shareholder
-
ఇన్ఫీలో మూర్తి కుటుంబం కంటే రెట్టింపు వాటా
ఇన్ఫోసిస్‌లో నారాయణమూర్తి కుటుంబానికి ఉన్న సమష్టి హోల్డింగ్స్ వారి శాశ్వత వారసత్వాన్ని, కంపెనీ పథంలో గణనీయమైన ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఆ కుటుంబానికి మొత్తంగా కంపెనీలో ఉన్న వాటా దాదాపు 4-5 శాతం మాత్రమే. ప్రపంచ ఐటీ రంగం భవిష్యత్తులో భారీగా దూసుకుపోతుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. కేవలం రిటైలర్లే కాకుండా ఇన్వెసింగ్ సంస్థలు చాలాకాలం నుంచే ఈ రంగంలో వాటా కొనుగోలు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్‌లో మూర్తి కుటుంబానికి ఉన్న వాటా కంటే కూడా రెట్టింపు వాటాను హోల్డ్ చేస్తున్న సంస్థలున్నాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.మూర్తి కుటుంబం వాటాఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి కంపెనీలో గణనీయమైన వాటా ఉంది. తాజా నివేదికల ప్రకారం తన కుటుంబం మొత్తం హోల్డింగ్స్ సుమారు 4.02% ఉన్నాయి. నారాయణమూర్తికి 0.36%, ఆయన భార్య సుధామూర్తికి 0.93%, వారి పిల్లలు అక్షత మూర్తికి 1.05%, రోహన్ మూర్తికి 1.465% వాటా ఉంది. నారాయణమూర్తి మనవడు నాలుగేళ్ల ఏకగ్రహ్ మూర్తికి కూడా తన తాత ఇటీవల షేర్లను బహుమతిగా ఇవ్వడంతో 0.04% వాటా ఉంది.ఎల్ఐసీ వ్యూహాత్మక పెట్టుబడులువ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఇన్ఫోసిస్‌లో భారీగా పెట్టుబడి పెట్టింది. ఇన్ఫోసిస్‌లో ఏకంగా 9.531 శాతం వాటాను ఎల్ఐసీ హోల్డ్ చేస్తోంది. దీని విలువ సుమారు రూ.8,694 కోట్లు. ఈ పెట్టుబడి ద్వారా ఎల్ఐసీ భవిష్యత్తులో ఇన్ఫోసిస్ సామర్థ్యం పట్ల నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎల్ఐసీ ఇన్వెస్ట్మెంట్ వల్ల ప్రపంచ ఐటీ రంగంలో కంపెనీ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమాఇన్ఫోసిస్తో సహకారం..ఇన్ఫోసిస్‌తో ఎల్ఐసీ భాగస్వామ్యం కేవలం ఆర్థిక పెట్టుబడులకు పరిమితం కాలేదు. సంస్థ అందించే సేవల్లోనూ ఇరు కంపెనీల సహకారం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసుల్లో ఇన్ఫోసిస్ నైపుణ్యం ద్వారా ఎల్ఐసీ నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్) అనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్పై ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేశాయి. ఈ సహకారం ఎల్ఐసీ కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు అంతరాయంలేని సర్వీసులు అందిస్తుందని భావిస్తున్నారు. -
ఎన్డీటీవీపై అదానీ పట్టు
న్యూఢిల్లీ: వార్తా చానళ్ల దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ)లో అదానీ గ్రూప్ మెజారిటీ వాటాదారుగా ఆవిర్భవించనుంది. మీడియా సంస్థ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ 5 శాతం మినహా మిగిలిన తమ వాటాను విక్రయించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇందుకు అదానీ గ్రూప్ దాదాపు రూ. 648 కోట్లు వెచ్చించనుంది. దేశీయంగా అతిపెద్ద, తొలి ప్రయివేట్ రంగ వార్తా చానళ్ల సంస్థ ఎన్డీటీవీని ఏర్పాటు చేసిన రాయ్ దంపతుల వాటాను ఇటీవల అదానీ గ్రూప్ అధిగమించిన సంగతి తెలిసిందే. రాయ్‌ల సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ఎన్డీటీవీలో తొలుత 29.18% వాటాను అదానీ గ్రూప్ చేజిక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా మరికొంత వాటాను సొంతం చేసుకోవడంతో అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఎన్డీటీవీలో అదానీ వాటా 37.44% కాగా.. రాయ్‌ల వాటా 32.26%. దీనిలో 27.26% వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించనుంది. ఈ వాటాను ఈ నెల 30 తదుపరి ఒకేసారి లేదా దశలవారీగా విక్రయించనున్నట్లు ఎన్డీటీవీ ఎక్ఛ్సేంజీలకు సమాచారమిచ్చింది. దీంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 69.71%కి జంప్చేయనుంది. రాయ్ వాటా విక్రయ వార్తలతో ఎన్డీటీవీ షేరు 2.5% బలపడి రూ.340 వద్ద ముగిసింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
ఇన్ఫోసిస్ ఎండీగా ప్రవీణ్ రావు కొనసాగుతారా?
