నేడు ఆర్టీసీ ఎండీ కర్నూలు రాక
Published Mon, Jul 18 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు సోమవారం కర్నూలు రానున్నారు. ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కష్ణా పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలనకు ఆయన ఇక్కడికి వస్తున్నారు. కర్నూలు కొత్తబస్టాండ్‌లోపాటు గ్యారేజీలను తనిఖీ చేస్తారు. స్థానిక అధికారులతో సమావేశం కానున్నట్లు ఆర్‌ఎం వెంకటేశ్వర రావు తెలిపారు. ఎండీ వస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం ఆర్‌ఎంతోపాటు డీసీటీఎం శ్రీనివాసులు, పర్సనల్ ఆఫీసర్ బి. సర్దార్ హుసేన్, ఏటీఎం ప్రసాద్, కర్నూలు–1డిపో మేనేజరు అజ్మతుల్లా, మరో నలుగురు డీఎంలు బస్టాండ్ శుభ్రత, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Advertisement
Advertisement