రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఐసీఐసీఐ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ 'సందీప్ భక్షి' (Sandeep Bakhshi)ని మరో మూడేళ్లపాటు కొనసాగడానికి ఆమోదం తెలిపింది. దీంతో ఈయన 2023 అక్టోబర్ 04 నుంచి 2026 అక్టోబర్ 03 వరకు ఆ పదవిలో ఉంటారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, 2023 ఆగష్టు 30న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో షేర్‌హోల్డర్లు ఆమోదించినట్లు తెలిసింది. 2018లో చందా కొచ్చర్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత సందీప్ భక్షి సీఈఓగా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి బక్షి బ్యాంకుని అగ్రస్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేసాడు.
ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలు - ఇది కదా కావాల్సింది!
సందీప్ భక్షి నాయకత్వంలో ఐసీఐసీఐ బ్యాంక్ గొప్ప విజయాలను సాధించగలిగింది. 1986 నుంచి ఐసీఐసీఐ గ్రూపుతో మంచి సంబంధాలున్న భక్షి 2022లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ ఎండి అండ్ సీఈఓ పదవిని, 2010 నుంచి 2018 వరకు ఐసీఐసీఐ ఫ్రడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి, సీఈఓ పదవిని చేపట్టాడు. కాగా 2018 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓగా కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment