
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా 'అనురాగ్ మెహ్రోత్రా'ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆటోమోటివ్ పరిశ్రమలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న.. అనురాగ్ ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలలో పనిచేశారు.
సేల్స్, మార్కెటింగ్, స్ట్రాటజీ, వ్యాపార అభివృద్ధిలో కీలక పదవులు చేపట్టిన 'అనురాగ్ మెహ్రోత్రా' (Anurag Mehrotra).. జేఎస్‌డబ్ల్యు మోటార్ ఇండియాలో చేరడానికి ముందు.. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్‌లో స్ట్రాటజీ & ఇంటర్నేషనల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతకంటే ముందు ఫోర్డ్ ఇండియాకు ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
కంపెనీ మాజీ సీఈఓ, రాజీవ్ చాబా.. ఇకపై జాయింట్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా నిర్వహణ, వాటాదారులకు సలహా ఇస్తుంటారు. బ్రాండ్‌ను దేశంలోని ప్రముఖ ఆటోమోటివ్ ప్లేయర్‌లలో ఒకటిగా తీర్చిదిద్దడంలో రాజీవ్ చాబా కీలక పాత్ర పోషించారు. ఈయన సారథ్యంలోనే కంపెనీ అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది.
ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే..
Comments
Please login to add a commentAdd a comment