సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియాలో మరో కుట్రకు తెరతీసింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే... అతడి మృతిని రాజధాని ప్రాంతానికి ఆపాదించింది. రాజధాని రైతు ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకుని చనిపోయాడంటూ సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం చేపట్టింది. ఈ నేపథ్యంలో వీడియోపై ఆరా తీయగా... అది తమిళనాడుకు చెందిందని తేలడంతో టీడీపీ కుట్ర బట్టబయలైంది.(మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు)
కాగా రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలకు తెర తీసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఓ రైతు మరణిస్తే.. ఆయన మరణాన్ని రాజధాని వికేంద్రీకరణ పరిణామాలకు ముడిపెట్టారు. అదే విధంగా చిన్నకాకాని వద్ద ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుని.. ఆయన కారుపై రాళ్లతో దాడి చేసిన విషయం విదితమే. ఇలా అడుగడుగునా ఆందోళనలు సృష్టించి.. శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేయాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజధాని రైతులను రెచ్చగొట్టడానికి ఇప్పుడేమో ఇలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు.(ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం)
నీకెందుకు డబ్బులు వేయాలి.. చంద్రబాబుకు చేదు అనుభవం!
కఠిన చర్యలు తీసుకుంటాం..
తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగినట్లుగా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారని గుంటూరు ఐజీ పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలను ట్రోల్ చేస్తూ ప్రశాంతంగా ఉన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటువంటి అసత్య వార్తలను ప్రసారం చేసినా.. ఇతరులకు షేర్ చేసినా.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment