజయకుమార్ ఆధ్వర్యంలో సెనగల్, టునీషియా, మడగాస్కర్, జాంబియా, బెనిన్, మలవాయి తదితర ఆఫ్రికా దేశాల నుంచి 27 మంది ప్రతినిధులు యగ్నిశెట్టిపల్లిలోని పంట పొలాలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంభిస్తున్న నందీశ్వర, నరసింహప్ప అనే రైతులకు చెందిన వేరుశనగ, నవీన్‌కు చెందిన పత్తి పంటలను పరిశీలించారు. పంటల యాజమాన్యం, చీడపీడల నియంత్రణ, ఘన జీవామృతం, బీజామృతం తయారీ, 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ విధానం తదితర వాటిని రైతులు, అధికారులు సమగ్రంగా వివరించారు. అనంతరం గ్రామంలోని కల్పవల్లి గ్రామ సంఘం, మహేశ్వరి మహిళా సంఘ సభ్యులు ప్రధాన పంటలు ఐదు రకాలు వేయటం, 20 రకాల జీవ వైవిధ్య పంటల సాగు, 5శాతం విత్తనాలు వేసుకోవడం వల్ల వచ్చిన ఫలితాలు, మార్కెటింగ్ వంటి వాటిని విదేశీ బృందానికి వివరించారు. కార్యక్రమంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)కు చెందిన ఆన్నె సోఫియా, సీఐఆర్ఏడీకి చెందిన బ్రూనో, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మానాయక్, అధికారులు విజయ్‌కుమార్, బాబు పాల్గొన్నారు. -
టాప్ ఐటీ కంపెనీ సీఈవో జీతం ఢమాల్! ఏకంగా 80 శాతం..
HCL Tech CEO Vijayakumar Pay Drops: దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ వేతనం 2023 ఆర్థిక సంవత్సరంలో భారీగా పడిపోయింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. సీఈవో విజయకుమార్ 2023 ఆర్థిక సంవత్సరంలో 3.46 మిలియన్ డాలర్లు (రూ. 28.4 కోట్లు) అతి తక్కువ వేతనాన్ని పొందారు. ఇందులో మూల వేతనం 2 మిలియన్ డాలర్లు, పర్ఫామెన్స్ బోనస్ 1.43 మిలియన్ డాలర్లు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు 0.03 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న 16.5 మిలియన్ డాలర్లు (రూ. 130 కోట్లు) కంటే దాదాపు 80 శాతం తక్కువ గమనార్హం. కారణం ఇదే.. హెచ్‌సీఎల్ కంపెనీ సీఈవో విజయ్‌కుమార్ వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోవడానికి కారణం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు లేదా ఎల్టీఐ లేకపోవడం అని తెలుస్తోంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఈ దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ఎల్‌టీఐని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మైలురాళ్లు లేదా బోర్డు నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగా చెల్లిస్తారు. 2022 ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ ఎల్టీఐ రూపంలో 12.50 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఇదీ చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులు ఇక ఇంటికే..! అయితే 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎల్‌టీఐని ఆయన 2024లో అందుకోనున్నారు. అయినప్పటికీ సీఈవో విజయకుమార్ 2023లో అందుకున్న జీతం అదే కంపెనీలో మొత్తం ఉద్యోగుల సగటు వేతనం కంటే 253.35 రెట్లు ఎక్కువ. గత మార్చి 31 నాటికి హెచ్‌సీఎల్ కంపెనీకి చెందిన 60 దేశాల్లోని 210 డెలివరీ కేంద్రాలలో మొత్తం 2,25,944 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర కంపెనీల సీఈవోల జీతాలు.. గత ఏడాది వరకు భారతదేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా ఉన్న విజయకుమార్.. ఈ ఏడాది ఇతర కంపెనీల సీఈవోలతో పోల్చితే చాలా తక్కువ వేతనం పొందారు. 2023 ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ రూ.29.16 కోట్లు, టెక్ మహీంద్రా అవుట్గోయింగ్ సీఈవో సీపీ గుర్నానీ రూ.30.14 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 56.44 కోట్లు, విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రూ.82 కోట్లు వేతనాలు అందుకున్నట్లు ఆయా కంపెనీల వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది. -
డీఐజీ మృతి కేసులో 8 మందికి సమన్లు
సాక్షి, చైన్నె: తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడిన కోయంబత్తూరు రేంజ్ డీఐజీ విజయకుమార్(45) మృతిపై 8 మందిని విచారించేందుకు పోలీసులు నిర్ణయించారు. కోయంబత్తూరు రామనాథపురం స్టేషన్లో జరిగే ఈ విచారణకు హాజరుకావాలని వీరికి ఆదివారం సమన్లు అందాయ. వివరాలు.. కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా ఈ ఏడాది జనవరిలో ఐపీఎస్ అధికారి విజయకుమార్(45) పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన రేస్ కోర్సులోని క్యాంప్ కార్యాలయంలో ఆయన తన భద్రతా సిబ్బంది రవి వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమాచారం పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు, ఆరోపణలు బయలు దేరాయి. అయితే ఆయన తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా బలన్మరణానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. అయితే, సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు, ప్రత్యక్షంగా మరికొందరు ఈ వ్యవహారంపై అనుమానాలు, ఆరోపణలు గుప్పించారు. ఈ పరిస్థితులలో కేసును విచారిస్తున్న కోయంబత్తూరు రామనాథపురం పోలీసులు అనుమానాలు, ఆరోపణలు గుప్పించిన వారిని విచారించేందుకు సిద్ధమయ్యాయి. తొలి విడతగా ఎనిమిది మందికి సమన్లు జారీ చేశారు. వీరు మంగళవారం తగిన ఆధారాలతో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. -
మా నాన్న మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు: సాక్ష్యాలు చూపించిన హీరోయిన్
మలయాళ బ్యూటీ అర్థనా బిను సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత తమిళ, మలయాళ భాషల్లోనే వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె తన తండ్రి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తనను నటించవద్దని బెదిరిస్తున్నాడని ఇటీవలే తండ్రి, నటుడు విజయకుమార్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! దీనిపై విజయకుమమార్ స్పందిస్తూ.. తానేమీ దొంగచాటుగా ఇంట్లోకి చొరబడలేదని తన కూతుళ్లు అక్కడున్నారా? లేదా చూడటానికే వెళ్లానని చెప్పుకొచ్చాడు. తాజాగా అతడి వ్యాఖ్యలపై అర్థనా బిను స్పందిస్తూ.. 'నా మీద నా కుటుంబం మీద నా తండ్రి చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. మా నాన్న మమ్మల్ని బెదిరిస్తున్నాడని చెప్తుంటే మీకది జిమ్మిక్కుగా అనిపిస్తుందేమో! నిజం తెలియాలంటే మీరు ఇది పూర్తిగా చదవాలి. అప్పుడే అతడు మమ్మల్ని ఎంతగా బాధపెట్టాడో మీకర్థమవుతుంది. 1. నా సోదరి అతడి కోసం ఇంటి ద్వారం తెలిస్తే లోనికి వచ్చానని చెప్పిన మాట అబద్ధం. అతడి వాదనలు నిజమైతే మరి గేటు గుండా వెళ్లకుండా గోడ దూకి వెళ్లడం దేనికి? నేను పోస్ట్ చేసిన వీడియోలో అతడు గోడ దూకి రావడం మీరు స్పష్టంగా చూడవచ్చు. మా ఇంట్లో నేను, అమ్మ, చెల్లి, నానమ్మ ఉంటున్నాం. రేపు ఇతడిని చూసి ఇంకెవరైనా గోడ దూకి వస్తే మా పరిస్థితి ఏంటి? 2. అతడు ఇంటర్వ్యూలలో చట్టపరంగా ఇంకా విడాకుల ప్రక్రియ పూర్తి కాలేదని చెప్తున్నాడు. కానీ కోర్టు ఇదివరకే మా అమ్మకు, తనకు విడాకులు మంజూరు చేసింది. అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని ఈ పోస్ట్‌లో పొందుపరుస్తున్నాను. 3.మా చెల్లి చదువు కోసం జూలై 3న మా అమ్మ బ్యాంకు ఖాతాలో రూ.40 వేలు డిపాజిట్ చేశానని తను చెప్తున్నాడు. అది అబద్ధం. అతడు అమ్మకు రూ.10 లక్షలు, బంగారం బాకీ ఉన్నాడు. దీనిపై అమ్మ పెట్టిన కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతి నెల రూ.5000 మా అమ్మకు ఇవ్వాలని కోర్టు షరతు విధించింది. కానీ అది కూడా సరిగా చెల్లించక మాకు బకాయిపడ్డాడు. అలా వాయిదా పడ్డ డబ్బే అతడు చెల్లించాడు. 4. అతడు పంపిన రూ.40 వేలు అందాయో, లేదో తెలుసుకుందామని ఇంటికి వచ్చానన్నాడు. కానీ అతడు డబ్బు పంపానని చెప్పగానే అమ్మ థాంక్యూ అని మెసేజ్ చేసింది. 5. నేను జరిగిన పరిణామాలపై కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే అప్పటికే వేసిన కేసులే ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ కొత్త ఫిర్యాదులు వద్దని అమ్మ అంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ సుదీర్ఘ నోట్ షేర్ చేసింది హీరోయిన్. View this post on Instagram A post shared by Arthana Binu (@arthana_binu) View this post on Instagram A post shared by Arthana Binu (@arthana_binu) చదవండి: బిగ్‌బాస్ 7 ఆఫర్‌పై మాధవీలత క్లారిటీ -
డీఐజీ ఆత్మహత్య : ఆ మానసిక ఒత్తిడి కారణాలు ఏమిటో అంతుచిక్కడం లేదు..
తీవ్ర మానసికఒత్తిడికి లోనైన కోయంబత్తూరు రేంజ్ డీఐజీ విజయకుమార్(45) శుక్రవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది వద్ద ఉన్న తుపాకీ తీసుకుని తనకు తాను కాల్చుకుని మృత్యుఒడిలోకి చేరారు. ఈ సమాచారం పోలీసు యంత్రాంగాన్ని షాక్‌కు గురిచేసింది. డీజీపీ శంకర్ జివ్వాల్, ఏడీజీపీ అరుణ్ హుటాహుటిన కోయంబత్తూరుకు చేరుకున్నారు. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన సీఎం స్టాలిన్ తన సానుభూతి తెలియజేశారు. అధికార లాంఛనాలతో స్వస్థలం తేనిలో విజయకుమార్ భౌతికకాయానికి సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. సాక్షి, చైన్నె: కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా ఈ ఏడాది జనవరిలో ఐపీఎస్ అధికారి విజయకుమార్(45) పదోన్నతి పొందారు. ఆయనకు భార్య గీతావాణి, కుమార్తె నందిత ఉన్నారు. రేస్‌కోర్సు రోడ్డులోని క్యాంప్ కార్యాలయం క్వార్టర్స్‌లో నివాసం ఉన్నారు. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి వచ్చిన ఆయన సరిగ్గా 6.45 గంటల సమయంలో తన భద్రతా సిబ్బంది రవి వద్ద ఉన్న తుపాకీ తీసుకున్నారు. తన కణత కుడివైపుగా భాగంలో తుపాకీతో కాల్చుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో భద్రతా సిబ్బంది కలవరం చెందారు. క్యాంప్ కార్యాలయంలో ఉన్న వాళ్లంతా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కోయంబత్తూరు కమిషనర్ బాలకృష్ణన్, ఎస్పీ బద్రినారాయణన్, ఐజీ సుధాకర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మానసిక ఒత్తిడికి కారణం ఏమిటో... తుపాకీతో కాల్చుకుని డీఐజీ మరణించిన సమాచారంతో డీజీపీ శంకర్జివ్వాల్తోపాటు పోలీసు యంత్రాంగమే షాక్‌కు గురైంది. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ అరుణ్ నేతృత్వంలోని విచారణ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం కోయంబత్తూరుకు చేరుకుని విచారణ చేపట్టింది. గత కొంతకాలంగా విజయకుమార్ తీవ్ర మానసికఒత్తిడితో ఉన్నట్టు, ఆయన కౌన్సెలింగ్ తీసుకున్నట్టు తేలింది. రాత్రుల్లో నిద్రలేమి కారణంగా మాత్రలను వాడుతూ వచ్చినట్టు గుర్తించారు. గురువారం ఐజీ సుధాకర్, ఎస్పీ బద్రినారాయణన్తో కూడా విజయకుమార్ మాట్లాడినట్టు, ఓ సిబ్బంది కుమార్తె బర్త్‌డే వేడుకకు వెళ్లి వచ్చినట్టు తెలిసింది. ఈ బర్త్‌డేలో ఆయన మౌనంగా కనిపించినట్టు సహచర సిబ్బంది సమాచారం ఇచ్చారు. అయితే, ఈ మానసికఒత్తిడి పనిభారంతో మాత్రం కాదన్నది విచారణలో వెలుగు చూసింది. ఇక, తన సామాజిక మాధ్యమంలో చివరగా ఓ వీడియోను పోస్టు చేసి ఉండడం వెలుగు చూసింది. ఇందులో ఈ ప్రపంచం ఓ మాయ.. కోల్పోయేందుకు ఏమీ లేదన్న ఆధ్యాత్మిక వచనాలు చేసి ఉండడం గమనార్హం. అలాగే, విజయకుమార్ సతీమణి గీతావాణిని కమిషనర్ బాలకృష్ణన్ విచారించి, వివరాలను సేకరించారు. రెండేళ్లుగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని, వైద్యుల వద్ద చికిత్స కూడా తీసుకుంటూ, కౌన్సెలింగ్‌కు వెళ్తున్నారని ఆయన భద్రతా సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే, విజయకుమార్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితికి దారితీసిన ఆ మానసిక ఒత్తిడి కారణాలు ఏమిటో అంతుచిక్కడం లేదు. ఇదే అంశాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పలు పార్టీల నేతలు ప్రస్తావిస్తూ సమగ్ర విచారణ జరగాలని పట్టుబట్టారు. ఏడీజీపీ అరుణ్ మీడియాతో మాట్లాడుతూ విజయకుమార్ పనిభారంతో బలన్మరణానికి పాల్పడ లేదని, మానసిక ఒత్తిడికి లోనయ్యారని, దీనిని రాజకీయం చేయొద్దని అని విజ్ఞప్తి చేశారు. అంత్యక్రియలు.. విజయకుమార్ బలన్మరణ సమాచారంతో రాష్ట్ర గవర్నరన్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఆయన భౌతికకాయాన్ని పోస్టుమార్టం అనంతరం స్వస్థలం తేని జిల్లా బోడినాయకనూరు సమీపంలోని అనైకారపట్టి గ్రామానికి తీసుకెళ్లారు. మంత్రి ఐ పెరియస్వామి, డీజీపీ శంకర్ జివ్వాల్‌తో పాటు పోలీసు బాసులు, అధికారులు నివాళులర్పించారు. విజయకుమార్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన భౌతికకాయాన్ని డీజీపీతో సహా పోలీసు అధికారులు మోశారు. విజయకుమార్ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. టీఎన్పీఎస్సీ టూ యూపీఎస్సీ.. తేని జిల్లా బోడి నాయకనూరు సమీపంలోని అనైకారపట్టి గ్రామానికి చెందిన రిటైర్డ్ వీఏఓ చెల్లయ్య, రిటైర్డ్ టీచర్ రాజాత్తిల కుమారుడు విజయకుమార్. 2003లో టీఎన్పీఎస్సీ ద్వారా గ్రూప్–1 ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ పదవి దక్కించుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకు వివాహం జరిగింది. ఐపీఎస్ కావాలన్న లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్ష రాసి కలను సాకారం చేసుకున్నారు. 2009 ఐపీఎస్ బ్యాచ్ అధికారిగా తమిళనాడులోని కడలూరు, కాంచీపురం, తిరువారూర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. విధి నిర్వహణలో నిజాయితీతో పాటు సహచర, కింది స్థాయి సిబ్బందితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. చైన్నె అన్నానగర్ డీసీపీగా కూడా పనిచేశారు. ఇటీవలనే డీఐజీగా పదోన్నతి పొందిన ఆయన కోయంబత్తూరుకు వెళ్లారు. తన కుమార్తెను కూడా ఐపీఎస్ చేయాలన్న కాంక్షతో ఉన్న విజయకుమార్‌ను మానసికఒత్తిడి బలి కొనడం సహచరులు జీర్ణించుకోలేకున్నారు. -
గెలుపు అంచు వరకు వచ్చి ఓడిపోవడంతో..
మాలూరు: శాసనసభ ఎన్నికలలో గెలుపు అంచు వరకు వచ్చి తాను ఓడిపోవడం సాంకేతిక కారణాల వల్లనే జరిగిందని స్వతంత్య్ర అభ్యర్థి హూడి విజయకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలో తన నివాసంలో మాట్లాడారు. తాను బీజేపీలో ఉన్నప్పుడు తన శ్రమను పార్టీ గుర్తించకపోవడం వల్ల తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. బీజేపీలోని కొంతమంది మంత్రులు, ఎంపీ ఎస్ మునిస్వామి వల్లనే తనకు నియోజకవర్గంలో ఈసారి బీజేపీ టికెట్ తప్పిపోయిందన్నారు. తనకు బీజేపీటికెట్ రాకుండా చేసిన ఎంపీ ఎస్ మునిస్వామికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన అభిమానులు, కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. -
దేశంలో అత్యధిక వేతనం పొందే ఐటీ కంపెనీ సీఈవో ఎవరో తెలుసా!
కోవిడ్ కారణంగా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. కానీ ఐటీ రంగం మాత్రం అందుకు భిన్నంగా ఎన్నడూ లేని విధంగా కార్యకలాపాల్ని నిర్వహించాయి. భారీ లాభాల్ని గడించాయి. అందుకే దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు, సీఈవోలకు కళ్లు చెదిరేలా వేతనాల్ని అందిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మన దేశానికి చెందిన ఏ ఐటీ కంపెనీ సీఈవో అత్యధిక వేతనం పొందుతున్నారో తెలుసా? ఇంతకీ ఆయన పేరేంటీ? ఆ సంస్థ ఏంటో తెలుసుకోవాలని ఉందా? నిన్న మొన్నటి వరకు మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలో అత్యధిక వేతనం పొందిన సీఈవోలో జాబితాలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ నిలిచారు. ఆయన ఏడాదికి రూ.71కోట్ల వేతనం పొందుతున్నట్లు ఈ ఏడాది మేనెలలో ఆ కంపెనీ వార్షిక ఫలితాల విడుదల సందర్భంగా తెలిపింది. తాజాగా సలీల్ పరేఖ్ కంటే అత్యధికంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీ యూఎస్ ఆధారిత సీఈవో సి.విజయ్ కుమార్ రూ.123.13కోట్ల శాలరీ పొందినట్లు ఆ సంస్థ విడుదల చేసిన వార్షిక ఫలితాల నివేదిక పేర్కొంది. అయితే సీఈవో విజయ్ కుమార్ రూ.123.13కోట్లను శాలరీ రూపంలో ఇవ్వలేదని, కొంత మొత్తాన్ని లాంగ్ టర్మ్ ఇన్సెన్టీవ్స్ -(ఎల్టీఐ (స్టాక్స్) రూపంలో అందించినట్లు హెచ్‌సీఎల్ యాజమాన్యం తెలిపింది. బేసిక్ యాన్యువల్ శాలరీ ఎంతంటే? హెచ్‌సీఎల్ టెక్నాలజీ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ ఏడాది మార్చి 31 వరకు ఆ సంస్థ సీఈవో సి.విజయ్ కుమార్‌కు ఎంత వేతనం చెల్లిస్తుందో చెప్పే ప్రయత్నం చేసింది. తమ సంస్థ సీఈవో బేసిక్ యాన్యువల్ శాలరీ 2మిలియన్ డాలర్లు ఉండగా, సంస్థకు లాభాల్ని తెచ్చినందుకు ప్రోత్సహకాల కింద మరో 2 మిలియన్ డాలర్లు, బోనస్‌లు ఇతర అలవెన్స్‌లు 0.02 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు వెల్లడించింది. మొత్తంగా ఎల్టీఐ 12.50 మిలియన్ డాలర్లను కలుపుకొని విజయ్ కుమార్ వేతనం 16.52 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పింది. 2021-2022లో సీఈవోల శాలరీ ఎంతంటే 2021-2022లో మనదేశానికి చెందిన సీఈవోలు అత్యధిక వేతనం తీసుకోవడంలో సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్నారు. 2021-2022లో ఏడాదికి ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ శాలరీ రూ.79.75కోట్లు,హెచ్‌సీఎల్ సీఈవో సి.విజయ్ కుమార్ శాలరీ రూ.123.13కోట్లు, టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ వార్షిక వేతనం రూ. 25.76 కోట్లు, విప్రో పారిస్ ఆధారిత సీఈవో వేతనం రూ. 64.34 కోట్లు. హెచ్‌సిఎల్ టెక్ సిఇఓ రూ.32.21 కోట్లు టెక్ మహీంద్రా సీఈవో రూ.22 కోట్ల వేతనం అందుకుంటున్నారు. -
ఈ కంపెనీకి ప్రభుత్వం అండగా ఉంటుంది
-
కొత్త జిల్లాల ఫైనల్ నోటిఫికేషన్ అప్పుడే..!
-
రాహుల్ హత్యకేసు కొలిక్కి
సాక్షి, అమరావతి బ్యూరో: పారిశ్రామికవేత్త రాహుల్ హత్యకేసు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు కోరాడ విజయకుమార్‌తోపాటు మిగిలిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కోగంటి సత్యంను సోమవారం బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్న పోలీసులు.. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఎలా హత్య చేశారనే దానిపై అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కోరాడ విజయకుమార్ వద్ద పనిచేసే వారే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యలో 10 మందికిపైగా పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసులో గాయత్రి అనే మహిళ పాత్ర పరోక్షంగా ఉన్నట్లు తెలిసింది. రాహుల్‌కు, ఆమెకు కూడా ఆర్థిక లావాదేవీల విషయమై విభేదాలున్నట్లు సమాచారం. ప్రధానంగా కంపెనీ లావాదేవీలకు సంబంధించి రాహుల్, కోరాడ విజయకుమార్ల పంచాయితీలో కోగంటి సత్యం ఉన్నట్లు తెలిసింది. హత్య జరిగిన వెంటనే వేగంగా స్పందించిన పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను బహిరంగపరిచి కేసును తేల్చే దిశగా అడుగులు వేస్తున్నారు. -
ఉద్యోగం వదిలి.. ‘ప్రకృతి’లోకి కదిలి
గారపాటి విజయ్‌కుమార్ మూడేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి ఆయన స్వగ్రామం. గడచిన రెండేళ్లూ హైబ్రిడ్ విత్తనాలను సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో పోషకాలతో పాటు ఔషధ విలువలు గల సాంప్రదాయ వరి రకాల సాగు వైపు దృష్టి సారించారు. తొమ్మిది రకాల దేశవాళీ విత్తనాలను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మూడు నెలల వయస్సు ఉన్న వరి పైరు సుమారు ఆరు అడుగులు ఎత్తు పెరగడంతో తోటి రైతులు అబ్బురపడుతున్నారు. విజయ్‌కుమార్ తండ్రి గారపాటి శ్రీనివాస్‌రావు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి. ఆరు నెలల వయస్సులోనే తల్లి మృతి చెందడంతో విజయ్‌కుమార్ అమ్మమ్మ ఇంటి వద్దే పెరిగారు. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన అనంతరం వైజాగ్‌లో ఓ కన్స్ట్రక్షన్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు ఉద్యోగం చేశారు. 27 సంవత్సరాల వయసులో సహచరæ ఉద్యోగి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన విజయ్‌కుమార్‌ను తీవ్రంగా బాధించింది. అనారోగ్యానికి గల కారణాలను అన్వేషించి రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్లనే అన్న అభిప్రాయానికి వచ్చారు. అంతే.. ఉద్యోగాన్ని విడిచి పెట్టి అమ్మమ్మ గారి ఊరు చేరుకున్నాడు. ఇది నాలుగేళ్ల నాటి ముచ్చట. దేశీ వంగడాలపై దృష్టి హైబ్రిడ్ విత్తనంతో కూడా విటమిన్ లోపాలు వచ్చి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసుకున్న విజయ్‌కుమార్ ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లోని దేశవాళీ వరి విత్తనాలను వృద్ధి చేస్తున్న సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయ్రామ్ను కలుసుకున్నారు. సుమారు 50 ఎకరాల్లో దేశవాళీ విత్తనం అభివృద్ధి చేయడాన్ని ప్రత్యక్షంగా చూసి, వాటిలో ఔషధ గుణాలు, ఉపయోగాలను తెలుసుకున్నారు. ఆయన సూచనల మేరకు సుమారు తొమ్మిది రకాల దేశవాళీ విత్తనాలను తీసుకువచ్చి ఈ ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో తొమ్మిది మడుల్లో సాగు చేపట్టారు. నవార, కాలాబట్టీ, సుగంధ సాంబ, రధాతిలక్, రక్తసాలి, తులసీబసొ, నారాయణ కామిని, బహురూపి, రత్నచోడి రకాలను ప్రస్తుతం సాగు చేస్తున్నారు. రాధా తిలక్ రకం పంట సుమారు ఆరున్నర అడుగుల ఎత్తు పెరిగింది. వెన్ను సుమారు రెండు అడుగుల పొడవు ఉంది. మిగిలిన 8 దేశవాళీ వరి రకాలను సాగు చేస్తున్న మడుల్లో పైరు ఐదున్నర అడుగులు ఎత్తు పెరిగింది. మూడు రకాలను వెదజల్లే పద్ధతిలో, మిగిలిన ఆరు రకాలను ఊడ్పు పద్ధతిలో సాగు చేస్తున్నట్టు విజయ్‌కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన దేశవాళీ రకాలు క్వింటాల్ రూ. 3,500 నుంచి రూ.7,500 ధర పలుకుతోందని తెలిపారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తే లక్ష్యం ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహార ఉత్పత్తులను తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, బీపి, షుగర్ వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అందుకే ఆరోగ్యదాయకమైన తొమ్మిది రకాల దేశవాళీ వరి రకాలను సాగు చేస్తున్నాను. వీటిని సాగు చేయడం వలన రైతులకు కూడా మంచి లాభం వస్తుంది. సాగు చేసిన పంటను నేరుగా వినియోగదారులకే విక్రయిస్తున్నా. రబీలో నీటి ఎద్దడి సమస్య ఉండటంతో కొర్రలు, సామలు, అండుకొర్రలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఖరీఫ్‌లో సుమారు పదెకరాల్లో దేశవాళీ వరి రకాలను సాగు చేద్దామనుకుంటున్నాను. ఈ విధానంలో మిత్రపురుగులు వృద్ధి చెందుతాయి. శత్రు పురుగులు అదుపులో ఉంటాయి. ఏటేటా భూసారం పెరుగుతుంది. పంచభూతాలకు, పశుపక్ష్యాదులకు మొత్తంగా మానవాళికి మంచి జరుగుతుంది. ఈ సాగు ద్వారా విత్తనాన్ని సొంతంగా తయారు చేసుకొని రైతులకు అందిస్తున్నాను. ప్రకృతి సాగులో ఎకరాకు కేవలం నాలుగు కేజీల విత్తనం అవసరం. అదే రసాయనిక సాగులో ఎకరానికి 25 కేజీల విత్తనం పడుతుంది. దీని వల్ల విత్తన ఖర్చు బాగా తగ్గి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. – గారపాటి విజయ్ కుమార్ (98665 11419), గండేపల్లి, తూ.గో. జిల్లా -
‘ప్రకృతి’ వరి దుబ్బుకు 55 పిలకలు!
వరి సాగు చేసే పొలాల్లో కొందరు రైతులు భూసారం పెంపుదలకు పచ్చి రొట్ట ఎరువులు సాగు చేస్తుంటారు. పప్పు జాతి జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి ఒకటి, రెండు రకాల పచ్చి రొట్ట పంటలను సాగు చేసి రొటవేటర్‌తో పొలంలో కలియదున్నుతారు. అది కుళ్లిన తర్వాత ఆ పొలంలో వరి సాగుకు ఉపక్రమిస్తుంటారు. అయితే, గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని కంచర్లపాలెం గ్రామ కౌలు రైతు జి.విజయకుమారి ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం తోడ్పాటుతో మరింత విభిన్నమైన ప్రయోగాన్ని చేపట్టి అద్భుత ఫలితం సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎకరం మాగాణిలో, ఖరీఫ్‌కు ముందు, వర్షాల రాకకు ముందే మే నెలలో, పచ్చిరొట్ట పంటలు వేశారు (దీన్నే ‘ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ – పీఎండీఎస్’ పద్ధతి అంటున్నారు). అందరిలా ఒక రకానికే పరిమితం కాలేదామె. ఏకంగా 18 రకాల పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలను కలిపి చల్లారు. భూమిలో ఎకరానికి మొదట 200 కిలోల ఘనజీవామృతం, ఆముదం పిండి వేసి కలియదున్ని విత్తనాలు వేశారు. పెరిగిన పచ్చి రొట్ట పైర్లను కూడా అందరిలా రొటవేటర్‌తో భూమిలో కలియ దున్న లేదు. కోసి పశుగ్రాసంగా వినియోగించారు. ఆ పంటల మోళ్లను, వేర్లను తీసెయ్యకుండా అలాగే వదిలేశారు. మళ్లీ దుక్కి దున్నకుండా లేదా దమ్ము చేయకుండానే.. ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం చల్లి వరి సాగుకు ఉపక్రమించారు. ఎదిగిన 18 రకాల పచ్చిరొట్ట పైరు, తాళ్లు పట్టి వరుసలుగా నాటిన వరి పంట తాళ్ల సహాయంతో నేలపై చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ ఎంటీయూ–1262 వరి విత్తనాలను వరుసలుగా మనుషులతో నాటించారు. 10 రోజులకోసారి ఎకరానికి మునగాకు కలిపిన 200 లీటర్ల ద్రవ జీవామృతాన్ని భూమికి అందించడమే కాకుండా పైరుపైన చల్లుతున్నారు. నాము తెగులు కనిపిస్తే వావిలాకు కషాయం రెండు సార్లు పిచికారీ చేశారు. అంతే. తొంభై రోజులు తిరిగే సరికి 55–59 వరకు పిలకలు కలిగిన వరి దుబ్బులను గ్రామస్తులు అబ్బురంగా చూస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్, ప్రకృతి వ్యవసాయ విభాగం గుంటూరు జిల్లా ప్రాజెక్టు మేనేజరు కె.రాజకుమారి ఈ వరి పొలాన్ని ఇటీవల స్వయంగా పరిశీలించి సంతోషాన్ని వ్యక్తపరిచారు. సమీపంలో రసాయన ఎరువులతో సాగయ్యే వరి పొలంతో పోల్చి చూడగా.. రెండు సాగు పద్ధతుల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించింది. విజయకుమారి పొలంలో ఎకరానికి 45–50 బస్తాల దిగుబడి వస్తుందన్న అంచనాకొచ్చారు. ఎక్కువ రకాల పచ్చిరొట్ట పంటలు వేయటం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి వైవిధ్యం పెరిగి భూసారం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని దున్నకుండా వరి విత్తనాలు నాటించడం, ఘన, ద్రవ జీవామృతం వాడటం వల్ల వరికి పుష్కలంగా అన్ని రకాల పోషకాలు అందుతున్నాయని అంటున్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి అంతా ఆశ్చర్యంగా చూశారు! జనుము, జీలుగ, పిల్లిపెసర సహా 18 రకాల విత్తనాలను కలిపి పచ్చి రొట్ట పైరుగా వర్షాలకు ముందే చల్లినపుడు రైతులంతా ఆశ్చర్యంగా చూశారు. పచ్చిరొట్ట పైరును కలియదున్న లేదు. కోసి పశుగ్రాసంగా వాడాం. మోళ్లను అలాగే వదిలేశాం. మళ్లీ దుక్కి చెయ్య లేదు. దమ్ము చెయ్య లేదు. తాడు పట్టి చిన్న చిన్న గుంతలు తీసి వరి విత్తనాలను మనుషులతో నాటించాను. పైరుకు ఎకరానికి 600 కిలోల ఘనజీవామృతంతోపాటు ప్రతి పది రోజులకు జీవామృతం అందించాను. రెండుసార్లు వావిలాకు కషాయం చల్లాను. వరి పైరు బలంగా పెరిగింది. ఆకర్షణీయంగా ఉంది. తొంభై రోజుల్లో 55–59 వరకు పిలకలు వచ్చాయి. 45–50 బస్తాల దిగుబడి వస్తుందని రైతులే చెబుతున్నారు. – జి.విజయకుమారి (91211 47694), మహిళా కౌలు రైతు, కంచర్లపాలెం, గుంటూరు జిల్లా పీఎండీఎస్ గొప్ప ప్రయోగం ప్రపంచంలోనే ప్రప్రథమంగా గత రెండేళ్లుగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిని ప్రకృతి వ్యవసాయంలో రైతులతో అమలు చేయిస్తు్తన్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో పీఎండీఎస్ విధానంలో 92 వేల రైతులు రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. మే నెలలోనే 18 రకాల పచ్చి రొట్ట పంటలు వేసినా ఘనజీవామృతం గాలిలోని తేమను ఆకర్షించటం వల్ల పంటలు పెరగటం విశేషం. పచ్చిరొట్టను భూమిలో కలియదున్నకుండా, మోళ్లను అలాగే ఉంచి భూమిని మళ్లీ దుక్కి చేసి కదిలించకుండా, వరి విత్తనాలను లైన్ సోయింగ్ పద్ధతిలో నాటించటం విజయకుమారి చేసిన గొప్ప ప్రయోగం. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పీఎండీఎస్‌ను మరో 700 గ్రామాలకు విస్తరించనున్నాం. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ఛైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ ‘ప్రకృతి సేద్యం –మూలసూత్రాలు, ఆచరణ’పై శిక్షణ ప్రకృతి వ్యవసాయం మూలసూత్రాలు, ఆచరణాత్మక పద్ధతులపై ప్రసిద్ధ శాస్త్రవేత్తలు డా. దేబల్ దేవ్, ప్రొ. స్టీఫెన్ గ్లియెస్మాన్ నవంబర్ 2 నుంచి 8 వరకు ఒడిశా రాయగడ జిల్లా కెరాండిగుడలోని బసుధ సంస్థ పరిశోధనా క్షేత్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం పుట్టుపూర్వోత్తరాలు, మిశ్రమ పంటల సాగు, పంటల మార్పిడి, కలిసి పెరిగే పంటలు, అటవీ జాతి చెట్ల మధ్యలో పంటల సాగు, బహుళ అంతస్థుల ఇంటిపంటల సాగు, దేశీ వరి వంగడాల పరిరక్షణ, శ్రీవరి సాగు, ప్రకృతిసిద్ధంగా కలుపును అదుపు చేయటం, రసాయన రహిత వ్యవసాయంలో పంటల జీవవైవిధ్యం పాత్ర తదితర అంశాలపై అభ్యర్థులకు ఆంగ్లంలో లోతైన అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా తమ పూర్తి వివరాలతోపాటు ధరఖాస్తు పంపాలి. బసుధ సంస్థ నిర్వాహకులు పరిశీలన అనంతరం శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు సమాచారం పంపుతారు. ఆ తర్వాత రూ. 16,000 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. ఫోన్ నంబర్: 98538 61558/94326 74377 11న రబీలో వరి, కూరగాయల ప్రకృతి సాగుపై శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ విధానంలో రబీలో వరి, కూరగాయల సాగుపై రైతునేస్తం ఫౌండేషన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర్లోని కొర్నెపాడులో రైతులకు ఈ నెల 11(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నారు. గుంటూరు జిలా అత్తోటకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు బాపన్న, రాజుపాలెం రైతు శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. దేశీ వరి రకాల సాగు, కషాయాలు, ద్రావణాల తయారీపై కూడా శిక్షణ ఇస్తారు. కొవిడ్ నేపథ్యంలో 40 మందిని మాత్రమే శిక్షణకు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 97053 83666, 0863–2286255. -
చంద్రబాబే అధికార ఉన్మాది
సాక్షి, కాకినాడ: గతంలో చంద్రబాబు అధికార ఉన్మాదంతో అరాచకాలకు పాల్పడ్డారని.. ఆయనే అధికార ఉన్మాది అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు అమరావతిపై అంత ప్రేమ.. వెనుకబడిన ప్రాంతాలపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ‘అధికార వికేంద్రీకరణ జరగాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగకూడదా..? చంద్రబాబు ఎంపిక చేసిన ప్రాంతంలోనే అభివృద్ధి జరగాలా? వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణకు ఆయన ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్ క్యాపిటల్‌కు చంద్రబాబు వ్యతిరేకమా..’ అంటూ పలు ప్రశ్నలను మంత్రి సంధించారు. చంద్రబాబు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.. స్వార్థం కోసమే చంద్రబాబు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. జీఎన్‌రావు, విజయ్‌కుమార్‌లాంటి అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని.. అధికారులను కించపరడం మానుకోవాలని హితవు పలికారు. బీసీజీ నివేదికను మంటల్లో వేయమనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ కమిటీకి అబద్ధాలు అంటగడుతున్నారని.. వాళ్లు చెప్పింది ఒక్కటైతే.. చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లాంటి రాజధాని వద్దని శివరామకృష్ణన్ చెప్పారని.. దానికి విరుద్ధంగా చంద్రబాబు అమరావతి అంటున్నారని మండిపడ్డారు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి మరిన్ని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. డ్రామాలొద్దు.. చంద్రబాబు గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ఇకనైనా డ్రామాలు ఆపాలన్నారు. చంద్రబాబు మాయలో పడొద్దని రైతులకు కన్నబాబు సూచించారు. ఫ్యూడలిస్టు విధానాలకు సీపీఐ నారాయణ మద్దతు పలుకుతున్నారా అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు పూర్తిగా న్యాయం చేస్తామన్నారు. ‘అమరావతి ముద్దు- రాష్ట్రాభివృద్ధి వద్దు అన్నది చంద్రబాబు నినాదం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ముద్దు అన్నది సీఎం జగన్ నినాదం’ అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. -
ఆయన నిజ స్వరూపం బయటపడింది..
సాక్షి, తిరుపతి: దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలోని అంబ్కేదర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కుల దురహంకారం ప్రదర్శించిన చంద్రబాబుపై మేరుగ మండిపడ్డారు. విజయ్‌కుమార్‌కు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టనున్నామని తెలిపారు. మరోసారి చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని దుయ్యబట్టారు. చంద్రబాబు నోటిని అదుపులో పెట్టుకోవాలని..లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చౌకబారు విమర్శలను సహించేది లేదని మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: విజయకుమార్గాడు మాకు చెబుతాడా!) (చదవండి: అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు) -
అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు
దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను దూషిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళిత, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు తన కుల అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డాయి. విజయకుమార్‌కు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు పెట్టాలంటూ పోలీస్స్టేషన్లలో దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. సాక్షి, అమరావతి : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) నివేదికలోని అంశాలను మీడియాకు వివరించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐదుగురు మంత్రులు తీవ్రంగా ఖండించారు. విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రులు నారాయణస్వామి, విశ్వరూప్, సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాకే చంద్రబాబు బయటకు రావాలన్నారు. మున్సిపల్ శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి హోదాలో విజయకుమార్ బీసీజీ నివేదికపై మీడియాకు వివరించారని వారు గుర్తుచేశారు. దీనిపై చంద్రబాబు చేసిన విమర్శలు చౌకబారుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అలాగే, విజయకుమార్‌ను ‘గాడు’ అనడం ద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి చంద్రబాబు చాటుకున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని సీఎంగా ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు.. బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళల మీద చేయిచేసుకోవడం లాంటి సంఘటనలతో పలుమార్లు కులపరంగా తనకున్న దురహంకార నిజస్వరూపం బయటపడిందని మంత్రులు గుర్తుచేశారు. విజయకుమార్ బాధ్యతలేంటో.. ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసని, అయినా ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ప్రకటనలో మంత్రులు పేర్కొన్నారు. చంద్రబాబు ఇకపై నోటిని అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. విజయకుమార్‌కు క్షమాపణ చెప్పాలి విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా చంద్రబాబును మంత్రులు డిమాండ్ చేశారు. అలాగే, స్వయంగా విజయకుమార్ వద్దకు వెళ్లి, ఆయనక్కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇది జరిగే వరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలందరూ బాబును ఛీకొట్టాలన్నారు. జ్యుడీషియల్ విచారణ చేయించాలి చంద్రబాబు నాయుడు చేసిన సామాజిక నేరాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి.. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. విజయకుమార్‌ను ‘వాడు’ అని సంబోధించడంలోనే చంద్రబాబులో ఉన్న అహంకారం ఏంటో తెలుస్తోంది. ఆయన గతంలోనూ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఎన్నో కేసుల నుంచి, కోర్టుల నుంచి మాజీ సీఎం తప్పించుకు తిరుగుతున్నారు. చంద్రబాబు దోపిడీదారు, అవినీతిపరుడు. దళితులను అవమానించటమేగాక దాడులు చేయించిన ఘనుడు. గతంలో నాయీబ్రాహ్మణులనూ తోకలు కత్తిరిస్తానని బెదిరించారు. తాను ఉన్న సభలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు మాట్లాడలేదు. – కత్తి పద్మారావు, దళిత ఉద్యమ నేత చంద్రబాబూ.. నోరు అదుపులో పెట్టుకో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ‘గాడు’ అని సంబోధించడం ఆయన కుల అహంకారానికి నిదర్శనం. ముఖ్యమంత్రి పదవి పోయేసరికి చంద్రబాబుకు చిన్న మెదడు దెబ్బతింది. ఆయన ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడు. – కిషోర్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అట్రాసిటీ కేసు నమోదు చేయాలి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హేయం. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా మాల ఉద్యోగులతో సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. – నక్కా రాజశేఖర్, ఏపీ మాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దళితులు తలుచుకుంటే రోడ్డెక్కలేరు ప్రణాళికా సంఘం కార్యదర్శిగా విజయకుమార్ తన బాధ్యతల నిర్వహణలో భాగంగా బీసీజీ నివేదికను రాష్ట్ర ప్రజలకు చదివి వినిపించారు. అతన్ని పట్టుకుని ‘విజయకుమార్ గాడు’ అని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయటం దుర్మార్గం. రాష్ట్రంలోని దళితులు తలచుకుంటే చంద్రబాబు రోడ్లపై తిరగలేరు. విజయ్‌కుమార్‌ను అవమానించినందుకు బాబు అంబేద్కర్ విగ్రహం పాదాల వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పకపోతే దళిత జాతి ఆయనను క్షమించదు. – ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేసే చరిత్ర ఆయనదే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికను మీడియాకు వివరించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ‘గాడు’ అని సంబోధిస్తూ మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు తీరు ఆయనలోని నిరాశ, నిస్పృహలతో పాటు కుల అహంకారాన్ని బయటపెట్టింది. విజయకుమార్‌కు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. అధికారులను, ఉద్యోగులను బెదిరించడంతో పాటు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే చరిత్ర చంద్రబాబుదే. – ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి క్షమాపణ చెప్పకుంటే ఆందోళన దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి విజయకుమార్ని తీవ్రస్థాయిలో కించపరుస్తూ ‘వాడు’ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మా ఉద్యోగ సంఘం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. – రెడ్డిచర్ల ధనుంజయ్, సెర్ప్ ఎల్4, ఎల్5 స్థాయి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాబు అహంకారానికి నిదర్శనం విజయకుమార్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం. ప్రభుత్వ పథకాల అమలు, పేదలకు సేవలందించడంలో విజయకుమార్ ఎప్పుడూ ముందుంటారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, తూర్పు గోదావరి జిల్లా జేసీగా, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్‌గా విశేష సేవలందించారు. – తాళ్ళూరి బాబూరాజేంద్ర ప్రసాద్ ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు క్షమాపణ చెప్పాల్సిందే.. విజయకుమార్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక దళిత ఐఏఎస్ అధికారి విషయంలో ఆయన అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – ఎస్.కృష్ణమోహన్‌రావు, ఏపీ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతిపక్ష నేతను అరెస్టు చేయాలి దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వెంటనే అరెస్టు చేయాలి. అధికారం కోల్పోయిన చంద్రబాబు మతిభ్రమించి కుల అహంకారంతో దళిత అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. – మేడిద బాబూరావు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఆందోళనలు చేస్తాం రాష్ట్ర ప్రతినిధిగా మాట్లాడిన దళిత ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ఎస్సీ కమిషన్లు ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తాం. – గోళ్ల అరుణ్‌కుమార్,మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ప్రతి ఒక్కరూ ఖండించాలి విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబుపై సుమోటోగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. గతంలో సీనియర్ ఐపీఎస్ అధికారి బయ్యారపు ప్రసాదరావును డీజీపీగా రాకుండా ఆయన అడ్డుకున్నారు. ఇప్పుడు విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబు తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలి. – పెరికే వరప్రసాదరావు, ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు ఐఏఎస్ అధికారిపై వ్యాఖ్యలు సరికాదు ఒక బాధ్యతగల ఐఏఎస్ అధికారిని అవమానించేలా ప్రతిపక్షనాయకుడు దుర్భాషలాడటం సరికాదు. ప్రభుత్వానికి అందిన నివేదికలోని అంశాలను విజయకుమార్ సవివరంగా చెప్పడాన్ని సహించుకోలేక చంద్రబాబు పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం మంచిది కాదు. – ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.హృదయ రాజు -
40 ఏళ్ల అనుభవం అవమానించడమేనా..?
సాక్షి, తాడేపల్లి: దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. బరి తెగించి ఆయన మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజయ్‌కుమార్‌ను విమర్శించడం ద్వారా తన కుల దురహంకారాన్ని చంద్రబాబు మరోసారి బయట పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. ‘దళిత అధికారులంటే చంద్రబాబుకు చులకన భావం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన ఏకైక నాయకుడు’ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు అన్యాయాన్ని ప్రజలు మరిచిపోలేదు.. దళితులకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. విజయ్‌కుమార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై చంద్రబాబు అనేక సార్లు దాడులు చేయించారని.. దళితుల భూములను దోచుకున్నారని దుయ్యబట్టారు. దళిత ఐఏఎస్ అధికారిపై నోరు పారేసుకున్న చంద్రబాబు పై ఎస్సీ,ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టాలన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం దళితులను అవమానించడమేనా అని ప్రశ్నించారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు గతంలో కూడా దళితులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు తలుచుకుంటే చంద్రబాబు రోడ్లపై తిరగలేరని మేరుగు నాగార్జున హెచ్చరించారు. (చదవండి: విజయకుమార్గాడు మాకు చెబుతాడా..) (చదవండి: చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం) -
ఇవేం మాటలు బాబూ
-
విజయకుమార్గాడు మాకు చెబుతాడా!
