MD
-
సమానత్వం,సాధికారతకోసం కలిసి పనిచేద్దాం : అపోలో సునీతా రెడ్డి
అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు అందించారు. 1995 బీజింగ్ డిక్లరేషన్ , ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులను ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన పురోగతిని గుర్తించాలన్నా ఈ సందర్బంగా పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది బాలికలు పాఠశాలలో చదువుతున్నప్పటికీ మరియు కీలకమైన సేవలను పొందుతున్నప్పటికీ, పురోగతి సమానంగా లేదనీ, గణనీయమైన సవాళ్లు ఇంకా కొనసాగుతు న్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలలోని బాలికలకు, కొన్ని సంఘర్షణ ప్రాంతాలకు , వాతావరణ సంక్షోభం,మహమ్మారి ద్వారా ప్రభావితమైన బాలికలకు చేరడం లేదన్నారు.‘మన సమిష్టి బలాన్ని పెంపొందించుకుంటూ, మహిళలు, బాలికలు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకునేవ్యవస్థాగత అడ్డంకులను తొలగించుకునేందుకు, నిజంగాసమానమైన, సమ్మిళిత వాతావరణాలను సృష్టించడానికి మనం కలిసి పనిచేయాలి. తరువాతి తరానికి సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. శాశ్వత మార్పుకు ఉత్ప్రేరకాలు , భవిష్యత్తును నడిపించడానికి రూపొందించడానికి హక్కులు, వనరులు మరియు అవకాశాలతో వారి సన్నద్ధం కావాలి’’ అన్నారామె.మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే చొరవలలో వ్యూహాత్మక పెట్టుబడులు ఏ బాలికను వదిలి వెళ్ళకుండా చూసుకోవడంలో సహాయపడతాయి.తమ స్వాభావిక ప్రభావ మూలధనాన్ని ఉపయోగించుకోని, రాబోయే తరాలకు సాధికారత , సమానత్వం యొక్క వారసత్వాన్నిఅందించాలని ఆమె మహిళా నాయకులను కోరారు.. అందరికీ న్యాయమైన సమానమైన ప్రపంచాన్ని నిర్మించేక్రమంలో మహిళలు, బాలికలందరికీ 'హక్కులు, సమానత్వం, సాధికారత'ను స్పష్టమైన వాస్తవికతగా మార్చేలా కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా! -
JSW MG Motor India: కొత్త ఎండీగా అనురాగ్ మెహ్రోత్రా
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా 'అనురాగ్ మెహ్రోత్రా'ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆటోమోటివ్ పరిశ్రమలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న.. అనురాగ్ ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలలో పనిచేశారు.సేల్స్, మార్కెటింగ్, స్ట్రాటజీ, వ్యాపార అభివృద్ధిలో కీలక పదవులు చేపట్టిన 'అనురాగ్ మెహ్రోత్రా' (Anurag Mehrotra).. జేఎస్‌డబ్ల్యు మోటార్ ఇండియాలో చేరడానికి ముందు.. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్‌లో స్ట్రాటజీ & ఇంటర్నేషనల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతకంటే ముందు ఫోర్డ్ ఇండియాకు ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.కంపెనీ మాజీ సీఈఓ, రాజీవ్ చాబా.. ఇకపై జాయింట్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా నిర్వహణ, వాటాదారులకు సలహా ఇస్తుంటారు. బ్రాండ్‌ను దేశంలోని ప్రముఖ ఆటోమోటివ్ ప్లేయర్లలో ఒకటిగా తీర్చిదిద్దడంలో రాజీవ్ చాబా కీలక పాత్ర పోషించారు. ఈయన సారథ్యంలోనే కంపెనీ అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే.. -
హైదరాబాద్‌లో స్టాండర్డ్ గ్లాస్ భారీ ప్లాంట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు ప్రత్యేక ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 10వ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని బొంతపల్లి వద్ద 36 ఎకరాల్లో ఇది రానుంది. రూ.130 కోట్ల వ్యయంతో తొలి దశ 15 నెలల్లో పూర్తి అవుతుందని కంపెనీ ఎండీ నాగేశ్వర రావు కందుల వెల్లడించారు. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుందని అన్నారు.జనవరి 6న ప్రారంభం అవుతున్న ఐపీవో వివరాలను వెల్లడించేందుకు శనివారమిక్కడ జరిగిన సమావేశంలో కంపెనీ ఈడీ కాట్రగడ్డ మోహన రావు, సీఎఫ్‌వో పాతూరి ఆంజనేయులుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లలో అన్ని దశలు పూర్తి చేసుకుని ప్లాంటు మొత్తం 9 లక్షల చదరపు అడుగుల స్థాయికి చేరుతుందని చెప్పారు. ఇందుకు మొత్తం రూ.300 కోట్ల పెట్టుబడి అవసరమని వెల్లడించారు. నతన కేంద్రంలో చమురు, సహజ వాయువు, భారీ పరిశ్రమలు, వంట నూనెల రంగ సంస్థలకు అవసరమైన ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తామని నాగేశ్వర రావు వివరించారు.అయిదేళ్లలో ఎగుమతులు సగం..కంపెనీ ఆదాయంలో గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వాటా 0.5 శాతమే. 2024–25లో ఇది 15 శాతానికి చేరుతుందని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘అయిదేళ్లలో ఎగుమతుల వాటా 50 శాతానికి చేరుస్తాం. యూఎస్‌కు చెందిన ఐపీపీ కంపెనీతో చేతులు కలిపాం.ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షలకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఐపీపీ సహకారంతో ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకుంటాం. అలాగే జపాన్‌కు రెండు నెలల్లో ఎగుమతులు ప్రారంభిస్తున్నాం. కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్క భారత్ నుంచే రూ.15,000 కోట్లు ఉంటుంది’ అని వివరించారు.ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు..ప్రస్తుతం స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 65 రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. 15 కొత్త ఉత్పత్తులు అభివృద్ధి దశలో ఉన్నాయని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘నెలకు 300 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. రెండు నెలల్లో ర.40 కోట్ల మూలధన వ్యయం చేస్తాం. రెండేళ్లలో మరో ర.60 కోట్లు వెచ్చిస్తాం. 2023–24లో ర.549 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ర.700 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఏటా టర్నోవర్‌లో 50 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం. ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు ఉంది’ అని పేర్కొన్నారు.జనవరి 6న ఐపీవో..స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభమై 8న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ర.123 కోట్లు అందుకుంది. ఒక్కొక్కటి ర.140 చొప్పున 87,86,809 ఈక్విటీ షేర్లను కేటాయించింది. అమన్సా హోల్డింగ్స్, క్లారస్ క్యాపిటల్–1, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, కోటక్ మహీంద్రా ట్రస్టీ కో లిమిటెడ్ ఏ/సీ కోటక్ మాన్యుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఫండ్, టాటా ఎంఎఫ్, మోతిలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, 3పీ ఇండియా ఈక్విటీ ఫండ్–1, కోటక్ ఇన్ఫినిటీ ఫండ్–క్లాస్ ఏసీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐటీఐ లార్జ్ క్యాప్ ఫండ్ వీటిలో ఉన్నాయి.ఇక ఐపీవోలో భాగంగా ర.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1,42,89,367 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ ర.133–140గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతా
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్న దర్శన్ మెహతా ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రిలయన్స్ బ్రాండ్స్ వ్యాపారంలో భాగమైన ఆయన రిలయన్స్ గ్రూప్‌లో మెంటార్‌గా ఉండబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.తదుపరి తరం నాయకులకు మెహతా మార్గదర్శకత్వం వహిస్తారని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ గ్రూప్‌లో వ్యాపార అవకాశాలను విశ్లేషించడానికి, కొత్త వాటిని అన్వేషించడానికి కూడా ఆయన సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపింది. మెహతా రిలయన్స్ బ్రాండ్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. రిలయన్స్ బ్రాండ్స్ మొదటి ఉద్యోగుల్లో మెహతా కీలక వ్యక్తిగా ఉన్నారు. 2007లో రిలయన్స్ బ్రాండ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంస్థలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆయన అరవింద్ బ్రాండ్స్ వంటి కంపెనీల్లో పని చేశారు. విలాసవంతమైన, ప్రీమియం విభాగాల్లో రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మెహతా కృషి చేశారు.ఇదీ చదవండి: ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్గడిచిన కొన్నేళ్లుగా రిలయన్స్ బ్రాండ్స్ అనేక గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. బాలెన్సియాగా, జిమ్మీ చూ, బొట్టెగా వెనెటాతో సహా 90 కంటే ఎక్కువ బ్రాండ్లు రిలయన్స్ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంస్థ స్వదేశీ డిజైనర్ బ్రాండ్లను కూడా పరిచయం చేస్తోంది. మెహతా అనంతరం రిలయన్స్ బ్రాండ్‌కు కొత్త ఎండీని నియమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి రిలయన్స్ బ్రాండ్లను పర్యవేక్షిస్తూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉన్న వికాస్ టాండన్, దినేష్ తలూజా, ప్రతీక్ మాథుర్, సుమీత్ యాదవ్‌లతో కోర్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఎన్‌పీసీఐకి ప్రవీణా రాయ్ రాజీనామా: ఎంసీఎక్స్‌లో కొత్త బాధ్యతలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ప్రవీణా రాయ్' తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం 'మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్' (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణా రాయ్ ఎంసీఎక్స్‌లో నియామకానికి 'సెబీ' ఆమోదం తెలిపింది. రాయ్ ఎన్పీసీఐలో చేరటానికి ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీలలో కూడా పనిచేశారు.ఇదీ చదవండి: బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూతఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ప్రవీణా రాయ్.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పేజీ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో చేరినప్పుడు ఈమె క్యాష్ మేనేజ్మెంట్ పోర్ట్ ఫోలియో నిర్వహించారు. ఆ తరువాత హెచ్ఎస్బీసీలో ఆసియా - పసిఫిక్ రీజియన్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్పీసీఐలో రాయ్ మార్కెటింగ్, ప్రొడక్ట్, టెక్నాలజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఆపరేషన్ డెలివరీ వంటి బాధ్యలు నిర్వహించారు. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు.PRESS RELEASE - Ms. Praveena Rai takes charge as MD & CEO of MCXClick here to read more: https://t.co/114IrR0cYL#pressrelease pic.twitter.com/yZW5GGEmbT— MCX (@MCXIndialtd) October 31, 2024 -
ఈక్విటీ కరెక్షన్తో తిరిగి బ్యాంకుల్లోకి డిపాజిట్లు
ముంబై: ఈక్విటీ మార్కెట్లో దిద్దుబాటుతో బ్యాంక్‌లు తిరిగి డిపాజిట్లను ఆకర్షించగలవని ఎస్బీఐ ఎండీ అశ్విని తివారీ అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ డిపాజిట్ల వృద్ధికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలను కీలకంగా చూస్తున్నట్టు చెప్పారు. క్యాపిటల్ మార్కెట్లలో ర్యాలీతో బ్యాంకుల్లోని డిపాజిట్లు అధిక రాబడులను ఇచ్చే ఇతర సాధనాల్లోకి మళ్లేలా చేసినట్టు పేర్కొన్నారు.కాలక్రమేణా మార్కెట్ కరెక్షన్కు లోనైతే గతంలో తమ వద్ద డిపాజిట్లుగా ఉండే కొంత మొత్తం తిరిగి వెనక్కి వస్తుందన్నారు. తక్కువ విలువైన, చిన్న ఖాతాల ద్వారా డిపాజిట్లు పెంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నట్టు తివారీ తెలిపారు. జన్‌ధన్ యోజన ఖాతాలపై గతంలో ప్రత్యేక దృష్టి ఉండేది కాదంటూ, ఇక మీదట ఆ ఖాతాలను కూడా కీలకంగా చూస్తామన్నారు. గడిచిన 18 నెలలుగా బ్యాంకుల్లో డిపాజిట్ల కంటే రుణాల వృద్ధే అధికంగా నమోదవుతుండడం గమనార్హం. దీంతో డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు రేట్లను పెంచడం లేదంటే రుణ వృద్ధిలో రాజీ పడాల్సిన పరిస్థితి నెలకొంది.దేశ ఈక్విటీ మార్కెట్ గడిచిన ఏడాదిన్నర పాటు గణనీయమైన వృద్ధిని చూడడం గమనార్హం. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం ఈక్విటీ మ్యూచవుల్ ఫండ్స్, నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న ధోరణి నెలకొంది. ఈ క్రమంలో అశ్విని తివారీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అన్సెక్యూర్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచడం, ప్రాజెక్టు రుణాలకు అధిక కేటాయింపులు చేయాల్సి రావడం వంటివి డిపాజిట్లలో వృద్ధి నిదానించడానికి సంకేతంగా తివారీ పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైతే డిపాజిట్ల రేట్లను సైతం పెంచుతామని ప్రకటించారు. ప్రత్యామ్నాయాలు.. సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో 90 శాతం మేర రుణ అవసరాలకు సరిపడా నిధులు డిపాజిట్ల రూపంలోనే వస్తుంటాయని.. ఇన్ఫ్రా బాండ్లు వంటి ఇతర సాధనాలవైపు చూడక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్ల వాటా తగ్గొచ్చని తివారీ చెప్పారు. సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియో చెల్లింపుల్లో ఎలాంటి వైరుధ్యాలు లేవన్నారు. -
బంధన్ బ్యాంక్ సీఈఓగా రతన్ కుమార్ కేష్
బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'రతన్ కుమార్ కేష్' జూలై 10 నుంచి అమలులోకి వచ్చేలా ప్రైవేట్ లెండర్ తాత్కాలిక ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎండీ & సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ 2024 జులై 9న పదవీ విరమణ చేయనున్నారు.జూలై 6న సమావేశంలో రతన్ కుమార్ కేష్‌ను తాత్కాలిక ఎండీ అండ్ సీఈఓగా నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు తీర్మానించింది. ఈ నియామకం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం కూడా లభించింది.రతన్ కుమార్ కేష్ మార్చి 2023 నుంచి బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అంతకంటే ముందు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యెస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్‌లలో కూడా పనిచేశారు. -
సాగర తీరంలో లగ్జరీ ఫ్లాట్.. రూ.41 కోట్లకు కొన్న కేరళ బిజినెస్‌మ్యాన్
కేరళకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పి.నందకుమార్ ముంబైలో ఖరీదైన లగ్జరీ సీ ఫేసింగ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ప్రైమ్ కార్టర్ రోడ్డులో రూ.41.25 కోట్లకు ఈ అపార్ట్మెంట్ కొన్నట్లు ఈ లావాదేవీకి సహకరించిన రియల్ ఎస్టేట్ ప్రాప్‌టెక్ కంపెనీ నోబ్రోకర్‌ను ఉటంకిస్తూ మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది.వెస్ట్ బాంద్రా ప్రాంతంలో 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది. ఏప్రిల్ 24న రిజిస్ట్రేషన్ జరగ్గా, ఎస్ రహేజా డెవలపర్స్ దీనిని విక్రయించింది. దీని కోసం నందకుమార్ రూ.2.3 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ప్రస్తుతం ముంబైలో కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నందకుమార్ కుమారుడు ఈ నివాసం ఉపయోగించనున్నట్లు సమాచారం. కేరళకు చెందిన ఈ కుటుంబానికి ముంబైలో ఇదే తొలి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్.ముంబైలోని ఈ ఖరీదైన ప్రాంతంలో ఇటీవల పలువురు వ్యాపార సినీ ప్రముఖలు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేశారు. యానిమల్, బుల్బుల్, కాలా తదితర చిత్రాల్లో నటించిన నటి తృప్తి దిమ్రీ జూన్ 3న ముంబైలోని బాంద్రా వెస్ట్ కార్టర్ రోడ్లో ఓ లగ్జరీ ప్రాపర్టీని రూ.14 కోట్లకు కొనుగోలు చేశారు. అంతకు ముందు మే నెలలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని బోరివాలిలో ఆరు లగ్జరీ అపార్ట్మెంట్లను రూ .15.42 కోట్లకు కొనుగోలు చేశారు. -
వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల మార్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ఐఏఎస్‌లను ఎండీలుగా నియమిస్తామంటూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల్లో గుబులు నెలకొంది. మరోవైపు కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వ్యవసాయ శాఖలో కొందరు అధికారులు మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సంక్రాంతికి ముందుగానే లేదా ఆ వెంటనే కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తనకు గతంలో తెలిసిన, సమర్థులైన అధికారులను ఆయా పోస్టుల్లో నియమించవచ్చని చెబుతున్నారు. వ్యవసాయ శాఖలో మార్క్‌ఫెడ్, ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా, వేర్ హౌసింగ్ లాంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత కూడా వీటిల్లో కొన్నింటికి ఐఏఎస్‌లు ఎండీలుగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఐఏఎస్‌లు కానివారు ఎండీలుగా కొనసాగుతున్నారు. గత సర్కారుతో సంబంధాలపై ఆరా ప్రస్తుతం కార్పొరేషన్ల ఎండీలుగా ఉన్నవారి గురించిన సమాచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంతో వారెలా ఉన్నారు? వృత్తిపరంగా వ్యవహరించారా? లేక అప్పటి అధికార పార్టీ నేతల్లా పనిచేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొన్ని కార్పొరేషన్లలో ఎండీలు, చైర్మన్లు కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. కొందరు ఎండీ స్థాయి లేకున్నా పైరవీలతో ఆయా సీట్లలో కూర్చున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయా పోస్టుల్లో కొనసాగేందుకు కొందరు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఉండేదెవరు? ఊడేదెవరు?: మార్క్‌ఫెడ్‌కు సత్యనారాయణరెడ్డి ఎండీగా ఉన్నారు. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఆయన ఈ బాధ్యతల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన గత ప్రభుత్వంలోని మంత్రి దయాకర్‌రావు వద్ద పీఎస్‌గా పనిచేశారు. ఇలా గతంలో పీఎస్లుగా పనిచేసిన వారి ని ఇప్పుడు తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సత్యనారాయణరెడ్డి కొనసాగింపుపై చర్చ జరుగుతోంది. వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ఎండీగా ఉన్న జితేందర్‌రెడ్డి ఒక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు. కాబట్టి ఈయన కొనసాగింపుపైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇక ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా సంస్థలకు ఎండీలుగా సీనియర్ అధికారులు ఉన్నారు. వీరికి గతంలో బీఆర్ఎస్తో రాజకీయపరమైన సంబంధాలు లేవంటున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కేశవులు అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ సంస్థ (ఇష్టా)కు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతర్జాతీయంగా రాష్ట్ర ఖ్యాతిని చాటుతున్నారు. కాబట్టి ఈయన మార్పు ఉండబోదన్న వాదన వినిపిస్తోంది. ఇక ఆయిల్ ఫెడ్, హాకాలకు ఎండీగా ఉన్న సురేందర్, ఆగ్రోస్ ఎండీ రాములు ఇద్దరూ సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు చెందినవారు. కాబట్టి వారిని కూడా మార్చక పోవచ్చని చెబుతున్నారు. వారికి సీఎంతో ఉన్న అనుబంధం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. రఘునందన్‌రావు కొనసాగుతారా? వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు కొనసాగుతారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సన్నిహితుడన్న ప్రచారముంది. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోనూ రఘునందన్‌రావుకు మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొనసాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ మార్చినా మంచి పోస్టులోకే వెళ్తారని అంటున్నారు. -
భారత్‌కు మించింది లేదు: యూట్యూబ్ ఎండీ
ప్రతిభావంతులైన, ఔత్సాహికులైన యువతకు ప్రస్తుతం భారత్‌కు మించిన మెరుగైన ప్రదేశం మరొకటి లేదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇషాన్ ఛటర్జీ. ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన ఇషాన్ ఛటర్జీ గత సంవత్సరం యూఎస్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఎన్డీటీవీతో పలు విషయాలు వెల్లడించారు. భారత్‌లో రాబోయే 10 సంవత్సరాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. భారత్ అత్యంత వైవిధ్యమైన, డైనమిక్ ఉత్తేజకరమైన మార్కెట్ అని పేర్కొన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లకు సైతం యూట్యూబ్ వేదికను కల్పించిందన్నారు. ఇషాన్ ఛటర్జీ పాఠశాల విద్యాభ్యాసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఢిల్లీలోని సెయింట్ స్టీపెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ చేసిన ఆయన అమెరికాలోని వార్టన్ స్కూల్ యూనివర్సిటీ నంచి ఎంబీఏ పూర్తి చేశారు. యూట్యూబ్‌కు ముందు ఇషాన్ ఛటర్జీ గూగుల్, మెకెన్సీ కంపెనీల్లో పనిచేశారు. -
లగ్జరీ ఫ్లాట్ కొన్నహెచ్‌పీ ఇండియా ఎండీ ఇప్సితా దాస్‌గుప్తా
హెచ్‌పీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఇప్సితా దాస్‌గుప్తా, ముంబైలోని వర్లీ ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. అక్టోబర్ 2023లో హెచ్‌పీ ఇండియాకు ఎండీ నియమితులయ్యారు ఇప్సితా. ముంబైలోని వర్లీ ప్రాంతంలో 22.52 కోట్ల రూపాయలకు 2,964 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు ఇప్సితా. తాజా నివేదికల ప్రకారం అరేబియా సముద్రం, బాంద్రా-వర్లీ సీ లింక్ వ్యూతో , సూపర్-ప్రీమియం ప్రాజెక్ట్ రహేజా ఆర్టీసియాలోని 4వ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. ఈ ఫ్లాట్‌లో 100 చదరపు అడుగుల బాల్కనీ, మూడు కార్ పార్కింగ్ స్లాట్లు ప్రత్యేక ఆకర్షణ. ప్రాపర్టీ టెక్ సంస్థ Zapkey సమాచారం ప్రకారం ఈ డీల్ అక్టోబర్ 26న రిజిస్టర్ అయింది. అయితే ఈ డీల్‌పై ఇటు కె రహేజా కార్ప్, ఇటు హెచ్‌పీ ఇండియా గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా 2023 ఏడాదిలో 10 నెలల కాలంలో 1.04 లక్షలకు పైగా ఆస్తి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ముఖ్యంగా 2023 ఆగస్టులో, Paytm పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సురీందర్ చావ్లా, సెంట్రల్ ముంబైలోని లోయర్ పరేల్‌లోని ఇండియాబుల్స్ స్కై ఫారెస్ట్‌లో 2,516 కార్పెట్ ఏరియాతో 20 కోట్ల రూపాయలకు డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. 2022లో ముంబైలోని టాప్ 100 హౌసింగ్ ప్రాజెక్ట్‌లలో రూ. 43,000 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడయ్యాయి, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 2.5 శాతం క్షీణించిందని జాప్కీ డాట్ కామ్ విశ్లేషణలో తేలింది. -
2030–31 నాటికి 70 లక్షల కార్లు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన పరిశ్రమ 2030–31 నాటికి భారత్‌లో 60–70 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకే యూచీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థాయిల కంటే దాదాపు రెండింతల కార్యకలాపాలు పెరుగుతాయ ని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కార్యకలాపాలను నిలకడగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చే మార్గాలను కనుగొనాలని ఏసీఎంఏ సదస్సులో పిలుపునిచ్చారు. ‘విడిభాగాల తయారీ పరిశ్రమ దేశీయంగా రూపకల్పన, అభివృద్ధి సామర్థ్యాన్ని బలోపేతం, వ్యాపార విస్తరణ, వృద్ధికి ఇప్పటికే ఉన్న మానవశక్తి నైపుణ్యాలను మెరుగుపరచడానికి కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి కొత్త సాంకేతికతలు, ఇంధనాలను స్వీకరించడానికి దారితీస్తున్నాయి. తద్వారా ముఖ్యంగా భారతీయ ఆటో విడిభాగాల తయారీదార్లకు పెద్ద అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇప్పటి వరకు ’మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి ప్రతిరూపాలలో మీరు ఒకరు. ఇప్పుడు తయారీ నైపుణ్యాన్ని సంపాదించిన తర్వా త మనం ’డిజైన్ ఇన్ ఇండియా’ వైపు మళ్లాలి. భారత్‌లో భారీ టాలెంట్ పూల్ ఉంది. కానీ వారిని పరిశ్రమకు సిద్ధం చేయడానికి ముడిపడి ఉన్న అన్ని సంస్థలతో అనుసంధానం అవసరం. ప్రభుత్వం నుండి కూడా క్రియాశీల మద్దతు కోరుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ పగ్గాలు మళ్ళీ అతనికే - ఆర్బీఐ ఆమోదం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఐసీఐసీఐ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ 'సందీప్ భక్షి' (Sandeep Bakhshi)ని మరో మూడేళ్లపాటు కొనసాగడానికి ఆమోదం తెలిపింది. దీంతో ఈయన 2023 అక్టోబర్ 04 నుంచి 2026 అక్టోబర్ 03 వరకు ఆ పదవిలో ఉంటారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2023 ఆగష్టు 30న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో షేర్హోల్డర్లు ఆమోదించినట్లు తెలిసింది. 2018లో చందా కొచ్చర్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత సందీప్ భక్షి సీఈఓగా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి బక్షి బ్యాంకుని అగ్రస్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేసాడు. ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలు - ఇది కదా కావాల్సింది! సందీప్ భక్షి నాయకత్వంలో ఐసీఐసీఐ బ్యాంక్ గొప్ప విజయాలను సాధించగలిగింది. 1986 నుంచి ఐసీఐసీఐ గ్రూపుతో మంచి సంబంధాలున్న భక్షి 2022లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ ఎండి అండ్ సీఈఓ పదవిని, 2010 నుంచి 2018 వరకు ఐసీఐసీఐ ఫ్రడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి, సీఈఓ పదవిని చేపట్టాడు. కాగా 2018 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓగా కొనసాగుతున్నాడు. -
బ్రైట్‌కామ్ సీఎండీ, సీఎఫ్‌వోల రాజీనామా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్ సీఎండీ సురేశ్ రెడ్డి, సీఎఫ్‌వో నారాయణ రాజు రాజీనామా చేశారు. ఇరువురి రాజీనామాను ఆమోదించినట్టు కంపెనీ బోర్డు ప్రకటించింది. కొత్త సీఈవో, సీఎఫ్‌వో కోసం అన్వేషణ ప్రారంభించేందుకు సైతం బోర్డు ఓకే చెప్పింది. కాగా, కంపెనీ ఆర్థిక వ్యవహారాలలో అకౌంటింగ్ అక్రమాలు, తప్పుడు స్టేట్మెంట్లను వెల్లడించినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విచారణలో తేలడంతో.. ఆగస్టు 22న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు ద్వారా సీఎండీ, సీఎఫ్‌వోలను బోర్డు స్థానాల నుండి సెబీ నిషేధించిన సంగతి తెలిసిందే. కంపెనీ తన షేర్ల ప్రాధాన్యత కేటాయింపులకు సంబంధించిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లు కల్పితమని సెబీ కనుగొంది. దీనిని అనుసరించి బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లను విక్రయించకుండా శర్మ, 22 ఇతర సంస్థలను సెబీ నిషేధించింది. -
టెక్ కంపెనీ సీఈవో, ఎండీ జంట హత్యలు: షాకింగ్ వీడియో వైరల్
సంచలనం సృష్టించిన బెంగుళూరు జంట హత్యల కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఈ హత్యలతో సంబంధం ఉందని అనుమానిస్తున్న వ్యక్తులు ఘటన తర్వాత పారిపోతున్న వీడియో ఇపుడు సంచలనంగా మారింది. పీటీఐ దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. బెంగళూరులోని ఏరోనిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో జంట హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ గురువారం ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. జూలై 11న సాయంత్రం 4:14 గంటలకు మొదటి సీసీటీవీ విజువల్‌లో, ముగ్గురు నిందితులు ఏరోనిక్స్ కార్యాలయం నుంచి బయటకు పరుగెత్తుతూ కెమెరాకు చిక్కారు. నిందితులు సంతోష్, వినయ్ రెడ్డి ఆఫీసు గేటు నుంచి బయటకు వస్తుండగా, ప్రధాన నిందితుడు శబరీష్ అలియాస్ జాక్ ఫిలిక్స్ కనిపించారు .కన్నడ ర్యాపర్‌గా చెప్పుకునే ఫిలిక్స్‌కు ఇన్‌స్టాలో 16 వేల మంది ఫాలోయిర్స్ ఉన్నారు. (హెచ్‌సీఎల్ చేతికి జపాన్...279 మిలియన్ డాలర్ల డీల్) వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ హత్య పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ‘‘తన బిజినెస్‌కు ఇబ్బందిగా మారిన చెడ్డవారిని శిక్షిస్తా..ఈ ప్రపంచం మొత్తం మోసగాళ్లు, ఫేక్ పొగడ్తలతో ముంచెత్తే వారితో నిండిపోయింది. నేను ఈ భూమిపైనే వారిని శిక్షిస్తాను. మంచివారిని ఎప్పుడూ ఏమీ చేయను” అంటూ వాట్సాప్ స్టేషన్ పెట్టినట్టు తెలుస్తోంది. కాగా ఎఫ్ఐఆర్ ప్రకారం ఎయిర్నిక్స్ ఎండీ ఏళ్ల ఫణీంద్ర సుబ్రమణ్య (36), ఆ తర్వాత సీఈవో విను కుమార్ (40)పై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ముగ్గురు అనుమానితులు శబరీష్ , సంతోష్ వినయ్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు VIDEO | Bengaluru double-murder: CCTV footage shows two of the accused, who allegedly killed a managing director and a chief executive officer of a company, fleeing spot after committing the crime. (Source: Third Party) pic.twitter.com/scntpM5dRP — Press Trust of India (@PTI_News) July 13, 2023 -
కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది..
ఆయనొక పాథాలజిస్ట్.. ముంబైలో చిన్న ల్యాబ్‌ను నడిపేవాడు.. విదేశాల నుంచి అతని కూతురొచ్చింది. ఆ చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల మల్టీ చెయిన్ సంస్థగా తీర్చిదిద్దింది. ఆమె ఎవరు.. తండ్రి కలను ఎలా సాకారం చేసింది.. తెలుసుకోండి.. అమీరా షా.. మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయి. విదేశాల్లో చదివిన అమీరా షా ఫైనాన్స్ ప్రొఫెషనల్. గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో పని చేసేది. అందులో సంతృప్తి లేక వ్యాపారవేత్తగా మారాలని నిర్ణయించుకుంది. తన వ్యాపార పరిజ్ఞానాన్ని తండ్రి వైద్య ప్రావీణ్యంతో మిళితం చేసి, రూ. 6478 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న అతిపెద్ద డయాగ్నస్టిక్ సంస్థను సృష్టించింది. వైద్య కుటుంబం అమీరా షా ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆమె యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్ నుంచి ఫైనాన్స్ డిగ్రీ అందుకున్నారు. ఆమె వైద్యుల కుటుంబానికి చెందిన వారు. తండ్రి పాథాలజిస్ట్ డాక్టర్ సుశీల్ షా. తల్లి గైనకాలజిస్ట్ డాక్టర్ దురు షా. సోదరి జన్యు శాస్త్రవేత్త. కంపెనీని విజయవంతంగా ప్రారంభించిన అనంతరం కూడా ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఓనర్-ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేశారు. 21 ఏళ్లకే స్టార్టప్ అమీరా షా ఒక పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను గోల్డ్‌మన్ సాక్స్‌లో పనిచేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేదని, అంత పెద్ద ఆర్థిక సేవల సంస్థలో పనిచేస్తున్నా ఆ ఉద్యోగాన్ని ఎప్పుడూ ఆస్వాదించలేదని చెప్పారు. దీంతో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కేవలం ఐదుగురు వ్యక్తులతో స్టార్టప్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఆమె వయసు కేవలం 21 ఏళ్లు. ఇలా లాభం లేదు ఇంకా మరింత ప్రభావం చూపాలన్న తండ్రి సలహా మేరకు ఆమె భారత్‌కు తిరిగివచ్చారు. అలా దేశానికి తిరిగిన వచ్చిన ఆమె తన తండ్రి నడుపుతున్న ల్యాబ్‌లో సమస్యలను గుర్తించింది. ఆ లాబ్ చాలా సాదాసీదాగా ఉంది. కంప్యూటర్లు కూడా లేవు. కానీ తన ల్యాబ్‌ను అతిపెద్ద డయాగ్నోస్టిక్స్ చైన్‌ను రూపొందించాలన్నది ఆయన కల. కానీ ఎలాగో తనకు తెలియదు. తండ్రి కలను సాకారం చేసే భారీ ఆపరేషన్‌ను మొదలు పెట్టింది అమీషా. మొదటగా ల్యాబ్‌ను ఆధునికీకరించి అన్ని వసతులు, హంగులతో తీర్చిదిద్దింది. ల్యాబ్‌లో పేషంట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించింది. వివిధ విభాగాలను సృష్టించి ల్యాబ్ నిర్వహణను మెరుగ్గా మార్చేసింది. తండ్రి సహకారంతో ఆ కంపెనీకి సీఈఓ అయింది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. కిందిస్థాయి నుంచి.. ఆమె ఈ సంస్థను కింది స్థాయి నుంచి ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఆమే స్వయంగా కస్టమర్ కేర్ కౌంటర్లో రోగులకు సేవలందించింది. రోజువారీ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ప్రారంభించింది. ల్యాబ్ పేరును డాక్టర్ సుశీల్ షా లాబొరేటరీ నుంచి మెట్రోపాలిస్గా మార్చారు. తర్వాత ఇతర డయాగ్నోస్టిక్ సెంటర్లతో భాగస్వామ్యం చేయడం ప్రారంభించారు. వారి మొదటి టై అప్ చెన్నైలో డాక్టర్ శ్రీనివాసన్ అనే పాథాలజిస్ట్‌తో జరిగింది. అనతి కాలంలోనే వారి డయాగ్నోస్టిక్ సంస్థ అభివృద్ధి బాట పట్టింది. 2006 సంవత్సరంలో వారికి బయటి నుంచి నిధులు వచ్చాయి. వ్యాపారంలో సంపాదించిన డబ్బును అలాగే పెట్టుబడి పెట్టారు. 2002లో వారికి ఒకే ఒక ల్యాబ్ ఉండేది. దీని ఆదాయం అప్పట్లో రూ.7 కోట్లు. 2023లో వారి ఆదాయం రూ.1148 కోట్లు. మార్చి త్రైమాసికంలోనే వారి నికర లాభం రూ.33 కోట్లు. నేడు వారి మెట్రోపాలిస్ సంస్థకు 1500 పైగా సేకరణ కేంద్రాలు, 125 పైగా ల్యాబ్‌లు ఉన్నాయి. ఇవి ఏడు దేశాల్లో పనిచేస్తున్నాయి. ఇలాంటి స్పూర్తివంతమైన పారిశ్రామిక వేత్తల విజయగాథలు, ఆసక్తికరమైన కథనాల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడిండి -
బీపీసీఎల్ చైర్మన్‌గా కృష్ణకుమార్ బాధ్యతలు
న్యూఢిల్లీ: బీపీసీఎల్ నూతన చైర్మన్, ఎండీగా జి.కృష్ణకుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు వరకు సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2025 ఏప్రిల్ వరకు బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. గత డిసెంబర్లో ప్రభుత్వరంగ సంస్థల నియామక మండలి కృష్ణకుమార్‌ను ఈ పదవికి ఎంపిక చేయడం గమనార్హం. బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా అరుణ్‌కుమార్ సింగ్ గతేడాది అక్టోబర్‌తో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సంస్థ చైర్మన్ బాధ్యతలను ఫైనాన్స్ డైరెక్టర్ వెస్టా రామకృష్ణ గుప్తా చూశారు. ఎన్ఐటీ తిరుచ్చిరాపల్లి నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, జమ్నాలాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ను కృష్ణకుమార్ పూర్తి చేశారు. -
ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్!
భారత బ్యాంకింగ్ రంగంలో మహిళలు కీలక స్థానాలను అధిరోహించారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే మహిళ అధినేత్రిగా ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి కొన్ని ఇతర బ్యాంకుల్లో డైరెక్టర్, మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏకైక మహిళా సీఈవో, ఎండీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం మణిమేఖలై సీఈవో, ఎండీగా ఉన్నారు. చురుకైన నిర్ణయాలతో బ్యాంకును విజయవంతంగా నడిపిస్తున్నారు. 1988లో విజయా బ్యాంక్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె అక్కడ ఆమె పలు కీలక పదవులు నిర్వహించారు. 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్ విలీనం అయిన తర్వాత ప్రభుత్వం ఆమెను కెనరా బ్యాంక్‌లో మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. ఇందులో ఆమె వ్యూహాత్మక ప్రణాళిక, క్రెడిట్ సంబంధిత అంశాలు, తనిఖీ, మార్కెటింగ్, ఫైనాన్సియల్ ఇన్‌క్లూషన్, రాష్ట్ర స్థాయి లీడ్ బ్యాంక్ బాధ్యతలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరును పర్యవేక్షించారు. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల విలీనంలో కీలక పాత్ర పోషించారు. కాన్‌బ్యాంక్ ఫ్యాక్టర్స్, కాన్‌బ్యాంక్ కంప్యూటర్ సర్వీసెస్, కెనరా హెచ్ఎస్బీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్, జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఆమెకు విశేష అనుభవం ఉంది. అలాగే కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు ట్రస్టీగా వ్యవహరించారు. మణిమేఖలై బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (మార్కెటింగ్) పట్టా పొందారు. ముంబైలోని నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేశారు. ఇతర బ్యాంకుల్లో.. కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి మరికొన్ని బ్యాంకుల్లో డైరెక్టరియల్, మేనేజ్మెంట్ వంటి కీలక స్థానాల్లో మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బిజినెస్ ఫైనాన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గ్రూప్ హెడ్‌గా అషిమా భట్ సేవలు అందిస్తున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వినియోగదారుల బ్యాంకింగ్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా శాంతి ఏకాంబరం ఉన్నారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్లలో బృందా జాగీర్దార్ ఒకరు. గతంలోనూ అరుంధతీ భట్టాచార్య, ఉషా అనంతసుబ్రమణియన్, పద్మజ చుండూరు, శిఖా శర్మ, చందా కొచర్ వంటి వారు పలు బ్యాంకులకు నాయకత్వం వహించారు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! -
బీఎస్ఈ సీఈవోగా సుందరరామన్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈకి ఎండీ, సీఈవోగా సుందరరామన్ రామమూర్తి ఎంపికయ్యారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రామమూర్తి ఎంపికకు గత నెలలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు బీఎస్ఈ పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌ను రామమూర్తి ఆమోదించవలసి ఉన్నట్లు తెలియజేసింది. బీఎస్ఈ గత ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ గతేడాది(2022) జూలైలో పదని నుంచి తప్పుకుని మరో దిగ్గజ స్టాక్ ఎక్ఛేంజీ ఎన్ఎస్ఈకి తరలి వెళ్లారు. దీంతో ఎన్ఎస్ఈలో సభ్యులుగా వ్యవహరించిన రామమూర్తికి బీఎస్ఈ అత్యున్నత పదవిని ఆఫర్ చేసింది. -
ఐఓబీ ఎండీ, సీఈఓగా అజయ్ కుమార్ శ్రీవాస్తవ
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (ఎండీ, సీఈఓ) అజయ్ కుమార్ శ్రీవాస్తవను కేంద్రం నియమించింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఐఓబీ చీఫ్ డైరెక్టర్‌గా శ్రీవాస్తవ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆయనకు దాదాపు 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
ఎస్బీఐ ఫండ్స్ ఎండీగా షంషేర్ సింగ్ నియామకం
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న షంషేర్ సింగ్ తాజాగా ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు కొత్త ఎండీ, సీఈవోగా ఎంపికయ్యారు. ప్రస్తుత ఎండీ, సీఈవో వినయ్ ఎం టాన్సే నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. వినయ్ ఎస్బీఐకు తిరిగి బదిలీకానున్నట్లు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఎస్బీఐలోని వివిధ విభాగాలలో 32ఏళ్లకుపైగా పనిచేసిన అనుభవం సింగ్ సొంతంకాగా.. ఇన్వెస్ట్మెంట్, కార్పొరేట్, బ్రాంచ్ బ్యాంకింగ్లతోపాటు, ట్రెజరీ తదిరాలలో విధులు నిర్వర్తించారు. 1990 జూన్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా సింగ్ తొలుత ఎస్బీఐలో చేరారు. తదుపరి వివిధ నాయకత్వ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ డిప్యూటీ ఎండీగా పదవోన్నతి పొందారు. ఈ క్రమంలో యూఎస్, బహ్రయిన్, యూఏఈలలోనూ విధులు నిర్వహించారు. -
అద్దె బస్సుల విధానం ఈనాటిది కాదు: ఆర్టీసీ ఎండీ
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తోందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీకి ప్రజలు ముఖ్యమైన వారు. ఇటీవల కొన్ని పత్రికలు ఆర్టీసీపై దుష్రచారం చేస్తున్నాయి. ఆర్టీసీలో అద్దె బస్సుల విధానం కొత్తది కాదు. అద్దె బస్సులు 1979 నుంచి నడుపుతున్నారు. ప్రజల సౌకర్యం కోసం ప్రస్తుతం 995 అద్దె బస్సులు నడుపుతున్నాం. కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కొత్తవి కొనలేక అద్దెవి నడుపుతున్నాం. అద్దె బస్సులు కూడా పాతవి కాకుండా.. కొత్తవి, కండిషన్లో ఉన్నవి మాత్రమే వాడాలి. కొత్త బస్సులు ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలి. అద్దె బస్సులు కూడా ఆర్టీసీ సూచించిన విధంగానే నడుపుతారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది అత్యంత అరుదైనది, చరిత్రాత్మకమైనది. కర్ణాటక, తెలంగాణలో ఆర్సీఈ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేయాలని అనేకమార్లు ధర్మాలు చేశారు. అయినా అక్కడ ప్రభుత్వాలు స్పందించలేదు. అద్దె బస్సుల వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదు. ప్రభుత్వం ఉద్యోగులను తొలగిస్తూ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయా పత్రికల్లో వచ్చిన దుష్రచారాలను నమ్మొద్దు. ఇతర రాష్ట్రాలలో రెండు, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగుల సొమ్మును సైతం ఆయా రాష్ట్రాల్లో వాడుకుంటున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత 16,080 కోట్లు అప్పులు తీర్చాం. పీఎఫ్ బకాయిలు మొత్తం చెల్లించాం. సడెన్‌గా మెరుపు సమ్మెలు చేస్తారని కావాలనే హైయర్ బస్సుల పెనాల్టీలు పెంచాం. ప్రజలకు మంచి సేవలు అందాలనే ఇలా చేశాం. కోవిడ్ సమయంలో బస్సులు తిరగనప్పుడు ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో వేగంగా కారుణ్య నియామకాలు చేపడుతున్నాం. 2,237 ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో దాతల సాయంతో చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని' ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. -
చైర్మన్, ఎండీ బాధ్యతల విభజన స్వచ్ఛందమే!
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) స్థానాలను వేరు చేయడం స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాదని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజాగా వివరించింది. ఈ మేరకు 2018 మేలో జారీ చేసిన ఆదేశాలను సరళతరం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో భారత కంపెనీల అభిప్రాయాలను రెగ్యులేటర్ తెలుసుకోవాలని, అయితే దీనిని ‘ఆదేశంగా’ భావించవద్దని ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన సూచనల నేపథ్యంలో సెబీ బోర్డ్ తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతక్రితం సెబీ ప్రకటించిన నిబంధనల ప్రకారం, దేశంలో టాప్ 500 లిస్టెడ్ కంపెనీలు 2022 ఏప్రిల్‌లోపు చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవీ బాధ్యతలను విభజించాల్సి ఉంది. అవసరమైతే ప్రత్యేక అనుమతితో రెండేళ్లు సమయం తీసుకోవచ్చు. తగిన ఏకాభిప్రాయం రాలేదు ఈ విషయంలో ఇప్పటివరకూ తగిన స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో సోమవారం నాడు సమావేశమైన బోర్డ్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. టాప్ 600 లిస్టెడ్ కంపెనీ ఏకాభిప్రాయ ‘సమ్మతి’ 2019 సెప్టెంబర్‌లో 50.4 శాతం ఉంటే, 2021 డిసెంబర్ 31 నాటికి ఇది కేవలం 54 శాతానికి చేరినట్లు పేర్కొంది. కంపెనీల అగ్ర స్థానంలో అధికారాల విభజన వల్ల నిర్వహణా సామర్థ్యం, పర్యవేక్షణ మెరుగుపడుతుందని సెబీ నియమించిన ఉదయ్ కోటక్ నేతృత్వంలోని కమిటీ సూచనలు చేసింది. దీని ప్రాతిపదికనే 2018 మేలో సెబీ ఉత్తర్వులు వెలువడ్డాయి. తుది గడువకు మరో రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఏఐఎఫ్ నిబంధనలకు సవరణ ఇదిలాఉండగా, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బోర్డ్ మంగళవారం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) నిబంధనల సవరణలను ఆమోదించింది. సెక్యూరిటీ, క్రెడిట్ రేటింగ్‌ల బహిర్గతం చేయడంసహా పలు అంశాలను రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లోనికి తీసుకువచ్చింది. ఒక ఇన్వెస్టీ కంపెనీకి చెందిన లిస్టెడ్ ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి మూడవ కేటగిరీ ఏఐఎఫ్‌లకు వెసులుబాటు కల్పిస్తూనే, ఇందుకు కొన్ని షరతులకు లోబడాల్సి ఉంటుందని బోర్డ్ స్పష్టం చేసింది. . కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టండి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచన వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసే దిశగా మరిన్ని కొత్త తరం సంస్కరణలను ప్రవేశపెట్టాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలతో మార్కెట్లలో ఏవైనా ఒడిదుడుకులు తలెత్తితే సరి చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారిగా సెబీ బోర్డుతో సమావేశమైన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. సెబీ తీసుకున్న పలు నిర్ణయాలను ప్రశంసించిన నిర్మలా సీతారామన్.. నిబంధనల భారాన్ని తగ్గించేందుకు, ఇన్వెస్టర్లకు పటిష్టంగా రక్షణ కల్పించేందుకు మరిన్ని చర్యలు అమలు చేయాలని సూచించారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్‌కు తోడ్పాటు ఇవ్వాలని, ఈఎస్జీ (పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్)పరమైన పెట్టుబడులకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్ బాండ్ మార్కెట్‌ను కూడా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. కీలకమైన ధోరణులు, భారత సెక్యూరిటీల మార్కెట్లపై అంచనాలు, వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం తదితర అంశాల గురించి ఆర్థిక మంత్రికి సెబీ చైర్మన్ అజయ్ త్యాగి వివరించారు. ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, సెబీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చదవండి: ద్రవ్యోల్బణం పెరిగినా... వడ్డీరేట్లు పెరగవు -
సంధ్య హోటల్స్ ఎండీ శ్రీధర్‌రావుకు నోటీసు
సాక్షి,హైదరాబాద్: రియల్ఎస్టేట్ మోసాలతోపాటు భూ కబ్జాలకు పాల్పడిన సంధ్య హోటల్స్, కన్వెన్షన్ ఎండీ సరనాల శ్రీధర్‌రావుకు నార్సింగి పోలీసులు 41 సీఆర్పీ నోటీసు జారీ చేశారు. గతంలో రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్స్టేషన్లలో అతనిపై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఓ భూకబ్జా వ్యవహారంపై కేసు నమోదు అయ్యింది. సదరు కేసులో నార్సింగి పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఈనెల 22 వరకు అతడిని అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు వేచి చూసిన నార్సింగి పోలీసులు శుక్రవారం జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్‌లోని అతని నివాసానికి వెళ్లారు. అతను ఇంట్లో లేకపోవటంతో 41సీఆర్పీ నోటీసును ఇంటికి అతికించి వచ్చినట్లు నార్సింగి సీఐ శివకుమార్ పేర్కొన్నారు. అతనిపై కేసులు నమోదైన నేపథ్యంలో విచారణకు సహకరించకుండా బెంగుళూరులో తలదాచుకున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. దీంతో శ్రీధరరావు కోసం బెంగళూరుకు సైబరాబాద్ పోలీసులు స్పెషల్ టీం ని పంపించారు. చదవండి: రాత్రి భోజనం చేసి పడుకున్నాడు.. ఉదయం లేచి చూసేసరికి.. -
సెలెబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్
-
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో శుక్రవారం సజ్జనార్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్ అంతకుముందు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్ విభాగాల్లో పని చేశారు. చదవండి: లవ్ మ్యారేజ్ జంట మూడు నెలలకే తట్టుకోలేక.. చదవండి: కలెక్టరేట్లో గన్‌మెన్‌గా భర్త.. రోడ్డుపై విగతజీవిగా భార్య -
కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు నమోదు
-
ద్వారకా తిరుమలరావు: ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా
విజయవాడ: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఎండీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎండీకి అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రజలకు ఆర్టీసీ ద్వారా మరింత మెరుగైన రవాణా సేవలు అందిస్తానని తెలిపారు. కోవిడ్ తో విపత్కర పరిస్థితిల్లోనూ ఆర్టీసీ సిబ్బంది సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ద్వారకా తిరుమలరావు అభినందించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్వారకా తిరుమలరావు ఇలా మాట్లాడారు. ‘‘ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నన్ను నియమించినందుకు చాలా సంతోషపడుతున్నా. ప్రభుత్వం నాపై గురుతర బాధ్యతలు అప్పగించింది. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తా. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేస్తా. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు నా వంతు ప్రయత్నాలు చేస్తా. దీనికోసం తగిన ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తా. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రయత్నిస్తా’ అని ద్వారకా తిరుమలరావు తెలిపారు. -
శ్రీవైష్ణవి ఆస్పత్రి ఎండీ ఆత్మహత్య
నాగోలు: భవనం ఖాళీ చేయాలని యజమానితోపాటు మరికొందరు వేధించడంతో మనస్తాపం చెందిన ఓ ఆస్పత్రి ఎండీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా శాఖాపూర్(వై) గ్రామానికి చెందిన అజయ్‌కుమార్(38).. భార్య శ్వేత, కుమారులు వర్షిత్, హర్షిత్‌తో కలసి బీఎన్ రెడ్డి నగర్లో ఉంటున్నాడు. సాగర్ రింగ్ రోడ్డు సరస్వతి నగర్ కాలనీలో ఉండే కరుణరెడ్డి ఓ బిల్డింగ్ నిర్మిస్తోన్న క్రమంలో అందులో ఆస్పత్రి ఏర్పాటుకు అజయ్ రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అయినా నిర్మాణం పూర్తి చేయకపోవడంతో అజయ్ మరికొంత డబ్బుతో పూర్తిచేసి శ్రీవైష్ణవి హాస్పిటల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటూ డాక్టర్లతో ఆస్పత్రిని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా ఆస్పత్రి సరిగా నడవక అద్దె ఆలస్యం కావడంతో బిల్డింగ్ ఖాళీ చేయాలని కరుణరెడ్డి చెప్పాడు. కొంత సమయం ఇవ్వాలని కోరినా కరుణరెడ్డి నిరాకరించి కోర్టులో కేసు వేశాడు. తాడుతో ఉరి వేసుకుని..: కొద్దిరోజులు ఆస్పత్రిని మూసివేసి మూడ్రోజుల క్రితమే అజయ్ మళ్లీ ప్రారంభించాడు. బిల్డింగ్ ఖాళీ చేయాలని కరుణరెడ్డి, అతని బావమరిది కొండల్‌రెడ్డితోపాటు మరికొందరు అజయ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చారు. వేధింపులు ఎక్కువ కావడంతో అజయ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి 2 గంటల వరకు ఆస్పత్రిలో ఉన్న అజయ్‌కుమార్ సెల్లార్లో ఉన్న తన గదికి వెళ్లి తా డుతో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఆస్పత్రిలో పనిచేసే స్వా మి వచ్చి.. అజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు కరుణరెడ్డి, కొండల్‌రెడ్డి, తుర్కయంజాల్‌కు చెందిన మాజీ సర్పంచ్ కొత్తకురుమ్మ శివకుమార్, సరస్వతినగర్ కాలనీ అధ్యక్షుడు మేఘారెడ్డి, యాదగిరిరెడ్డి, శివారెడ్డితో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రమేష్ కారణమని అందులో ఉంది. పిల్లలను మంచిగా చూసుకోవాలని భార్యకు రాసిన మరో లేఖ లభించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బెయిల్‌పై ఇలా.. కస్టడీకి అలా..!
