
బీజేపీలో ఉన్నప్పుడు తన శ్రమను పార్టీ గుర్తించకపోవడం వల్ల తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు.
మాలూరు: శాసనసభ ఎన్నికలలో గెలుపు అంచు వరకు వచ్చి తాను ఓడిపోవడం సాంకేతిక కారణాల వల్లనే జరిగిందని స్వతంత్య్ర అభ్యర్థి హూడి విజయకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలో తన నివాసంలో మాట్లాడారు.
తాను బీజేపీలో ఉన్నప్పుడు తన శ్రమను పార్టీ గుర్తించకపోవడం వల్ల తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. బీజేపీలోని కొంతమంది మంత్రులు, ఎంపీ ఎస్ మునిస్వామి వల్లనే తనకు నియోజకవర్గంలో ఈసారి బీజేపీ టికెట్ తప్పిపోయిందన్నారు. తనకు బీజేపీటికెట్ రాకుండా చేసిన ఎంపీ ఎస్ మునిస్వామికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన అభిమానులు, కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.