న్యూఢిల్లీ: భారతీయ రెండవ అతిపెద్ద సాఫ్టవేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మధ్యంతర సీఈవో, ఎండీయుఎన్ ప్రవీణ్ రావును కొత్త మేనేజింగ్ డైరక్టర్‌గా నియమించేందుకు యోచిస్తోంది. ఆయన్ను ఈ పదవిలో కొనసాగించేందుకు షేర్‌హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల సీఈవో, ఎండీగా ఉన్న విశాల్సిక్కా రాజీనామాతో కొత్త సీఎండీ ఎంపికకోసం ఇన్ఫోసిస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రవీణ్ రావును తిరిగిఎన్నుకునేందుకు వాటాదారుల అనుమతి కోసం చూస్తోంది. ప్రవీణ్ కనీసం అయిదేళ్ల పాటు లేదా, కొత్త సీఈవో ఎంపిక చేసే దాకా మధ్యంతర సీఈవో అండ్ ఎండీ పదవిలో కొనసాగుతారని ఇన్ఫోసిస్ పోస్టల్ బ్యాలెట్ లో ప్రకటించింది. దీంతో సెప్టెంబరు 8 నుండి అక్టోబరు 7 వరకు పోస్టల్ బ్యాలట్‌పై వాటాదారులు ఓటు వేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 9న గానీ, అంతుకుముందుగానీ ఫలితాలు ప్రకటించనుంది. దీంతోపాటుగా ఇన్ఫీ బోర్డులోకి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా డి సుందరం నియామకంపై కూడా వాటాదారుల అనుమతిని కోరుతోంది. మరోవైపు విశాల్ సిక్కా స్థానాన్ని భర్తీ చేయడంలో పంచ శోధన ఈగోన్ జహేందర్ సహాయాన్ని అర్థించింది ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన రావు ఆగష్టు 18 న తాత్కాలిక సీఈవో , మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితుడయ్యారు. అలాగే ఇన్ఫోసిస్ ఎనిమిది సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అప్పటి చీఫ్ విశాల్ సికా సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఫినియోటెక్స్ కెమికల్స్‌లో వాటాలు పెంచుకున్న అమితాబ్
న్యూఢిల్లీ: రసాయనాల సంస్థ ఫినియోటెక్స్ కెమికల్స్‌లో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వాటాలను 5.58 శాతానికి పెంచుకున్నారు. తాజాగా ఆయన మరో 1.5 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇది మొత్తం షేర్ క్యాపిటల్‌లో 0.67 శాతమని కంపెనీ తెలిపింది. తద్వారా ప్రమోటర్లను మినహాయిస్తే అమితాబ్ బచ్చన్ మూడో అతి పెద్ద వాటాదారుగా ఉంటారని వివరించింది. టెక్స్టైల్ పరిశ్రమతో పాటు నిర్మాణ రంగం, పేపర్ తయారీ సంస్థలు మొదలైన వాటికి అవసరమైన రసాయనాలను ఫినియోటెక్స్ తయారు చేస్తుంది. శుక్రవారం బీఎస్ఈలో ఫినియోటెక్స్ షేరు 4.58 శాతం క్షీణించి రూ. 125.10 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ షేరు విభజన
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ షేరును 1:5 నిష్పత్తిలో విభజించేందుకు డెరైక్టర్ల బోర్డు మంగళవారం ఆమోదముద్ర వేసింది. అంటే రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరును రూ.2 ముఖ విలువగా 5 షేర్లుగా విడగొట్టనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత ఇదే తొలి షేరు విభజన కావడం గమనార్హం. షేర్ల లావాదేవీల్లో లిక్విడిటీ(సరఫరా) పెంచడమే ఈ చర్యల లక్ష్యమని బ్యాంక్ వివరించింది. కాగా, ఒక్కో అమెరికన్ డిపాజిటరీ షేరు(ఏడీఎస్) ఇప్పుడున్నట్లుగానే రెండు ఐసీఐసీఐ షేర్లకు సమానంగా కొనసాగనుందని... అయితే, తాజా విభజనతో అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్(ఏడీఆర్) హోల్డర్ వద్ద నున్న ఒక్కో ఏడీఎస్కు ఈక్విటీ షేర్ల సంఖ్య 10కి పెరగనుందని ఐసీఐసీఐ వెల్లడించింది. వాటాదారులు, ఇతర నియంత్రణపరమైన అనుమతులకు లోబడి షేర్ల విభజన అమల్లోకి వస్తుందని.. దీనికి సంబంధించి రికార్డు తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. కాగా, మంగళవారం ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో 1.31 శాతం (రూ.20.50) నష్టంతో రూ.1,547.70 వద్ద స్థిరపడింది.