Sambashiva rao
-
నకిలీ పత్రాలు.. ఫోర్జరీ సంతకాలు
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోర్జరీ డాక్యుమెంట్లతో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు బురిడీ కొట్టించాలనుకున్న టీవీ–5 సాంబశివరావుకు బుర్ర తిరిగిపోయే ఎదురుదెబ్బ తగలింది. పచ్చ మీడియాలో ఒకటైన టీవీ–5లో సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. కాగా భూ యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆయ న నడిపిస్తున్న పెట్రోల్ బంక్‌ను హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు బుధవారం సీజ్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో ప్లాట్‌ను అగ్రిమెంట్ చేసుకొని, దాన్ని హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చాడని ప్లాట్ యజమాని సరనాల శ్రీధర్‌రావు హెచ్‌పీసీఎల్‌కు చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు. ఫోర్జరీ చేసిన స్థలానికి బుధవారం కంచె వేయడంతో పాటు పెట్రోల్ బంక్‌ను పాక్షికంగా సీజ్ చేశారు. ఆ స్థలంలో ఉన్న పెట్రోల్ పంపులను మూసి వేశారు. ఆయిల్ సంస్థలతో మంచి సంబంధాలున్నాయని నమ్మించి.. సాంబశివరావుపై ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సరనాల శ్రీధర్ భార్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామం, సర్వే నంబరు–64, హుడా టెక్నో ఎన్క్లేవ్, సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో 600 చదరపు మీటర్ల (717.60 చదరపు గజాలు) స్థలం ఉంది. 2018లో సాంబశివరావు వీరిని కలిసి, తనకు ఆయిల్ సంస్థలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలర్షిప్ ఇప్పిస్తామని నమ్మించాడు. ప్లాట్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీపత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భూ యజమానులకు తెలియకుండా పెట్రోల్ బంక్ డీలర్‌షిప్‌ను డాక్టర్ కొల్లి సౌమ్య పేరు మీదకు సాంబశివరావు బదలాయించాడు. జర్నలిస్టులు, పోలీసుల పేరుతో భయపెట్టి.. తన స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్‌ను నడుపుతున్నట్లు తెలుసుకున్న శ్రీధర్‌రావు షాక్‌కు గురయ్యారు. 2021లో దీనిపై సాంబశివరావును నిలదీశారు. దీంతో సాంబశివరావు ఎదురుదాడికి దిగాడు. హెచ్పీసీఎల్తో డీలర్షిప్ అగ్రిమెంట్‌కు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. రాజకీయ నాయకులు, జర్నలిస్ట్‌లు, పోలీసు అధికారులతో తనకున్న పరిచయాలను ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతులకు గురైన శ్రీధర్‌రావు ఆ డీలర్‌షిప్‌ను తమ పేరు మీదకు బదలాయించాలని కోరారు. లక్షల్లో వసూలు చేసి డీలర్షిప్ బదలాయించకుండా.. అయితే కొంత నగదు చెల్లిస్తేనే డీలర్‌షిప్‌ను బదలాయిస్తానని సాంబశివరావు చెప్పాడు. వేరే దారిలేక 2021, మార్చిలో రూ.లక్షల్లో నగదు బదలాయించామని శ్రీధర్‌రావు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. అయినప్పటికీ డీలర్‌షిప్‌ను బదలాయించకపోవడంతో ఈ ఏడాది జనవరి 31న శ్రీధర్‌రావు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌పీసీఎల్ ప్రతినిధులకు సైతం శ్రీధర్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హెచ్‌పీసీఎల్ అధికారులు సాంబశివరావు నడుపుతున్న పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు. చీటింగ్ కేసును నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నన్ను చంపేందుకు బీఆర్ నాయుడు ప్లాన్ చేస్తున్నాడు: పోసాని
సాక్షి, హైదరాబాద్: ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ముసుగులో బీఆర్నాయుడు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. చంపించడం అనేది బీఆర్ నాయుడికి చాలా చిన్న పని అని అన్నారు. కాగా, పోసాని కృష్ణమురళి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీపై కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే అంతు చూస్తామని నన్ను బెదిరించారు. బీఆర్ నాయుడికి దివంగత నేత వైఎస్సార్ భిక్ష పెట్టారు. మీడియా ముసుగులో బీఆర్ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. ఆడవాళ్లపై టీవీ-5లో నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు లేరా? వారితో ఇలానే మాట్లాడుతారా?. ఇప్పటికైనా బీఆర్ నాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలి. సాంబశివరావు భాష ఏంటి? ప్రశ్నించినందుకు నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు. ఇవ్వాలా? లేదా రేపో నన్న చంపొచ్చు. బీఆర్ నాయుడు టీవీ5 పెట్టినప్పుడు ఓ వ్యక్తి దగ్గర రూ.30కోట్లు అప్పుగా తీసుకుని ఇప్పటికీ ఇవ్వలేదు. మార్వాడీ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని చెదిరింపులకు పాల్పడ్డారు. మీడియాను అడ్రస్ చేయాలంటేనే నాకు భయమేస్తోంది. సినీ పరిశ్రమలో ఉన్న మహిళలను అవమానించినందుకు సాంబశివరావు ఇంట్లో తనను అడగరా?. తెలంగాణ ఆడబిడ్డలను తిట్టడానికే బీఆర్ నాయుడు.. సాంబశివరావును టీవీ-5లో పెట్టుకున్నాడు. సాంబశివరావు వాడుతున్న భాషను ఏ ఛానెల్ అయినా వాడుతుందా?. సాంబశివరావు వెనుక చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఉన్నారు. నన్ను ఎన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడినా నేను మాట్లాడటం ఆపను. సీఎం జగన్ గురించి ప్రజలకు తెలుసు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో నాతో వస్తే చూపిస్తాను. స్కూల్స్, ఉద్యోగులను, ఆసుపత్రులకు వెళ్లి చూపిస్తాను. నవరత్నాల పేరుతో సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమం ప్రజలందరికీ తెలుసు. సీఎం జగన్‌ను తిట్టడానికి ప్రతిపక్షాలకు కారణాలు లేవు. కుల, మతాలతో సంబంధం లేకుండా సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారు. కమ్మ, కాపు అనే తేడా లేకుండా పేదలకు సంక్షేమం అందిస్తున్నారు. ఏపీలో ఇప్పుడున్న నాయకుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే మంచి పాలన అందిస్తున్నారన్నది నా అభిపాయ్రం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు ముట్టిన 118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి: విజయసాయిరెడ్డి -
మేడారంలో విషాదం.. తల్లీ ఇక సెలవు..
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం గ్రామానికి చెందిన సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబశివరావు(40) అనారోగ్యంతో మృతి చెందాడు. మేడారానికి చెందిన సాంబశివరావు ఇటీవల ఆనారోగ్యానికి గురయ్యాడు. బుధవారం ఉదయం శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ఆయనను కుటుంబ సభ్యులు ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రతి ఏటా మహాజాతరలో సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైన ప్రతిష్టించేంత వరకు బూర కొమ్ము శబ్దం ఊదుతూ కీలక పాత్ర పోషించేవాడు. జాతర ప్రారంభం నుంచి తల్లులు వన ప్రవేశం చేసేంత వరకు ఆయన పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. జాతరలో సాంబశివరావు అధికారుల నుంచి మంచి పేరు సంపాదించాడు. ఆయన మృతితో మేడారంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పూజారులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మేడారంలో ఆయన దహన సంస్కారాలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు మేడారం వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతిపట్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, జాతర పునరుద్దరణ కమిటీ చైర్మన్ శివయ్య, సమ్మక్క– సారలమ్మ పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలోని పలువురు అధికారులు సంతాపం తెలిపారు. మృతుడికి భార్య సంతోషిని, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. చదవండి: మహిళా ప్రతినిధులతో సంబంధం.. ఇతర మహిళలను ట్రాప్‌లో పడేసి సాంబశివరావు భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సీతక్క ఎమ్మెల్యే సీతక్క సంతాపం సాంబశివరావు మృతిపై ఎమ్మెల్యే సీతక్క వ్యక్తం చేశారు. మేడారంలోని వారి స్వగృహం వద్ద మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సాంబశివరావు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, తదితరులు ఉన్నారు. సంతాపం తెలిపిన మంత్రి ఎర్రబెల్లి .. సమ్మక్క పూజారి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పెద్ది సాంబశివరావుకు డల్లాస్‌లో ఘన సన్మానం
