
సాక్షి, అమరావతి : ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూపు (బీసీజీ) నివేదికలోని వివరాలను మీడియాకు వివరించిన ఆయన్ను తప్పుపడుతూ ‘అమరావతిని ఫెయిల్యూర్ నగరాలతో పోలుస్తారా? విజయ్‌కుమార్‌గాడు మాకు చెబుతాడా’.. అంటూ చిందులు తొక్కారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. బీసీజీ నివేదికపై ఆరోపణలు చేశారు. బీసీజీ ఒక కంపెనీయే కాదని, ఎవరు డబ్బులిస్తే వారు చెప్పినట్లు రాసిస్తారని, అది చిత్తు కాగితమని విమర్శించారు. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి చెందిన సంస్థని ఆరోపించారు. అమరావతి విఫలమవుతుందంటున్నారని, కొత్త నగరాలు సైబరాబాద్, నవీ ముంబై, డెహ్రాడూన్ అభివృద్ధి చెందలేదా అని ప్రశ్నించారు. బీసీజీ ఇచ్చిన నివేదిక కంటే తాము తయారుచేసిన విజన్ డాక్యుమంట్ బెటరని, దాన్ని చదువుకోవాలన్నారు.
పట్టణీకరణ ద్వారానే ఉపాధి వస్తుందని, సంపద సృష్టించవచ్చని స్పష్టంచేశారు. జగన్ సొంతంగా సంపాదించి అమరావతిలో ఇల్లు కట్టారా.. అమరావతిలో జగన్ ఇల్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వేర్వేరు ప్రాంతాల్లో లేవన్నారు. అమరావతిలో కట్టడాలకు ఎక్కువ ఖర్చవుతుందని అబద్ధాలు చెబుతున్నారని.. హైదరాబాద్, చెన్నై కంటె అమరావతిలోనే తక్కువ ఖర్చవుతుందన్నారు. రాజధానిని విశాఖపట్నానికి తరలించినా అక్కడ మళ్లీ రైతుల భూముల కొనాల్సిందేనని తెలిపారు. ఎమర్జెన్సీ అసెంబ్లీ అంటున్నారని.. ఆ మాట తానెప్పుడూ వినలేదనన్నారు. అజేయ కల్లం చెప్పినట్లు రాసిచ్చానని జీఎన్ రావు చెప్పాడని చంద్రబాబు ఆరోపించారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికలను భోగి మంటల్లో తగలబెట్టాలని, సంక్రాంతి పండుగను అమరావతి సంక్రాంతిగా జరుపుకోవాలన్నారు.
చదవండి:
మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు
బోస్టన్ కమిటీ నివేదిక అద్భుతం..
సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు..
మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన