న్యూఢిల్లీ: భారతీయ రెండవ అతిపెద్ద సాఫ్టవేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మధ్యంతర సీఈవో, ఎండీయుఎన్ ప్రవీణ్ రావును కొత్త మేనేజింగ్ డైరక్టర్‌గా నియమించేందుకు యోచిస్తోంది. ఆయన్ను ఈ పదవిలో కొనసాగించేందుకు షేర్‌హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది.
ఇటీవల సీఈవో, ఎండీగా ఉన్న విశాల్‌సిక్కా రాజీనామాతో కొత్త సీఎండీ ఎంపికకోసం ఇన్ఫోసిస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రవీణ్ రావును తిరిగిఎన్నుకునేందుకు వాటాదారుల అనుమతి కోసం చూస్తోంది. ప్రవీణ్ కనీసం అయిదేళ్ల పాటు లేదా, కొత్త సీఈవో ఎంపిక చేసే దాకా మధ్యంతర సీఈవో అండ్ ఎండీ పదవిలో కొనసాగుతారని ఇన్ఫోసిస్ పోస్టల్ బ్యాలెట్ లో ప్రకటించింది. దీంతో సెప్టెంబరు 8 నుండి అక్టోబరు 7 వరకు పోస్టల్ బ్యాలట్‌పై వాటాదారులు ఓటు వేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 9న గానీ, అంతుకుముందుగానీ ఫలితాలు ప్రకటించనుంది. దీంతోపాటుగా ఇన్ఫీ బోర్డులోకి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా డి సుందరం నియామకంపై కూడా వాటాదారుల అనుమతిని కోరుతోంది.
మరోవైపు విశాల్ సిక్కా స్థానాన్ని భర్తీ చేయడంలో పంచ శోధన ఈగోన్ జహేందర్ సహాయాన్ని అర్థించింది ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన రావు ఆగష్టు 18 న తాత్కాలిక సీఈవో , మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితుడయ్యారు. అలాగే ఇన్ఫోసిస్ ఎనిమిది సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అప్పటి చీఫ్ విశాల్ సికా సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇన్ఫోసిస్ ఎండీగా ప్రవీణ్ రావు కొనసాగుతారా?
Published Sat, Sep 2 2017 6:45 PM | Last Updated on Tue, Sep 12 2017 1:39 AM
Advertisement
Advertisement