2023-24 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ సీ విజయకుమార్ అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా నిలిచారు. ఈయన మొత్తం జీతం సుమారు 10.06 మిలియన్ డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 84.16 కోట్లు. ఈ విషయాన్ని కంపెనీ నివేదికలో వెల్లడించింది. దీంతో ఈయన ఈ ఏడాది భారతీయ ఐటీ కంపెనీల సీఈఓలలో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు.
హెచ్‌సీఎల్ టెక్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 ప్రకారం.. విజయకుమార్ వేతనం గత ఏడాది కంటే 190.75 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఈయన మొత్తం ప్యాకేజీలో 16.39 కోట్లు (1.96 మిలియన్ డాలర్లు) బేసిక్ శాలరీ కాగా.. పర్ఫామెన్స్ లింక్‌డ్ బోనస్ 1.14 మిలియన్ డాలర్లు లేదా రూ. 9.53 కోట్లు, లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ రూ. 2.36 మిలియన్ డాలర్లు (రూ. 19.74 కోట్లు).
ఇతరత్రా ప్రయోజనాల కింద కూడా భారీ మొత్తంలోనే లభిస్తుంది. విజయకుమార్ వేతనం.. కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగుల జీతం కంటే 707.6 రెట్లు ఎక్కువని తెలుస్తోంది.
ఇతర కంపెనీల సీఈఓల వేతనాల విషయానికి వస్తే.. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ. 66 కోట్లు, విప్రో సీఈఓ శ్రీని పల్లియా రూ. 50 కోట్లు, టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ రూ. 25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దేశంలోని దిగ్గజ కంపెనీలలో పని చేసే సీఈఓలలో ఎక్కువ వేతనం తీసుకునే వ్యక్తిగా విజయకుమార్ నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment