ఆర్టీసీలో విభాగాధిపతుల విభజన | Division of department officers allocation is done for AP, telangana | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో విభాగాధిపతుల విభజన

Published Fri, Apr 10 2015 9:39 PM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

ఆర్టీసీలో విభాగాధిపతుల విభజన

ఆర్టీసీలో విభాగాధిపతుల విభజన

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు విభాగాధిపతుల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీలో మొత్తం విభాగాధిపతుల పోస్టులు 43 కాగా అందులో రెండు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన వాటిలో ఏపీకి 19 మందిని, తెలంగాణకు 22 మందిని కేటాయించారు. రీజినల్ మేనేజర్ స్థాయిలో ఏపీకి 12 మంది, తెలంగాణకు 11 మందిని కేటాయించారు.

జనాభా ప్రాతిపదికన ఏపీ, తెలంగాణ నిష్పత్తి ప్రకారం ఏపీకి 24 మందిని, తెలంగాణకు 17 మందిని కేటాయించాల్సి ఉంది. అయితే, ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతం ప్రాతిపదికన కేటాయింపు జరిగిందని బస్‌భవన్ వర్గాలు తెలిపాయి. తుది విభజన సమయంలో రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపు ఉంటుందని వెల్లడించాయి. ఈ నెల 20లోగా విభాగాధిపతులు ఆప్షన్లు ఇవ్వాలంటూ సాంబశివరావు సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement