న్యూఢిల్లీ: వార్తా చానళ్ల దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్‌డీటీవీ)లో అదానీ గ్రూప్ మెజారిటీ వాటాదారుగా ఆవిర్భవించనుంది. మీడియా సంస్థ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ 5 శాతం మినహా మిగిలిన తమ వాటాను విక్రయించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇందుకు అదానీ గ్రూప్ దాదాపు రూ. 648 కోట్లు వెచ్చించనుంది. దేశీయంగా అతిపెద్ద, తొలి ప్రయివేట్ రంగ వార్తా చానళ్ల సంస్థ ఎన్‌డీటీవీని ఏర్పాటు చేసిన రాయ్ దంపతుల వాటాను ఇటీవల అదానీ గ్రూప్ అధిగమించిన సంగతి తెలిసిందే.
రాయ్‌ల సంస్థ ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ఎన్‌డీటీవీలో తొలుత 29.18% వాటాను అదానీ గ్రూప్ చేజిక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా మరికొంత వాటాను సొంతం చేసుకోవడంతో అదానీ గ్రూప్ ఎన్‌డీటీవీలో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఎన్‌డీటీవీలో అదానీ వాటా 37.44% కాగా.. రాయ్‌ల వాటా 32.26%. దీనిలో 27.26% వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించనుంది. ఈ వాటాను ఈ నెల 30 తదుపరి ఒకేసారి లేదా దశలవారీగా విక్రయించనున్నట్లు ఎన్‌డీటీవీ ఎక్ఛ్సేంజీలకు సమాచారమిచ్చింది. దీంతో ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 69.71%కి జంప్‌చేయనుంది. రాయ్ వాటా విక్రయ వార్తలతో ఎన్‌డీటీవీ షేరు 2.5% బలపడి రూ.340 వద్ద ముగిసింది.
చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్!
Comments
Please login to add a commentAdd a comment