నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ప్రవీణా రాయ్' తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం 'మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్' (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణా రాయ్ ఎంసీఎక్స్‌లో నియామకానికి 'సెబీ' ఆమోదం తెలిపింది. రాయ్ ఎన్‌పీసీఐలో చేరటానికి ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీలలో కూడా పనిచేశారు.
ఇదీ చదవండి: బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూత
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ప్రవీణా రాయ్.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పేజీ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో చేరినప్పుడు ఈమె క్యాష్ మేనేజ్‌మెంట్ పోర్ట్ ఫోలియో నిర్వహించారు. ఆ తరువాత హెచ్ఎస్‌బీసీలో ఆసియా - పసిఫిక్ రీజియన్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్‌పీసీఐలో రాయ్ మార్కెటింగ్, ప్రొడక్ట్, టెక్నాలజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఆపరేషన్ డెలివరీ వంటి బాధ్యలు నిర్వహించారు. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు.
PRESS RELEASE - Ms. Praveena Rai takes charge as MD & CEO of MCX
Click here to read more: https://t.co/114IrR0cYL#pressrelease pic.twitter.com/yZW5GGEmbT— MCX (@MCXIndialtd) October 31, 2024
Comments
Please login to add a commentAdd a comment