డల్లాస్ : తెలుగు భాష పరిరక్షణకు చేస్తున్న సేవలకుగానూ గుంటూరుకి చెందిన బహు భాషా నిఘంటువుల నిర్మాత పెద్ది సాంబశివరావుని ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ డల్లాస్‌లో ఘనంగా సత్కరించింది. వైద్య ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన తర్వాత 75 ఏళ్ల వయస్సులో వీరు 50 నిఘంటువులను కూర్చి రికార్డు నెలకొల్పారు. వీటిలో కొన్నిటిని ఇంటర్నెట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవటానికి వీలుగా ఉంచారు. మరి కొన్నిటిని ప్రముఖ సంస్థలు ప్రచురించాయి. ఆయన తన కృషిని ఇంతటితో ఆపకుండా అరచేతిలో అర్థాలమూట అన్నట్లుగా 16,000 తెలుగు మాటలకు ఇంగ్లీష్, హిందీ అర్థాలు ఇచ్చే ఆండ్రాయిడ్ యాప్‌ను తయారు చేశారు. వి. ఫణి కిరణ్ సాంకేతిక సహకారంతో రూపొందిన ఈ యాప్ ను గురించి ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర వివరించారు. యాప్‌ను ఆవిష్కరించిన డాక్టర్. రాఘవేంద్ర ప్రసాద్, సాంబశివరావు కృషిని ఆయన వ్యక్తిత్వ విశిష్టతను ప్రశంసించారు. దేశ సమైక్యతకు భాషల పదకోశాలు అవసరమన్నారు. 7 సంవత్సరాల తన నిఘంటువు నిర్మాణ కృషిని, తాను చేసిన అన్నమాచార్య సాహిత్యం గురించి సాంబశివరావు వివరించి శ్రోతల సందేహాలకు సమాధానాలు చెప్పారు. ‘ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం’ ఉత్తరాధ్యక్షుడు చిన సత్యం వీర్నపు“తెలుగు – సంస్కృతం” నిఘంటువును ఆవిష్కరించగా, డాక్టర్. భానుమతి ఇవటూరి “సంస్కృతం - తెలుగు” నిఘంటువును ఆవిష్కరించారు. సభ చివరిలో యాప్ నిర్మాత పెద్ది సాంబశివరావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చెన్నుపాటి కృష్ణ మోహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. రహదారి ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువ మంది చనిపోతున్నారని సోమవారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వివరించారు. రహదారి ప్రమాదాల మరణాల్లో 35 శాతం మంది ద్విచక్రవాహనదారులే ఉన్నారని ఆయన చెప్పారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ప్రమాదాలు తగ్గించేందుకే హెల్మెట్ ఉన్నవారికే పెట్రోలు పోయాలని బంకు యజమానులకు సూచించామని ఆయన వెల్లడించారు. నో హెల్మెట్ - నో పెట్రోల్ నిబంధన తప్పనిసరి కాదన్నారు. రాష్ట్రంలో బెట్టింగ్ సంస్కృతి పెరుగుతోందన్నారు. బెట్టింగ్ కారణంగా జరిగే నేరాల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. కొందరు క్రికెట్ గేమ్ నేర్చుకుంటుంటే.. మరికొందరు బెట్టింగ్ గేమ్ నేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. బెట్టింగ్ లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. -
నయీంను పోషించింది రాజకీయ జోక్యమే
పంజగుట్ట: రాజకీయ జోక్యమే నయీంను పెంచి పోషించిందని,ఈ కేసునుహైకోర్టు చీఫ్ జస్టిస్‌చే విచారణ జరపాలని పలువురు పేర్కొన్నారు. ఆది వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చిక్కుడు ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక ఉద్యమకారుడు సాంబశివరావు (ఉసా) మాట్లాడుతూ.. గతంలో చట్టం, రాజ్యాంగం, ప్రభుత్వ పరిధిలో నేరస్తులకు శిక్షవిధించేదని, ప్రస్తుతం బూటకపు ఎన్కౌంటర్లు అనే విచ్చిన్నకర కార్యక్రమాలు చంద్రబాబు సృష్టించాడన్నారు. గ్రేహౌండ్స్‌ను ఎలా తయారు చేశారో అందుకు సమాంతరంగా నయీంను కూడా అలానే తయారు చేశారని ఆరోపిచారు. ప్రజా ఉద్యమకారులను మట్టుబెట్టేందుకు 10 శాతం గ్రేహౌండ్స్ సిబ్బందిని నయీం గ్యాంగ్‌లో ఉంచారని ఆరోపించారు. సీపీఐ నాయకురాలు పశ్య పద్మ మాట్లాడుతూ.. కేవలం నయీం ఆస్తులు, స్థలాలపైనే విచారణ జరుగుతోందని, అతను హత్యలు చేసిన కుటుంబాల ఆవేదనను ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, పౌరహక్కుల సంఘం నాయకుడు నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆర్టీసీ ఎండీ కర్నూలు రాక
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు సోమవారం కర్నూలు రానున్నారు. ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కష్ణా పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలనకు ఆయన ఇక్కడికి వస్తున్నారు. కర్నూలు కొత్తబస్టాండ్‌లోపాటు గ్యారేజీలను తనిఖీ చేస్తారు. స్థానిక అధికారులతో సమావేశం కానున్నట్లు ఆర్ఎం వెంకటేశ్వర రావు తెలిపారు. ఎండీ వస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం ఆర్ఎంతోపాటు డీసీటీఎం శ్రీనివాసులు, పర్సనల్ ఆఫీసర్ బి. సర్దార్ హుసేన్, ఏటీఎం ప్రసాద్, కర్నూలు–1డిపో మేనేజరు అజ్మతుల్లా, మరో నలుగురు డీఎంలు బస్టాండ్ శుభ్రత, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
ఆర్టీసీ ఎండీ ఆకస్మిక తనిఖీ
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌లను ఆర్టీసీ ఎండీ సాంబశివరావు శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంప్లెక్స్‌లలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. వనరులను వినియోగించుకుని, సంస్థ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. నిరుపయోగంగా ఉన్న పెద్దాపురం ఆర్టీసీ భవన సముదాయాన్ని కల్యాణమంటపం, గోదాములుగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
'నష్టాలని అధిగమించేందుకు చర్యలు'
రాజమండ్రి సిటీ: ఆర్టీసీ నష్టాలని అధిగమించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని ఆ సంస్థ ఎండీ నండూరి సాంబశివరావు చెప్పారు. ఆదివారం ఆయన రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గత ఏప్రిల్ నుంచి ఆగసు వరకూ రూ.120 కోట్ల నష్టం వాటిల్లిందని, సంస్థ నిర్వహణకు ఆస్తుల మీద అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. విజయవాడ కేంద్రంగా పాలన నిర్వహిస్తున్నామని, ఈ నెల 30 నాటికి 40 కొత్త ఓల్వో, స్కానియా బస్సులను ప్రతి డిపోనూ కలుపుతూ నడపనున్నామని తెలిపారు. త్వరలో కండక్టరు ఉన్న ప్రతి బస్సులో పార్శిల్ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏటా 27 కోట్ల లీటర్ల డీజిల్ వాడుతుండగా దానిలో 20 శాతం బయోడీజిల్ అని చెప్పారు. బయో డీజిల్ వాడకం ద్వారా లీటర్‌కు మూడు రూపాయలు ఆదా అవుతుందన్నారు. ఆదాయం కోసం అద్దె బస్సులకు తామే డీజిల్ సరఫరా చేసే మార్గాన్ని అన్వేషిస్తున్నామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ హాస్పిటల్, సర్వీస్ అపార్ట్మెంట్లను నిర్మించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 200 బస్ స్టేషన్లలో థియేటర్ల ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. -
ఆర్టీసీలో విభాగాధిపతుల విభజన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు విభాగాధిపతుల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీలో మొత్తం విభాగాధిపతుల పోస్టులు 43 కాగా అందులో రెండు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన వాటిలో ఏపీకి 19 మందిని, తెలంగాణకు 22 మందిని కేటాయించారు. రీజినల్ మేనేజర్ స్థాయిలో ఏపీకి 12 మంది, తెలంగాణకు 11 మందిని కేటాయించారు. జనాభా ప్రాతిపదికన ఏపీ, తెలంగాణ నిష్పత్తి ప్రకారం ఏపీకి 24 మందిని, తెలంగాణకు 17 మందిని కేటాయించాల్సి ఉంది. అయితే, ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతం ప్రాతిపదికన కేటాయింపు జరిగిందని బస్‌భవన్ వర్గాలు తెలిపాయి. తుది విభజన సమయంలో రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపు ఉంటుందని వెల్లడించాయి. ఈ నెల 20లోగా విభాగాధిపతులు ఆప్షన్లు ఇవ్వాలంటూ సాంబశివరావు సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.