
ఐడీబీఐ బ్యాంక్ ఎండీగా మహేశ్ కుమార్
హైదరాబాద్: ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈవోగా మహేశ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జైన్ బ్యాంకింగ్ కెరియర్ ప్రారంభించారు. ఆతర్వాత సిండికేట్ బ్యాంక్‌లో జీఎంగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2013 సెప్టెంబర్‌లో ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరిన జైన్.. కార్పొరేట్ అండ్ రిటైల్ క్రెడిట్, రిస్క్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాలు పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన ఎన్‌ఐబీఎం గవర్నింగ్ బోర్డు సభ్యులుగా ఉన్నారు.