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రూ.వందల కోట్ల స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌహీరా షేక్ చంచల్‌గూడ జైలు నుంచి గురువారం ఇలా బయటకు వచ్చి... అలా అరెస్టయ్యారు. ఈమెపై ఇక్కడ నమోదైన కేసుల్లో హైకోర్టు గత వారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో బయటకు వచ్చిన ఆమెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఆ రాష్ట్రంలో నౌహీరాపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు 2018 అక్టోబర్ 16న అరెస్టు చేశారు. ఆపై దేశ వ్యాప్తంగా కేసులు నమోదు కావడంతో వరుస అరెస్టులు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర, బెంగళూరుల్లోని జైళ్లకు వెళ్లి వచ్చిన నౌహీరా చంచల్గూడలోని మహిళా జైలుకు చేరారు. ఈమెపై నమోదైన కేసుల్ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి (ఎస్ఎఫ్ఐఏ) బదిలీ చేసిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ గత నెలాఖరి వారంలో ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌పై విడుదల కావడానికి రూ.5 కోట్లు డిపాజిట్ చేయాలని, రెండు పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. ఈ నిబంధనలను పూర్తి చేసిన నౌహీరా షేక్ గురువారం విడుదలయ్యారు. ఆమెకు తెలంగాణలో బెయిల్ మంజూరైన విషయం తెలుసుకున్న ముంబై ఎకనమికల్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు పీటీ వారంట్లతో చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చారు. జైలు నుంచి బయటకు వస్తున్న నౌహీరాను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో అక్కడకు తరలించారు. అక్కడి కోర్టులో శుక్రవారం హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు వద్ద నౌహీరాను అదుపులోకి తీసుకునే సందర్భంలో ఆమె న్యాయవాదులకు, మహారాష్ట్ర పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. -
మారుతి మాజీ ఎండీకి షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన రూ.110 కోట్ల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు రుణం విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖట్టర్‌పై కేసు నమోదు చేసింది. తన కొత్త కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ లోన్ మోసం కేసులో 110 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. మారుతి ఎండీగా రిటైరైన తరువాత, జగదీష్ ఖట్టర్ కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 2009లో 170 కోట్ల రూపాయల రుణాన్ని పొందారు. ఆ తర్వాత 2012 వరకు కొంత మొత్తాన్ని చెల్లించారు. కానీ సుమారు 110 కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టారు. దీంతో 2015లో ఇది నిరర్ధక ఆస్తి (ఎన్‌పిఎ)గా మారింది. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. -
ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ అన్షులా కాంత్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. గత ఏడాదే కాంత్ ఎండీగా నియమితులైన సంగతి తెలిసిందే. అన్షులా కాంత్‌ను ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎండీ, సీఎఫ్ఐగా నియమించడం సంతోషంగా ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఎస్బీఐ ఎండీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్న ఆమె సుమారు 38 బిలియన్ డాలర్ల (రూ.2.3 లక్షల కోట్లు) ఆదాయాన్ని, 500 బిలియన్ డాలర్ల (రూ.35 లక్షల కోట్లు) ఆస్తులను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆమెకు ఫైనాన్స్, బ్యాంకింగ్ సహా బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్నివినూత్నంగా ఉపయోగించడంలో 35 అనుభవం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తన విధులను విజయవంతంగా కొనసాగిస్తారనే విశ్వాసాన్ని డేవిడ్ మల్పాస్ వ్యక్తంచేశారు. ప్రపంచ బ్యాంకు ఎండీ, సీవోవోగా కాంత్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక, రిస్క్ మేనేజ్మెంట్ బాధ్యత వహిస్తారు, రాష్ట్రపతికి నివేదిస్తారని తెలిపారు. అన్షులాకు ఉన్న అనుభవం నేపధ్యంలో ఆమెకు సాధారణ నిర్వాహణ వ్యవహారాలతో పాటు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ బాధ్యతలను అప్పగించామన్నారు. కాగా లేడీ శ్రీరాం కాలేజ్ ఫర్ విమెన్ నుంచి ఎకనమిక్స్ హానర్స్ చేసిన అన్షులా కాంత్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1960లో జన్మించిన ఆమె 1983లో ఎస్బీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా పనిచేశారు. -
ఏవియేషన్ ఎండీగా భరత్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన నియమాకాలు చేపట్టింది. అందులో భాగంగా ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీగా భరత్ రెడ్డిని.. రైతు సాధికార సంస్థ సీఈవోగా అరుణ్ కుమార్‌ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎండీ గారూ.. సమస్యలు ఆలకించండి సారూ..!
ప్రజా రవాణా వ్యవస్థ ఏపీఎస్ ఆర్టీసీ జిల్లా రీజియన్ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రబాబు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట డిపోను కూడా తనిఖీ చేయనున్నారు. డిపోలు, గ్యారేజ్‌లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, డిపోల భవనాలు, గ్యారేజ్‌ల స్థితిగతులను స్వయంగా పరిశీలించనున్నారు. తమ సమస్యలను ఎండీ పరిష్కరిస్తారని ఆర్టీసీ కార్మికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చిత్తూరు, తిరుపతి సిటీ : జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 డిపోల్లో డీఎం నుంచి కిందిస్థాయి కార్మికుల వరకు 7,200 మంది కార్మికులు ఉన్నారు. కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలను ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయూ నాయకులు ఎండీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే బస్సు పోర్టు నిర్మాణానికి 15 ఎకరాల స్థల సేకరణ, టీటీడీ స్థలాలు, భవనాలకు ఆర్టీసీ నెలవారీగా అద్దెల రూపంలో సుమారు రూ.45 లక్షల దాకా చెల్లిస్తున్నారు. అద్దెలను తగ్గించి నామినల్ చార్జీలు చెల్లించేలా ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌తో ఎండీ చర్చించనున్నారు. తిరుపతి– తిరుమల మధ్య ఎలక్ట్రానిక్ బస్సులు నడపడం, ఆర్టీసీ కార్మికుల వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రి స్థాయి పెంపు వంటి అంశాలపై నెల్లూరు జోన్ ఈడీ, ఆర్ఎం, ఇతర అధికారులతో ఎండీ సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. నేడు డీఎంలతో ఎండీ సమావేశం.. ఎండీ సురేంద్రబాబు సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్ఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో డిపో మేనేజర్లు, సీఐలు, మెకానికల్ ఫోర్మెన్లతో సమావేశం కానున్నారు. సమావేశంలో డిపోల వారీగా స్థితిగతులను డీఎంలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రీజియన్ పరిధిలోని అన్ని డిపోల వివరాలను వీక్షించనున్నారు. అనంతరం ఎండీతో ఎంప్లాయిస్, ఎన్ఎంయూ నాయకులు సమావేశమై జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నారు. మధ్యాహ్నం తిరుపతి బస్‌స్టేషన్, అలిపిరి, మంగళం డిపోలను తనిఖీలు చేయనున్నారు. ♦ 2వ రోజు మంగళవారం శ్రీకాళహస్తి, పుత్తూరు, సత్యవేడు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట బస్ డిపోలను తనిఖీ చేయడంతో పాటు బస్స్టేషన్లలోని మౌలిక సదుపాయాలను పరిశీలించనున్నారు. ♦ 3వ రోజు బుధవారం పీలేరు, పలమనేరు, కుప్పం, మదనపల్లి, చిత్తూరు–1, చిత్తూరు–2 డిపోలను సందర్శించనున్నారు. ప్రధాన సమస్యలివే... ♦ రాయలసీమలోని ఆర్టీసీ కార్మికుల సౌకర్యార్థం తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వెంటనే చేపట్టాలి. ♦ యాక్సిడెంట్లు, అత్యవసర పరిస్థితులలో పక్కరాష్ట్రాలలో చికిత్స పొందుతున్న వారికి మెడికల్ క్లయిమ్‌లు మంజూరు చేయాలి. ♦ గత రెండేళ్లుగా విజయవాడ హెడ్ ఆఫీస్‌లో పెండింగ్‌లో ఉన్న జిల్లాకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–1 సమస్యను వెంటనే పరిష్కరించాలి. ♦ తిరుపతి– తిరుమల మధ్య బస్సులు నడిపే ఘాట్‌రోడ్డు డ్రైవర్లకు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ♦ స్పెషల్ సర్వీసు డ్యూటీలు చేసిన వారికి రావాల్సిన ఆలవెన్సులు ఇప్పించాలి. ♦ తిరుపతి సెంట్రల్ బస్‌స్టేషన్‌లో దీర్ఘకాలికంగా పట్టిపీడిస్తున్న నీటిసమస్యను బోర్లు వేసి పరిష్కరించాలి. ♦ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో, గ్యారేజ్‌ల్లో సీసీ ఫ్లోరింగ్ నిర్మాణాలు చేపట్టాలి. ♦ టార్గెట్లు లేకుండా తమిళనాడు తరహాలో ఇన్సెంటివ్‌ల విధాణం ప్రవేశపెట్టాలి. ♦ గ్యారేజ్‌లలో ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ♦ డిస్పెన్సరీలలో మందుల కొరత తీర్చాలి. -
తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఇంచార్జ్ ఎండీ నిర్బంధం
-
ఫేస్బుక్ ఇండియా కొత్త ఎండీ ఈయనే
సాక్షి, ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియా ఎట్టకేలకు ఇండియా హెడ్‌నునియమించింది. హాట్‌స్టార్ వ్యవప్థాపకుడు అజిత్ మోహన్‌ను ఎండీ, వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు ఫేస్బుక్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభంలో మోహన్ ఫేస్బుక్ ఇండియాలో కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. ఉమాంగ్ బేడీ ఫేస్‌బుక్‌ను వీడిన సంవత్సరం తరువాత ఈ నియామకాన్ని చేపట్టింది. కాగా నకిలీ వార్తలు, డేటా చోరీపై ఎదుర్కొంటున్న ఆరోపణలు, ఒత్తిడి నేపథ్యంతో అజిత్ మోహన్ బాధ్యతలు కీలకంగా మారనున్నాయి. ఏప్రిల్ 2016 నుండి, స్టార్ ఇండియాకు చెందిన ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫాంకు హాట్‌స్టార్‌కు అజిత్ సీఈవోగా పనిచేశారు. -
ఎస్బీఐ కొత్త ఎండీగా అన్షులా కంత్
సాక్షి న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా (ఎండీ) అన్షులా కంత్ నియమితులయ్యారు. ఆమె నియామకాన్ని ప్రభుత్వం శుక్రవారం ఖరారు చేసింది. ఐడీబీఐ సీఎండీగా అదనపు బాధ్యతల నేపథ్యంలో బి.శ్రీరామ్ జూన్30న రాజీనామా చేసారు. ఆయన స్థానంలో అన్షులా బాధ్యతలను చేపట్టనున్నారు. 2020 వరకు సెప్టెంబరువరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని క్యాబినెట్ నియామకాల కమిటీ ఒక ప్రకటనలో తెలియ జేసింది. కాగా అన్షులా కంత్ ఎస్బీఐలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరు, సీఎఫ్‌వోగా సేవందిస్తున్నారు. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ వుమెన్ నుంచి అర్ధశాస్త్రంలో పీజీ చేసిన ఆమె 1983లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్బీఐలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ క్రెడిట్, క్రాస్-బోర్డర్ ట్రేడింగ్ మరియు అభివృద్ధి చెందిన మార్కెట్లలో బ్యాంకింగ్ (రీటైల్ అండ్ హోల్‌సేల్) రంగాల్లో విస్తృతమైన అనుభవం ఉన్న అన్షులా మూడు దశాబ్దాల పాటు ఎస్బీఐలో అనేక కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. -
మాల్యా అస్తుల రికవరీపై ఎస్బిఐ ఎమ్‌డి సంతోషం
-
కొత్త బాస్ ఎవరో...?
-
‘ప్రగతి’ సారథి కావాలి!
సాక్షి, హైదరాబాద్: అత్యంత అస్తవ్యస్తంగా మారిన ఆర్టీసీకి ఇప్పుడు జవజీవాలు కల్పించేందుకు ఓ ఆపద్బాంధవుడు కావాలి. నష్టాలతో కునారిల్లుతున్న ప్రగతి రథాన్ని ప్రగతి వైపు నడిపేందుకు సమర్థుడైన సారథి కావాలి. ప్రస్తుతం ఎండీగా ఉన్న రమణారావు పదవీకాలం ముగియడంతో కొత్త ఎండీ అవసరం వచ్చిపడింది. రెండు పర్యాయాలు ఆయనకు పొడిగింపు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ మరో అవకాశం ఇవ్వలేదు. గడు వు తీరిపోవటంతో రమణారావు పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పూర్తిస్థాయి ఎండీ నియామకం జరిగే వరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. విఫల ప్రయోగం.. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించటం ఆనవాయితీగా ఉండేది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి ఎండీ విషయంలో ప్రభుత్వం భిన్నంగా నాన్ కేడర్ అధికారిని నియమించింది. ఆ ప్రయోగం విఫలమవడంతో ఐపీఎస్ అధికా రినే ఎండీగా నియమించాలన్న డిమాండ్ పెరిగింది. మరోవైపు రమణారావుకే అవకాశం ఇవ్వాలంటూ ఓ కార్మిక సంఘం తెరవెనుక ప్రయత్నం చేస్తున్న తరుణంలో మిగతా సంఘాలన్నీ ఏకమయ్యాయి. సరైన నాయకత్వం లేక ఆర్టీసీ నష్టాల పాలైందని, సమర్థుడైన సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించాలని ఆ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అంతా అస్తవ్యస్తం.. ఆర్టీసీలో ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణారావును కేసీఆర్ ఎంపిక చేశారు. రమణారావు అనుభవం సంస్థకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఆయన్ను ఎండీగా నియమించినట్టు సీఎం తెలిపారు. కానీ ఫలితం దానికి భిన్నంగా కనిపించింది. ఆయనతో ఏ ఒక్క ఈడీ సఖ్యతగా పనిచేయలేదు. వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగింది. కార్మిక సంఘాలు కూడా రమణారావు మాట లెక్క చేయలేదు. అధికారులు, కార్మిక సంఘాలు ఎండీని లెక్కచేయకపోవటంతో ఆర్టీ సీ అస్తవ్యస్తమైంది. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కూడా ఎండీకి పొసగలేదు. కొంత కాలంగా చైర్మన్ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కేడర్ అధికారి వస్తేనే.. ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దాలంటే చైర్మన్, అధికారులు, సిబ్బంది, కార్మికులు.. ఇలా అందరినీ కలుపుకుపోవటంతోపాటు డైనమిక్‌గా పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. నష్టాలు తగ్గి ఆదాయం పెరగాలంటే అధికారులు, కార్మికులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. సీనియర్ ఐఏఎస్‌గానీ, ఐపీఎస్గానీ ఎండీగా రావాల్సిన అవసరం ఉంది. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసి దాన్ని గాడిలో పెట్టిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును ఎక్కువ మంది ప్రతిపాదిస్తున్నారు. రేసులో ఐదుగురు ఐపీఎస్‌లు ఆర్టీసీ ఎండీగా సమర్థమైన అధికారి కావాలని, ఇందుకు ఐపీఎస్ అధికారుల్లో సీనియర్ అధికారిని గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి ఆదేశాలందాయి. దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ అధికారులపై ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక రూపొందిస్తోంది. గతంలో ఆర్టీసీ ఎండీగా డీజీపీ హోదా లేదా అదనపు డీజీ హోదా ఉన్న ఐపీఎస్‌లు పనిచేశారు. ఇప్పుడు కూడా డీజీపీ లేదా అదనపు డీజీపీలతోపాటు సీనియర్ ఐజీల పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో డీజీపీ హోదాలో పనిచేస్తున్న 1986 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ త్రివేది పేరు ప్రముఖంగా ఉన్నట్టు తెలిసింది. అదే బ్యాచ్‌కు చెందిన కృష్ణ ప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇక అదనపు డీజీపీల నుంచి అగ్నిమాపక శాఖ డైరెక్ట ర్ జనరల్ గోపీకృష్ణ(1987 బ్యాచ్), ఆర్గనైజేషన్ అదనపు డీజీ రాజీవ్ రతన్(1991 బ్యాచ్) పేర్లు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐజీలను కూడా ఇంటెలిజెన్స్ పరిశీలనలో చేర్చినట్టు తెలుస్తోంది. గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి, సీనియర్ ఐజీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(1995 బ్యాచ్) పేరు కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, సీనియర్ సెక్రటరీ హోదాలో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు పోటీ పడుతున్నట్టు సమాచారం. -
లియోనియా రిసార్ట్స్ ఎండీ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్‌లో ఉన్న లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తి రాజును సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. లియోనియా రిసార్ట్స్ నిర్మించడం కోసం చక్రవర్తి రాజు 11 బ్యాంకుల నుంచి రూ.650 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ఆ సమయంలో అనేక మంది రైతుల భూములకు సంబంధించిన బోగస్ పత్రాలను బ్యాంకుల్లో దాఖలు చేశారనే ఆరోపణలపై బెంగళూరు సీబీఐ టీమ్ కేసు నమోదు చేసుకుంది. ఈ రిసార్ట్‌కు కేవలం 30 ఎకరాల స్థలం మాత్రమే ఉండగా... బ్యాంకులకు 100 ఎకరాలకు పైగా చూపించారని, బోగస్ డాక్యుమెంట్ల ద్వారానే ఇది సాధ్యమైందని సీబీఐ గుర్తించింది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు నిందితుడిగా ఉన్న చక్రవర్తి రాజును అరెస్టు చేశారు. -
చైర్మన్, ఎండీ గిరీ వేర్వేరు!
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఓ కంపెనీకి చైర్మన్, ఎండీగా ఒక్కరే బాధ్యతలు నిర్వహించేందుకు వీలుంది. కానీ, సెబీ ప్యానెల్ సిఫారసులు అమలు చేస్తే ఇక ముందు ఈ అవకాశం ఉండకపోవచ్చు. చైర్మన్‌గా ఉన్న వ్యక్తి ఎండీ బాధ్యతలు చేపట్టలేరు. కార్పొరేట్ గవర్నెన్స్ (నిర్వహణ) నిబంధనల్లో భారీ సంస్కరణలకు వీలు కల్పించేలా ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన సెబీ ఈ ప్యానెల్ సిఫారసులు చేయడం విశేషం. చైర్మన్ పదవిని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకే పరిమితం చేయాలని ప్యానెల్ సూచించింది. అలాగే, కనీసం ఒక మహిళను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని కూడా సిఫారసు చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌నే చైర్మన్‌గా నియమించాలనే ప్రతిపాదన చైర్మన్, ఎండీ పోస్టుల విభజనకు దారితీయనుంది. ఇక ఓ కంపెనీ బోర్డు సభ్యుల సంఖ్య ఆరుకు పెంచాలని, ఓ ఏడాదిలో బోర్డు కనీసం ఐదు సార్లు సమావేశాలు నిర్వహించాలన్న సిఫారసులు కూడా ఉన్నాయి. ఓ మహిళ బోర్డులో ఉండాలన్న నిబంధన ఇప్పటికే ఉంది. అయితే, ఇండిపెండెండ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీటిలో ఏ రూపంలో అయినా నియమించుకునే వెసులుబాటు ఉంది. తాజా సిఫారసు ప్రకారం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఉంచటం తప్పనిసరి కానుంది. టాటా గ్రూపు, ఇన్ఫోసిస్ సంస్థల్లో ఇటీవలి కాలంలో కార్పొరేట్ గవర్నెన్స్ ఉల్లంఘనలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో సెబీ ప్యానెల్ తాజా సిఫారసులకు ప్రాధాన్యం ఏర్పడింది. -
అరుదైన డెంగ్యూతో బ్యాంక్ ఎండీ మృతి
సాక్షి, ముంబై: డెంగ్యూ జ్వరం బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎండీని బలితీసుకుంది. అరుదైన డెంగ్యూ-లింక్డ్ సిండ్రోమ్‌తో బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) ఎండీ సంజీవ్ ఝా ముంబై లీలావతి ఆసుపత్రిలో కన్నుమూశారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ ఎండీ సంజీవ్ ఝా (34) ముంబై లీలావతి ఆసుపత్రిలో అరుదైన రుగ్మతతో చికిత్స పొందుతూ అధిపతి మంగళవారం మరణించారు. కొన్ని రోజుల అనారోగ్యం తరువాత, ఝాను ఆగష్టు 29న బాంద్రా ఆసుపత్రిలో చేర్చారు. దాదాపు ఏడు రోజుల తరువాత అతనికి అరుదైన హెచ్ఎల్హెచ్ సోకినట్టు గుర్తించారు. డెంగ్యూ జ్వరం మరింత ముదిరి, కాలేయంలో తెల్లరక్త కణాలు అసాధారణంగా పెరగడంతో ఇతర రక్తకణాలను నాశనం చేశాయి. దీంతో శరీరంలోని వివిధ అవయవాలు ప్రభావిత మయ్యాయి. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ బాగా పాడైపోవడంతో ఆయన చనిపోయారని సీనియర్ వైద్యులు డా. సీసీ నయ్యర్ తెలిపారు. అయితే ప్లేట్లెట్స్ , రక్తమార్పిడి కారణంగా ఝా పరిస్థితి క్షీణించిందనీ కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితులు చెప్పారు. -
ఇన్ఫోసిస్ ఎండీగా ప్రవీణ్ రావు కొనసాగుతారా?
న్యూఢిల్లీ: భారతీయ రెండవ అతిపెద్ద సాఫ్టవేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మధ్యంతర సీఈవో, ఎండీయుఎన్ ప్రవీణ్ రావును కొత్త మేనేజింగ్ డైరక్టర్‌గా నియమించేందుకు యోచిస్తోంది. ఆయన్ను ఈ పదవిలో కొనసాగించేందుకు షేర్‌హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల సీఈవో, ఎండీగా ఉన్న విశాల్సిక్కా రాజీనామాతో కొత్త సీఎండీ ఎంపికకోసం ఇన్ఫోసిస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రవీణ్ రావును తిరిగిఎన్నుకునేందుకు వాటాదారుల అనుమతి కోసం చూస్తోంది. ప్రవీణ్ కనీసం అయిదేళ్ల పాటు లేదా, కొత్త సీఈవో ఎంపిక చేసే దాకా మధ్యంతర సీఈవో అండ్ ఎండీ పదవిలో కొనసాగుతారని ఇన్ఫోసిస్ పోస్టల్ బ్యాలెట్ లో ప్రకటించింది. దీంతో సెప్టెంబరు 8 నుండి అక్టోబరు 7 వరకు పోస్టల్ బ్యాలట్‌పై వాటాదారులు ఓటు వేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 9న గానీ, అంతుకుముందుగానీ ఫలితాలు ప్రకటించనుంది. దీంతోపాటుగా ఇన్ఫీ బోర్డులోకి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా డి సుందరం నియామకంపై కూడా వాటాదారుల అనుమతిని కోరుతోంది. మరోవైపు విశాల్ సిక్కా స్థానాన్ని భర్తీ చేయడంలో పంచ శోధన ఈగోన్ జహేందర్ సహాయాన్ని అర్థించింది ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన రావు ఆగష్టు 18 న తాత్కాలిక సీఈవో , మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితుడయ్యారు. అలాగే ఇన్ఫోసిస్ ఎనిమిది సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అప్పటి చీఫ్ విశాల్ సికా సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఐడీబీఐ బ్యాంక్ ఎండీగా మహేశ్ కుమార్
హైదరాబాద్: ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈవోగా మహేశ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జైన్ బ్యాంకింగ్ కెరియర్ ప్రారంభించారు. ఆతర్వాత సిండికేట్ బ్యాంక్‌లో జీఎంగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2013 సెప్టెంబర్‌లో ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరిన జైన్.. కార్పొరేట్ అండ్ రిటైల్ క్రెడిట్, రిస్క్ మేనేజ్మెంట్ తదితర విభాగాలు పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన ఎన్ఐబీఎం గవర్నింగ్ బోర్డు సభ్యులుగా ఉన్నారు. -
నేడు ఆర్టీసీ ఎండీ కర్నూలు రాక
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు సోమవారం కర్నూలు రానున్నారు. ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కష్ణా పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలనకు ఆయన ఇక్కడికి వస్తున్నారు. కర్నూలు కొత్తబస్టాండ్‌లోపాటు గ్యారేజీలను తనిఖీ చేస్తారు. స్థానిక అధికారులతో సమావేశం కానున్నట్లు ఆర్ఎం వెంకటేశ్వర రావు తెలిపారు. ఎండీ వస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం ఆర్ఎంతోపాటు డీసీటీఎం శ్రీనివాసులు, పర్సనల్ ఆఫీసర్ బి. సర్దార్ హుసేన్, ఏటీఎం ప్రసాద్, కర్నూలు–1డిపో మేనేజరు అజ్మతుల్లా, మరో నలుగురు డీఎంలు బస్టాండ్ శుభ్రత, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
అమూల్ ఎండీకి మాఫియా డాన్ బెదిరింపు!
అహ్మదాబాద్: అమూల్ పాలు ఈ పేరు వినే ఉంటారు కదా..! ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనే ఆ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధీకి మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవి పూజారి పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి 25 కోట్లు ఇవ్వాలని తనను డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోధీ ఫిర్యాదు మేరకు కేసును అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ కు అప్పగించినట్లు ఆనంద్ ఎస్పీ సౌరభ్ సింగ్ తెలిపారు. తాను ఫెడరేషన్ మీటింగ్ లో ఉన్నప్పుడు తొలిసారి ఫోన్ కాల్ వచ్చినట్లు సోధీ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలర్ తనను తాను రవి పూజారిగా చెప్పి తాను ఆస్ట్రేలియాలో ఉంటానని పరిచయం చేసుకున్నారని తెలిపారు. తొలుత ఏదో వ్యాపారం పనిమీద ఫోన్ చేసి ఉంటారని భావించానని, అతడి నెంబరును మరో అధికారి మొబైల్ యాప్‌లో చెక్ చేయగా, అతను గ్యాంగ్ స్టర్ అని తెలిసినట్లు చెప్పారు. తనకు రూ. 25 కోట్లు ఇవ్వకపోతే కాల్చిపారేస్తామని బెదిరించినట్లు వివరించారు. ఈ సంస్థపై ఆధాపడి 36 లక్షల పేద కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పడానికి ప్రయత్నించానని కానీ, పూజారి అవన్నీ తనకేం పట్టవనీ డబ్బు ఇవ్వాల్సిందేనని చెప్పినట్లు తెలిపారు. మే మొదటివారంలో సోధీకి పూజారి మరో మూడు మార్లు ఫోన్ చేసినట్లు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కే ఎన్ పటేల్ తెలిపారు. ఫోన్లన్నీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) తో చేయడం వల్ల వ్యక్తి నంబర్‌ను కచ్చితంగా పట్టుకోలేమని వివరించారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల నుంచి మాత్రం ఫోన్లు వచ్చినట్లు గుర్తించమన్నారు. గత ఏడాది నవంబర్, జనవరిలో పూజరి బెదిరించిన వ్యక్తుల కేసులను కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఎమ్డీ కోసం గలాటా కాదు...
డాక్టర్ శశికుమార్ సోదరుడు రవి సిటీబ్యూరో: తన సోదరుడు డాక్టర్ శశికుమార్ ఇప్పటికే రెండు ఆస్పత్రుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నాడని... అలాంటప్పుడు లారెల్ హాస్పిటల్స్‌లో ఎమ్డీ కావాలని ఎందుకు గొడవ పడతాడని మృతుడి సోదరుడు, ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పైలట్ రవి అన్నారు. ఈ గొడవకు మరేదో కారణం ఉండొచ్చని... కేసు వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదించాల్సిన అవసరముందన్నారు. చైతన్యపురి ప్రభాత్నగర్లోని నివాసంలో ‘సాక్షి ’ మీడియాతో గురువారం మాట్లాడారు. ముగ్గురు మంచి మిత్రుల మధ్య ఇటువంటి గొడవ జరుగుతుందని ఎన్నడూ ఊహించలేదన్నారు. ఇప్పటి వరకు అటువైపు కుటుంబాల నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని తెలిపారు. హిమాయత్‌నగర్‌లో గలాటా జరిగిన వెంటనే చంద్రకళ వద్దకు శశికుమార్ వెళ్లడం... ఆమె మెయినాబాద్‌లోని నక్కలగుట్ట ఫాంహౌస్‌లో దింపడం... ఇంటికి వచ్చి టీవీలో వార్తలు చూశాక పంజగుట్ట పోలీసుల వద్దకు వెళ్లడం... ఇదంతా చూస్తుంటే ఏదో జరిగిందన్న అనుమానం ఉందన్నారు. పదేళ్లుగా చంద్రకళ స్నేహితురాలిగ తెలుసని...వృత్తిపరంగా ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. శశికుమార్ పేరుమీద ఆ ఫామ్‌హౌస్ ఉందని వస్తున్న వదంతులు వాస్తవం కాదన్నారు. గురువారం ఉదయం నారాయణగూడ పోలీసులు పిలిస్తే... వెళ్లి కారు, బ్రీఫ్‌కేసు తీసుకొచ్చామన్నారు. బ్లాక్ కలర్ షర్ట్ లేదు. పోస్టుమార్టం నివేదిక ఇప్పటివరకు అందలేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి తమ కుటుంబానికి న్యాయం చేస్తారని అనుకుంటున్నామని తెలిపారు. -
ఇక ఎవరి ‘దారి’ వారిదే
నేడు అధికారికంగా ఏపీఎస్ఆర్టీసీ విభజన స్థానికత ఆధారంగా అధికారులు, సిబ్బంది కేటాయింపు హైదరాబాద్: ఇక ఎవరి దారి వారిదే. ఆర్టీసీ విభజన వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ రెండుగా మారబోతోంది. బుధవారం నుంచి అధికారికంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలు ఏర్పాటవుతున్నాయి. ఆస్తులు, అప్పులు మినహా అధికారుల, సిబ్బంది విడివిడిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఆర్టీసీలోకి మారబోతున్నారు. దీనికి సంబంధించి రెండు నెలల క్రితం ‘స్థానికత’ ఆధారంగా జరిగిన కేటాయింపునే ఖరారు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఆప్షన్ల జోలికి వెళ్లొద్దని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తొలుత స్థానికత ఆధారంగానే అధికారులు, సిబ్బందిని విభజించిన ప్పటికీ గత నెలలో ఆప్షన్లను ఎండీ సాంబశివరావు తెరపైకి తేవటంతో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఎండీ కాస్త వెనక్కు తగ్గారు. స్థానికత ఆధారంగా జరిగిన విభజన ఆధారంగా బుధవారం పోస్టింగులు ఇవ్వనున్నారు. ఏపీకి మొత్తం ఆరుగురు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు అవసరమవుతారు. ఇందులో బస్‌భవన్‌లో ఇద్దరు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం బస్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వెంకటేశ్వరరావు, జయరావు, కోటేశ్వరరావులు ఈడీలుగా ఉన్నారు. ఫీల్డ్‌లో నలుగురు ఉండాల్సి ఉండగా కడప, విజయవాడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఓ అధికారిని తెలంగాణకు కేటాయించే ఉద్దేశంతో అప్పట్లో ఐటీ సెక్షన్‌ను విడదీసి మరో ఈడీకి హెడ్ఆఫీసులో కుర్చీ వేశారు. దీనిపై వ్యతిరేకత వచ్చినా అప్పట్లో పట్టించుకోలేదు. ఇక తెలంగాణకు సంబంధించి హెడ్ఆఫీసులో రెండు ఈడీ పోస్టులుండగా ప్రస్తుతం రవీందర్ ఒక్కరే ఉన్నారు. ఇటీవలే విజయవాడ నుంచి వచ్చిన నాగరాజు, ప్రస్తుతం కరీంనగర్లో పనిచేస్తున్న పురుషోత్తమనాయక్లో ఒకరికి హెడ్ఆఫీసులో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఫీల్డులో పోస్టు భర్తీకి సికింద్రాబాద్ ఆర్ఎంగా ఉన్న సత్యనారాయణకు ఈడీగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన డీఎం స్థాయి అధికారులు కొందరు ఏపీకి మారనున్నారు. ఆర్టీసీ కార్మికుల డిప్యుటేషన్ గడువు పొడిగింపు ఆర్టీసీ పూర్తి స్థాయి విభజన ప్రక్రియ జాప్యం జరుగుతుండటంతో ఏపీ, తెలంగాణల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారికి మరో ఏడాది గడువు పొడిగించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు డిప్యుటేషన్‌ను 2016 మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ రీజియన్ ట్రాన్స్ఫర్ సమస్యను పరిష్కరించాలని ఇటీవలే కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై గుర్తింపు సంఘాలతో ఓ కమిటీ వేశారు. దీంతో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ఏడాది కాలం పొడిగించక తప్పలేదు. -
మేమెంతో ‘సెల్ఫీ’ష్!
-
ఏపీఎస్ఆర్టీసీ@విజయవాడ
{పధాన పాలనా కేంద్రాన్ని తరలించే యోచనలో ఎండీ ఇందుకోసం అక్కడ ప్రత్యేక భవనాన్ని నిర్మించేందుకు కసరత్తు నష్టాల్లో ఉన్న ఆంధ్రా ఆర్టీసీ గట్టెక్కాలంటే పాలన అక్కడే ఉండాలని నిర్ణయం ఇది జరిగితే విభజన తర్వాత ఏపీకి తరలే తొలి కార్పొరేషన్ ఇదే హైదరాబాద్: రాష్ట్రం విడిపోయి పది నెలలు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్ పాలన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్రంగానే సాగుతోంది. ప్రభుత్వ విభాగాలు గానీ, కార్పొరేషన్లుగానీ అక్కడి నుంచి ఇంకా తరలలేదు. ఈ తరుణంలో హైదరాబాద్ వెలుపల పాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే తొలి కార్పొరేషన్‌గా ఏపీఎస్ ఆర్టీసీ నిలవబోతోంది. ఈ దిశగా ఆర్టీసీ ఎండీ సాంబశివరావు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం విజయవాడలో భవనాన్ని నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆర్టీసీకి రాకముందు ఏపీ ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేసిన సమయంలో ఆ విభాగానికి విజయవాడలో పరిపాలన భవనం నిర్మించారు. అదే తరహాలో ఆర్టీసీకి కూడా భవనాన్ని సమకూర్చి పాలనను అక్కడి నుంచే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. నష్టాల ఊబిలో చిక్కుకున్న ఆర్టీసీని గాడిలో పెట్టాలంటే ముందుగా దాన్ని విభజించడం తప్పదన్న అభిప్రాయాన్ని సాంబశివరావు మొదట్లోనే వ్యక్తం చేశారు. దానికి సాంకేతికంగా కొన్ని సమస్యలు ఎదురుకావటంతో ‘స్థానికత’ ఆధారంగా ఏ ప్రాంత అధికారులు, సిబ్బంది అక్కడే ఉండేలా తాత్కాలిక విభజన చేపట్టారు. అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కేటాయింపు కూడా పూర్తిచేశారు. వారి నుంచి ‘ఆప్షన్లు’ స్వీకరిస్తున్న ఆయన... మే 15 నాటికి అవసరమైన మార్పు చేర్పులతో తుది కేటాయింపులు పూర్తిచేసి పోస్టింగులు ఇవ్వనున్నారు. ఫలితంగా పాలనపరంగా కూడా ఆర్టీసీ పూర్తిగా విడిపోయినట్లవుతుంది. అప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ పాలన సరికాదనేది ఆయన అభిప్రాయం. దీంతో విజయవాడలో పరిపాలన కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. అధికారులు, కార్మిక నేతల్లో వ్యతిరేకత ఏపీఎస్ ఆర్టీసీ పాలనను విజయవాడకు తరలించాలన్న ఎండీ నిర్ణయాన్ని ఉన్నతాధికారులు, కార్మిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. సీఎం, రవాణా మంత్రి, కార్యదర్శుల కార్యాలయాలు సచివాలయంలో ఉన్నందున... ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌ను వీడి విజయవాడలో ప్రధాన కేంద్రం ఏర్పాటు చేస్తే కొత్తగా వచ్చే ప్రయోజనమేమీ ఉండదని వారు పేర్కొంటున్నారు. అలా చేస్తే ప్రతి ముఖ్యమైన పనికి హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆస్తుల వివాదం తేలకుండా ఇక్కడి నుంచి వెళ్లడం కూడా సరికాదని వాదిస్తున్నారు. అయితే మరో 3 నెలల్లో ఈ ఆస్తుల విషయాన్ని కూడా తేల్చేందుకు ఎండీ కసరత్తు చేస్తున్నారు. అది కూడా ముగిస్తే ఇక హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం లేదని... ఫోన్ ద్వారానో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో సచివాలయంతో సంప్రదింపులు జరిపే వెసులుబాటు ఉందని ఎండీ పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ‘ఎ’ బ్లాక్‌ను ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయించారు. అందులో ఇటీవల రూ.1.85 కోట్ల వ్యయంతో వసతులు కల్పించారు. ఇప్పుడు విజయవాడకు తరలితే.. అదంతా వృథా అవుతుందని, దానికితోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని అంటున్నారు. కానీ ఎండీ మాత్రం ఇవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేనట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో ఆరు నెలల్లో అయినా ఏపీఎస్ ఆర్టీసీని తరలించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆవిష్కరణలు కోరుకుంటున్నారు..
సెనెకా గ్లోబల్ ఎండీ రావు తుమ్మలపల్లి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతంలో క్లయింట్లు నిర్ధేశించిన పని చే స్తే చాలు. ఇప్పుడలా కాదు. ప్రధానంగా ఐటీ కంపెనీల నుంచి క్లయింట్లు వినూత్న ఆవిష్కరణలు కోరుకుంటున్నారని సెనెకా గ్లోబల్ ఎండీ రావు తుమ్మలపల్లి తెలిపారు. కంపెనీ ప్రెసిడెంట్ ఎడ్ జోఫర్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. సేవలందించే కంపెనీని భాగస్వామిగా భావిస్తున్నారని, మరింత ఉత్పాదకత ఆశిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు అమెరికా కార్యకలాపాలకు వచ్చే మూడేళ్లలో రూ.31 కోట్లు వ్యయం చేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే నూతన భవనంలోకి కార్యాలయాన్ని మారుస్తున్నట్టు తెలిపారు. దశలవారీగా దీనిని విస్తరిస్తామన్నారు. అమెరికా మార్కెట్ లక్ష్యంగా ఐటీ సేవలందిస్తున్న సెనెకా గ్లోబల్‌కు ప్రస్తుతం హైదరాబాద్ కార్యాలయంలో 220 మంది ఉద్యోగులు ఉన్నారు. 2020 నాటికి ఈ సంఖ్యను 2 వేలకు చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. వీరిలో 90 శాతం మంది భారతీయులు ఉంటారని వివరించారు. 2015 నుంచి కంపెనీల కొనుగోళ్లపై దృష్టిసారిస్తామన్నారు. కంపెనీ 2014-15లో రూ.55 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. -
మెర్సిడెస్-బెంజ్... సీఎల్ఏ క్లాస్ సెడాన్
ధర రూ. 31.5-35.9 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ సీఎల్ఏ క్లాస్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.31.5-35.9 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని మెర్సిడెస్-బెంజ్ ఎండీ, సీఈఓ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో ఈ కారు లభిస్తుందని వివరించారు. ఈ కారు మంచి అమ్మకాలు సాధిస్తుందని నమ్మకం ఉందని, అందుకే భారత్‌లోనే ఈకారును ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. గత రెండేళ్లలో భారత్‌లో తమ అమ్మకాలు 50 శాతానికి పైగా వృద్ధి సాధించాయని, ఈ స్థాయి వృద్ధి మరే దేశంలోనూ లేదని వివరించారు. 2014లో 10,201 కార్లను విక్రయించామని, ఈ ఏడాది కూడా చెప్పుకోదగ్గ అమ్మకాలు సాధిస్తామని, విక్రయాల్లో రెండంకెల వృద్ధి అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది 10 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చామని, ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తామని కెర్న్ వెల్లడించారు. -
మెట్రో శ్రీధరన్ వెయిటింగ్
సాదాసీదాగా చిన్నకారులో వచ్చిన వైనం గెస్ట్‌హౌస్‌లో గది కోసం నిరీక్షణ విజయవాడ బ్యూరో : రాష్ట్రంలోని మెట్రో రైలు ప్రాజెక్టుల సలహాదారు, డీఎంఆర్సీ మాజీ ఎండీ శ్రీధరన్ బుధవారం సాయంత్రం స్టేట్ గెస్ట్ హౌస్‌లో గది కోసం నిరీక్షించాల్సివచ్చింది. బుధవారం రాత్రి 7.30 గంటలకు శ్రీధరన్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎస్.డి.శర్మ స్టేట్ గెస్ట్ హౌస్‌కు వచ్చారు. వారి కోసం ముందే రెండు వీఐపీ గదులు బుక్ చేశారు. అయితే వారు వచ్చే సమయానికి ఆ గదులకు తాళం వేసి ఉంది. గెస్ట్‌హౌస్ ఉద్యోగి ఒకరు తాళం వేసుకుని బయటకు వెళ్లినట్లు సమాధానం రావడంతో కొద్దిసేపు వారిద్దరూ ఆ గది బయటే నుంచున్నారు. ఈలోపు మరో ఉద్యోగి వచ్చి వేరే గదిలో కొంతసేపు వేచి ఉంటే బుక్ చేసిన వీఐపీ గదుల తాళాలు తెప్పిస్తానని చెప్పడంతో శ్రీధరన్ అందులో కొద్దిసేపు కూర్చున్నారు. ఈలోపు బుక్ చేసిన గదుల తాళాలు రావడంతో అందులోకి వెళ్లారు. రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సీఆర్డీఏ ఉన్నతాధికారులంతా సింగపూర్ పర్యటనలో ఉండడంతో మిగిలిన అధికారులు ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రొటోకాల్ బాధ్యతలు చూసే రెవెన్యూ అధికారులు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో ఇక్కడ డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఎంఆర్సీ అధికారే హడావుడి పడాల్సివచ్చింది. మరోవైపు గెస్ట్హౌస్ట్కు కిందిస్థాయి అధికారులు ఇన్నోవా, ఇతర మోడల్ కార్లలో వస్తుంటే శ్రీధరన్, ఎస్.డి.శర్మ అద్దెకు తీసుకున్న ఇండికా విస్టా కారులో చాలా సాదాసీదాగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నేడు కారిడార్ల పరిశీలన బుధవారం రాత్రి డీపీఆర్ రూపకల్పన తీరును మ్యాప్‌ల ద్వారా సమీక్షించిన శ్రీధరన్ గురువారం ఉదయం ప్రతిపాదిత రెండు కారిడార్లను పరిశీలించనున్నారు. ఏలూరు, బందరు రోడ్డుల్లో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రదేశాలను చూడనున్నారు. మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ వెళతారు. -
చిత్తూరు షుగర్స్ ఎండీ రాజీనామా
చిత్తూరు: చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం ఎండీ మల్లికార్జునరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని డెరెక్టర్ ఆఫ్ షుగర్స్, హైదరాబాద్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. కార్మికుల పండుగ అడ్వాన్స్ ఇచ్చే విషయంలో చైర్మన్ ఎన్పీ.రామకృష్ణ, ఎండీ మధ్య సోమవారం చోటుచేసుకున్న గొడవే రాజీనామాకు దారితీసినట్లు తెలుస్తోంది. ఏడాదిగా ఫ్యాక్టరీలో కేన్ ఇన్చార్జిగా ఉన్న మల్లికార్జునరెడ్డి మూడు నెలల క్రితం ఎండీగా బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం పరిధిలో మూడేళ్లుగా రైతులకు సంబంధించి *12 కోట్ల బకాయిలు, కార్మికులకు సంబంధించి *8 కోట్లు మొత్తం *20 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు నెలల క్రితం పాలకవర్గం కర్మాగారంలోని స్టోర్స్ తాకట్టుపెట్టి ఆప్కాబ్ ద్వారా *కోటి రుణం తీసుకుంది. ఈ మొత్తం నుంచి కార్మికులకు ఒక నెల జీతం మాత్రమే ఇచ్చారు. మరో *14 లక్షలు చైర్మన్, ఎండీ ఉమ్మడి ఖాతాలో ఉన్నట్లు సమాచారం. సంక్రాంతికి పండుగకు అడ్వాన్ ఇస్తామని చైర్మన్, ఎండీ కార్మికులకు హామీ ఇచ్చారు. కా ర్మికులు సోమవారం ఉదయం పండుగ అడ్వాన్స్ విషయం ఎండీ వద్ద ప్రస్తావించారు. దాంతో ఎండీ, సీసీ కుమారస్వామి నాయుడు, సీఈ మధుసూదన్‌రెడ్డి కలసి చైర్మన్ వద్దకెళ్లారు. కార్మికుల పండుగ అడ్వాన్స్ విషయం మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్యుద్ధంగా మారినట్లు సమాచారం. కార్మికులకు పైసా ఇచ్చేదిలేదంటూ చైర్మన్ చిందులు తొక్కినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురైన ఎండీ బయటకు వచ్చి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని ఫ్యాక్టరీ వద్ద ఉన్న కార్మికులకు చెప్పారు. ఇక తాను పదవిలో కొనసాగేది లేదంటూ వెళ్లిపోయారు. రైతులు, కార్మికులకు న్యాయం చేయలేక పోయినందుకే రాజీనామా ఫ్యాక్టరీ కార్మికులకు, రైతులకు న్యాయం చే యలేకపోయినందుననే ఎండీ పదవికి రాజీ నామా చేసినట్లు చిత్తూరు చక్కెర కర్మాగారం ఎండీ మల్లికార్జునరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇన్నాళ్లు న్యాయం చేసేందుకు ప్రయత్నించానన్నారు. అయినా తనవల్ల కాలేదన్నారు. వారికి న్యాయం చేసే స్టేజీలో లేనందునే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. తనకు కార్మికులు, రైతులవల్ల ఎటువంటి ఇబ్బందు లు లేవన్నారు. ఫ్యాక్టరీని నడపాలని ఎంత ప్రయత్నించినా వీలుకాలేదని చెప్పారు. -
సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్
-
బ్యాంకర్లతో సిఎం సమీక్షా సమావేశం
-
ఎలాంటి పాలసీ తీసుకోవాలంటే..
రాజేశ్ సూద్ ఎండీ, సీఈఓ, మ్యాక్స్ లైఫ్ జీవిత బీమా... ప్రతి ఒక్కరికీ ధీమా కలిగిస్తుంది. వ్యక్తి ఆర్థిక ప్రణాళికలకు స్థిరత్వాన్నీ, సంపూర్ణత్వాన్నీ ఇచ్చేదే బీమా. దీర్ఘకాలిక పొదుపును, రక్షణను, పన్ను ప్రయోజనాలను సమకూర్చే ఏకైక సాధనం జీవిత బీమా మాత్రమే. తొలిసారిగా ఇలాంటి పాలసీని కొనుగోలు చేసే వారికి ఏది మంచి పాలసీ అనే సందేహం ఉంటుంది. పాలసీ తీసుకొనే ముందు చూడాల్సిన అంశాలను తెలుసుకుందాం. వారో వీరో చెప్పారని వద్దు... మీ స్నేహితులో, బంధువులో చెప్పారని పాలసీని కొనవద్దు. వ్యక్తులకు, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే విధంగా జీవిత బీమాను రూపొందించారు. మీ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటే మీకు జీవిత బీమా చాలా అవసరం. మీపై ఆధారపడిన వారు ప్రస్తుతానికి లేనప్పటికీ, భవిష్యత్తులో అలాంటి వారు మీకు ఉంటారని భావిస్తే చిన్న పాలసీతో ప్రారంభించాలి. ఎంత మొత్తానికి జీవిత బీమా అనేది మీ వార్షిక ఆదాయం, ఖర్చులు, మీ తదనంతరం కుటుంబానికి అవసరమయ్యే సొమ్ము వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అవగాహనకు రావచ్చు. తగిన పాలసీ: ఇప్పుడు అనేక రకాల జీవిత బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు అవసరమైనవి ఎంచుకోవాలి. తొలిసారిగా కొనే వారికి తగినవి నాలుగు రకాలున్నాయి. అవి: 1. నిర్ణీత కాలవ్యవధిలో మరణానంతర ప్రయోజనాలు (డెత్ బెనిఫిట్స్) కల్పించే టర్మ్ పాలసీ. 2. పూర్తి జీవితకాల కవరేజీ కల్పించే హోల్ లైఫ్‌టైమ్ పాలసీ. 3. మరణం సంభవించినపుడు లేదా నిర్ణీత తేదీన బెనిఫిట్లను అందించే ఎండోమెంట్ పాలసీ. 4. బీమా చేయించుకున్న వారు నిర్ణీత వయస్సుకు చేరినపుడు (రిటైర్మెంట్ వంటివి) చెల్లింపులు చేసే యాన్యుయిటీ పాలసీ. వీటిలో మీకు ఏది అన్ని విధాలుగా తగినదో తెలుసుకునేందుకు ఏజెంట్ అడ్వయిజర్‌ను సంప్రదించవచ్చు. జీవిత బీమా పాలసీని కొనడమంటే సదరు ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లే. కనుక, బీమా ప్రొడక్టును కొనేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, దీర్ఘకాలిక అవసరాల కోసం ఏటా చేయాల్సిన పెట్టుబడులను మదింపు చేయండి. రిస్కు తీసుకునే సామర్థ్యం ఎంతవరకు ఉందో గమనించండి. మీకు ఎక్కువ అనుకూలంగా ఉండే పాలసీని ఎంచుకోండి. ఇదే కసరత్తు ఏటా చేస్తుండాలి. ఎందుకంటే, ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు కాలక్రమేణా మారుతుంటాయి కదా!