సాక్షి, అమరావతి : ఐఏఎస్ అధికారి ఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూపు (బీసీజీ) నివేదికలోని వివరాలను మీడియాకు వివరించిన ఆయన్ను తప్పుపడుతూ ‘అమరావతిని ఫెయిల్యూర్ నగరాలతో పోలుస్తారా? విజయ్‌కుమార్‌గాడు మాకు చెబుతాడా’.. అంటూ చిందులు తొక్కారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. బీసీజీ నివేదికపై ఆరోపణలు చేశారు. బీసీజీ ఒక కంపెనీయే కాదని, ఎవరు డబ్బులిస్తే వారు చెప్పినట్లు రాసిస్తారని, అది చిత్తు కాగితమని విమర్శించారు. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి చెందిన సంస్థని ఆరోపించారు. అమరావతి విఫలమవుతుందంటున్నారని, కొత్త నగరాలు సైబరాబాద్, నవీ ముంబై, డెహ్రాడూన్ అభివృద్ధి చెందలేదా అని ప్రశ్నించారు. బీసీజీ ఇచ్చిన నివేదిక కంటే తాము తయారుచేసిన విజన్ డాక్యుమంట్ బెటరని, దాన్ని చదువుకోవాలన్నారు. పట్టణీకరణ ద్వారానే ఉపాధి వస్తుందని, సంపద సృష్టించవచ్చని స్పష్టంచేశారు. జగన్ సొంతంగా సంపాదించి అమరావతిలో ఇల్లు కట్టారా.. అమరావతిలో జగన్ ఇల్లు ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వేర్వేరు ప్రాంతాల్లో లేవన్నారు. అమరావతిలో కట్టడాలకు ఎక్కువ ఖర్చవుతుందని అబద్ధాలు చెబుతున్నారని.. హైదరాబాద్, చెన్నై కంటె అమరావతిలోనే తక్కువ ఖర్చవుతుందన్నారు. రాజధానిని విశాఖపట్నానికి తరలించినా అక్కడ మళ్లీ రైతుల భూముల కొనాల్సిందేనని తెలిపారు. ఎమర్జెన్సీ అసెంబ్లీ అంటున్నారని.. ఆ మాట తానెప్పుడూ వినలేదనన్నారు. అజేయ కల్లం చెప్పినట్లు రాసిచ్చానని జీఎన్ రావు చెప్పాడని చంద్రబాబు ఆరోపించారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికలను భోగి మంటల్లో తగలబెట్టాలని, సంక్రాంతి పండుగను అమరావతి సంక్రాంతిగా జరుపుకోవాలన్నారు. చదవండి: మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు బోస్టన్ కమిటీ నివేదిక అద్భుతం.. ‘బాధ తక్కువ.. బాగు ఎక్కువ’ అమరావతి.. విఫల ప్రయోగమే ‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’ సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు.. మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! -
వీరమరణానికి విలువెక్కడ?
-
పార్టీలకు బూత్ కమిటీలే పునాది
తగరపువలస: రాజకీయపార్టీలకు బూత్‌కమిటీలే పునాదిరాళ్లని.. ఇవి ప్రజల్లో వేళ్లూనుకుని పోతే వారిమాటలే ప్రజలకు వేదవాక్కుగా, పార్టీలకు శ్రీరామరక్షగా పనిచేస్తాయని వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ అన్నారు. మంగళవారం సంగివలస ఫారచ్యన్ ఫంక్షన్ హాలులో జీవీఎంసీ భీమిలి జోన్ వైఎస్సార్సీపీ బూత్ కమిటీల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బూత్‌కమిటీలే వైఎస్సార్సీపీని విజయపథాన నిలబెడతాయన్నారు. గనన్న వెనుక పెద్ద సైన్యం ఉందని అది కార్యకర్తలు, బూత్‌కమిటీలకు అండగా నిలబడుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగనన్న కూడా అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని నవరత్నాలనే పథకాల ద్వారా వారికి మంచి చేయాలనుకుంటున్నారని చెప్పారు. ఈ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను మరో పది మాసాల్లో ఎన్నికలు ఉన్నందున బిస్కట్లు మాదిరిగా విసురుతున్నారన్నారు. అన్న క్యాంటీన్ పథకం ద్వారా కూడా రూ.కోట్లు దోచుకునే మోసగాడు చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ప్రజలకు చంద్రబాబు 600 హామీలు ఇచ్చారన్నారు. మళ్లీ ఇప్పుడు ఆ హామీలను అడిగితే గెలవలేమనే ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో బూత్‌కమిటీ సభ్యులు తనకు కేటాయించిన ఇళ్లలో రోజుకు రెండేసి వంతున చెక్ చేసుకుని వలస ఓటర్లు తొలగించేటట్టు, కొత్త వారిని చేర్చేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల బూత్‌కమిటీల ఇన్చార్జ్ కిషోర్ బూత్‌కమిటీల ప్రతినిధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంతకు ముందు హాలులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. శిక్షణ తరగతుల్లో సీనియర్ నాయకుడు కాకర్లపూడి వరహాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి శిల్లా కరుణాకరరెడ్డి, పట్టణ అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ జగుపల్లి ప్రసాద్, చిల్ల బాబయ్యరెడ్డి, నియోజకవర్గ బూత్‌కమిటీల ఇన్చార్జ్ చిర్రా రాజ్‌కుమార్, భీమిలి బూత్‌కమిటీల అధ్యక్షుడు ఉప్పాడ నాగేశ్వరరావు, ప్రధానకార్యదర్శులు జీరు వెంకటరెడ్డి, అల్లిపల్లి నరసింగరావు, కోండ్రు రామసూరప్పడు, వాసుపల్లి ఎల్లాజీ, యూత్ అధ్యక్షుడు బింగి హరికిరణ్‌రెడ్డి, బీసీ, ఎస్సీ, మహిళా, సేవాదళ్ అధ్యక్షులు వాసుపల్లి కొండబాబు, జీరు సుజాత, పందిరి విజయ్, మారుపల్లి రాము, ఎర్రయ్య రెడ్డి, ప్రభాకర్‌రావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
278 మందికి తాళికి బంగారం పంపిణీ
గుమ్మిడిపూండి: తాళికి బంగారం పథకం కింద 278మంది పేద యువతుల వివాహానికి బంగారం పంపిణీ కార్యక్రమం గుమ్మిడిపూండిలో ఆదివారం జరిగింది. స్థానిక బీడీవో కార్యాలయంలో గుమ్మిడిపూండి, ఎల్లాపురం యూనిట్లకు చెందిన లబ్ధిదారులకు తాళికి బంగారాన్ని గుమ్మిడిపూండి ఎమ్మెల్యే కె.ఎస్.విజయకుమార్ అందజేశారు. కార్యక్రమానికి బీడీవో దయానిధి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే విజయకుమార్ పాల్గొన్నారు. ముందుగా పది, ప్లస్ టు చదివి వివాహం చేసుకున్న గ్రామీణ ప్రాంతాల్లోని పేద యువతులు 278మందికి ఒక్కొక్కరికి 8 గ్రాముల బంగారాన్ని పంపిణీ చేశారు. అలాగే పేద యువతులు పెళ్లి చేసుకుంటే 10, 12, తరగతులు చదివే వారికి రూ.25వేలు, డిగ్రీ చదివిన వారికి రూ.50వేలు చొప్పున 86 మందికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలను అభివృద్ధిపరచుకోవాలని కోరారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి మీనా, అడిషనల్ బీడీవో ఉమాదేవి, జిల్లా మాజీ కౌన్సిలర్ నారాయణమూర్తి, అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శి ఎం.కె.శేఖర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.